కావలసినవి : సగ్గుబియ్యం - అర కేజీ; టొమాటోలు - 200 గ్రా; నీళ్లు - 6 కప్పులు; కారం - 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత తయారీ టొమాటోలను శుభ్రంగా...
కావలసినవి :
సగ్గుబియ్యం - అర కేజీ; టొమాటోలు - 200 గ్రా; నీళ్లు - 6 కప్పులు; కారం - 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత
తయారీ

తయారీ
- టొమాటోలను శుభ్రంగా కడిగి వేడి నీళ్లలో సుమారు పావు గంటసేపు ఉడికించాలి
- చల్లారాక పైన తొక్కు తీసి ప్యూరీలా చేసి పక్కన ఉంచాలి
- సగ్గుబియ్యాన్ని సుమారు పావుగంటసేపు నానబెట్టి నీళ్లు ఒంపేయాలి
- ఒక పాత్రలో సగ్గుబియ్యం, ఆరు కప్పుల నీళ్లు పోసి కుకర్లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చాక దింపేయాలి సగ్గుబియ్యం చల్లారాక, టొమాటో ప్యూరీ, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి
- ఎండలో ప్లాస్టిక్ కవర్ మీద, ఉడికించుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని స్పూన్తో తీసుకుని వడియా లుగా పెట్టాలి
- కొద్దిగా ఎండాక ప్లాస్టిక్ కవర్ నుంచి వేరు చేసి పళ్లెంలో నాలుగైదు రోజులు ఎండబెట్టి, డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
COMMENTS