jokes, telugu jokes
చిన్నమ్మి:
పెళ్ళైన మూడు రోజులకే మీవారు ఎలా పోయారు చిన్నమ్మి?
పెద్దమ్మి
: మొదటి రోజు కాళ్ళు నొప్పంటే పట్టాను, రెండో
రోజు నడుమునొప్పి అంటే పట్టాను, మూడో
రోజు గొంతు నొప్పి అంటే పట్టాను, అంతే
..........?
ఆఆఆఆఆ.....................
అప్పారావు
:(సుబ్బారావుతో):
ఒరేయ్!
"You are a fool" అంటే
అర్థం చెప్పరా?
సుబ్బారావు
:"నువ్వు ఒక వెధవవి" అని
అప్పారావు
:అలా తిట్టవద్దురా సుబ్బారావు.
ఆఆఆ...................
సుబ్బులు
: ఆ దొంగ మీ ఉంగరం, గడియారం, పర్స్
దోచుకొని వెళ్లిపోతుంటే అలా నోరు మూసుకొని ఎలా ఉన్నారండి? కనీసం అరిస్తే ఇరుగు పొరుగు ఎవరైనా వచ్చేవాళ్ళు
కదా?
అప్పారావు
: ఆ, నోరు తెరిస్తే లోపలున్న రెండు బంగారు పళ్ళు కూడా
పీక్కు పోతాడని భయమేసిందే సుబ్బులు.
ఆఆఆఆఅ..........................
అప్పారావు
: మా తాత చాలా తెలివిగలవాడని, పైగా
చాలా ముఖాలు ఉండేవని మానాన్న చెబుతుంటారు.
సుబ్బారావు
: అలాగా! నువ్వు చూశావా?
అప్పారావు
: లేదు. "మీ తాత బహుముఖ ప్రజ్ఞాశాలిరా! అని మా నాన్న చెబుతుంటారు.
ఆఆఆఆఆఆఅ..................
బంటి :
"నాన్నా! నేను ఎక్కువ తింటూ ఉంటానని అరుస్తూ ఉంటావుగా. మరి నాకు పోటిలో మొదటి
బహుమతి వచ్చింది తెలుసా?
నాన్నా
: మంచిది! ఇంతకీ ఏ పోటీలో?
బంటి :
తిండి పోటీలో
ఆఆఆఆ............
భార్య:
ఏవండీ పొద్దున్న పిల్లాడ్నిస్కూల్ కి బైక్ మీద దించలేదంట?
భర్త:
దించుదామనుకున్నా. కాని, వీధి
చివరిదాకా వెళ్ళి, పేపర్
కొనుక్కుని వచ్చేసరికి వాడు బస్ లో వెళ్ళిపోయాడు.
బాస్:
ఆఫీసుకు మారీ ఇంత లేటుగానా రావడం...?
ఉద్యోగి: మూడా బండ్ల ముచ్చటతో త్రిబుల్ థమాకా సార్. బండి
మీద బయలు దేరి రాక టైరు బరస్ట్ అయింది. బస్సులో వద్దా మంటే చెకింగ్ అంటూ ఆపారు.
ఆటో ఎక్కి రైట్ రైట్ అనగానే రాంగ్ రూట్ అంటూ పట్టు కున్నాడు పోలీసు. అందుకే...
డైరక్టర్:
ఏమిటండి ప్రొడ్యూసర్ గారూ! మీతో పాటు ఈ భిక్షగాడ్ని పట్టుకొచ్చారు?
ప్రొడ్యూసర్:
రైల్లో పాటలు పాడుకుంటుంటే చూశానండి. పాటకు ఐదు రూపాయలిస్తే మనం చెప్పిన ట్లు
పాడేస్తాడట. మనది లోబడ్జెట్ కదా! ప్లే బ్యాక్ సింగర్గా పనికొస్తాడని..
‘మా వారికి పిచ్చి కుక్క కరిచింది. మీరు వెంటనే
రావాలి,’ అంది తాయారు కంగారుగా.
‘మీరేం
గాభరా పడకండి. నేను వచ్చేదాకా మంచం మీదే పడుకోబెట్టండి,’అన్నాడు
డాక్టర్.
‘ఛీ..ఛీ..పిచ్చి
కుక్కని మంచం మీదెలా పడుకోబెడతాం,’ అంది
తాయారు.
టి.వి
కొందామంటే బైనాక్యులర్స్ కొందామాటరేంటి,’ చిరాగ్గా
అన్నది భార్య.
‘బైనాక్యులర్స్
వుంటే మేడమీద నుంచి ఎదురింటి టి.వి చూడవచ్చు,’ చెప్పాడు
భర్త.
‘ఏమిట్రా హరి అంతలా జుట్టు పెంచుకుం టున్నావ్? మొక్కా ఏంటి?’ సందేహంతో
అడిగాడు సురేంద్ర.
‘మొక్కా
పాడా? మా ఆవిడ సవరం కుట్టించుకుంటుందట,’ తాపీగా చెప్పాడు.
‘ఏరా రవీంద్ర! క్రమ శిక్షణ అంటే ఏమిట్రా?’
‘ఒక్కొక్కరిని
శిక్షించడం సార్!
సుబ్బారావు:
ఈ పెళ్ళి అనేదాన్ని ఎవడు కనిపెట్టాడో గాని, బతుకు
నానాటికీ దుర్భరమైపోతోంది గురూ!
పాపారావు:
దానికంత వర్రీ అవ్వడమెందుకూ! అన్ని విషయాల్లోనూ భార్య చెప్పినట్లే విని
ఆమెకనుకూలంగా నడుచుకుంటే సరి. ఏ సమస్యలూ రావు!
సుబ్బారావు:
నిజమే! కాని నేను ఏ భార్య చెప్పినట్లు వినాలి? పెద్ద
భార్య చెప్పినట్లా? చిన్న
భార్య చెప్పినట్లా?
COMMENTS