Articles by "Health Tips"
Health Tips లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
వృద్ధుల్లో తికమక పడడం, మతి మరుపు వంటి లక్షణలు సహజంగా కనిపించేవే గానీ ఇందుకు బీ12 విటమిస్ లోపమూ కారణం అవుతుండొచ్చని మీకు తెలుసా? ఎందుకంటే వయసు మీద పడుతున్నకొద్దీ మనం తీసుకునే ఆహారంలోని బీ12 విటమిస్ను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. ఇది బీ12 లోపానికి దారితీస్తుంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఈ లోపం ఎక్కువవుతుండొచ్చు. దీంతో తికమకపడం, మతిమరుపు వంటి లక్షణలు కనిపిస్తాయి. ఇలాంటివి వృద్ధుల్లో కనిపిస్తే వయసుతో పాటు వచ్చే లక్షణలుగానే చాలమంది పొరపడుతుంటారు. 


మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటనికి, ఎర్ర రక్తకణాల తయారీకి బీ12 విటమిస్ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, మూత్రం ఆపుకోలేకపోవం, రక్తపోటు తక్కువ కావడం, కుంగుబాటు(డిప్రెషన్), మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు తలత్తుతాయి. ఇక లోపం మరీ తీవ్రమైతే మాత్రం రక్తహీనతకు దారితీస్తుంది. అన్ని బీ విటమిన్ల మాదిరిగానే బీ12 కూడా నీటిలో కరుగుతుంది. అయితే మోతాదు ఎక్కువగా ఉంటే దీన్ని మన శరీరం.. కాలేయం, కణజాలల్లో నిల్వ చేసుకుంటుంది. అందువల్ల ఆహారం ద్వారా తగినంత బీ12 తీసుకోకపోయినా చాలకాలం పాటు రక్తంలో దీని మోతాదు తగ్గినట్లు కనిపించదు. ఒకవేళ నిల్వ మోతాదు తక్కువగా ఉంటే చాల త్వరగానే బీ12 లోపం కనబడొచ్చు. పిల్లల్లోనైతే అంతకన్నా ముందుగానే ప్రభావం చూపుతుంది. 

వేటి ద్వారా లభిస్తుంది? 

ఆహారం పదార్థాల్లోకేవలం మాంసంలో.. ముఖ్యంగా కాలేయంలో బీ12 అధిక మొత్తంలో ఉంటుంది. సుమారు 100 గ్రాముల కాలేయం ద్వారా 83 మైక్రోగ్రాముల విటమిస్ లభిస్తుంది. చేపలు, షెల్ఫిషలో కూడా ఎక్కువగానే ఉంటుంది. పాల పదార్థాలు, గుడ్లు లలోకాస్త తక్కువ.

మాంస పదార్థాల్లో ఈ బీ12 విటమిస్ ప్రోటన్లతో కలిసిపోయి ఉంటుంది. జీర్ణాశయంలోని ఆమ్లం ఇది విడుదలయ్యేల చేస్తుంది. అయితే వయసుతో పాటే జీర్ణాశయంలోని ఆమ్లం స్థాయీ తగ్గుతుండం వల్ల వృద్ధాప్యంలో బీ12ను గ్రహించే శక్తీ మందగిస్తుంది. ఇక శాకాహారంలో బీ12 చాల తక్కువగా ఉండమే కాదు.. దీన్ని శరీరం సరిగా గ్రహించలేదు కూడా. కాబట్టి పూర్తి శాకాహారులు, వృద్ధులు వైద్యుల సలహా మేరకు బీ12 మాత్రలు వేసుకోవం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ఈ మధ్య మీకు కారణం తెలియకుండానే తలనొప్పి వేధిస్తోందా? దీనికేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మీ విధి నిర్వహణలో భాగంగా తలెత్తిన ఒత్తిడి. దీన్ని పట్టించుకోకపోతే డిప్రెషన్‌లోకీ దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

భారత పరిశ్రమల అనుబంధ సంస్థ- అసోచామ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక సర్వేలో.. మనదేశంలో పలురంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి, బడలిక అధికంగా ఉంటున్నట్లు గుర్తించారు. భారతీయ ఉద్యోగివర్గంలో ఇంటికీ, ఆఫీసు పనికీ మధ్య తేడా చెదిరిపోతున్నట్లు తేల్చారు. పనివేళలు ఎక్కువవ్వటం, అసాధారణ పని వేళల్లో విధులు నిర్వర్తించాల్సి రావటం వంటివన్నీ మానసిక ఒత్తిడులను అంతకంతకూ పెంచుతూ పలురకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఒత్తిడి డిప్రెషన్‌కు కారణమవ్వటం మామూలే కానీ.. ఇది తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలకూ దారి తీస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి తలనొప్పులకు స్పష్టమైన కారణం కూడా తెలియటం లేదని పేర్కొంటున్నారు. తలనొప్పితోపాటు కాళ్లూ చేతుల్లో నొప్పులు, నిద్రలేమి, ఆకలి తగ్గటం, మహిళల్లోనైతే ఎక్కువెక్కువగా తినెయ్యటం వంటి సమస్యలు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. 

అకస్మాత్తుగా ఇలా తలనొప్పి, కాళ్ల నొప్పుల వంటివి వేధిస్తున్నప్పుడు తరచూ ఆఫీసు వదిలి ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుండటం ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. ఎన్ని రకాల పరీక్షలు చేయించుకున్నా ఈ తరహా నొప్పులకు కారణాలేమిటనేది వైద్యులు సైతం గుర్తించలేకపోతున్నారు. ఎంతకీ అంతుచిక్కని పలురకాల నొప్పులు, దేనిపైనా ఆసక్తి లేకపోవటం, నీరసం వంటివి సతాయిస్తున్నప్పుడు ఇవన్నీ విధి నిర్వహణకు సంబంధించిన సమస్యలుగా అనుమానించాలని మానసిక నిపుణులు అంటున్నారు. 

అధిక వేతనాలు, పెరుగుతున్న కోర్కెలు, తీవ్రస్థాయి పోటీతత్వం, బాగా సంపాదించాలనే కాంక్ష.. వంటివన్నీ భారతీయ ఉద్యోగుల్లో ఒత్తిడులను పెంచుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చేసే పనినీ, పనిచేసే చోటునీ ఆస్వాదించటం, అనవసరమైన ఒత్తిడికి లోనుకాకుండా జాగ్రత్తగా వ్యవహరించటమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. 

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
డాక్టర్‌ దగ్గరకు వెళ్లగానే.. స్టెతస్కోప్‌తో 'లబ్‌-డబ్‌'లు వినటానికంటే ముందే.. మణికట్టు దగ్గర పట్టుకుని ఒక్క నిమిషం నాడి చూస్తారు. ఇలా చూస్తే ఏం తెలుస్తుంది? 'నాడి' మన వైద్యులకు ఏం చెబుతుంది? పూర్వకాలంలో కేవలం నాడి చూసే ఎన్నో వ్యాధులను గుర్తించేవారు. అన్ని విషయాలను చెబుతుందా మన నాడి?
మన గుండె అత్యంత కీలకమైన అవయవం. అది బలంగా కొట్టుకున్న ప్రతిసారీ.. మన గుండెకు అనుబంధంగా శరీరమంతా ఉన్న రక్తనాళాలు కూడా ప్రభావితమవుతాయి. గుండె కొట్టుకోవటం, ఆ ఒత్తిడి తాలూకూ తరంగాలు రక్తనాళాల ద్వారా మన శరీరమంతా పాకుతాయి. దీన్నే మన వైద్యులు 'నాడి' చూడటం ద్వారా గుర్తిస్తారు. ఈ ఒత్తిడి తరంగాలను మణికట్టు దగ్గర, చంకల్లో, మెడ పక్కన, తొడలు, మోకాలు వెనకవైపు, పాదాల్లో స్పష్టంగా గమనించవచ్చు. ఈ నాడీ వేగం.. మన గుండె కొట్టుకుంటున్న వేగాన్ని సూచిస్తుంది. 

మణికట్టు దగ్గర నాడి తెలుసుకోవటం తేలిక. మణికట్టు కింద బొటనవేలు, పైవైపు చూపుడు, మధ్య, ఉంగరం వేళ్లను పెట్టి కొద్దిగా అదిమి చూస్తే.. క్రమ పద్ధతిలో నాడి కొట్టుకోవటం మనకు ఇట్టే తెలిసిపోతుంది. సాధారణంగా వైద్యులు దీన్ని 30 సెకన్లు లెక్కించి, దాన్ని రెట్టింపు చేయటం ద్వారా ఒక నిమిషంలో నాడి వేగాన్ని గణిస్తుంటారు. 

స్టెతస్కోపు, ఈసీజీ వంటివి లేని పూర్వకాలంలో డాక్టర్లు ఈ నాడి చూడటం ద్వారానే రోగ నిర్ధారణ చేస్తుండేవారు. మానసిక ఆందోళన, ఉద్వేగాలు నాడీ వేగం పెరిగేలా చేస్తాయి. ఒంట్లో థైరాయిడ్‌ హార్మోన్‌ ఎక్కువైనా, రక్తహీనత వచ్చినా, కొన్నిరకాల గుండె జబ్బులున్నా నాడి ప్రభావితమవుతుంది. కాపీ, టీ, కూల్‌డ్రింకుల వంటి కెఫీన్‌ ఉండే పానీయాలను తాగినా నాడీ వేగం పెరుగుతుంది. కొన్ని రకాల బీపీ మందులు వేసుకుంటుంటే నాడీ వేగం తగ్గుతుంది. 
మొత్తమ్మీద- విశ్రాంతి సమయంలో నాడీవేగం 76 కంటే ఎక్కువుంటే గుండె వ్యాధుల ముప్పు రెట్టింపు అయినట్టు లెక్క. అలాగే నాడి కొట్టుకుంటున్న తీరును బట్టి రకరకాల గుండె జబ్బులను కూడా వైద్యులు గుర్తించే లేదా కనీసం అనుమానించే అవకాశం ఉంటుంది. కాబట్టి నాడి మీద ఒక కన్నేసి ఉండటం ద్వారా మన ఆరోగ్య పరిరక్షణకు కొంతవరకూ మనమే నడుం కట్టొచ్చు

మన వయసును బట్టి ఈ నాడీ వేగం మారుతుంటుంది...
  • ఏడాది లోపు పిల్లల్లో: 100-160
  • 1-10 ఏళ్ల పిల్లల్లో: 70-120 
  • 10 ఏళ్ల పైబడిన వారిలో: 60-100
  • శిక్షణ పొందిన క్రీడాకారుల్లో: 40-60 
  • నిద్రలో: 40 వరకూ కూడా తగ్గొచ్చు. 
  • బాగా వ్యాయామం చేసినప్పుడూ.. మానసికంగా భయాందోళనలకు గురైనప్పుడు: 200 వరకూ కూడా వెళ్లొచ్చు.


E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
అవసరానికన్నా అధికంగా  తినటం అలవాటైన వారికి..  కడుపులో జీర్ణాశయం గోడలపై  వాపు తరహా ఇన్‌ఫ్లమేషన్‌ తలెత్తి... అజీర్తి, ఆకలి పెరగటం, పేగుల్లో చిరాకు, బరువు పెరగటం  వంటి సమస్యలకు దారితీస్తుంది.  ఆహార అలవాట్లు, జీవనశైలిలో  చిన్నచిన్న మార్పులు తీసుకురావటం  ద్వారా ఆరోగ్యంలో, శరీర ఆకృతిలో  పెద్దపెద్ద మార్పులే తీసుకు రావచ్చంటున్నారు  నిపుణులు.
  • రోజూ గ్లాసుడు పచ్చి కూరగాయల రసం తాగటం శ్రేయస్కరం. క్యారెట్‌, ఉసిరి, కూరగాయల రసాల్లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఉత్తేజాన్నిస్తూ ఆహారాన్ని తేలికగా జీర్ణం చేస్తాయి. 
  • బీటాకెరటిన్‌, విటమిన్‌-సి, విటమిన్‌-ఇ, కూరగయాలు, గింజల్ని రోజువారీ ఆహారంలో తీసుకోవాలి. 
  • ఆరోగ్యంగా, చక్కగా ఉన్నారనేది శరీరాకృతి చక్కగా ఉండటం ఒక సంకేతం. తక్కువగా తినటం ద్వారా వృద్ధాప్య ఛాయలూ నెమ్మదిస్తాయి. 
  • సరిపడినన్ని మాంసకృత్తులు తీసుకోవాలి. ఇవి కణజాలానికి మరమ్మతులు చేస్తాయి. ఎముకల ఎదుగుదలను ప్రేరేపిస్తాయి. 
  • ఒత్తిడిని నియంత్రించాలి. వ్యాధులకు కారణమయ్యే వాటిలో మనసూ ముఖ్యమైనదే. ఒత్తిడి రోగ నిరోధక వ్యవస్థను అణచి పెడుతుంది. వయసు మీద పడేలా చేస్తుంది. 
  • వారంలో ఒకరోజు ఇతరత్రా ఆహారం తీసుకోకుండా పచ్చి కూరగాయ ముక్కలు (సలాడ్లు) తినొచ్చు. స్థూలకాయాన్ని అడ్డుకోవటానికి ఇది చక్కని మార్గం. 

  • నెలకు ఒక్కరికి 500 మి.లీ.కన్నా ఎక్కువగా నూనెల్ని వాడకూడదు. అది కూడా ఆలివ్‌, తవుడు, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆవ నూనెలు మేలు. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, ప్రాసెస్డ్‌ ఆహారం, వేపుళ్లు తగ్గించటం ద్వారా వయసు మీద పడటాన్నీ నిరోధించవచ్చు. 
  • కుటుంబ సభ్యులు, స్నేహితులు, పెంపుడు జంతువులతో అనుబంధాల్ని పెంచుకోవాలి. ఇది రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించే శక్తివంతమైన సాధనం. 
  • వారానికి అయిదు రోజులైనా 30-40 నిమిషాలపాటు వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. చెమట పట్టటం వల్ల నిల్వఉండే విషపదార్థాలు బయటికి పోతాయి. ఏరోబిక్‌ వ్యాయామాలు జీర్ణశక్తినీ, జీవక్రియల్నీ పెంచుతాయి. 
  • పొగతాగటం మానటం ద్వారా ఆరోగ్యానికి మరింత బలాన్ని అందించవచ్చు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
చాల మంది వ్యాయామాన్ని హుషారుగానే మొదలు పెడతారు. కానీ కొద్ది రోజులు కాగానే మధ్యలోనే మానేస్తుంటారు. ఒకసారి వ్యాయామం ఆరంభిస్తే దాన్ని కొనసాగించటం చాల అవసరం. క్రమం తప్పకుండా రోజూ చేస్తేనే ఫలితం కనబడుతుంది. వ్యాయామాన్ని మధ్యలో మానకుండా ఉండాలంటే దాన్నొక అలవాటు మార్చుకోవడం మంచి పద్ధతి. అప్పుడది మిగతా పనుల్లో ఒకటి గానే తోస్తుంది కానీ భారంగా అనిపించదు. కనీసం 6 నెలల పాటు వ్యాయామాన్ని ఆపేయకుండా చేయగలిగితే ఒక అలవాటుగా మారుతుంది. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు.
  • రకరకాల పనులతో తీరిక లేకుండా గడిపే వారు వ్యాయామానికి చివరి స్థానం ఇస్తుంటారు. అయితే ఆయా పనులను చేయాలంటే ముందు చురుకుగా ఉండాలని గుర్తుంచుకోవాలి. ఇందుకు వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి పనుల్లో మునిగిపోక ముందే ఉదయం లేస్తూనే వ్యాయామానికే ప్రాధాన్యమివ్వటం అలవరచుకోవాలి. దీన్ని కూడా తప్పనిసరి పనిగా భావిస్తే సమయం దానంత అదే చిక్కుతుంది.
  •  బయటికి వెళ్లటాన్ని ఇష్టపడేవారు సైకిల్ తొక్కడం, ఈత, నడక వంటి వాటితో వ్యాయామాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు. నడుస్తున్నప్పుడు, తోట పని చేస్తున్నప్పుడు సంగీతం కూడా వినొచ్చు. చాల మంది ఒకరకం వ్యాయామం చాలని సరిపెట్టుకుంటుంటారు. అయితే రకరకాల వ్యాయామాలను ఎంచుకోవటం వల్ల సహన శక్తి, దృఢత్వం, నియంత్రణ వంటివి చేకూరుతాయి. దీంతో విసుగు రాకుండా ఉండటమే కాదు.. గాయాల బారిన పడకుండా చూసుకోవచ్చు.
  • ఎలాంటి వ్యాయామాలైనా గాయాలు కాకుండా చూసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా కొత్తవి ఆరంభించినా, చాల కాలం తర్వాత తిరిగి మొదలెట్టినా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బులతో బాధ పడుతుంటే వైద్యుల సలహా మేరకు, శరీరానికి సరి పడేలా ఎంచుకోవాలి. వ్యాయామం మొదలెట్టక కొద్దిరోజుల పాటు నొప్పిగా ఉన్నా క్రమంగా తగ్గిపోతుంది. అయితే నొప్పులు మరీ ఎక్కువగా ఉన్నట్లయితే వ్యాయామం తీవ్రంగా చేసి ఉండొచ్చని గుర్తించాలి. కాబట్టి వ్యాయామాన్ని నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి.
  • వ్యాయామం చాల కష్టంగా ఉన్నా.. ఎక్కువ ఖర్చుతో కూడుకున్నా.. అసౌకర్యంగా అనిపించినా దానిపై అంతగా ఆసక్తి ఉండదు. కాబట్టి దీన్ని సాధ్యమైనంత తేలికగా మార్చుకోవాలి. కుర్చీలో కూచ్చోని టీవీ చూస్తున్నప్పుడు  చేత్తో బరువులెత్తడం, పిల్లలను ఆడిస్తూ నడవడం, ఒకేసారి ఎక్కువ కాకుండా మధ్య మధ్యలో విరామం ఇస్తుండడం వంటివి చేస్తుంటే అసలు వ్యాయామం చేసినట్టే అనిపించదు.
  • స్నేహితుడితో గానీ కుటుంబసభ్యులతో గానీ కలిసి వ్యాయామం చేయం పరస్పరం ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీంతో వ్యాయామం కొనసాగించే వాతావరణమూ ఏర్పడుతుంది. వీలైతే యోగా తరగతుల్లో, వాకింగ్ క్లబ్లో చేరమూ మంచిది.
  • మనకు మనమే శారీరక శ్రమ చేయటానికి వీలున్న అవకాశాలను సృష్టించుకోవడం కూడా బాగా ఉపయోగపడుతుంది. బయటకు వెళ్ళినప్పుడు వాహనాలను కాస్త దూరంగా ఆపి నడవడం, మెట్లు ఎక్కడం వంటివి చేయవచ్చు. వృద్ధులు క్యూలో ఎక్కువ సేపు నిలబడాల్సి వస్తే ఒక కాలు మీద నిలబడుతూ నియంత్రణనూ సాధన చేయవచ్చు. ఏదైమైన మనసుంటే మార్గం దొరక్కపోదని గుర్తుంచుకోవాలి.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
టీవీ చూసేటప్పుడు, కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు, దాదాపు అందరూ కూర్చునే ఉంటారు. కానీ ఇలా కూర్చుని ఉండడం వల్ల మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం వుంది. కాబట్టి గంటల కొద్దీ అలానే కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగడం ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు పరిశోధకులు.

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే ఇబ్బందులు...
  • ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు నడుము చుట్టు వచ్చి చేరుతుంది. ఫలితంగా స్థూలకాయం, రక్తంలో చెక్కర స్ధాయిలు ఎక్కువవడం, రక్తపోటు పెరగడం మొదలైన ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
  • రోజులో ఎక్కువ సమయం కూర్చునే ఉండడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనివల్ల గుండె ఆరోగ్యం దెబ్బతినడమే కాదు, భవిష్యత్తులో క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
  • ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల డయాబటెస్ సమస్య ఎదురవుతుంది.
  • అధిక సమయాన్ని కూర్చోవడానికే కేటయిస్తే మూత్రపిండాలకు సంబంధించిన రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మహిళల్లో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి వీలైన అన్ని సందర్భాల్లోనూ నిలబడి ఉండడమే మంచిది.
  • బస్సుల్లో, రైళ్ళల్లో సీటులు లేక చాలాసేపు నిల్చునే ప్రయాణిస్తే నడుం నొప్పి వస్తుందని మనందరికీ తెలుసు. కానీ ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది.
‘రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాం కదా!! మేం ఎక్కువ సేపు కూర్చున్నా ఫర్వా లేదు.. మాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు’ అనుకుంటే పొరబడినట్లే. వ్యాయామం చేసినా సరే.. ఎక్కువ సేపు కూర్చోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
అదే పనిగా కూర్చుని ఉండడం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు తలత్తుతాయో తెలిసిందిగా. కాబట్టి ఇప్పటి నుంచైనా ఎక్కువ సమయం పాటు అలాగే కూర్చుని ఉండం మానేయండి. వీలైనప్పుడల్లా అటు ఇటు అలా నడుస్తూ ఉండండి.
శరీరానికి వ్యాయామం కల్పించండి. ఆరోగ్యంగా ఉండండి.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates

సన్నగా, నాజూగ్గా ఉండాలనే కోరుకుంటారు  ఏవ్వరైన అనుకోకుండా పెరిగిన బరువుని వ్యాయామంతో తగ్గించుకోవడానికి ప్రత్యేకంగా సమయం కేటయించలేని వాళ్లు చాలమందే ఉంటారు. అలాంటి వాళ్లకి బాదం  మంచి ప్రత్యామ్నాయం. కొత్తగా చేసిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది. బరువుని తగ్గించడంలో బాదం ముందుంటుది. విటమిన్లూ, ఖనిజాలూ, ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వూ కలిగిన బాదం పలుకుల్ని తింటే కార్బోహైడ్రే్లు ఎక్కువగా ఉండే పదార్థాలు తినాలన్న ఆసక్తి తగ్గుతుంది.
 ఇలా కొన్ని నెలల పాటూ కార్బోహైడ్ల్రే వినియోగం తగ్గించగలిగితే అదనపు కొవ్వు దానికదే కరుగుతుంది. కొత్తగా కొవ్వు పట్టదు కూడా. కనుక రెండు రోజులకోసారి గుప్పెడు బాదం గింజల్ని తింటూ ఉండాలి. వీటిల్లో మాంగనీస్, కాపర్, మెగ్నీషియం, బి- కాంప్లెక్సు విటమిన్లయిన నియాసిస్, బయోటిస్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తి పుట్టేందుకు సహకరిస్తాయి. దీనివల్ల శరీరం చురుకుగా ఉండి ఏదో ఒక పనిలో నిమగ్నమవుతారు. దానివల్ల కెలొరీలు కరుగుతాయి. కనుక సాధారణ బరువుని మించి ఉన్నారు బరువు తగ్గడానికి బదం పలుకుల్ని వినియోగించుకోవచ్చు.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
శరీరంలో అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తుంటాయి. కాళ్లు, చేతులు, పాదాలు వంటి భాగాలలో రక్తప్రసారంలో కొంత అంతరాయం కలిగి, తిరిగి మళ్లీ ప్రసరించడానికి జరిగే ఒక రకమైన శరీర ప్రక్రియే ‘తిమ్మిరి’ శరీరభాగాలలో
తిమ్మిరెక్కిన ప్రదేశంలో సూదులతో పొడిచినట్లు, స్పర్శజ్ఞానం కోల్పోయినట్లు, మొద్దుబారినట్లు వుంటుంది. కాళ్లు ముడుచుకుని (బాసింపట్టు వేసుకుని) ఎక్కువ సేపు కూర్చుని పైకి లేస్తే కాళ్లు, పాదాలలో తిమ్మిరి ఎక్కుతుంది. 
పొడవుగా లాగి వుంచిన నీటిగొట్టంలో నీరు ప్రవహించి నట్లు రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తుంటుంది. అలాంటప్పుడు నిలువుగా వున్న నీటిగొట్టాన్ని మడిస్తే ఏమవుతుంది? నీళ్లుధారాళంగా ప్రవహించకుండా ప్రవాహనికి అడ్డుకట్టపడి, కొద్ది కొద్దిగా ప్రవహిస్తాయి. అలాగే రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తున్నప్పుడు వివిధ అవయవాలలో గల విషతుల్యమైన వ్యర్థ పదార్థాలను కూడా రక్తం తీసుకుని వెళుతుంటుంది. ఈ పనికి అడ్డుకట్టపడినప్పుడు వ్యర్థ విషపదార్థాలు పేరుకుని పోయి, ఆయా అవయవాలనుండి మెదడుకు సందేశాలు చేరవేసే నాడీకణాలను మూసివేస్తాయి. కింద కూర్చుని లేచినప్పుడు ప్రవహించడం ఆగిపోయిన రక్తం తిరిగి ప్రవహించే ప్రక్రియలో ఆయా అవయవాలు మొద్దుబారినట్లు, సూదులతో పొడిచినట్లు, తిమ్మిరి ఎక్కుతుంది.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికీ ఇబ్బందే! ఇది హార్మోన్లనూ ప్రభావితం చేస్తుంది. అంతేకాదు దీని వల్ల గుండెజబ్బులూ, మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉండి. అందుకే ఈ కొవ్వును తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహార పదార్థాల ఎంపికలో జాగ్రత్త వహించాలి. ఒకరోజులో మనం తినే ఆహారంలో పది గ్రాముల పీచు పద్దార్ధం (ఫైబర్) ఉండేలా చూసుకొంటే అంతర్గత కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం బీన్స్, పప్పుధాన్యాలూ, పండ్లూ, కాయగూరలూ, ఓట్స్ (అటుకులు), పొ్టుతీయని తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటూ రోజూకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే పీచు పదార్థాల కారణంగా ఏర్పడే గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదురుకావు.
దీనితో పాటు ప్రొటన్స్ అంటే మాంసకృత్తుల మోతాదు తగినంతగా ఉండేలా చూసుకోవాలి. రోజులో కనీసం వంద కేలరీల పోషకాలు ప్రొటన్ల నుంచి అందేలా జాగ్రత్త పడాలి. ఇవి నిదానంగా జీర్ణమై ఆకలిని అదుపులో ఉంచి కొవ్వు పేరుకోకుండా చూస్తాయి. ఇందుకోసం మీగడ తీసిన పెరుగూ, పాలూ, చేపలూ, గుడ్లూ తింటే మెరుగైన మాంసకృత్తులు అందుతాయి.
అలాగే యాపిల్, పుచ్చకాయ, దోసకాయ, ముల్లంగి, టొమాటో, క్యాబేజీ, చిలగడదుంప లలో పీచు పదార్ధలు ఎక్కువగా ఉంటాయి. మరియు కొవ్వు తక్కువగా ఉండి, యాంటి ఆక్సిడెంట్ల ఎక్కువగా ఉంటయి. వీటిని తినడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. ఓట్స్ (అటుకులు)తో  చేసిన పదార్థాలు కూడా పొట్ట దగ్గర కొవ్వును తగ్గిస్తాయి.