కొంతకాలం క్రితం వరకు అసలు పెళ్లిళ్లంటే ముక్కుపుడక లేకుండా జరిగేవే కాదు.. కొన్ని చోట్ల ఇప్పటికీ ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. అయితే కేవలం పెళ్లిళ్లనే కాదు. వేరే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా చక్కని ముక్కుపుడక పెట్టుకోవడం వల్ల చుక్కల్లో చందమామల వెలిగిపోతారు. కేవలం సంప్రదాయమైన దుస్తుల మీదే కాదు, చుడీదార్, జీన్స్ వంటి అవుట్ ఫీట్స్ మీద వేసుకోవడానికి కూడా ముక్కుపుడక అందంగా కనిపిస్తుంది. అందుకే కాబోలు. ఇటివల మన తారలంతా ఎక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్లైనా ముక్కు పుడకలతో ప్రత్యక్షమైపోతున్నారు. ఆ మధ్య కేన్స్ అవార్డ్ ఫంక్షన్ లో విద్యాబాలన్, సోనమ్ కపూర్ ముక్కు పుడగ తో మెరిసారు. యశ్ చోప్రాకు నివాళులర్పిస్తూ బాలీవుడ్ నటమణులంతా నిర్వహించిన క్యాట్వాక్లో కూడా రాణీముఖర్జీ ముక్కుముడకతో మెరుపులు మెరిపించింది. ఇక మన టాలీవుడ్ హీరోయిన్ల పని చెప్పే పనే అవసరం లేదు... ఎక్కడ లేటేస్ట్ ఫ్యాషన్ కనిపించినా దాన్ని వెంటనే ఫాలో అయిపోయే మన అమ్మాయిలు హీరోయిన్లను ఫాలో అవుతూ ముక్కు పుడకకు సలాం అంటున్నారు.. మరి మనమూ ఈ సరికొత్త పాత ఫ్యాషన్పైన ఓ లుకేద్దామా..?
ముక్కుపుడక
ముక్కుపుడక లేదా ముక్కెర ఒక విధమైన ముక్కుకు ధరించే ఆభరణము. ముక్కుపుడక ధరించడం సంపంగి లాంటి ముక్కుకు కొత్త వింత అందాన్ని ఇస్తుంది. అనేక ప్రాంతాలలో ముక్కుపుడక పెళ్ళి అలంకారాలలోనే ఎక్కువగా కనిపిస్తుంది.
  • ముక్కుపుడక అంటే మహిళలకు ఎంత మక్కువో తెలియాలంటే పురాణాలలోని ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు. భామాకలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్లనంటుంది. విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంకెబెందెలు దొరికినంత సంతోషం గా శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయబారం నడుపుతుంది.
  • అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం. తాళిబొట్టు మాదిరిగానే వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం కొందరు తీయరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు. పూర్వకాలం భార్య పెట్టుకున్న ముక్కుపుడక బరువు, సైజు, డిజైన్ భర్త ఆర్థిక స్తోమతను తెలిపేవిగా ఉండేవి. రాజుల వంశానికి చెందిన మహిళల ఆభరణాల్లో ఒకటి నుండి 17 వరకు వివిధ రత్నాలు ఉన్న ముక్కుపుడకలు ఎన్నో ఉండేవి.
  • పూర్వకాలంలో ఏడేళ్ళ వయసులోనే ముక్కు కుట్టించి బంగారుతీగ చుట్టించేవారు. పెరిగిన తర్వాత దాన్ని తీసి రాళ్ళు పొదిగిన పుడకలు పెట్టేవారు. ఎంత పేదవారైనా దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకుంటారు. దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువగా కుడివైపు పెడితే, ఉత్తరాదిన మాత్రం ఎడమవైపు పెడుతుంటారు. ఈ ప్రస్తుతకాలంలో కూడా పెద్ద ముత్యపు ముక్కెరను మరాఠీ మహిళలు చాలా ఇష్టంగా ధరిస్తారు. కొందరిలో ఇది దాదాపు గడ్డం వరకు వస్తుంది.


ఇప్పుడు పెళ్ళికాని అమ్మాయిలు కూడా ముక్కుపుడకను ఇష్టంగా ధరిస్తున్నారు. బంగారు పుడక నుంచి వజ్రపు ముక్కుపుడక వరకూ, రింగులు కూడా ధరించడం ఫ్యాషన్ గా మారింది. దానితో సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకూ అందరూ దీనిని ఇష్టంగా ధరిస్తున్నారు. ప్రముఖ క్రీడాకారిణి సానియా మిర్జా దీనిని మార్చకుండా ధరిస్తుంది. ప్రపంచ సుందరి పోటీల్లో వజ్రపు ముక్కుపుడకతో ఐశ్వర్యా రాయ్ అందరినీ ముగ్ధుల్నిచేసిన విషయం తెలిసిందే.
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment: