దేశంలో శృంగార సమస్యలతో బాధపడే పురుషుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది . పురుషుల శృంగార సమస్యల్లో అంగస్తంభన సమస్య , శీఘ్రస్ఖలన సమస్...
దేశంలో శృంగార సమస్యలతో బాధపడే పురుషుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పురుషుల శృంగార సమస్యల్లో అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలన సమస్యలు ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.
శృంగార సమస్యలు ఏర్పడటానికి ప్రధానంగా శారీరక, మానసిక కారణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులోనూ మానసిక కారణాలతో ఏర్పడుతున్న శృంగార సమస్యలు పెరుగుతున్నాయి. 20- 30 శాతం మందిలో శృంగార సమస్యలకు కారణాలు మానసిక కారణాలేనని అధ్యయనాల్లో వెల్లడవుతున్న విషయాలు.
వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో ఒత్తిడి కారణంగానే కాక, ఆర్థిక సమస్యలు, భయం వల్ల కూడా శృంగార సమస్యలు ఏర్పడుతున్నాయి. పెర్ఫామెన్స్ యాంగ్జయిటి అంటే శృంగారంలో పాల్గొన్నప్పుడు తన శృంగార సామర్థ్యంపైన నమ్మకం కలగక ఆందోళన చెందడాన్ని ఫెర్ఫామెన్స్ యాంగ్జయిటి అంటారు. ఇలాంటి వారిలో శృంగారం పట్ల విపరీతమైన కోరిక ఉన్నప్పటికి అంగస్తంభనలు తగినంతగా కనిపించవు. శృంగారంలో పాల్గొన్నప్పుడు ఏ కారణం చేతనైనా అంగస్తంభన సమస్య ఏర్పడి వైఫల్యం చెందితే, ఆ వైఫల్యం పదే పదే వెంటాడుతుంది. ఒకసారి అంగస్తంభన సమస్య ఎదుర్కొంటే ఇక ప్రతిసారీ ఇలానే జరుగుతుందనే అనుమానంతో ఆందోళన పెరిగిపోవడం వల్ల వారిలో ఆత్మ విశ్వాసం తగ్గిపోయి సమస్య మరింత జటిలమవుతుంది.
వివాహానికి ముందు లేదా వివాహం తర్వాత ఏదో ఒక సందర్భంలో అంగస్తంభన సమస్య వచ్చి ఉండటం వల్ల 'నేను పెళ్లికి పనికి రానేమో, శృంగారానికి పనికి రానేమో' అనే భయంతో చాలామంది డిప్రెషన్కు లోనవుతారు. వివాహానికి ముందు ఎవరైనా చూస్తారేమోననే భయం, తగినంత ఏకాంతం లేకపోవడం వల్ల, భయం భయంగా శృంగారంలో పాల్గొనడం వల్ల అంగస్తంభన సమస్య రావచ్చు. హస్తప్రయోగం చేసుకోవడం వల్ల కూడా అంగస్తంభన సమస్య ఏర్పడుతుందనే అపోహ ఎక్కువ మందిలో ఉంది.
డిప్రెషన్కు లోనైన వారిలో శృంగార సమస్యలు ఏర్పడి ఒత్తిడికి లోనైన వారిలో శృంగార సమస్యలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. ముఖ్యంగా సెక్స్ పట్ల కోరికలు తగ్గడం జరుగుతుంది. కోరికలు తగ్గడం వల్ల అంగస్తంభన సమస్యకు దారితీస్తాయి. డిప్రెషన్తో బాధపడే వారిలో ఆత్మవిశ్వాసం తగ్గడం, మానసిక ఆందోళనకు లోనవడం, నిద్ర పట్టక పోవడం, వ్యతిరేక ఆలోచనలు చేయడం, శారీరకంగా బలహీనంగా ఉండటం జరుగుతుంది. వీటివల్ల సెక్స్ పట్ల కోరికలు చాలా వరకు తగ్గిపోతాయి. డిప్రెషన్కు లోనైన వారికి హార్మోన్ల లోపాలు కూడా ఏర్పడతాయి. డిప్రెషన్తో బాధపడే వారిలో నిద్రలో కూడా అంగస్తంభన లు తగ్గే అవకాశం ఉంది. డిప్రెషన్కు వాడే మందుల వల్ల కూడా సెక్స్ కోరికలు తగ్గడం, అంగస్తంభన సమస్యలు ఏర్పడటం జరుగుతుంది. డిప్రెషన్కు లోనైన వారిలో కూడా కొన్ని సందర్భాల్లో సెక్స్ కోరికలు పెరగటం, అంగస్తంభనలు మామూలుగా ఉండే అవకాశం ఉంది. శృంగార సమస్యలు రావడానికి అనేక సంవత్సరాల నుంచి మనలో ఉన్న ఆలోచనలు, మనం పెరిగిన వాతావరణం, శృంగార సమస్యల పట్ల సరైన అవగాహన లేక పోవటం వంటివి కారణం అవుతాయి. వాటి వల్ల శృంగార సామర్థ్యం పట్ల వ్యతిరేక భావం ఏర్పడి ఎక్కువగా సెక్స్ సమస్యలు వస్తాయి.
మానసిక కారణాలైన డిప్రెషన్, ఒత్తిడి, యాంగ్జయిటి వంటి వాటి వల్ల ఏర్పడిన శృంగార సమస్యలకు అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ సమస్యలపై సరైన అవగాహన ఉన్న వైద్యనిపుణుల ద్వారా సెక్స్ కౌన్సెలింగ్ తీసుకోని ఇలాంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడవచ్చు.
COMMENTS