teluguh, perugu vadalu, telugu special vantakalu
మినుములు: కప్పు, పెసలు: అరకప్పు, రాజ్మా: అరకప్పు, బొబ్బర్లు: అరకప్పు, జొన్నలు: అరకప్పు, సెనగలు: అరకప్పు, రాగులు: అరకప్పు, సజ్జలు: అరకప్పు, ఉప్పు: తగినంత, పెరుగు: లీటరు, పచ్చిమిర్చి, అల్లంముద్ద: 3 టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తురుము: కప్పు, జీలకర్ర: టేబుల్‌స్పూను
తాలింపుకోసం:
మినప్పప్పు: టీస్పూను, పచ్చిసెనగపప్పు: టీస్పూను, ఎండుమిర్చి: 5, జీలకర్ర: టీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, ఆవాలు: టీస్పూను
తయారుచేసే విధానం :
బాణలిలో కొద్దిగా నూనె వేసి దినుసులన్నీ వేసి తాలింపు చేసి పెరుగులో కలపాలి. తరవాత ఉప్పు కూడా కలపాలి. మినుములు, పెసలు, సెనగలు, రాజ్మా, సజ్జలు, బొబ్బర్లు, జొన్నలు, రాగులు... అన్నీ ఆరుగంటలముందే నానబెట్టుకోవాలి. నానబెట్టిన నీళ్లను వంపేసి గారెల పిండిలా మెత్తగా గట్టిగా రుబ్బాలి. ఇందులో సరిపడా ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి ముద్ద, జీలకర్ర, కొత్తిమీర తురుము వేసి కలపాలి.
బాణలిలో నూనె పోసి కాగాక వడల్లా చేసి వేయించాలి. తీసిన వెంటనే పెరుగులో వేస్తే మల్టీగ్రెయిన్ దహీ వడలు రెడీ.
COMMENTS