అందమంటే కేవలం ముఖసౌందర్యమే కాదు. చేతులు , పాదాలు కూడా అందంగా ఉండాలి. కాని చాలామంది మహిళలు వాటి అందానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. వారి నిర్లక...
అందమంటే కేవలం ముఖసౌందర్యమే కాదు. చేతులు, పాదాలు కూడా అందంగా ఉండాలి. కాని చాలామంది మహిళలు వాటి అందానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. వారి నిర్లక్ష్యం వల్ల తరువాత చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలా కాకుండా కొద్దిపాటి జాగ్రత్తతో పాదాల అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం ఎలాగో తెలుసుకుందాం. వీటి సంరక్షణ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు....
- పాదాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
- గోరువెచ్చని నీటితో సబ్బుతో శుభ్రం చెయ్యాలి.
- వేళ్ల మధ్య సబ్బునీటితో కడగాలి. తరువాత బాగా ఆరబెట్టాలి. అవసరమయితే డ్రయ్యర్ ఉపయోగించవచ్చు.
- చర్మం రంగు మారడం, ఆనికాయలు, పగుళ్లు వంటివి ఉంటే డాక్టర్ని సంప్రదించాలి.
- భోజనం చేసే ముందు, తరువాత, బయట తిరిగి వచ్చిన తరువాత, పడుకోబోయే ముందు పాదాలను చల్లని నీటితో శుభ్రంగా కడగాలి.
- ఇంటికి వెళ్లిన వెంటనే పాదరక్షలు తీసివేయాలి.
- మరీ ఎక్కువగా కడగడం వలన పాదాలలోని సహజనూనెలు పోతాయి.
- ఈతవల్ల, పాదాలకు కాళ్లకు మంచి వ్యాయామం కాలికండరాలు పటిష్టమవుతాయి.
- పాదాలు మరీ చల్లగా ఉంటే రక్తప్రసరణ నెమ్మదిగా జరుగుతుంది. అందువలన పాదాలు ఎప్పుడే వెచ్చగా ఉంచడం మంచిది.
- అతివేడి, అతిచల్లని, అతికఠిన ప్రదేశాలపై నడవవద్దు.
- పొగతాగితే, పాదాలకు రక్తప్రసరణ సరిగా జరగదు.
- శరీర బరువు తగ్గించుకుంటే పాదాల శ్రమ తగ్గుతుంది.
- పిక్కలను, కాళ్లను చాచడం ద్వారా పాదాల శ్రమ తగ్గుతుంది. కాలి కండరాలు విశ్రాంతిగా ఉంటాయి.
- బాగా ఎక్కువగా నడవడం వల్ల పాదాలు అలిసిపోతే కొద్దిగా నూనె, సబ్బుపొడి గోరువెచ్చని నీటిలో వేసి, దానిలో పాదాలను కొద్దిసేపు ఉంచాలి.
- రెండు చెంచాల ఆలివ్నూనెకి, కొంచెం ఉప్పు కలిసి స్నానానికి ముందు పాదమర్దన చేస్తే మంచిది.
- ఎక్కువదూరం నడిచినప్పుడు మధ్యలో కాళ్లు చాచడం, ముడవడం, విదిలించడం, చెప్పులు లేదా షూస్ తీసి పాదాలకు గాలి తగిలేలా చెయ్యడం మంచిది.
- బరువులను మోసేటప్పుడు, ఎత్తు పల్లాలలో నడుస్తున్నప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మధ్యమధ్యలో ఆగి పాదాలకు విశ్రాంతినివ్వాలి.
- కాళ్లు ముడుచుకుని లేక పీఠం వేసుకుని ఎక్కువసేపు కూర్చోకూడదు. అందువలన కాళ్లకు, పాదాలకు రక్తప్రసరణ సరిగా జరగదు. నొప్పి కలిగిస్తాయి.
- మడమ లేదా పాదం ముందుభాగంపై మొత్తం శరీర బరువు ఆనకుండా బేలన్స్ గా నడవాలి. నేలపై కూర్చొన్నప్పుడు చెప్పులపై కూర్చోవడం మానుకోవాలి. సాధ్యమైనంతవరకు లిఫ్ట్ వాడవద్దు. మెట్లు ఎక్కుతూ వెళ్లడం మంచిది. ఇందువలన కాళ్లకు రక్తప్రసరణ సరిగా జరుగుతుంది.
- గోరువెచ్చని నీటిలో ఎప్సమ్ సాల్ట్ వేసి దానిలో పాదాలు మునిగేలా ఉంచితే కీళ్లనొప్పులు తగ్గుతాయి.
- వెల్లుల్లి నూరి ఆనెల మీద ఉంచితే నొప్పి తగ్గుతుంది.
- రాత్రి పడుకోబోయే ముందు మూడు చెంచాల నిమ్మరసం, రెండు చెంచాల గ్లిజరిన్ కలిపి మర్దన చేస్తే పాదాలు మృదువుగా, అందంగా ఉంటాయి.
- కాలి పగుళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు స్క్రాపర్ ఉపయోగించాలి.
- పాదాలు శుభ్రం చేసి మసాజ్ క్రీమ్తో రుద్దితే రక్తప్రసరణ బాగా జరిగి పాదాలు హాయిగా ఉంటాయి.
- వేపాకు ముద్ద అరికాళ్లకి రాస్తే బాగా నిద్రపడుతుంది.
- పాదాలను పదినిముషాలు పాలతో మర్దన చేసి, నిమ్మచెక్కతో తోమి, శుభ్రం చేస్తే నాజూకుగా ఉండే మీ పాదాలు మీకు ఆశ్చర్యం కలిగిస్తాయి.
- పాదాలు పగిలితే స్పూన్ మామిడిబంకను నీళ్లతో అరగతీసి రాస్తే పగుళ్లు తగ్గి నాజూకుగా ఉంటాయి.
- మూడు గరిటెల తేనెలో స్పూన్ నువు్వల నూనె కలిపి కొద్దిగా వేడిచేసి, పాదాలకు రాస్తూ పొడిగా ఉండడం, పగుళ్లు తగ్గుతాయి.
- ఆముదంలో కొద్దిగా పసుపు కలిపి, ఉదయం, సాయంత్రం పాదాలకు మర్దన చేస్తే పగుళ్లు తగ్గుతాయి.
- మూడు గరిటెల తేనెటీగల మైనానికి, 3స్పూన్ల నువు్వలనూనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని పగుళ్లపై రాయాలి.
- తరువాత ఆవునెయ్యి విడిచి విడిచి రాయడం వల్ల పొడిగా ఉండే పాదాలు, పగుళ్లు నయమవుతాయి.
- శరీరభాగాలకు, అవయవాలకు సంబం ధించిన అరవై అయిదు కేంద్రాలు పాదాల్లో ఉన్నాయి. పాదమర్దన చేయడం వల్ల ఆయా భాగాలన్నీ ఉత్తేజితమవుతాయి. శరీరమంతా ఆరోగ్యంగా ఉంటుంది. పాదాల్లోని ఒక్కో భాగంపై ఒత్తిడి కలిగిస్తే ఆ భాగం ఆరోగ్యవంతమవుతుంది. దీనిని ఆక్యుప్రెజర్ అంటారు. దీనికోసం ప్రత్యేకమయిన జోళ్లు వాడటం మంచిది.
- పాదరక్షలు లేకుండా నడవడం చాలా మంచిది. గ్రామాల్లో ఉండే మన పూర్వీకులు చెప్పులు లేకుండా నడిచేవారు. పాద సంబంధమైన వ్యాధులు వారికి వచ్చేవి కావు.
- సహజసిద్ధమైన నడకల వల్ల గాలి, నేల మొక్కలు వంటివి తగిలి పాదాల్లోని నరాలు ఉత్తేజితమవుతాయి.
- చిన్నపిల్లల కాళ్లు ఎదగాలంటే చెప్పులు వాడకపోవడం మంచిది.
- మెత్తటి సోల్స్ వల్ల ఎత్తుపల్లాలోను, ఎగుడు,దిగుళ్లలోను నడిచినా అపాయముండదు.
- ఉత్తపాదాలతో నడిస్తే బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎథ్లెట్స్ ఫుట్ రాదు
బీస్ ఇఛ్:
శుభ్రమైన గుడ్డను, త్రిఫలచూర్ణం లేక నీటిలో ముంచి పాదాల్ని శుభ్రం చెయ్యాలి. ఆరనివ్వాలి. దూదితో తుడిస్తే త్వరగా ఆరుతుంది. వెంటనే తేనె, నెయ్యి రాయాలి. వెంటనే నయమవుతుంది. వేపాకులు, నువు్వల ముద్దను గాయంపై వేసి కట్టుకట్టాలి.
ఆనెలు:
ఒక వెల్లుల్లిపాయను నేతితో కాని, అలాగే కాని, నిప్పులపై పెట్టి బంగారం రంగు వచ్చే వరకు వేయించాలి. దానిని ఆనెల ఉంచి కట్టాలి. ఒక్కొక్క ఆనెకు ఒక్కొక్క వెల్లుల్లి వాడాలి. ఇలా రోజుకోసారి ఆనెలు పోయేదాకా చెయ్యాలి.
చెమట కార్చే పాదాలు
ఎక్కువ చెమట పడుతున్నప్పుడు పాదాలను పొడిగుడ్డతో తుడిచి ఆరబెట్టాలి. కారన్ స్టార్చ్ పైన రాయాలి.
దుర్వాసన వెలువరించే పాదాలు
ఒక వెడల్పైన పాత్రలో రెండు చెంచాల షాంపూ వెయ్యాలి. దానిలో గోరువెచ్చని నీరుపోసి, శుభ్రమైన చేతులతో దానిని కలపాలి. ఆ పాత్రలో పాదాల్ని ఐదునిముషాలుంచాలి. పుదీనా ఆకులు వేస్తే సువాసనిస్తాయి.
పాదాల శ్రమ తగ్గించడానికి
- కాసేపు వెచ్చని నీటిలో పాదాలు ఉంచి, మర్దన చేస్తే పాదాలకు రక్తసరఫరా బాగా జరిగి సేదదీరుతాయి.
- ఎక్కువగా పాదాలు నీటితో తడుస్తున్నప్పుడు వేళ్ల మధ్య ఒరుపులు వస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే పొద్దుటే లేవగానే కొద్దిగా కొబ్బరి నూనెలో పసుపు కలుపుకుని పాదాలకు పట్టించాలి. ఒరుపులు వచ్చాక కూడా పసుపు బాగా పనిచేస్తుంది.
- కాళ్లకు పారాణి రాసినప్పుడు పసుపు, సూక్ష్మజీవుల నుండి పాదాలను రక్షించడానికి, అందలి కాల్షియం పగుళ్ల నివారణకు తోడ్పడుతుంది.
- గోరింటాకు, నూనెవేసి ఉడికించి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమం రాస్తే కాలివేళ్ల ఒరుపులు మానతాయి.
- గోరింటాకును మెత్తగా నూరి కొద్దిగా వెనిగర్తో కలిపి పాదాలకు రాస్తే పాదాల మంటలు తగ్గుతాయి.
- గోరింటాకును మెత్తగా దంచి రసం తీయాలి. దానిలో కొద్దిగా నిమ్మరసం, గ్లిజరిన్ కలిసి కాలిపగుళ్లపై రాస్తే పగుళ్లు తగ్గుతాయి.
COMMENTS