Articles by "Fitness"
Fitness లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మనసుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుకోవటానికి ఆహారం బాగా తోడ్పడుతుంది. ఇందుకోసం కొంతమంది కాఫీ, టీలను ఆశ్రయిస్తుంటే.. మరికొందరు స్వీట్ల వంటివి తెగ లాగించేస్తుంటారు. నిజానికి ఇవి మనసుని ఉత్సాహ పరచినా వీటితో దుష్రభావాలు ఎక్కువ. అంతకన్నా పోషకాలు దండిగా కలిగిన ఆహార పదార్థాలు తినటం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి చాలా త్వరగా మూడ్‌నీ మార్చేస్తాయని వివరిస్తున్నారు. 

మోనోసాచ్యురేటెడ్‌ కొవ్వు, పొటాషియం:
 ఇవి మెదడుని ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడులోని నాడీకణాలు ఉత్తేజంగా ఉండేలా చేయటంలో పొటాషియం తోడ్పడుతుంది. బాదంపప్పు, వేరుశనగల్లో ఆరోగ్యకరమైన కొవ్వు.. అరటిపండు, చిలగడ దుంపల్లో బాగా పొటాషియం లభిస్తాయి. 

ట్రైప్టోఫాన్‌: 
మూడ్‌ని నియంత్రించటంలో సెరటోనిన్‌ పాత్ర చాలా కీలకం. ఇది మెదడులో న్యూరో ట్రాన్స్‌మీటర్‌గా పనిచేస్తుంది. ఈ సెరటోనిన్‌ ఎక్కువగా లభించాలంటే పాలు, చేమదుంపలు, చేమకూర, జీడిపప్పులను తింటే సరి. 

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు:
 మానసిక ఏకాగ్రత, విశ్రాంతి, కలుపుగోలుతనం పెంపొందటానికి ఒమేగా-3 కొవ్వులు సాయం చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఈ కొవ్వులు లోపించటం వల్ల కుంగుబాటు, చిరాకు బాధించే అవకాశం ఉంది. అందుకే వీటిని పొందాలంటే ఆకుకూరలు.. చేపలు.. అవిసెగింజలు తీసుకుంటే మేలు.

ఫోలిక్‌ యాసిడ్‌, బి6 విటమిన్‌: 
కుంగుబాటుని దూరం చేసేందుకు ఈ రెండు విటమిన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి తాజా కూరగాయలు, కాలేయం, పప్పుల్లో దండిగా ఉంటాయి. 
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
చదువులు కావచ్చు.. పోటీ పరీక్షలు కావచ్చు.. విద్యార్థుల మీద రకరకాల ఒత్తిళ్లుంటాయి. అలాంటప్పుడు యోగా, ధ్యానం చాలు అని చాలామంది అంటారు. అవే కాదు... ఆహారంతోనూ ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

విటమిన్‌ 'సి': ఈ విటమిన్‌లో ఒత్తిడిని తగ్గించే గుణం ఉంటుంది. నారింజ, అనాస, టొమాటో, జామలో ఇది ఉంటుంది. మానసికంగా చిరాగ్గా, విసుగ్గా ఉన్నప్పుడు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది.  

అరటిపండు: ఒత్తిడిని తగ్గించే ఔషధాల్లో అరటి పండు ఒకటి. ఓ చిన్న పండును తింటే సరిపోతుంది. అందులో తక్కువ కెలొరీలు లభించడమే కాదు, శరీరానికి అవసరమైన చక్కెర ఆ చిన్న పండు ద్వారా అందుతుంది. 
అంతేకాదు మెదడుకు మేలు చేసే సెరటోనిన్‌ అనే రసాయనం ఉత్పన్నమవుతుంది. దీనివల్ల ఉత్సాహంగా ఉండటం సాధ్యమవుతుంది. ఒత్తిడి కూడా నియంత్రణలోకి వచ్చేస్తుంది. 

నట్స్‌: వీటిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మానసికంగానూ దృఢంగా మారతారు. ఉద్యోగినులూ, విద్యార్థినులూ వెంట ఎప్పుడూ డ్రై ప్రూట్స్‌ ఉంచుకుంటే సరిపోతుంది. అలవాటుగా మార్చుకుంటే ఇంకా మంచిది. ఒత్తిడిగా అనిపించినప్పుడు తిన్నా అది దూరమవుతుంది. 

ఓట్స్‌: ఇవి మనకు కావల్సినప్పుడు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే ఓట్స్‌తో చేసిన బిస్కెట్లు, చిక్కీలు తినడం మంచిది. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు ఒత్తిడిని దూరం చేస్తాయి. శరీరం కూడా వీటిని త్వరగా గ్రహిస్తుంది. ఓట్స్‌ తేలికపాటి ఆహారం కావడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలూ రావు.

చేప నూనె: ఎక్కువగా ఒత్తిడికి గురై, టెన్షన్లు ఎదుర్కొనేవాళ్లు..వంటకు మామూలు నూనెకు బదులు, చేప నూనెను ఎంచుకోవడం మంచిది. దీనిలో ఉండే విటమిన్‌ ఈ ఒత్తిడిని దూరం చేసే హార్మోన్లను శరీరంలోకి విడుదల చేస్తుంది. విద్యార్థులు దీనికి ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచిది.  

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
అధికబరువుతో రకరకాల అనర్థాలు పొంచి ఉన్న మాట నిజమే. కానీ తక్కువ బరువునూ తక్కువగా అంచనావేయటానికి వీల్లేదు. ఎందుకంటే శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) సాధారణ స్థాయిలో (18.5-25.9) గలవారి కన్నా తక్కువ బీఎంఐ (18.5, అంతకన్నా తక్కువ) గలవారికి రకరకాల కారణాలతో మరణించే ముప్పు 1.8 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
మామూలు వ్యక్తులతో పోలిస్తే వూబకాయులకు (బీఎంఐ 30-34.9) మరణ ముప్పు 1.2 రెట్లు మాత్రమే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక బీఎంఐ 35, అంతకంటే ఎక్కువగల వుబకాయులకు ఈ ముప్పు 1.3 రెట్లు ఎక్కువని తేలింది. అంటే వూబకాయం కంటే తక్కువ బరువే ఎక్కువ ప్రమాదకరంగా పరిణమిస్తోందన్నమాట. మన బీఎంఐ కేవలం శరీరంలోని కొవ్వును మాత్రమే కాదు. కండరాల మోతాదునూ ప్రతిబింబిస్తుంది. 
అందువల్ల వూబకాయాన్ని తగ్గించే విషయంలో కొవ్వు, కండరాల, ఎముక మోతాదులు తగినంత స్థాయిలో ఉండేలా చూసుకోవటం కీలకమని అధ్యయనానికి నేతృత్వం వహించిన వైద్యులు చెబుతున్నారు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మనిషిలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందడానికి చక్కని ఆరోగ్యం అవసరం. మంచి ఆరోగ్యానికి సమతులాహారం, రోజువారీ వ్యాయామ ప్రక్రియలు ఎంతో దోహదపడుతాయనడంలో సందేహం లేదు.
ఆత్మ విశ్వాసంతో జీవించగలిగిననాడు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను, సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చు. తద్వారా జీవితాన్ని సాఫీగా, ఆనందంగా గడుపవచ్చు. జీవితంలో నిర్దేశించుకునే లక్ష్యాలను సునాయాసంగా సాధించవచ్చు.

వ్యాయామాన్ని తొలిసారిగా ప్రారంభించేవారు కూడా తమ శరీరంలో కలిగే మార్పులను తేలిక గానే గుర్తించవచ్చు. వీరు ఇతరులను అనుకరించకూడదు. ముఖ్యంగా మోడల్స్, సినీ తారలు మొదలైన వారితో పోల్చుకుంటూ, వారు చేసే వ్యాయామ ప్రక్రియలను నిర్వహించకూడదు.
సమాజంలో కొందరు సన్నగానూ, మరికొందరు లావుగానూ, ఇంకొందరు ఎంతో బలిష్టంగానూ కనిపిస్తారు. అది లోక సహజం. వారి వారి శరీరాకృతులనూ, ఆరోగ్యాన్ని చూసి మన మలా లేమని కలత చెందాల్సిన పని లేదు. వారికంటే మనం అన్నిటిలో తక్కువగా ఉన్నామనే భావనతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. ఫిట్నెస్ సెంటర్లు శారీరకంగా తగిన అర్హత కల్పించడానికి ఏర్పడినవే. వాటిద్వారా శారీరకంగా ఫిట్నెస్ను పొందవచ్చు.

ప్రతివ్యక్తి తనకు అనుకూలమైన, తనకు ఆనందాన్ని కలిగించే వ్యాయామ ప్రక్రియలను ఎంచుకుని వాటిని కొనసాగిస్తూ ఉండడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఆశయ సాధనలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొనే శక్తి కూడా లభిస్తుంది. సుదీర్ఘ జీవనయానంలో తగిన సత్ఫలితాలను అందుకోవడానికి వీలుగా వ్యాయామ ప్రక్రియల రూపకల్పన జరగాలి. ఈ ప్రక్రియలను ముందు చిన్నవిగా రూపొందించుకుంటూ, తరువాత అసాధ్యమనుకునే ప్రక్రియలను కూడా నెమ్మదిగా చేపట్టాలి. వాటిని సాధన చేయగలిగితే చురుకుగా ముందుకు సాగడానికి వీలవుతుంది.

శరీరంలో కలిగే మార్పుల వలన ఎటువంటి ఆందోళనలకు గురి కాకుండా తాను రూపొందించుకున్న వ్యాయామ ప్రక్రియల ప్రకారం ఒక సదవగాహనను ఏర్పరచుకుని ప్రతిరోజూ కొనసాగించాలి. వ్యాయామ  ప్రక్రియల వలన కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాటి వలన ఆశించిన ఫలితాలను సాధించినప్పుడల్లా ఒక పుస్తకంలో రికార్డు చేసుకోవాలి.

సమాజంలో మిమ్మల్ని ప్రోత్సహించి, మీ ఆశయాలకు అనుగుణంగా స్పందించే వ్యక్తులు, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలగాలి. వారితో అనేక విషయాలపై చర్చలు జరుపుతూ, మీరు నిర్వహిస్తున్న వ్యాయామ ప్రక్రియల గురించి కూడా చర్చలు జరపండి.


E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
పొద్దున్నే లేచి, హడావుడిగా రెడీ అయిపోయి, వాహనాన్ని బయటకు తీసి, తిన్నగా పార్క్కో, జిమ్కో వెళ్ళిపోయి.... వన్ టూ త్రీ... అంటూ వ్యాయామం మొదలు పెట్టేయడం చాలా మందికి అలవాటు. లెక్కప్రకారం 3-4 కిలోమీటర్ల వాకింగో, 30 నిమిషాల సేపు వెయిట్స్తో వర్కవుట్సో చేసేసి చెమటలు కూడా ఆరకుండానే సర్రున ఇంటికి తిరిగి వచ్చేస్తారు. హడావుడిగా తమ రోజువారీ పనుల్లో పడిపోతారు. కానివ్యాయమం చేయడం ఎంత అవసరమో, పద్ధతిగా చేయడం అంతే అవసరం
ఫిట్నెస్రొటీన్లో వర్కవుట్కి ముందు వార్మప్చివరనకూల్డవున్చేయడం సక్రమమైన పద్ధతిలో భాగం. రోజూ వ్యాయామం చేసేప్పుడు అందులో వార్మప్‌, కూల్డవున్ఎక్సర్సైజ్లు కూడా తప్పకుండా చేర్చాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 వార్మప్‌ కోసం
వేడెక్కించాలి వంచాలంటేఇనుమును మాత్రమే కాదు దేహాన్ని కూడావేడెక్కితేనే ఒళ్లు వంగుతుందిఒళ్లు వంచితేనే వ్యాయామం పండుతుందిపండిన ఫలం అందాలంటే... అందుకోవాలంటే దేహానికి తీరిక చిక్కాలివ్యాయామానికి ముందూ వెనుకా చూడాలిచేసే ముందు వార్మప్‌, ముగించాక కూల్డవునూ చేయాలి... వార్మప్‌ కోసం ఆటలకైనావ్యాయామాలకైనా ప్రారంభానికి ముందు వార్మప్‌ తప్ప నిసరిచేయబోయే పూర్తిస్థాయి వర్కవుట్కు సిద్ధం చేసే ప్రయత్నమది.వ్యాయామానంతరం కూల్డవున్‌ అత్యవసరం. వ్యాయామం పూర్తయ్యాక చేసే ఈ కూల్డవున్‌ ప్రక్రియ వల్ల రక్తసరఫరాతో పాటు అన్నీ తిరిగి సాధారణ స్థాయికి చేరతాయి.

వార్మప్ఎందుకంటే..
ఏదైనా శారీరక శ్రమకు గురయ్యే పని చేసేప్పుడు దానికి తగ్గట్టుగా మనసు, శరీరం సిద్ధం కావాలి. పరిగెత్తే ముందు, ఆటలాడే ముందు నిదానంగా, దశలవారీగా మాత్రమే మజిల్ని వేడెక్కించాలి. అవయవాలను చైతన్యపరచి, అప్పటిదాకా నిద్రాణంగా ఉన్న అంతర్గత శక్తిసామర్థ్యాలను మేల్కొలపడానికి వార్మప్సహకరిస్తుంది. దేహాన్ని మాత్రమే కాదు మనసును కూడా ఇది వ్యాయామానికి సన్నద్ధం చేస్తుంది.
లాభాలేమిటంటే... దేహంలో చక్కెర స్థ్ధాయిల్ని అదుపులో ఉంచే అడ్రినలిన్ హార్మోన్తోపాటు, సామర్ధ్యాన్ని పెంచేహార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. రక్తంలోని ఆక్సిజన్సరఫరా మెరుగయ్యేందుకు దోహదం చేసి అవయవాలు, కీళ్ళ కదలికలు సాఫీగా ఉండేందుకు సైనోవిల్ఫ్లూయిడ్ఉత్పత్తిని వార్మప్పెంచుతుంది. కీళ్ల కదలికల మధ్య ఇబ్బందుల్ని నివారించి, సామర్ధ్యంతో కదిలేలా చేస్తుంది. రక్తనాళాలు వ్యాకోచింపజేయడం, దేహంలో, కండరాల్లో, రక్తంలో అవసరమైనంత వేడి పుట్టించడం, కండరాల్లో సాగే తత్వాన్ని మెరుగుపరచడం, ఎంజైమ్ కదలికల్ని మెరుగు పరచడం వంటివి చేస్తుంది. హిమోగ్లోబిన్మరింతఆక్సిజన్ను స్వీకరించేలా చేసి మజిల్పై ఒత్తిడి నివారణకు ఉపకరిస్తుంది. వ్యాయామంపై ఏకాగ్రత, ఇష్టం పెరిగేందుకు, శక్తిమంతంగా, పూర్తి సామర్ధ్యానికనుగుణంగా వ్యాయామం చేసేందుకు సహకరి స్తుంది. గుండెకు రక్తసరఫరా వేగాన్ని నియంత్రించి తద్వారా గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది. మజిల్మెటబాలిజం ప్రక్రియను పెంచుతుంది.

వార్మప్చేసేటప్పుడు...

వార్మప్లో భాగంగా రొటేట్ఎక్సర్సైజ్లు ఎంచుకోవాలి. కనీసం 10 రిపిటీషన్స్అయినా చేయాలి. బాడీపార్ట్కి చేస్తుంటే దానికి తగ్గట్టుగా నప్పేది చేయాలి. ఒక్కోరకం ఒక్కోసెట్ మాత్రమే చేయాలి. 30 నిమిషాల వర్కవుట్కు కనీసం 5 నిమిషాలు, గంట చేసే వర్కవుట్కు 10 నిమిషాల చొప్పున వార్మప్చేస్తే సరిపోతుంది. ఉఛ్వాస నిశ్వాసాలు స్వేచ్ఛగా తీసుకుని వదులుతుండాలి. దేహాన్ని సాగదీసే స్ట్రెచ్ఎక్సర్సైజ్లనుదీనికి ఎంచుకోవాలి. హార్ట్రేట్మీద దృష్టి పెట్టాలి. గుండె కొట్టుకునే వేగం మరీ పెరిగేంత వరకూ చేయనక్కర్లేదు. వర్కవుట్కు తగిన విధంగా వార్మప్ఎక్సర్సైజ్కూడా నప్పేది ఎంచు కోవాలి. ఉదాహరణకు కాళ్ళకి సంబంధించిన వ్యాయామం చేస్తుంటే కాళ్ళకదలికల్ని దానికి అనువుగా మార్చే స్ట్రెచ్వార్మప్ ఎక్సర్సైజ్లు చేయాలి.

కూల్డవున్‌...

అలసిన దేహం తప్పనిసరిగా విశ్రాంతిని కోరుకుంటుంది. చాలామంది వర్కవుట్స్పూర్తి కాగానే తిరిగి రోజువారి పనుల్లో నిమగ్నమవుతారు. దాంతోదేహానికి అవసరమైన విశ్రాంతి లభించదు. తద్వారా ఆశించిన ఫలితాలు సిద్ధించవు. అలాగని వ్యాయామం పూర్తిచేసిన తర్వాత ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోవడం లాంటివి చేయలేం... చేయకూడదు కూడా. అందుకే నిదానంగా ప్రారంభమై, ఊపందుకుని, తారస్థాయికి చేరి ముగించాలి వ్యాయమాన్ని. ముగించేముందుగా తారస్థాయిని తిరిగి సాధారణ స్థాయికి చేర్చాలి. అలా చేయకపోతే దేహంలో తక్కువ వ్యవధిలో పెరిగిన వేడి, ఇతరత్రా సమస్యలకు దోహదం చేసే ప్రమాదముంది. దానికోసం తప్పకుండా చేయాల్సింది కూల్డవున్‌.
ఉత్పత్తయిన హార్మోన్లు తిరిగి దేహానికి అవసరమైన సాధారణస్ధాయికి చేరేలా కూల్డవున్ప్రక్రియ చేస్తుంది.. లాక్టిక్యాసిడ్తో సహా వ్యాయామ సమయంలో అదనంగా, వ్యర్థంగా ఉత్పత్తయిన వాటిని తొలగించేందుకు సహకరిస్తుంది. అలసినకండరాలు సేద తీరేందుకు దోహదపడుతుంది. రక్తంలో పెరిగిన ఎడ్రినలిన్హార్మోన్స్థాయిని యధాస్థితికి చేరుస్తుంది. కండరాలు విశ్రాంతిని పొందేందుకు, వ్యాయామ ఫలితాలు పూర్తిగా దేహానికి అందేందుకు ఉపకరిస్తుంది. గుండెకొట్టుకునే స్థితిని సాధారణస్థాయికి చేరుస్తుంది. కొందరిలో వ్యాయామం చేసిన48-72 గంటల తర్వాత డిలేడ్ఆన్సెట్మజిల్సోర్నెస్‌ (డిఒఎమ్ఎస్‌) కారణంగా తీవ్రమైన ఒళ్లునొప్పులు వంటివి లుగుతాయి. వీటిని కూల్డవున్ఎక్సర్సైజ్లు నివారిస్తాయి.
కూల్డవున్కోసం చేసే వ్యాయామాలు పూర్తిగా రిలాక్సింగ్ మూడ్లో చేయాలి. శవాసనంతోపాటు, కూర్చుని, పడుకుని చేసే స్ట్రెచెస్కు ప్రాధాన్యం ఇవ్వాలి. బాడీపార్ట్స్కైతే మనం వ్యాయామమందించామో అవి రిలాక్స్అయ్యేట్టుగా స్ట్రెచ్ చేయాలి. వేగంగా దించడం, లేపడం చేయకుండా స్ట్రెచ్చేసి అదే స్థితిలో కాసేపు ఉంచి నిదానంగా యధాస్థానానికి రావాలి. దాదాపు వార్మప్కోసం కేటాయించినంత సమయాన్నే కూల్డవున్కి కూడా వెచ్చించాలి. ఏదైనాపని చేసేటప్పుడు కొంచెం ముందూవెనుకా చూసుకోవాలని పెద్దలు చెప్పారు. అదే విషయాన్ని ఇపుడు ఫిట్నెస్ నిపుణులు, వైద్యులు కూడా చెప్తున్నారు. అందులో భాగమే వార్మప్లూ, కూల్డవున్లూ... ఎన్ని రోజులు చేసినా ఆశించినఫలితం రావడం లేదనివ్యాయామంపై వ్యతిరేకత పెంచుకోవ డం కన్నాసరిగా చేస్తున్నామా లేదా అనేదితరచి చూసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు