‘పిండి కొద్దీ రొట్టె’ అనట్లు - ఎన్ని చపాతీలు అవసరమో అంతకు సరిపడా పిండినే కలుపుకోవాలి. అలా పరిమాణం నిర్దిష్టంగా ఉండడం వల్ల అందులో కలిపే ఉప్పు, నూనె, వంటివి సులభంగా అంచనా వేయవచ్చు. పిండిని కలిపే సమయంలో కొంతమంది నెయ్యి లేదా నూనె, పెరుగు అందులో కలుపుతారు. వీట్టనిటినీ ఎంతో కొంత అని కాకుండా, తీసుకున్న పిండికి తగిన పాళ్లలో కలిపినప్పుడే చపాతీలు మృదువుగా వస్తాయి.
ఈ క్రమంలో ముందుగా నాణ్యమైన చపాతీ పిండి తీసుకోవాలి. అవసరమైతే దాన్ని జల్లడ పట్టాలి. మీకు అవసరమయ్యే పరిమాణంలో పిండిని తీసుకుని తగు పాళ్లలో నూనె, ఉప్పు, నీళ్లు కలుపుకోవాలి. 

ఉదాహరణకు మీరు మూడు కప్పుల(చిన్నవి) పిండి కలపాలనుకుంటే; అందులో రెండు చెంచాల నూనె, కాస్త ఉప్పు, ఒకటిన్నర కప్పుల నీళ్లు (మీరు పిండి కొలిచిన కప్పుతో) కలపాలి. మొదట్లో మెల్లగా పిండి కలుపుకొంటూ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఒకేసారి నీళ్లన్నీ పోయకూడదు. పిండి బాగా కలవాలంటే ముందు గోధుమ పిండిని ఒక  కొండ ఆకారంలో పోసి దాని మధ్యలో నూనె, ఉప్పు, నీళ్లు వేసి కలపాలి. అప్పుడు మొత్తం అన్నీ సమానంగా కలుస్తాయి.

పిండిలో అన్నీ వేసి కలుపుకున్న తర్వాత దాన్ని మదించడం చాల ముఖ్యం. అప్పుడే ఆ పిండి మెత్తగా, మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. వెడల్పుగా ఉండే పాత్ర లేదా గిన్నెలో పిండి కలుపుకుంటే బాగా పిసకడానికి వీలుంటుంది. మీ బలం అంతా ఉపయోగించి కలిపిన పిండిని ఎంత వీలైతే అంత మదించడానికి ప్రయత్నించండి. తర్వాత దాని మీద తడి వస్త్రం కప్పి, 15 నుంచి 20 నిమిషాల పాటు కదపకుండా వదిలేయాలి. దీని వల్ల పిండికి వచ్చిన మెత్తదనం, మృదుత్వం పోకుండా ఉంటాయి.

చపాతీలు చేసుకోవడానికి పిండి సిద్ధమైన తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అన్ని ఉండల్నీ  ఒకేల, ఎక్కడా హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా, గుండ్రంగా అప్పడాల్ల ఒత్తుకోవాలి. ఈ క్రమంలో చపాతీలు ఒత్తే పీటకు తడి పిండి అంటుకోకుండా పొడి గోధుమ పిండి చల్లుతూ ఉండాలి. అల చపాతీలు చేస్తున్నప్పుడు వాటిని ఎప్పుడూ సవ్యదిశలోనే తిప్పుతూ ఒత్తుకోవాలి.
చపాతీలు ఒత్తుకున్న తర్వాత వాటిని మొదటి పచ్చిదనం పోయే వరకు పెనం మీద కాసేపు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కాలనివాలి. తర్వాత మంట మధ్యస్థంగా ఉంచాలి. ఇటా అవసరమైనంత ఉష్ణోగ్రత అందించడం వల్ల చపాతీలు మెత్తగా ఉంటాయి. మరీ, ఎక్కువ మంట పెట్టి కాల్చినా అవి గట్టిగా వచ్చేస్తాయి. అందుకే ఈ విషయం గుర్తుపెట్టుకోవడం చాల అవసరం. ఇలా ఒక క్రమ పద్ధతిలో చపాతీలు చేస్తే.. చాల చక్కగా, మెత్తగా, మృదువుగా వస్తాయి. ఎన్ని తిన్నా ఇంకా తినాలనే అనిపిస్తుంది. 

దీంతో పాటు మరికొన్ని చిట్కాలు పాటించడం వల్ల కూడా మెత్తటి చపాతీలు చేసుకోవచ్చు.. అవి;
  • గోధుమ పిండిని కలుపుకునేప్పుడు చల్లటి నీళ్లకు బదులు వేడి నీటిని ఉపయోగించవచ్చు.
  • అర చెంచా బేకింగ్ సోడా పిండిలో కలపడం వల్ల కూడా చపాతీలు మెత్తగా వస్తాయి. పొంగు తాయి కూడా.
  • చపాతీలు చేయడానికి ఒక గంట ముందే పిండిని కలిపి పెట్టుకోవాలి.
  • నీళ్లకు బదులు పాలు కూడా కలుపుకోవచ్చు.
  • చపాతీలు చేసుకునేటప్పుడు పొడి పిండిని ఎంత వీలైతే అంత తక్కువగా ఉపయోగించాలి. లేకపోతే చపాతీలు గట్టిపడే ప్రమాదం ఉంది.
  • కాల్చిన చపాతీలను వెంటనే మూత ఉండే పాత్రల్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీలు మెత్తగా, మృదువుగా, వేడిగా ఉంటాయి. 

ఈ సారి చపాతీలు చేసేటప్పుడు ఈ చిట్కాలన్నీ పాటించి చూడండి.. 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment: