Articles by "ladies health"
ladies health లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
జుట్టు తల మీద ఒత్తుగా.. నల్లగా నిగనిగలాడాలనే మహిళలంతా కోరుకుంటారు. అందాన్ని, ఆకర్షణను తెచ్చిపెట్టే దీన్ని సంరక్షించుకోవటానికి రకరకాల పద్ధతులూ పాటిస్తుంటారు. కానీ అవే వెంట్రుకలు ముఖం మీద మొలిచి అందాన్ని దెబ్బతీస్తుంటే? 
మనసులో తీవ్ర వేదన మొదలవుతుంది. అనుక్షణం ఆలోచనలన్నీ దాని చుట్టే తిరుగుతూ ఆందోళనకు దారితీస్తుంది. నిజానికి మహిళలకు పెదవులు, చుబుకం, ఛాతీ, కడుపు, వెన్ను వంటి భాగాల మీద వెంట్రుకలు చాలా సూక్ష్మంగా.. కంటికి కనిపించని విధంగానే ఉంటాయి. కానీ కొందరిలో మాత్రం ఇవి గుబురుగా పెరుగుతూ నల్లగా స్పష్టంగా కనిపించటం చూస్తుంటాం. ఈ సమస్యను 'హిర్సుటిజమ్‌' అంటారు. సాధారణంగా స్త్రీలల్లో పురుష హార్మోన్లు (ఆండ్రోజెన్స్‌) తక్కువ మోతాదులోనే ఉత్పత్తి అవుతాయి. ఒకవేళ ఈ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయితే అవాంఛిత రోమాలు పెరగటం మొదలవుతుంది. ఇలా జరగటానికి కారణాలు అనేకం.
అయితే చాలామందిలో పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) సమస్య అవాంఛిత రోమాలు పెరగటానికి కారణమవుతోంది. చూడటానికి ఇబ్బంది తప్పించి అవాంఛిత రోమాలన్నది చాలాసార్లు హానికరమైన సమస్యేమీ కాదు. అధికబరువు గలవారు బరువు తగ్గితే ఈ వెంట్రుకలు పెరగటమూ తగ్గుతుంది. బ్లీచింగ్‌ చేసుకోవటం ద్వారా వీటిని అంతగా కనిపించకుండా చూసుకోవచ్చు. షేవింగ్‌ చేసుకుంటే మరిన్ని వెంట్రుకలు మొలుస్తాయని అనుకుంటారు కానీ అది నిజం కాదు. కాకపోతే వెంట్రుకలు దట్టంగా కనిపిస్తాయి. ప్లకింగ్‌, ట్వీజింగ్‌, వ్యాక్సింగ్‌ సురక్షితమైన, చవకైన ప్రక్రియలు. అయితే వీటితో నొప్పి కలుగుతుంది. అలాగే మచ్చలు, వాపు, చర్మం నల్లబడటం, కొన్నిసార్లు చీముపట్టి ఇన్ఫెక్షన్లు రావటం వంటి ముప్పులూ ఉంటాయి. అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించే ఎలక్ట్రాలసిస్‌, లేజర్‌ వంటి ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. నిపుణులతో చికిత్స చేయించుకుంటే మంచి ఫలితం కనబడుతుంది.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
వృద్ధుల్లో తికమక పడడం, మతి మరుపు వంటి లక్షణలు సహజంగా కనిపించేవే గానీ ఇందుకు బీ12 విటమిస్ లోపమూ కారణం అవుతుండొచ్చని మీకు తెలుసా? ఎందుకంటే వయసు మీద పడుతున్నకొద్దీ మనం తీసుకునే ఆహారంలోని బీ12 విటమిస్ను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. ఇది బీ12 లోపానికి దారితీస్తుంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఈ లోపం ఎక్కువవుతుండొచ్చు. దీంతో తికమకపడం, మతిమరుపు వంటి లక్షణలు కనిపిస్తాయి. ఇలాంటివి వృద్ధుల్లో కనిపిస్తే వయసుతో పాటు వచ్చే లక్షణలుగానే చాలమంది పొరపడుతుంటారు. 


మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటనికి, ఎర్ర రక్తకణాల తయారీకి బీ12 విటమిస్ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, మూత్రం ఆపుకోలేకపోవం, రక్తపోటు తక్కువ కావడం, కుంగుబాటు(డిప్రెషన్), మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు తలత్తుతాయి. ఇక లోపం మరీ తీవ్రమైతే మాత్రం రక్తహీనతకు దారితీస్తుంది. అన్ని బీ విటమిన్ల మాదిరిగానే బీ12 కూడా నీటిలో కరుగుతుంది. అయితే మోతాదు ఎక్కువగా ఉంటే దీన్ని మన శరీరం.. కాలేయం, కణజాలల్లో నిల్వ చేసుకుంటుంది. అందువల్ల ఆహారం ద్వారా తగినంత బీ12 తీసుకోకపోయినా చాలకాలం పాటు రక్తంలో దీని మోతాదు తగ్గినట్లు కనిపించదు. ఒకవేళ నిల్వ మోతాదు తక్కువగా ఉంటే చాల త్వరగానే బీ12 లోపం కనబడొచ్చు. పిల్లల్లోనైతే అంతకన్నా ముందుగానే ప్రభావం చూపుతుంది. 

వేటి ద్వారా లభిస్తుంది? 

ఆహారం పదార్థాల్లోకేవలం మాంసంలో.. ముఖ్యంగా కాలేయంలో బీ12 అధిక మొత్తంలో ఉంటుంది. సుమారు 100 గ్రాముల కాలేయం ద్వారా 83 మైక్రోగ్రాముల విటమిస్ లభిస్తుంది. చేపలు, షెల్ఫిషలో కూడా ఎక్కువగానే ఉంటుంది. పాల పదార్థాలు, గుడ్లు లలోకాస్త తక్కువ.

మాంస పదార్థాల్లో ఈ బీ12 విటమిస్ ప్రోటన్లతో కలిసిపోయి ఉంటుంది. జీర్ణాశయంలోని ఆమ్లం ఇది విడుదలయ్యేల చేస్తుంది. అయితే వయసుతో పాటే జీర్ణాశయంలోని ఆమ్లం స్థాయీ తగ్గుతుండం వల్ల వృద్ధాప్యంలో బీ12ను గ్రహించే శక్తీ మందగిస్తుంది. ఇక శాకాహారంలో బీ12 చాల తక్కువగా ఉండమే కాదు.. దీన్ని శరీరం సరిగా గ్రహించలేదు కూడా. కాబట్టి పూర్తి శాకాహారులు, వృద్ధులు వైద్యుల సలహా మేరకు బీ12 మాత్రలు వేసుకోవం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ఈ మధ్య మీకు కారణం తెలియకుండానే తలనొప్పి వేధిస్తోందా? దీనికేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మీ విధి నిర్వహణలో భాగంగా తలెత్తిన ఒత్తిడి. దీన్ని పట్టించుకోకపోతే డిప్రెషన్‌లోకీ దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

భారత పరిశ్రమల అనుబంధ సంస్థ- అసోచామ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక సర్వేలో.. మనదేశంలో పలురంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి, బడలిక అధికంగా ఉంటున్నట్లు గుర్తించారు. భారతీయ ఉద్యోగివర్గంలో ఇంటికీ, ఆఫీసు పనికీ మధ్య తేడా చెదిరిపోతున్నట్లు తేల్చారు. పనివేళలు ఎక్కువవ్వటం, అసాధారణ పని వేళల్లో విధులు నిర్వర్తించాల్సి రావటం వంటివన్నీ మానసిక ఒత్తిడులను అంతకంతకూ పెంచుతూ పలురకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఒత్తిడి డిప్రెషన్‌కు కారణమవ్వటం మామూలే కానీ.. ఇది తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలకూ దారి తీస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి తలనొప్పులకు స్పష్టమైన కారణం కూడా తెలియటం లేదని పేర్కొంటున్నారు. తలనొప్పితోపాటు కాళ్లూ చేతుల్లో నొప్పులు, నిద్రలేమి, ఆకలి తగ్గటం, మహిళల్లోనైతే ఎక్కువెక్కువగా తినెయ్యటం వంటి సమస్యలు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. 

అకస్మాత్తుగా ఇలా తలనొప్పి, కాళ్ల నొప్పుల వంటివి వేధిస్తున్నప్పుడు తరచూ ఆఫీసు వదిలి ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుండటం ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. ఎన్ని రకాల పరీక్షలు చేయించుకున్నా ఈ తరహా నొప్పులకు కారణాలేమిటనేది వైద్యులు సైతం గుర్తించలేకపోతున్నారు. ఎంతకీ అంతుచిక్కని పలురకాల నొప్పులు, దేనిపైనా ఆసక్తి లేకపోవటం, నీరసం వంటివి సతాయిస్తున్నప్పుడు ఇవన్నీ విధి నిర్వహణకు సంబంధించిన సమస్యలుగా అనుమానించాలని మానసిక నిపుణులు అంటున్నారు. 

అధిక వేతనాలు, పెరుగుతున్న కోర్కెలు, తీవ్రస్థాయి పోటీతత్వం, బాగా సంపాదించాలనే కాంక్ష.. వంటివన్నీ భారతీయ ఉద్యోగుల్లో ఒత్తిడులను పెంచుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చేసే పనినీ, పనిచేసే చోటునీ ఆస్వాదించటం, అనవసరమైన ఒత్తిడికి లోనుకాకుండా జాగ్రత్తగా వ్యవహరించటమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. 

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
రాత్రివేళ ఉద్యోగం చేసే వారిలో ఆరోగ్యం దెబ్బతింటుందా? అవుననే అంటున్నారు  పరిశోధకులు. ఎక్కువ కాలంపాటు రాత్రివేళల్లో విధులు నిర్వహించిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు ఉంటున్నట్లు తాజా అధ్యయనంతో తేల్చారు.
రాత్రి వేళల్లో మేల్కొని ఉన్నప్పుడు శరీరంలోని హార్మోన్లపై ప్రభావం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతున్నట్లు గుర్తించారు. ఈ కారణంగానే పగటి వేళల్లో విధులు నిర్వర్తించే వారితో పోలిస్తే, రాత్రి డ్యూటీలు చేసే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు 48 శాతం దాకా ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. శరీరంలో మెలటోనిన్‌ హార్మోన్‌పై ప్రభావం చూపటం వల్లే రాత్రి డ్యూటీలు క్యాన్సర్‌కు కారణమవుతున్నట్లు పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. సహజ సిద్ధమైన వెలుతురులో కాకుండా కృత్రిమ వెలుతురు కింద, లైట్ల కాంతిలో పని చేసేటప్పుడు మెదడు మెలటోనిన్‌ విడుదలను ఆపేస్తుంది. పలురకాల విధులు నిర్వర్తించే మెలటోనిన్‌ హార్మోన్‌ మన శరీరంలో జీవ గడియారం పనిచేసేలా చేస్తూ, పగటివేళ మెలకువగా ఉండేలా, రాత్రివేళ నిద్రపోయేలా నిర్దేశిస్తుంటుంది. అంతేకాదు, క్యాన్సర్‌ నుంచి రక్షణ అందించటంలోనూ ఈ హార్మోన్‌దే కీలకపాత్ర.

మెలటోనిన్‌.. రక్తంలో ఈస్ట్రోజన్‌ను తగ్గిస్తుంది. ఈస్ట్రోజన్‌ రొమ్ము, అండాశయ క్యాన్సర్లను ప్రేరేపిస్తుంది. అలాంటి ఈస్ట్రోజన్‌ను తగ్గించగలిగే సామర్థ్యమున్న మెలటోనిన్‌ విడుదల రాత్రివేళ డ్యూటీల కారణంగా తగ్గిపోవటం వల్లే క్యాన్సర్‌ ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు అంటున్నారు. మెలటోనిన్‌.. క్యాన్సర్‌ కణాల పెరుగదలనూ నిరోధిస్తుందికణాల్ని దెబ్బతీసే ఫ్రీరాడికల్స్‌ను దెబ్బతీయటం ద్వారా రోగనిరోధక వ్యవస్థనూ ప్రేరేపిస్తుంది. మామూలుగా మన మెదడు మెలటోనిన్‌ను ఎక్కువగా మధ్యరాత్రి వేళల్లో వాతావరణం చీకటిగా ఉన్నప్పుడే ఉత్పత్తి చేస్తుంది. అందుకని, కృత్రిమ వెలుతురు కింద పని చేసేవారి శరీరాల్లో మెలటోనిన్‌ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. 'రాత్రి విధుల కారణంగా తలెత్తే అనారోగ్య ముప్పును ప్రజారోగ్య సమస్యగా భావించాల్సిన అవసరం ఉందని' స్టిర్లింగ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభిప్రాయపడ్డారు. రాత్రి విధుల వల్ల రొమ్ము క్యాన్సర్‌ ఒక్కటే కాకుండా, పలురకాల అనారోగ్య సమస్యల ముప్పు పొంచి ఉంటుందన్నారు. ప్రొస్టేట్‌, గర్భాశయ క్యాన్సర్‌ కూడా రావచ్చన్నారు. డెన్మార్క్‌ పరిశోధనలో రాత్రివేళ డ్యూటీల్లో ఉండే మహిళలకు బరువు తక్కువ బిడ్డలు పుట్టినట్లు తేల్చారు. రాత్రివేళ ఉద్యోగం చేసేవారి ఆహార అలవాట్లు సక్రమంగా ఉండనందు వల్ల జీర్ణ సమస్యలు, పేగు క్యాన్సర్‌ సమస్యలు ఎక్కువేనని మరికొన్ని అధ్యయనాల్లో గుర్తించారు. అయితే.. రొమ్ము క్యాన్సర్‌ ముప్పుకు రాత్రి డ్యూటీలనే పూర్తిగా కారణంగా చూడలేమనీ, ఇతరత్రా అంశాలూ తోడవ్వచ్చని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. శారీరక శ్రమ తక్కువగా ఉండే మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందనే సంగతి ఇప్పటికే పలు అధ్యయనాల్లో గుర్తించారు. ఇలాంటి వారిలో వ్యాయామం, శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల ఈ ముప్పు ఎక్కువగానే ఉంటుంది.మహిళలకు రాత్రి విధులు హానికరమా?
రాత్రివేళ ఉద్యోగం చేసే వారిలో ఆరోగ్యం దెబ్బతింటుందా? అవుననే అంటున్నారు  పరిశోధకులు. ఎక్కువ కాలంపాటు రాత్రివేళల్లో విధులు నిర్వహించిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు ఉంటున్నట్లు తాజా అధ్యయనంతో తేల్చారు.
రాత్రి వేళల్లో మేల్కొని ఉన్నప్పుడు శరీరంలోని హార్మోన్లపై ప్రభావం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతున్నట్లు గుర్తించారు. ఈ కారణంగానే పగటి వేళల్లో విధులు నిర్వర్తించే వారితో పోలిస్తే, రాత్రి డ్యూటీలు చేసే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు 48 శాతం దాకా ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. శరీరంలో మెలటోనిన్‌ హార్మోన్‌పై ప్రభావం చూపటం వల్లే రాత్రి డ్యూటీలు క్యాన్సర్‌కు కారణమవుతున్నట్లు పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. సహజ సిద్ధమైన వెలుతురులో కాకుండా కృత్రిమ వెలుతురు కింద, లైట్ల కాంతిలో పని చేసేటప్పుడు మెదడు మెలటోనిన్‌ విడుదలను ఆపేస్తుంది. పలురకాల విధులు నిర్వర్తించే మెలటోనిన్‌ హార్మోన్‌ మన శరీరంలో జీవ గడియారం పనిచేసేలా చేస్తూ, పగటివేళ మెలకువగా ఉండేలా, రాత్రివేళ నిద్రపోయేలా నిర్దేశిస్తుంటుంది. అంతేకాదు, క్యాన్సర్‌ నుంచి రక్షణ అందించటంలోనూ ఈ హార్మోన్‌దే కీలకపాత్ర.
మెలటోనిన్‌.. రక్తంలో ఈస్ట్రోజన్‌ను తగ్గిస్తుంది. ఈస్ట్రోజన్‌ రొమ్ము, అండాశయ క్యాన్సర్లను ప్రేరేపిస్తుంది. అలాంటి ఈస్ట్రోజన్‌ను తగ్గించగలిగే సామర్థ్యమున్న మెలటోనిన్‌ విడుదల రాత్రివేళ డ్యూటీల కారణంగా తగ్గిపోవటం వల్లే క్యాన్సర్‌ ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు అంటున్నారు. మెలటోనిన్‌.. క్యాన్సర్‌ కణాల పెరుగదలనూ నిరోధిస్తుంది, కణాల్ని దెబ్బతీసే ఫ్రీరాడికల్స్‌ను దెబ్బతీయటం ద్వారా రోగనిరోధక వ్యవస్థనూ ప్రేరేపిస్తుంది. మామూలుగా మన మెదడు మెలటోనిన్‌ను ఎక్కువగా మధ్యరాత్రి వేళల్లో వాతావరణం చీకటిగా ఉన్నప్పుడే ఉత్పత్తి చేస్తుంది. అందుకని, కృత్రిమ వెలుతురు కింద పని చేసేవారి శరీరాల్లో మెలటోనిన్‌ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. 'రాత్రి విధుల కారణంగా తలెత్తే అనారోగ్య ముప్పును ప్రజారోగ్య సమస్యగా భావించాల్సిన అవసరం ఉందని' స్టిర్లింగ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభిప్రాయపడ్డారు. రాత్రి విధుల వల్ల రొమ్ము క్యాన్సర్‌ ఒక్కటే కాకుండా, పలురకాల అనారోగ్య సమస్యల ముప్పు పొంచి ఉంటుందన్నారు. ప్రొస్టేట్‌, గర్భాశయ క్యాన్సర్‌ కూడా రావచ్చన్నారు. డెన్మార్క్‌ పరిశోధనలో రాత్రివేళ డ్యూటీల్లో ఉండే మహిళలకు బరువు తక్కువ బిడ్డలు పుట్టినట్లు తేల్చారు. రాత్రివేళ ఉద్యోగం చేసేవారి ఆహార అలవాట్లు సక్రమంగా ఉండనందు వల్ల జీర్ణ సమస్యలు, పేగు క్యాన్సర్‌ సమస్యలు ఎక్కువేనని మరికొన్ని అధ్యయనాల్లో గుర్తించారు. అయితే.. రొమ్ము క్యాన్సర్‌ ముప్పుకు రాత్రి డ్యూటీలనే పూర్తిగా కారణంగా చూడలేమనీ, ఇతరత్రా అంశాలూ తోడవ్వచ్చని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. శారీరక శ్రమ తక్కువగా ఉండే మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందనే సంగతి ఇప్పటికే పలు అధ్యయనాల్లో గుర్తించారు. ఇలాంటి వారిలో వ్యాయామం, శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల ఈ ముప్పు ఎక్కువగానే ఉంటుంది.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మధుమేహం ఉన్న వారికి కృత్రిమ తీపి పదార్థాలు (ఆర్టిఫీషియల్‌ స్వీటనర్స్‌) మంచివని భావిస్తూ చాలామంది వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు, ఇదంత మంచిది కాదు.

ఆస్పర్టేమ్‌, శాక్రీన్‌ వంటి కృత్రిమ తీపి పదార్థాలను ఏదో పాలు, కాఫీల్లో రుచికి కొద్దిగా కలుపు కొంటే పెద్దగా నష్టం ఉండదు గానీ వాటితోనే స్వీట్లు, బిస్కట్లు, బేకరీ ఉత్పత్తుల వంటివన్నీ చేసుకుని.. వాటిని పెద్ద మొత్తంలో తినటం వల్ల ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో ప్రస్తుతానికి చెప్పటం కష్టం. అవేవీ సహజమైనవి కావు, కృత్రిమ రసాయనాలు. వాటిపై జరిగిన అధ్యయనాలు ఇంకా స్పష్టంగా ఏమీ తేల్చకపోయినా సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవటమే మంచిదని గుర్తించాలి.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మన శరీరంలో నిత్యం వేల సంఖ్యలో కణాలు పుడుతూ, చనిపోతూఉంటాయి. ఈ ప్రక్రియ అంతా జన్యువుల నియంత్రణలో జరుగుతుంటుంది. కొన్నిసార్లు జన్యువుల నియంత్రణ తప్పి, కణవిభజన ప్రక్రియ అదుపుతప్పి కణాలు విశృంఖలంగా పుడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు అదనంగా ఏర్పడ్డ కణాలు ఒక కణితిగా రూపొందుతాయి. ఈ కణుతులు హానికరం కావుగాని... కొన్ని సందర్భాల్లో మాత్రం హానికరంగా పరిణమిస్తాయి. అవే క్యాన్సర్ కణుతులుగా పరిణితి చెందవచ్చు.  ఇవి రొమ్ములోగాని, నిపుల్కు పాలను సరఫరా చేసే నాళాల్లోగాని రావచ్చు. కానీ ముందే గుర్తిస్తే చికిత్స చేయవచ్చు. క్యాన్సర్కు వయసును కూడా ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్గా పరిగణించవచ్చు. అలాగే రొమ్ము క్యాన్సర్ వంశపారంపర్యం కాదు. కాకపోతే తల్లికి, అక్కచెల్లెళ్లలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే రిస్క్ కాస్త ఎక్కువ. ఒకవేళ ఇదివరకు ఒక రొమ్ములో క్యాన్సర్ వస్తే రెండో రొమ్ముకూ వచ్చే అవకాశాలు ఉండవచ్చు. అంతేగాని వంశపారంపర్యంగా కానీ, ఒక రొమ్ముకు వస్తే మరో రొమ్ముకు తప్పనిసరిగా వస్తుందని చెప్పలేము. 
లేటు వయసులో పెళ్లిళ్లు, గర్భధారణ... పెరిగే వయసు రొమ్ము క్యాన్సర్కు ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పుకున్నాం. ముప్ఫయి ఏళ్లు దాటిన ప్రతి 233 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 60 ఏళ్లు దాటిన ప్రతి 27 మందిలో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడవచ్చు. త్వరగా పెళ్లిచేసుకుని గర్భం దాల్చడం అన్నది రొమ్ము క్యాన్సర్ అవకాశాలను తగ్గించే అంశం. ఎందుకంటే గర్భధారణ వల్ల నెలసరులు తగ్గుతాయి. ఆ మేరకు ఈస్ట్రోజెన్ ప్రభావం కూడా తగ్గుతుంది. కాబట్టి రొమ్ము క్యాన్సర్కు అవకాశాలు కూడా తగ్గుతాయి. రిస్క్ను తగ్గించే రొమ్ము పాలు: బిడ్డకు రొమ్ము పాలు పట్టడం కూడా రొమ్ము క్యాన్సర్ రిస్క్ను గణనీయంగా తగ్గిస్తుంది. ఎంతకాలం బిడ్డకు రొమ్ము పాలు పడుతూ ఉంటే రొమ్ము క్యాన్సర్ రిస్క్ అంతగా తగ్గు తుంది. దీనివల్ల బిడ్డ కూడా ఆరోగ్యంగా ఎదుగుతుంది. కాబట్టి బిడ్డ పుట్టాక కనీసం ఏడాది పాటైనా రొమ్ము పాలు పట్టేలా చూసుకోవాలి.

గుర్తించడం ఎలా?: 

రొమ్ము క్యాన్సర్ కణుతుల్లో సాధారణంగా నొప్పి ఉండదు. కొన్నిసార్లు ఈ కణుతులు మెత్తగా ఉండవచ్చు. లేదా గట్టిగా కూడా ఉండవచ్చు. రొమ్ములో ఎలాంటి మార్పు కనిపించినా అశ్రద్ధ చేయకూడదు. రొమ్ములో వాపు, నొప్పి, నిపుల్స్ లోపలికి వెళ్లడం, ఎరు పెక్కడం, పాలు కాకుండా నిపుల్ నుంచి ఇతరత్రా ద్రవాలు స్రవించడం, చంకలో గడ్డలు ఏర్పడటం లాంటి మార్పులు కనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించాలి.
రొమ్ము క్యాన్సర్ను ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత సులువవుతుంది. పైగా పూర్తిగా నయమయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రఫీ అనే పరీక్ష చేస్తారు. 

పరిష్కారాలు: 

రొమ్ము క్యాన్సర్ అనగానే చాలామంది రొమ్ము తొలగించాల్సి వస్తుందేమోనని భయపడతారు. కానీ నిజానికి రొమ్ము తొలగించకుండానే క్యాన్సర్కు చికిత్స చేసే వీలుంది. రొమ్ములో ఏర్పడ్డ చిన్న కణుతులను సర్జరీ ద్వారా తీసేస్తారు. అవే పెద్ద కణుతులైతే రెండుమూడు సార్లు కీమోథెరపీ ఇచ్చి వాటి పరిమాణం తగ్గించి, ఆ తర్వాత ఆపరేషన్ ద్వారా మిగిలిన కణుతులను కూడా తీసేస్తారు. 

నివారణ చాలా సులభం: 
క్యాన్సర్ రాకుండా నివారించడం మన చేతిలో ఉన్నదే.
  • పెరిగే బరువు, స్థూలకాయం క్యాన్సర్కు కారణాలు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో బరువును నియంత్రించుకోవడం, స్థూలకాయం రాకుండా కాపాడుకోవడం తో క్యాన్సర్ను నివారించవచ్చు.  
  • మంచి ఆహారంతో క్యాన్సర్ నివారణ చాలా తేలిక. మాంసాహారాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడం, కొవ్వు పదార్థాలను పరిహరించడం, తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం.  వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయటం .
  • ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.
  • ఒత్తిడి, ఆందోళన లాంటి వాటికి దూరంగా ఉండటం క్షేమకరం. 
  • రెండు పదుల వయసు దాటిన తరువాత ప్రతి మహిళ ఎక్కడైనా గడ్డల్లా ఉన్నాయేమోనని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి.
  • 40 ఏళ్లలోపు వాళ్లందరూ ప్రతి మూడేళ్లకు ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాలి. 40 దాటి నవాళ్లు ప్రతి ఏటా పరీక్ష చేయించుకోవాలి.

ప్రతి రెండేళ్లకు ఒకసారి డిజిటల్ మామోగ్రఫీ ద్వారా పరీక్ష చేయించుకోవడం మంచిది. 50 దాటితే ప్రతి ఏటా ఈ పరీక్ష తప్పనిసరి. 

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
చాలా మంది స్త్రీలకు నెలసరి సమయంలో పొత్తికడుపు నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. దీనిని బహిష్టు నొప్పి(డిస్మనోరియా) అంటారు. డిస్మనోరియా అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తుంది. ప్రస్తుతం యుక్త వయసులో ఉన్న స్త్రీలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. ప్రతీ చిన్న విషయానికి ఎక్కువ ఆందోళన చెందడం వల్ల గర్భాశయంలోని హార్మోన్స్ సరియైన క్రమంలో పనిచేయక గర్భాశయ సమస్యలు మొదలవుతున్నాయని అంటున్నారు వైద్యులు. గర్భాశయానికి సంబంధించిన సమస్యలు, అందులో నెలసరి సమస్యలు స్త్రీలను ఎక్కువగా బాధిస్తుంటాయి. 
ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలను ఎక్కువగా వేధిస్తుంది. బహిష్టు నొప్పి వల్ల స్కూల్కు, కాలేజ్కు వెళ్లలేకపోవడం, ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయాల్సి రావడం, చికాకు, ఏ పనీ సరిగ్గా చేసుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది. చాలా మంది స్త్రీలు బహిష్టు నొప్పిని భరించాల్సిందేనా అని అడుగుతూ ఉంటారు.

ప్రతినెలా క్రమం తప్పకుండా వచ్చే బహిష్టు నొప్పి నివారణకు ఔషధాలు వేసుకుంటున్నా ఫలితం ఉండటం లేదని మరికొందరు స్త్రీలు వాపోతుంటారు. అయితే నిపుణులైన డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు వైద్యులు.

గర్భాశయ నిర్మాణం

స్త్రీలలో గర్భాశయం ముఖ్యమైన రీప్రోడక్టివ్ అర్గాన్. ఇది 9 సెంమీ పొడవు, 6.5 సెంమీల వెడల్పు, 3.5 సెంమీల మందం కలిగి పెల్విక్ జోన్లో అమరి ఉంటుంది. గర్భాశయంలో ఉండే లోపలి పొర కదలికలతో రక్తస్రావం జరుగుతూ ఉంటుంది.

లక్షణాలు

  • కొంతమందిలో బహిష్టు మొదలైన మొదటిరోజు మాత్రమే ఒకటి, రెండు గంటలు నొప్పి ఉండి రుతుస్రావం సాఫీగా జరగడంతో తగ్గిపోతుంది. ఈ సమయంలో వచ్చే నొప్పి ఎక్కువగా ఉండి పొట్ట బిగదీసినట్లుగా ఉండటం, విరేచనాలు కావడం వంటి లక్షణాలు ఉంటాయి. నొప్పి మరీ అధికంగా ఉన్నప్పుడు వాంతులు కావడం, శరీరం వణకడం, కొన్ని సందర్భాల్లో తలతిరగడం జరగచ్చు. ఈ రకమైన లక్షణాలు 50శాతం మంది స్త్రీలలో కనిపిస్తాయి. దీనిని స్పాస్మోడిక్ డిస్మనోరియా అంటారు.
  • కొంతమందిలో బహిష్టు మూడు నుంచి ఐదు రోజుల ముందే పొత్తి కడుపులో, నడుము భాగంలో నొప్పితో ప్రారంభమవుతుంది. ఇది రుతుస్రావం మొదలైన తరువాత ఔషధాలు ఉపయోగించకపోయినా దానికదే తగ్గిపోతుంది. దీనిని కంజెస్టివ్ డిస్మనోరియా అంటారు.
  • కొంతమందిలో నొప్పి విపరీతంగా ఉండి రక్తస్రావంలో గడ్డలు పడటం జరుగుతుంది. దీనిని మెంబ్రేనస్ డిస్మనోరియా అంటారు.


కారణాలు

  • కొంతమందిలో యోని ముఖద్వారం చిన్నదిగా ఉండటం వల్ల స్రావం సరిగ్గా బయటకు రాక, చిన్నగడ్డల రూపంలో రుతుస్రావం జరిగి నొప్పి కలుగుతుంది.
  • గర్భాశయ ముఖద్వారం చిన్నదిగా ఉండటం, ముడుచుకుని ఉండటం వల్ల స్రావం సాఫీగా జరగక నొప్పి వస్తుంది.
  • గర్భాశయం చుట్టూ ఉన్న కండరాలు, ఇతరత్రా వ్యాధుల కారణంగా సరియైన సంకోచ వ్యాకోచాలు జరగకపోవడం కారణంగా రుతుస్రావం కష్టంగా ఉండి బహిష్టు సమయంలో నొప్పి విపరీతంగా వస్తుంది.
  •  గర్భాశయం ఆకృతిలోనూ, పరిమాణంలోనూ ఉండే తేడాల వల్ల బహిష్టు నొప్పి వచ్చే అవకాశం ఉంది.
  • గర్భాశయం స్థానం మారి వెనకకు తిరిగి ఉండటం వల్ల కూడా బహిష్టు సమయంలో నొప్పి రావడం జరుగుతుంది.
  • గర్భాశయంలో గడ్డలు, చీము చేరడం, అండాశయంలో కణితులు పెరగడం మొదలైనవి కూడా నొప్పికి కారణమవుతాయి.
  • గర్భనిరోధక మాత్రలు వాడటం, గర్భనిరోధక పద్ధతులను పాటించడం, మానసిక ఆందోళన వంటి కారణాల వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడి నొప్పి ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఏం చేయాలి?

రుతు స్రావ సమస్యలకు ఇప్పుడు మంచి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అధిక రక్తస్రావం జరుగుతున్నా, ఇతర రుతుస్రావ సమస్యలు ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ఆరోగ్యంగా ఉండాలంటే.. కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలని అనుకుంటాం. మరి కొలెస్ట్రాల్‌ సంగతి! అదీ కొవ్వూ.. ఒకటేనా.. రెండూ హాని చేసేవేనా..  మీకూ ఇలాంటి సందేహాలు ఉన్నాయా.. రండి వాటిని నివృత్తి చేసుకుందాం.

సాధారణంగా కొవ్వు పదార్థాలు అనగానే అవి శరీరానికి హానిచేస్తాయనే భ్రమలో ఉంటాం. దాంతో వాటి వినియోగాన్ని తగ్గిస్తాం. లేదంటే పూర్తిగా మానేస్తాం. కానీ శరీరానికి అందే ఇతర పోషకాల్లానే కొవ్వు కూడా మేలుచేసే పదార్థమే. అది మోతాదు మించినప్పుడే సమస్య మొదలవుతుంది. కొలెస్ట్రాల్‌ కూడా అంతే. ఇందులోనూ మేలు, కీడు చేసే రకాలుంటాయి. కొవ్వు వల్ల ఎప్పుడు హాని జరుగుతుందో తెలియాలంటే... అవి ఏయే పదార్థాల నుంచి అందుతాయి.. ఎలా ఉపయోగపడతాయి అన్నది తెలుసుకోవాలి. 

రెండు రకాల్లో.. 

మన శరీరం కొన్నిరకాల కొవ్వుల్ని తయారు చేసుకోలేదు. కాబట్టి ఆహారం నుంచి తీసుకోవాలి. ఇందులో రెండు రకాలుంటాయి. ఒకటి కనిపించేది, మరొకటి కనిపించనిది. కనిపించే కొవ్వు అంటే.. మనం వాడే వేరుసెనగ, రైస్‌బ్రాన్‌, సోయా, సన్‌ఫ్లవర్‌ వంటి రకరకాల వంటనూనెలు. ప్రతి నూనెలో రకరకాల ఫ్యాటీయాసిడ్ల మిశ్రమం ఉంటుంది. ఇదికాక రోజువారీ తీసుకునే ఆహారం నుంచీ మనకు కొద్దో గొప్పో కొవ్వు అందుతుంది. అదే కనిపించనిది. అన్నం, పప్పూ, కూరగాయలూ, పాలూ, గోధుమలూ.. ఇలా వీటన్నింటి నుంచీ రోజుకి ఇరవై గ్రాముల వరకూ కొవ్వు అందుతుంది. ఇక, కొలెస్ట్రాల్‌... జంతు సంబంధిత ఆహార పదార్థాల్లో ఉంటుంది. గుడ్డూ, చికెన్‌, మటన్‌, రొయ్యలూ, కొంత వరకూ పాల నుంచి అందుతుంది. ఇది కూడా శరీరానికి కొంతవరకు అవసరమే. 

ట్రాన్స్‌ఫ్యాట్లతో హాని... 

ఓ పదార్థానికి రంగూ, రుచీ ఇవ్వడంలో, కొద్దిగా తీసుకున్నా పొట్ట నిండినట్లుగా అనిపించడంలో కొవ్వు పాత్ర కీలకం. అయితే ఇందులోనూ రకాలుంటాయి. మొదటిది శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్‌. గడ్డకట్టే స్వభావం ఉన్న రకం ఇది. కొబ్బరినూనె, నెయ్యి, మాంసాహారం, క్రీం, వెన్న, పామాయిల్‌ లాంటి వాటినుంచి అందుతుంది. 
రెండోది, శరీరానికి మేలు అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు. ఇందులో మళ్లీ మోనో అన్‌శాచురేటెడ్‌ (మ్యుఫా), పాలీ అన్‌శాచురేటెడ్‌ (ప్యుఫా) ఉంటాయి. ఆలివ్‌, వేరుసెనగ, రైస్‌బ్రాన్‌ లాంటి నూనెలు 'మ్యుఫా' కిందకొస్తాయి. ఒమెగా త్రీ, సిక్స్‌ ఫ్యాటీ యాసిడ్లు ఉండే సోయా, ఆవ, పొద్దు తిరుగుడు, కుసుమ నూనెలు ప్యుఫా జాబితాలోకి వస్తాయి.  
ఈ నూనెల్లో ఉండే కొవ్వుల్ని శుద్ధి చేసినప్పుడు... నూనెను ఎక్కువగా వేడి చేసినప్పుడూ హానిచేసే ట్రాన్‌ఫ్యాట్లు తయారవుతాయి. కేకులూ, బిస్కెట్లూ, బేకరీ పదార్థాలూ, డాల్డాతో చేసిన రకరకాల స్నాక్స్‌లలో ఈ ట్రాన్స్‌ఫ్యాట్లు అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది.  

అతి అనర్థం అన్నట్లుగా... కొవ్వును మోతాదుకు మించి తీసుకుంటే సమస్యలు తప్పవు. శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. దాంతో బరువు పెరుగుతాం. అదే ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బుల వంటివి చుట్టుముడతాయి. అధిక కొవ్వు వల్ల పీసీఓడీ (పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌).. థైరాయిడ్‌ సమస్యలూ.. హార్మోన్ల పనితీరులో లోపాలూ.. దాంతో గర్భధారణకు సంబంధించిన సమస్యలూ తలెత్తుతాయి. ముఖ్యంగా శాచురేటెడ్‌ కొవ్వుని ఎంచుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ శాతం పెరుగుతుంది. దాంతో గుండెకు రక్తం తీసుకెళ్లే రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడి హృద్రోగాలు మొదలవుతాయి. అసలు గుండెజబ్బులు వస్తాయా లేదా.. రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం ఏ మేరకు ఉందనేది తెలుసుకునేందుకు లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్ష ఉంటుంది. దాన్ని చేయించుకుంటే మొత్తం కొలెస్ట్రాల్‌లో చెడు శాతం ఎంత ఉంది (ఎల్‌డిఎల్‌), మేలు చేసే కొలెస్ట్రాల్‌ (హెచ్‌డిఎల్‌).. ట్రైగ్లిజరైడ్ల వంటి వివరాలు తెలుస్తాయి. ఒకవేళ రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు అదుపులో లేవని తేలితే.. మధుమేహం, అధికరక్తపోటు ఉన్నవారికి  గుండెజబ్బులొచ్చే ఆస్కారం ఎక్కువని చెబుతున్నారు వైద్యులు. 

ఎంత మోతాదులో.. 

ప్రతీ వ్యక్తికీ రోజువారీ అవసరమయ్యే శక్తిలో కొంత శాతం కొవ్వు నుంచి అందడం తప్పనిసరి. కాబట్టి ఆహారంలో పదిహేను, ఇరవై శాతం వరకూ కొవ్వు ఉండేలా చూసుకోవాలి. ఏ నూనె అయినా ఒక గ్రాము తీసుకుంటే దాదాపు తొమ్మిది కెలొరీలు అందుతాయి. అందుకే ఒక రోజులో నాలుగు చెంచాలకు మించి నూనె వాడకూడదు. అయితే ఇది అందరికీ వర్తించదు. చిన్నపిల్లలకీ, గర్భిణులకూ కొవ్వు పదార్థం అతి ముఖ్యమైన పోషకం గనుక సాధారణ కొవ్వు పదార్థాలనే ఎంచుకోవచ్చు. అతిగా మాత్రం కాదు. అధిక మోతాదులో కొవ్వు పదార్థాలను ఇష్టపడే వాళ్లు మేలైన రకాలను ఎంచుకుంటే మంచిది.  

కొలెస్ట్రాల్‌ కూడా అంతే. అది కూడా శరీరానికి అవసరమే కానీ.. అతిగా కాదు. మనం తీసుకునే డైటరీ ఫ్యాట్‌ని బట్టి రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులపై ప్రభావం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శాచురేటెడ్‌, ట్రాన్స్‌ఫ్యాట్లు రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని పెంచుతాయి కాబట్టి బదులుగా పాలీ అన్‌శాచురేటెడ్‌, మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. శుద్ధిచేసిన కార్బోహైడ్రేట్లను మానేయాలి. గుండెజబ్బుల ప్రమాదం ఉన్నవారు రోజుకి రెండొందల మిల్లీగ్రాముల వరకూ, ఎలాంటి సమస్యలూ లేనివారు మూడొందల మిల్లీగ్రాముల వరకూ కొలెస్ట్రాల్‌ ఉన్న పదార్థాలను ఎంచుకోవచ్చు. 

రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ వల్ల గుండెజబ్బుల సమస్య పెరుగుతుంది కాబట్టి కొవ్వు పదార్థాలను ఓ పద్ధతి ప్రకారం తీసుకోవాలి. ఏ నూనెల్ని ఎంత మోతాదులో వాడుతున్నారనేదీ గమనించుకోవాలి. ఒక నూనెలో అన్నిరకాల ఫ్యాటీయాసిడ్లు అందవు కాబట్టి వంటనూనెల్ని కలిపి వాడాలి. వేరుసెనగ, రైస్‌బ్రాన్‌, నువ్వులనూనె ఏదో ఒకటి తీసుకుని దాంట్లో కనోలా, సోయాబీన్‌, ఆవనూనెల్లో ఏదో ఒకటి కలపాలి. రెండూ సమపాళ్లలో కలిపి వాడుకోవాలి. సలాడ్లకు ఆలివ్‌నూనె, వేపుళ్లకు వేరుసెనగనూనె, ఇతర వంటకాలకు సోయాబీన్‌ నూనెల్ని ఎంచుకోవచ్చు. చాలా మంది ఆలివ్‌నూనెను ఎంతయినా తీసుకోవచ్చని అనుకుంటారు. ఏ రకమైనా మోతాదును మించనివ్వకూడదు. 
ఈ జాగ్రత్తలూ అవసరమే.. 

చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించాలంటే అవిసెగింజలూ, తృణధాన్యాలూ, గింజధాన్యాలూ, నట్స్‌ లాంటివి ఎంచుకోవాలి. వీటి వల్ల మేలు చేసే కొలెస్ట్రాల్‌ అందుతుంది. పొట్టుధాన్యాలను తీసుకోవాలి. చేపలూ, స్కిన్‌లెస్‌ చికెన్‌, గుడ్డులోని తెల్లసొన, పాల పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఎసెన్షియల్‌ ఫ్యాటీయాసిడ్లు అందుతాయి. 

వేపుళ్ల వల్ల కొవ్వు స్థాయులు పెరుగుతాయి. బదులుగా ఆవిరిమీద ఉడికించడం, గ్రిల్‌ చేయడం, దోరగా వేయించడం లాంటి పద్ధతుల్ని ఎంచుకోవాలి. గ్రేవీలూ, ఇతర కూరల్లాంటివి ఫ్రిజ్‌లో కొన్ని గంటలపాటు ఉంచితే, అనవసర కొవ్వు గడ్డకట్టుకుని పైన పేరుకుంటుంది. దాన్ని తీసేసి వాడుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించుకుని, మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుకోవాలంటే.. తగినంత శారీరక శ్రమా అవసరమే.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
నెలసరిలో భరించలేని నొప్పి కొందరికి. నెల మధ్యలో రక్తస్రావం కనిపిస్తుంటుంది మరికొందరికి. బాధించే ఈ సమస్యలు ఎండోమెట్రియోసిస్‌, ఎడినోమయోసిస్‌కి సంకేతం కావచ్చు. అసలు ఈ సమస్యలేంటీ... వాటికి ఎటువంటి చికిత్సలున్నాయో... తెలుసుకుందాం..

కొన్ని సమస్యలకు ఇదీ కారణం అని ప్రత్యేకంగా ఉండదు. ఎండోమెట్రియోసిస్‌ కూడా అలాంటిదే. గర్భాశయంలో ఉండాల్సిన ఎండోమెట్రియం పొర కొన్నిసార్లు అక్కడ కాకుండా మరో చోట ఏర్పడుతుంది. ముఖ్యంగా కటివలయ భాగం, పొత్తికడుపూ, మరికొన్నిసార్లు ఇతర శరీర భాగాల్లోనూ ఏర్పడుతుంది. ఆ పరిస్థితినే ఎండోమెట్రియోసిస్‌ అంటారు. 

బయట పెరగడమే కారణం.. 

సాధారణంగా ఎండోమెట్రియల్‌ కణాలు ఈస్ట్రోజెన్‌ హార్మోనుకి స్పందించి, రెట్టింపవుతాయి. అలా పెరిగిన కణాలు పొరలుగా నెలసరి సమయంలో బయటకు వచ్చేస్తాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు గర్భాశయం బయట, అండాశయాలూ, ఫెల్లోపియన్‌ ట్యూబుల్లో కూడా పెరుగుతాయి. దాంతో నెలసరి సమయంలో బయటకు రావాల్సిన ఆ పొర అక్కడే ఉండిపోతుంది. అదే ఎండోమెట్రియోసిస్‌ సమస్య. ఈ పొరలు జిగురుగా ఉండటం వల్ల కొన్నిసార్లు రెండు శరీర భాగాలను కలిపి అతికించేస్తాయి. ఎండోమెట్రియోసిస్‌ పొరలు పెద్దగా ఉన్నప్పుడు అవి సిస్ట్‌లుగా మారిపోతాయి. వీటినే చాక్లెట్‌ సిస్ట్‌లు అంటారు. ఈ చాక్లెట్‌ సిస్ట్‌లలో రక్తం నిల్వ ఉండిపోతుంది. నెలసరి సమయంలో వాటినుంచి కొన్నిసార్లు రక్తస్రావం అవుతుంది. ఎండోమెట్రియోసిస్‌కీ, ఎడినోమయోసిస్‌కీ పెద్ద తేడా ఉండదు. ఎండోమెట్రియాసిస్‌లో కణాలు గర్భాశయం బయటి శరీరాభాగాల్లోని ఉపరితలం పైనే చేరతాయి. అదే ఎడినోమయోసిస్‌లో ఎండోమెట్రియం పొర గర్భాశయ కండరంలోకి చొచ్చుకెళుతుంది.దాంతో గర్భాశయంపై ప్రభావం పడి, అది పెరుగుతుంది. ఎండోమెట్రియోసిస్‌తో బాధపడే మహిళల్లో పన్నెండు శాతం మంది ఎడినోమయోసిస్‌ సమస్యకు గురయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు తెలియజేశాయి. 

ఒకే లక్షణాలుంటాయి.. 

ఎండోమెట్రియోసిస్‌ పొరల ప్యాచ్‌లు సూది మొన మొదలు, పెద్ద బంతి అంత పరిమాణం వరకూ ఉంటాయి. అయితే ఈ సమస్య ఉన్నా.. లక్షణాలు పెద్దగా కనిపించకపోవచ్చు. ఎండోమెట్రియోసిస్‌ పొర ఎంత పెద్దగా ఉంటే.. లక్షణాలు అంత తీవ్రంగా ఉంటాయి. అలాగని ఇది అందరికీ వర్తించదు. సాధారణంగా అయితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. నెలసరికి కొద్దిరోజుల ముందు నుంచీ పొత్తికడుపులో నొప్పి మొదలవుతుంది. నెలసరి పూర్తయ్యాక పోతుంది. కొందరికయితే.. నెలసరి అయిపోయినా కూడా ఆ నొప్పి కొన్ని రోజుల పాటు వేధిస్తుంది. నెలసరితో సంబంధం లేకుండా కొన్నిసార్లు రక్తస్రావం కనిపిస్తుంది. 
కలయిక సమయంలో నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది. ఆ తరవాత కూడా కొన్ని గంటల పాటు ఆ నొప్పి వేధిస్తుంది. 
ఫెల్లోపియన్‌ ట్యూబుల్లో ఎండోమెట్రియం పొరలు చేరడం వల్ల అవి మూసుకుపోతాయి. దాంతో గర్భధారణ కష్టం అవుతుంది.  మలమూత్ర విసర్జన సమయంలో పొత్తికడుపులో నొప్పి, కొన్నిసార్లు నెత్తురు కూడా కనిపిస్తుంది. ఎడినోమయోసిస్‌లో అయితే నెలసరి సమయంలో రక్తస్రావం తీవ్రంగా కనిపిస్తుంది. నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. కేవలం గర్భాశయంపైనే ఎక్కువ ప్రభావం ఉంటుంది. 

ఎండోమెట్రియోసిస్‌, ఎడినోమయోసిస్‌... ఈ రెండూ క్యాన్సర్‌కి దారితీసే సమస్యలు కాదు కాబట్టి భయపడాల్సిన పని లేదు. సమస్య తీవ్రతకు తగిన చికిత్స తీసుకుని ఉపశమనం పొందవచ్చు. సాధారణంగా అయితే.. ఎండోమెట్రియోసిస్‌ని లాపరోస్కోపీతో గుర్తించవచ్చు. ఎడినోమయోసిస్‌కయితే అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేస్తారు. అయితే అన్నిసార్లూ అది ఆ సమస్యా లేక ఫైబ్రాయిడ్లా అన్నది తేలదు. అప్పుడే అవసరాన్ని బట్టి ఎంఆర్‌ఐ పరీక్షతో నిర్థరిస్తారు. 

మాత్రలు మొదలు.. ఎన్నో చికిత్సలు.. 

సాధారణంగా ఈ రెండు సమస్యలకీ ఒకే తరహా చికిత్సలుంటాయి. చికిత్స తీసుకోని వారిలో.. పదిమందిలో నలుగురికి సమస్య తీవ్రమవుతుంది. ఈ పది మందిలో ముగ్గురికి దానికదే తగ్గే అవకాశాలూ ఉంటాయి. చాలా కేసుల్లో అటు తగ్గకుండా.. ఇటు పెరగకుండా యథాతథంగా ఉండిపోతాయి! అలాగని చికిత్స తీసుకోకుండా, ఏం ఫరవాలేదు దానికదే తగ్గిపోతుంది అన్న నిర్లక్ష్యం వహించకూడదు. ఎందుకంటే చికిత్స తీసుకోకుండా ఉండిపోతే ఒక్కోసారి పరిస్థితి తీవ్రంగా మారుతుంది. ఎండోమెట్రియాసిస్‌ కణాలు చిన్న పేగులకి అడ్డుపడొచ్చు. కిడ్నీనీ... బ్లాడర్‌నీ కలిపే నాళానికి (యురేటర్‌) ఆటంకం కలిగించొచ్చు. నెలసరి సమయంలో భరించలేని నొప్పీ, అధిక రక్తస్రావంతో బాధపడకుండా ఉండాలంటే తప్పకుండా చికిత్స తీసుకోవాలి. 

నెలసరి సమయంలో పారాసిటమాల్‌ వంటి సాధారణ నొప్పి నివారణ మందులు వాడొచ్చు. వీటి కన్నా తీవ్రమైన నొప్పి నివారిణులు వాడితే కొన్నిసార్లు దుష్ఫలితాలూ ఏర్పడొచ్చు. అందుకే వైద్యుల సలహాతోనే వీటిని వేసుకోవాలి. వీటిని ఇప్పుడొకటి.. అప్పుడొకటిగా కాకుండా నెలసరి వస్తున్నన్ని రోజులూ క్రమం తప్పకుండా వాడాలి. 

ఇలా నయం చేసుకోవచ్చు.. 

ఎండోమెట్రియోసిస్‌ కణాలు పెరగడానికి ఈస్ట్రోజెన్‌ హార్మోనే కారణం. కాబట్టి దీన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తారు వైద్యులు. దాంతో ఆ కణాలు కృశిస్తాయి . అందుకోసం కొన్ని చికిత్సా విధానాలున్నాయి. 

గర్భనిరోధక మాత్రలు: ఇవి ఎండోమెట్రియోసిస్‌ చికిత్స కోసం కాకపోయినా.. ఇవి వాడుతున్న చాలామందిలో ఆ సమస్యలు తగ్గుతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. ఈ మాత్రలు అండాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. తద్వారా అండాశయంలో ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి శాతం కూడా తగ్గుతుంది. దాంతోపాటూ నెలసరి సమయంలో రక్తస్రావం కూడా తగ్గి, నొప్పి బాధించదు. లైంగిక చర్య సమయంలో వచ్చే నొప్పీ, కటివలయంలో బాధా తగ్గుతాయి. 

ఇంట్రాయుటరైన్‌ డివైజ్‌: ఇది కూడా గర్భనిరోధక సాధనమే. ఇందులో లెవొనోజెస్ట్రెల్‌ అనే ప్రొజెస్టెరాన్‌ హార్మోన్‌ ఉంటుంది. ఇది గర్భసంచి ఉపరితలాన్ని పలుచగా చేస్తుంది. అండాలు ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. దీన్ని వైద్యులు గర్భసంచిలో అమరుస్తారు. ఇది కూడా ఎండోమెట్రియోసిస్‌ నొప్పిని తగ్గిస్తుంది. నెలసరిలో అధిక రక్తస్రావం కాకుండా చూస్తుంది. దీన్ని ఒక్కసారి గర్భసంచిలో అమరిస్తే ఐదేళ్లు పనిచేస్తుంది. 

జీఎన్‌ఆర్‌హెచ్‌ ఔషధాలు: పిట్యూటరీ గ్రంథి గొనాడోట్రోఫిన్స్‌ ఉత్పత్తి చేయకుండా ఇవి అడ్డుకుంటాయి. ఈ గొనాడోట్రోఫిన్సే అండాశయాల్లో ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కాబట్టి వీటిని నియంత్రించడం ద్వారా ఈస్ట్రోజెన్‌ను అదుపు చేయవచ్చు. అందువల్ల జీఎన్‌ఆర్‌హెచ్‌ ఔషధాలను ఇంజెక్షన్లుగానూ, నాజల్‌ స్ప్రేగానూ వాడొచ్చు. అయితే వీటితో ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల జననేంద్రియాలు పొడిగా మారడం, లైంగిక చర్యపై ఆసక్తి తగ్గడం వంటి దుష్ఫలితాలు ఏర్పడతాయి. ఈ హార్మోనల్‌ చికిత్సలో సత్పలితాలు రావాలంటే వీటిని కనీసం ఆరు నెలల పాటు వాడాలి. 

శస్త్రచికిత్స 

ఒకవేళ ఎండోమెట్రియోసిస్‌ ప్యాచ్‌లు పెద్దగా ఉండి.. మందుల వల్ల తగ్గనప్పుడు వైద్యులు శస్త్రచికిత్సను సూచిస్తారు. ఇందులోనూ రకరకాల పద్ధతులున్నాయి. 
సాధారణంగా అయితే లాపరోస్కోపీ పద్ధతిలో పొత్తికడుపు దగ్గర చిన్న కోత పెట్టి టెలీస్కోప్‌ లాంటి పరికరాన్ని గర్భసంచిలోకి ప్రవేశపెడతారు. ఆ తరవాత లాపరోస్కోపీ ద్వారా పొట్టలోపలి భాగాన్ని చూసి... వేడి, లేజర్‌ లేదా ప్రత్యేకమైన హీలియం గ్యాస్‌ ద్వారా ఆ ప్యాచ్‌లు నశించేలా చేస్తారు. సిస్ట్‌లు ఉంటే.. లాపరోస్కోపీ ద్వారా తొలగిస్తారు. ఎండోమెట్రియోసిస్‌ ఉండి, సంతానసాఫల్య సామర్థ్యం తగ్గినప్పుడు.. ఇలాంటి శస్త్రచికిత్స చేయడం వల్ల గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఒకవేళ పిల్లలు పుట్టి ఉంటే.. వయసు ఇతర అనారోగ్యాలను అంచనా వేసి.. గర్భాశయాన్ని తొలగిస్తారు. దాంతోపాటూ అండాశయాలనూ తొలగించే అవకాశం ఉంది. దాంతో ఆ లక్షణాలు అదుపులోకి వచ్చేస్తాయి. ఎడినోమయోసిస్‌లో అయితే.. లాపరోస్కోపీ చేయరు. 
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
చాలామంది మహిళలు నెలసరి సమయంలో కడుపునొప్పితో బాధపడుతుండటం చూస్తూనే ఉంటాం. దీన్ని భరించలేక నొప్పి తగ్గించే మందులు వేసుకుంటూ ఉంటారు. కొందరికి నొప్పితో పాటు వికారం, వాంతి, విరేచనాలు, నిద్ర సమస్యలు కూడా తోడవుతాయి. ఇలాంటి వారికి ఒకేసారి పెద్దమొత్తంలో విటమిన్‌ డి ఇవ్వటం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతున్నట్టు ఇటలీ పరిశోధకులు గుర్తించారు. దీంతో నొప్పి నివారణ మందుల వాడకాన్ని తగ్గించొచ్చని భావిస్తున్నారు. 
రెండు నెలల పాటు చేసిన తమ అధ్యయనంలో విటమిన్‌ డి ఇచ్చినవారికి గణనీయంగా నొప్పి తగ్గినట్టు తేలిందని మెసినా విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య నిపుణులు అంటున్నారు. హార్మోన్ల వంటి ప్రోస్టాగ్లాండిన్స్‌ పదార్థాలు అధికంగా విడుదల కావటం వల్ల నెలసరి సమయంలో నొప్పికి దారితీస్తుంది. విటమిన్‌ డి వీటి ఉత్పత్తిని తగ్గిస్తుంది కాబట్టి పరిశోధకులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నెలసరి రావటానికి ఐదు రోజుల ముందు కొందరికి పెద్దమొత్తంలో విటమిన్‌ డి ఇవ్వగా.. మరికొందరికి ఏ మందూ లేని మాత్రలు ఇచ్చారు. రెండు నెలల అనంతరం పరిశీలించగా.. విటమిన్‌ డి తీసుకున్నవారిలో నొప్పి అంతగా రాలేదని గుర్తించారు. వీళ్లంతా నొప్పి నివారణ మందులు అసలే వేసుకోలేదు కూడా. ఇక మిగతా వారిలో 40% మంది కనీసం ఒక్కసారైనా నొప్పి మందులు వేసుకోవటం గమనార్హం. సాధారణంగా నెలసరి సమయంలో నొప్పిని తగ్గించటానికి వైద్యులు కూడా నాన్‌స్టిరాయిడల్‌ యాంటీఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ను సిఫారసు చేస్తుంటారు. అయితే వీటిని దీర్ఘకాలం వాడితే జీర్ణకోశ సమస్యలకు దారితీయొచ్చు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మహిళలు వైద్యుల్ని సంప్రదించడానికి దారితీసే కారణాల్లో వైట్‌ డిశ్ఛార్జి కూడా ఒకటి. వినడానికి చిన్న విషయంగానే అనిపిస్తుంది కానీ.. కొన్నిసార్లు ఇది రకరకాల ఇన్‌ఫెక్షన్లకీ, క్యాన్సర్‌కీ సూచన కావచ్చు. అందుకే ఈ కింది కారణాల్లో ఏది కనిపించినా.. నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. 

శరీర సహజ పనితీరు వల్ల జరిగే వైట్‌ డిశ్ఛార్జికీ, మరేదయినా కారణంతో అది కనిపించడానికీ చాలా తేడా ఉంటుంది. ఈ సమస్యతో వైద్యుల్ని సంప్రదించినప్పుడు నడుమునొప్పీ, విపరీతమైన నీరసం, ఏ పనీ చేయలేకపోతున్నామని చెబుతుంటారు మహిళలు. వైట్‌ డిశ్ఛార్జి కావడం వల్లే ఇలా జరుగుతోందా అని సందేహిస్తారు. కొన్నిసార్లు ఇతర కారణాలూ ఈ సమస్యకు దారితీస్తాయి. అసలు వైట్‌ డిశ్ఛార్జి, ఎలా ఎందుకు అవుతుందంటే..  

నోట్లో లాలాజలం, కంట్లో తడి పొర ఉన్నట్లుగానే యోనిలోనూ సహజమైన స్రావాలు ఉంటాయి. అవి గర్భాశయ ముఖ ద్వారం, యోని గోడలూ, యోని ద్వారంలో ఉండే బార్థోలిన్‌, చర్మంపై ఉండే స్వేద గ్రంథులూ, సెబేషియస్‌ గ్రంథుల నుంచి తయారవుతాయి. అలాగే అతి కొద్దిగా ఫెల్లోపియన్‌ ట్యూబులూ, ఎండోమెట్రియం పొర నుంచీ స్రావాలు విడుదలవుతాయి. ఇవన్నీ కలిసి యోని నుంచి తెల్లని ద్రవం రూపంలో బయటకు వస్తాయి. అదే వైట్‌ డిశ్ఛార్జి. అయితే ఆ స్రావాలు ఎంతవరకూ ఉంటాయనేది ఆ సమయంలో శరీరంలో ఉండే హార్మోన్ల పనితీరు ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. ఈస్ట్రోజెన్‌ హార్మోను ఎక్కువగా ఉండే సమయంలో వైట్‌ డిశ్ఛార్జి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అదే అండం విడుదలైనప్పుడు జిగురు లాంటి మ్యూకస్‌ కనిపిస్తుంది. దాన్ని బట్టి గర్భధారణకు ఆ స్త్రీ శరీరం అనుకూలంగా ఉన్నట్లు అర్థం. అలాగే గర్భిణిగా ఉన్నప్పుడు హార్మోన్ల పనితీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడూ కనిపిస్తుంది. కలయిక సమయంలో ల్యూబ్రికేషన్‌ కోసం గ్రంథులు ఎక్కువగా ప్రేరేపితమైనప్పుడూ, నెలసరికి ముందూ వైట్‌ డిశ్ఛార్జి కనిపిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో భయపడాల్సిన అవసరంలేదు.  

అనారోగ్యానికి సంకేతం.. 

కొన్నిసార్లు వైట్‌ డిశ్ఛార్జితో పాటూ దురదా, దుర్వాసనా కూడా ఉంటాయి. రంగూ మారుతుంది. అది ఇన్‌ఫెక్షన్‌కి సంకేతం కావచ్చు. యోనిలో ఉండే లాక్టోబాసిలస్‌ అనే మంచి బ్యాక్టీరియా మిగిలిన సూక్ష్మక్రిముల ద్వారా ఇన్‌ఫెక్షన్లు రాకుండా రక్షణ కవచంలా అడ్డుకుంటుంది. అయితే కొన్నిసార్లు నెలసరి సమయంలో, కాన్పూ, అబార్షన్‌ తరవాత ఆ లాక్టోబాసిలస్‌ క్రిముల సంఖ్య తగ్గిపోతుంది. అప్పుడు ఇన్‌ఫెక్షన్లు మొదలవుతాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడూ హానికారక బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాంటి వాటిల్లో ట్రైకోమోనాస్‌, ఫంగస్‌, క్లమీడియా లాంటి ఇన్‌ఫెక్షన్లు కీలకమైనవి. వీటిల్లో చాలా వరకూ లైంగికపరంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించేవే. ఈ ఇన్‌ఫెక్షన్లు ఒక్క యోని భాగానికి మాత్రమే పరిమితం కావు. గర్భాశయ ముఖద్వారానికీ, తద్వారా గర్భాశయంలోకీ, ఫెల్లోపియన్‌ ట్యూబుల్లోకీ ప్రవేశిస్తాయి. 

ఎలా గుర్తించాలి: 
వైట్‌ డిశ్ఛార్జితో వైద్యుల్ని సంప్రదించినప్పుడు 'స్పెక్యులమ్‌' అనే పరీక్ష చేస్తారు. ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ ఉందనే విషయాన్ని.. డిశ్ఛార్జి రంగు, వాసన, యోని ఎటువంటి మార్పులు జరిగాయనే దానిపై గుర్తిస్తారు. ట్రైకోమోనాస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు జననేంద్రియ భాగం ఎర్రగా, కంది పోయినట్లుగా కనిపిస్తుంది. ఎర్రగా, చిన్నచిన్న పొక్కులూ, లేత పసుపు రంగులో నురగ లాంటి డిశ్ఛార్జి కనిపిస్తుంది. ఒకవేళ ఫంగస్‌ లేదా ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే మీగడ తరకల్లాంటి డిశ్ఛార్జి యోని గోడలకు గట్టిగా అతుక్కుని ఉంటుంది. ఇలాంటప్పుడు విపరీతమైన దురద ఉంటుంది. వివిధ రకాల బ్యాక్టీరియాలు కారణమైతే డిశ్ఛార్జి లేత మబ్బు రంగులో కనిపించడంతోపాటూ, నీచు వాసనలా ఉంటుంది. 

సమస్యను గుర్తించాక ఇన్‌ఫెక్షన్‌ని బట్టి చికిత్స ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ స్త్రీతోపాటూ ఆమె భర్త కూడా చికిత్స తీసుకోవాలి. ఈ ఇన్‌ఫెక్షన్లకు మందులను నోటి మాత్రలుగా, యోనిలో అమర్చుకునేలా మాత్రల్లా లేదా క్రీంల రూపంలో ఉంటాయి. ట్రైకోమోసాస్‌ కోసం మెట్రోనిడజాల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లకు ఇమెడజోల్‌, క్లమీడియాకు డాక్సిసైక్లిన్‌, ఎరిత్రోమైసిన్‌ లాంటివి అందుబాటులో ఉన్నాయి. 

దీర్ఘకాలిక సమస్యలూ.. 

బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల వైట్‌ డిశ్ఛార్జి అవుతున్నప్పుడు ఇతర సమస్యలూ తలెత్తవచ్చు. ముఖ్యంగా కటివలయానికి సంబంధించి పీఐడీ (పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌) మొదలవుతుంది. దాంతో పిల్లలు పుట్టకపోవడంతో మొదలుపెట్టి.. గర్భం దాల్చినప్పుడు కూడా ఇన్‌ఫెక్షన్లు వేధిస్తాయి. నెలలు నిండకుండా ఉమ్మ నీరు సంచి చిట్లి పోవడం, త్వరగా ప్రసవం జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రసవానంతరం కూడా ఈ ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించడం వల్ల ఇతర సమస్యలూ ఉంటాయి. 

  • కొంతమంది ఏళ్ల తరబడి చికిత్సలు తీసుకున్నా ఈ సమస్య తగ్గదు. అలాంటప్పుడు లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లూ లేవని నిర్థరించుకోవాలి. 
  • భర్తకి ఏదయినా కారణం వల్ల ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు భార్య మాత్రమే వైట్‌ డిశ్ఛార్జికి చికిత్స తీసుకుంటే సరిపోదు. కలయిక జరిగాక భర్త నుంచి ఆ ఇన్‌ఫెక్షన్‌ మళ్లీ మొదలవుతుంది. ఉదాహరణకు భర్త మధుమేహంతో బాధపడుతున్నప్పుడు.. అతనికి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. అటువంటప్పుడు అతనూ చికిత్స తీసుకోవాలి. లేదంటే భార్యకు ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. 
  • మొండి బ్యాక్టీరియా ఉన్నప్పుడు వాడే మాత్రలు పనిచేయకపోవచ్చు. అటువంటప్పుడు ఎంత చికిత్స చేసినా ఫలితం ఉండదు. ఇలాంటి వారికి ఏ మందులు పనిచేస్తాయనేదీ తెలుసుకునేందుకు కల్చర్‌ అండ్‌ సెన్సిటివిటీ పరీక్ష సూచిస్తారు వైద్యులు. వైట్‌ డిశ్ఛార్జిని ఒక చుక్క తీసుకుని గ్లాస్‌ పలకమీద ఉంచి మైక్రోస్కోప్‌ కింద పరీక్ష చేస్తారు. దానివల్ల ఏ తరహా బ్యాక్టీరియా అన్నది తెలుస్తుంది. దాన్ని బట్టీ సరైన మందులు సూచిస్తారు. 


కొన్నిసార్లు ట్యూమర్లూ, క్యాన్సర్‌, అల్సర్‌ వల్ల కూడా అసాధారణమైన డిశ్ఛార్జి కావచ్చు. డిశ్ఛార్జిలో నెత్తుటి చారలు ఉండటం, కలయిక తరవాత రక్తం కనిపించడం ట్యూమర్లకి ముఖ్య సూచనలు. అలాగే గర్భాశయంలో ఎండోమెట్రియల్‌ పాలిప్స్‌, గర్భశయం లోపల పొరల్లో గడ్డలున్నప్పుడూ ఇటువంటి వైట్‌ డిశ్ఛార్జి కనిపిస్తుంది. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. 

ఇతర కారణాలు: 
కొన్నిసార్లు గర్భాశయ ముఖద్వారానికి పుండు అవుతుంది. ఆ భాగం చుట్టూ ఎర్రగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో డిశ్ఛార్జి ఎక్కువగా అవుతుంది. అప్పుడు పాప్‌స్మియర్‌ పరీక్ష చేస్తారు. ఆ తరవాతే చికిత్సను నిర్ధరిస్తారు. ఇలాంటప్పుడు యాంటీ బయోటిక్స్‌తో పాటూ ఎర్రగా మారిన భాగం మానేందుకు క్రయోథెరపీ లేదా ఎలక్ట్రిక్‌ కాటరీ చికిత్సలుంటాయి. 

ఈ జాగ్రత్తలూ అవసరమే..
ఈ సమస్యతో బాధపడేవారు.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. కలయిక సమయంలో కండోమ్‌ వాడటం తప్పనిసరి. 
  • వ్యాధినిరోధక శక్తి తగ్గినా ఇన్‌ఫెక్షన్లు వస్తాయి కాబట్టి తగ్గకుండా చూసుకోవాలి. ఆహారంలో పండ్లూ, కాయగూరలూ, ఆకుకూరలూ తీసుకోవాలి. వ్యాయామం చేయడమూ అవసరమే. 
  • వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. నెలసరి సమయంతో మొదలుపెట్టి జీవితాంతం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు పాప్‌స్మియర్‌ పరీక్షలు చేయించుకోవాలి. పిల్లల్ని ఎప్పుడు కనాలి.. అవాంఛిత గర్భం రాకుండా ఉండాలంటే ఏంచేయాలనే విషయాలను వైద్యులతో చర్చించాలి. సాధ్యమైనంత వరకూ అబార్షన్‌ చేయించుకోకూడదు. లేదంటే ఇన్‌ఫెక్షన్లు త్వరగా దాడిచేస్తాయి. 
  • ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని అనుమానం కలగగానే వెంటనే చికిత్స తీసుకోవాలి. ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
వయస్సులో ఉన్నప్పుడు ఏం తిన్నా.. ఎలా తిరిగినా రోజులు బాగానే గడిచిపోతాయి. ఆ ఉరకలెత్తే వయస్సులో శారీరక సామర్థ్యం అంత  బాగా ఉంటుంది! కానీ 30లు దాటుతున్న కొద్దీ పరిస్థితి క్రమేపీ మారిపోతుంటుంది. ఎప్పుడూ లేనిది నెలకో రెణ్ణెల్లకో ఏదో ఒక చిన్నాచితకా ఆరోగ్య సమస్య పలకరించటం. మళ్లీ కొద్దిరోజుల్లో సర్దుకోవటం! చాలామందికి నలభైల్లో పడిన తర్వాత బండి ఇలాగే నడుస్తుంది! శరీరం కొద్దికొద్దిగా పట్టు సడలుతోందనటానికి ఇదే తార్కాణం. మరి దీన్ని అడ్డుకునేదెలా? 50, 60 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఎటువంటి శారీరక సమస్యా దరిజేరకుండా.. దృఢత్వం జారకుండా చక్కటి ఆరోగ్యాన్ని నిలబెట్టుకునేదెలా? అందుకోసం..  పాటించండీ ఈ ఐదు సూత్రాలు!

  • ముప్ఫై ఏళ్లు దాటుతుంటే సహజంగానే స్త్రీపురుషులు ఇరువురూ కొద్దిగా బరువు పెరుగుతుంటారు. ముఖ్యంగా ప్రసవానంతరం స్త్రీలు కొంత బరువు పెరగటం చూస్తూనే ఉంటాం. అయితే ఏ రకంగా చూసుకున్నా కూడా బరువు పెరగటం మంచిది కాదు. అందుకోసం పద్ధతి ప్రకారం తప్పనిసరిగా రోజూ ఏదో ఒక వ్యాయామం చెయ్యటం చాలా అవసరం. బద్ధకం ముంచెత్తకుండా ఉండేందుకు నలుగురితో కలిసి వ్యాయామానికి వెళ్లేందుకు వీలుగా వాకింగ్‌ లాంటివి ఎంచుకోవచ్చు. నిజానికి సాధారణ వ్యాయామాలన్నింటిలోకీ ఈత ఉత్తమమైనది. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు కాబట్టి తేలికైన, సమర్థమైన వాకింగ్‌ను ఎంచుకోవచ్చు. వారానికి కనీసం నాలుగు రోజులు గుండె బలాన్ని పెంచే వాకింగ్‌, జాగింగ్‌, రన్నింగ్‌ చెయ్యాలి. మిగిలిన రోజుల్లో జిమ్‌ వ్యాయామాల వంటివి ఎంచుకోవచ్చు. బరువు పెరగకుండా ఉండటమే కాదు.. చిన్నాచితకా జబ్బుల బారిన పడకుండా రోగనిరోధక శక్తి బలపడేందుకు, శరీరంలో జీవక్రియలు సజావుగా సాగేందుకు కూడా నిత్య వ్యాయామం దోహదపడుతుందని మరువద్దు. 


  • ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏమిటో అవగాహన పెంచుకోవటం చాలా అవసరం. ప్రతిపూటా వరి అన్నం, గోధుమ వంటి పిండి పదార్ధాలనే ఎక్కువెక్కువగా తినటం సరికాదు. వీటిని కొద్దిగా తీసుకోవాలి. అది కూడా ముడివైతే మంచిది. (మైదా వంటి తేలికగా జీర్ణమయ్యే రిఫైన్డ్‌ పిండ్లు బాగా తగ్గించెయ్యాలి) ప్రతి భోజనంలోనూ ప్రధానంగా పప్పు, మాంసం వంటి మాంసకృత్తులు దండిగా ఉండాలి. ఇక ప్రతి పూటా కూరలు, ఆకుకూరలు దండిగా తినాలి. కూరలను, పండ్లను చెక్కు తియ్యకుండా తినటం, లేదా సాధ్యమైనంత తక్కువగా తియ్యటం మంచిది. నూనె, కొవ్వు, స్వీట్లు బాగా తగ్గించెయ్యాలి. రోజూ ఒకే సమయానికి తినటం అలవాటు చేసుకోవాలి. వారాంతాల్లో-ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువెక్కువగా తినటం మంచిది కాదు. 


  • ఇన్నాళ్లుగా ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేకపోయినా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తించి.. మన శరీరం మీద ఒక కన్నేసి ఉంచటం చాలా అవసరం. ముఖ్యంగా 30-35 ఏళ్లు వచ్చినప్పుడు ఏడాదికి ఒకసారైనా కొన్ని తేలికపాటి పరీక్షలు చేయించుకోవటం మంచిది. ముఖ్యంగా బీపీ చూపించుకోవటం, మధుమేహం వస్తోందేమో తెలుసుకునేందుకు, రక్తహీనత-అధిక కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు రక్తపరీక్షలు చేయించుకోవాలి. స్త్రీలైతే- పాప్‌స్మియర్‌ పరీక్ష (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వస్తోందేమో ముందే గుర్తించేందుకు), 40 ఏళ్లు దాటిన తర్వాత రెండేళ్లకొకసారైనా మామోగ్రామ్‌ పరీక్ష (రొమ్ము క్యాన్సర్‌ ఆనవాళ్లను పసిగట్టేందుకు) చేయించుకోవటం ఉత్తమం. పరీక్షల విషయంలో తాత్సారం అంత మంచిది కాదు! మన శరీరం పట్ల మనం శ్రద్ధ కనబరుస్తున్నామనటానికి ఇదే తార్కాణం. 


  • 30 ఏళ్ల వయసనేది ఎవరైనా ఇంట్లోనూ, పనిలోనూ కూడా చాలా చురుకుగా ఉండే సమయం. కెరీర్‌ పరంగా కూడా చాలా వేగంగా ఎదిగే సమయం. పిల్లల పెంపకం, డబ్బు దాచుకోవటం, భవిష్యత్‌ ప్రణాళికలు వేసుకోవటం, సామాజిక సంబంధాలు పెంచుకోవటం.. ఇవన్నీ కూడా ఒక్కసారిగా మీద పడతాయి. ఈ ఒత్తిడికి ఉక్కిరిబిక్కిరి అవుతూ.. ఏదైనా కాస్త అటూఇటూ అయితే మానసికంగా నిరాశలోకి జారిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అన్నింటినీ ఒక్కసారే నెత్తినేసుకుని వైఫల్యాన్ని కొని తెచ్చుకోకూడదు. జీవితాన్ని ప్రణాళికా బద్ధంగా మలుచుకోవటం, సమయ పాలన, 'ఈ క్షణం మనది' అనుకుంటూ కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో జీవితాన్ని ఆనందించటం ముఖ్యం. ప్రతి పనిలోనూ సానుకూల దృక్పథం ప్రదర్శించటం అవసరం. మానసిక నిశ్చింతకు అవసరమైతే యోగాభ్యాసం, ధ్యానం వంటివి కూడా ఉపకరిస్తాయి. 


  • కచ్చితంగా రావాలనేం లేదుగానీ... కొన్ని వ్యాధులు, రుగ్మతలు కుటుంబ పరంగా వచ్చే ఆస్కారం లేకపోలేదు. అందుకే కుటుంబంలో, వంశంలో ఇంతకు ముందు ఎవరికైనా గుండె జబ్బులు, హైబీపీ, మధుమేహం, క్యాన్సర్లు, థైరాయిడ్‌ సమస్యలు, కీళ్ల వాతం వంటివి ఉన్నాయేమో తెలుసుకుని ఉండటం.. వీలైతే సాధ్యమైనంత వరకూ మనకు రాకుండా 20-30 ఏళ్ల వయసు నుంచే నివారణ చర్యలు ఆరంభించటం చాలా చాలా అవసరం. దీని విషయమై కుటుంబ వైద్యులతో ముందే చర్చించటం శ్రేయస్కరం! 
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
వూబకాయం.. చిన్నారుల నుంచి పెద్దల దాకా ఎదుర్కొంటున్న సమస్య. నిజానికిదో వ్యాధి కాదు. అనేక ఆరోగ్య సమస్యలకు పునాది. ముఖ్యంగా మహిళలు టీనేజీ, సంతాన వృద్ధి దశ, నడి వయసు ఇలా అన్ని దశల్లోనూ స్థూలకాయంతో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. 

మనదేశంలో స్థూలకాయం సమస్య రెండేళ్ల వయసు నుంచే మొదలవుతునట్లు వైద్యులు చెబుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారంలో పెరుగుతున్న కెలరీలు, తగ్గుతున్న శారీరక శ్రమ ఇందుకు కారణం. చిన్నప్పుడు పిల్లలు బొద్దుగా ఉన్నా బడికి వెళ్లి ఆటపాటలు నేర్చుకుంటే సన్నగా మారతారనే నమ్మకం మనలో నిన్న మొన్నటి దాకా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. చిన్నప్పుడు లావుగా ఉండేవాళ్లు టీనేజీ కొచ్చినా ఆ బరువు తక్కించుకో లేకపోతున్నారు. ఇందువల్ల ఆరోగ్యపరంగానే కాదు సామాజికంగా మానసికంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే కౌమారం నుంచే స్థూలకాయం రాకుండా కాపాడుకోవాలి. 

టీనేజీలో వూబకాయం భవిష్యత్తులో ప్రపంచం ఎదుర్కొనే కీలక సవాళ్లలో ఒకటని పరిశోధకులు చెబుతున్నారు. ఆటపాటలకు దూరంగా పెరగడం, రోజులో అత్యధికంగా కెలరీలున్న ఆహారం తీసుకోవడం ఇందుకు కారణం. నేటి తరం పిల్లలు చేతుల నిండుగా పాకెట్ మనీ ఉంటోంది. దాంతో తరచూ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. పిజాలూ, బర్గర్ లూ లాగించేస్తుంటారు. అది మరింతగా వూబకాయానికి దారితీస్తోంది. వూబకాయం ఉన్న అమ్మాయిల్లో పీసీఓడీ, రుతుక్రమం సక్రమంగా కాకపోవడం, అవాంఛిత రోమాలు, హార్మోనల్ సమస్యల్లాంటివి ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాదు పెద్దయ్యాక వీరిలో దాదాపు 70 శాతం మందికి కొలస్ట్రాల్, బీపీ, నిద్ర లేమి వంటివీ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఓ అధ్యయనం ప్రకారం చిన్నప్పుడే స్థూలకాయంతో బాధ పడే వారు భవిష్యత్తులో ప్రాణాంతక గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం 130 శాతం ఎక్కువ!

సాధారణంగా థైరాయిడ్, హార్మోన్ల సమస్యలు, జన్యుపరమైన కారణాల వల్ల కూడా టీనేజ్ అమ్మాయిల్లో వూబకాయం వస్తుంది. ఈ సమస్యలకు సంబంధించి ఇతరత్రా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. ఈ సమస్యలు పోగా, ఆహారపు అలవాట్లే ప్రధానంగా వారిలో వూబకాయాన్ని పెంచుతున్నాయని పరిశోధనలో నిరూపించారు. సుమారు మూడు దశాబ్దల కాలంలో టీనేజ్ పిల్లల ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల్ని పరిశీలించారు. రోజు వారి ఆహారంలో తీసుకునే కెలరీలు గణనీయంగా పెరగడం ప్రధాన కారణమని చెప్పారు. చదువులో పడి ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం, క్రీడలకు దూరంగా ఉండడం కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. 

నివారణ మార్గాలు...

టీనేజ్ లో బయటకు వెళ్లి తినడం సరదాగా అనిపిస్తుంది. కానీ వాటి వల్ల మన శరీరం ఎలా మారుతోందో ఓసారి చూసుకోవాలి! వూబకాయం తగ్గి నాజూగ్గా తయారైతే మనం ఎంత ఆత్మవిశ్వాసంగా, చురుగ్గా ఉంటామో అంచనా వేసుకోవాలి. ఆ లక్ష్యమే మనకు ప్రేరణ కావాలి. సమతులహారం ఎంత అవసరమో.. ఆ ఆహారాన్ని రోజూ నిర్ణీత వేళల్లో తినడం అంతే ముఖ్యం. నిదానంగా అరిగే పిండి పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. చెక్కర వాడకానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఐస్ క్రీమ్ లు, చాకెట్లు, వేపుళ్లూ, ఫ్రైలు వంటివి పూర్తిగా మానేయలేం కాబట్టి బాగా తగ్గిస్తే మంచిది. ఆహారంలో పండ్లూ కూరగాయలు ఎక్కువగా ఉండేల చూసుకోవాలి. రోజులో టీవీ, కంప్యూటర్ రెండింటికీ కలిపి గంట కేటయిస్తే చాలు. చదువు కోసం ఎక్కువ సమయం కేటయించాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా ముప్పావు గంటకోసారి అయిదు నిమిషాలపాటు నడవాలి. పెరిగిన బరువు తగ్గించుకోవాలని అనుకున్నప్పుడు గంట గంటన్నర వ్యాయామం తప్పనిసరి. 

గర్భిణిలో వూబకాయం.. 

గర్భం దాల్చలని నిర్ణయించుకున్నప్పుడు వూబకాయంతో ఉన్నవారు బరువు తగ్గితీరాల్సిందే. బీఎంఐ 30 శాతం కంటే ఎక్కువున్న వారిలో గర్భస్రావం కావడం, సిజేరియస్ చేయాల్సి రావడం, హైపర్ టెన్షస్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రసానంతరం బిడ్డలకు పాలుపట్టడం, కొనసాగించడం కూడా కష్టమవుతుంది.

వూబకాయం ఉన్నవాళ్లు గర్భం దాల్చడానికి ముందు ఓ అయిదు కిలోలైనా తగ్గాలి. అలా చేయడం వల్ల గర్భం దాల్చక ఏర్పడే అధిక రక్తపోటూ, మధుమేహం సమస్యల్ని 40 శాతం తగ్గించుకోవచ్చు. గర్భిణులు ఉన్న బరువు తగ్గాల్సిన అవసరం లేదు. బరువు పెరగకుండా కాపాడుకుంటే చాలు! ప్రసవం తర్వాత సాధారణంగా రెండు, మూడు కిలోలే బరువు తగ్గుతారు. కాబట్టి అప్పుడూ కేలరీలు తక్కువగా తీసుకోవాలి. సమతుల ఆహారమే ఎంచుకోవాలి. ప్రొటన్లు, క్యాల్షియం, ఇనుము ఎక్కువగా ఉన్నవి తీసుకోవాలి. 

తీసుకోవలసిన ఆహారం..

గుడ్డూ, చికెస్, పనీర్, సోయా, డబుల్ టోన్డ్ మిల్క్ అరలీటరు నుంచి 750 ఎంఎల్ వరకూ వాడవచ్చు. రోజులో ఆకుకూర, అరకేజీ కూరగాయలు, రెండు రకాల పండ్లూ, విటమిన్ సి ఉండే నిమ్మలంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఒక్కో పూట ఒక్కో రకం తృణధాన్యాలు, మేలైన కొవ్వు ఉండే ధాన్యాలు ఎంచుకోవాలి. బేకరీ పదార్థాలు, పాలిష్ చేసిన బియ్యం వాడకం తగ్గించాలి. చిప్స్ వంటి శాచురేటడ్ కొవ్వులూ, కారప్పూస, ఎక్కువకాలం నిల్వ ఉంచిన పచ్చళ్లూ వంటివి అసలొద్దు. 

నాజూకుతనంపై మధ్యవయస్కుల్లోనూ శ్రద్ధ పెరుగుతోంది. వూబకాయం తగ్గించుకోవాలనుకున్నప్పుడు తక్కువ కాలనికి ఎక్కువ లక్ష్యం పెట్టుకుని, అది సాధ్యంకాక నిరాశా నిస్పృహలతో ఆపేస్తుంటారు చాల మంది. కొందరైతే ఈ లక్ష్యాలకు భయపడి ప్రయత్నాలనీ వాయిదా వేస్తుంటారు. ఇది వారిలో ఒత్తిడి పెంచుతుంది. అలాకాకుండా క్రమంగా ఓ పద్ధతిలో బరువు తగ్గాలి. నిపుణుల సలహా తీసుకోవాలి.
బరువు తగ్గడానికి మీరు రోజూ చేసే ప్రయత్నమేదీ వృథా కాదు. కనీసం రెండు నెలలు మీరు వ్యాయామాలు చేసినా, రక్తంలోని చెడు కొవ్వు(ఎల్డీఎల్) తగ్గి.. మంచి కొవ్వు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆకలి తీవ్రతను తగ్గించేల మన ఆహార విధానం ఏర్పరచుకోవాలి. అయితే అర్ధాకలితో ఉండడం మంచిది కాదు. పచ్చిగా, మసాల లేకుండా పచ్చి కూరగాయలు తినడం అలవాటు చేసుకోవాలి. ఉడికించిన కూరలు తినడానికే పరిమితం కండి. పోషకాలను మన రోజు వారి అలవాట్లను బట్టి ఏయే పోషకాలు అవసరం, ఏవి కాదూ అని నిర్ణయించుకోవాలి. శారీరకంగా తక్కువగా శ్రమించే వాళ్లు ఎక్కువ ఐరన్, కొవ్వు పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు. 

కేలరీలు తక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమతో ఎక్కువగా ఖర్చు పెట్టడం. బరువు తగ్గడానికి ఇదే ప్రధాన సూత్రం! 
ఒక పౌండు (సుమారు రెండు కిలోలు) బరువు తగ్గాలంటే రోజులో 3500 కేలరీలు ఖర్చుపెట్టాలి. 

వూబకాయం ఉన్నవాళ్లు అయిదు శాతం బరువు తగ్గించారనుకుందాం. అయిదేళ్లు పాటు అది పెరగకుండా చూసుకుంటే.. గుండెజబ్బు, మధుమేహం వంటి సమస్యలు 75 శాతం వరకూ రావు. 

కొందరికి పొట్ట దగ్గర, నడుం చుట్టు కొవ్వు చేరుతుంది. దానిపైనే దృష్టి పెట్టి బరువు తగ్గించుకోవాలనుకుంటారు. నిజానికి, బరువేప్పుడు శరీరం మొత్తంగా ఓ క్రమంలోనే తగ్గుతూ వస్తుంది. బరువు తగ్గాలనుకున్నప్పుడు కొందరు ఆహారం తగ్గిస్తే సరిపోతుందని అనుకుంటారు. అలా చేస్తే.. కండరాల రాశి తగ్గి కొవ్వు పెరుగుతుంది. ఆహార నియమాలు పాటించడంతోపాటు రోజులో వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలి.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
దిగులుగా అనిపిస్తోందా? అయితే లేచి నిలబడండి. కాసేపు అటు ఇటు నడచి చూడండి. ఎందుకంటే రోజుకి ఏడు గంటలు, అంతకన్నా ఎక్కువ సేపు కూచునే స్త్రీలలో డిప్రెషన్ లక్షణాలు మరింత అధికంగా కనిపిస్తున్నట్లు తాజా అధ్యయనంలో బయటపడింది.  ఎక్కువ సేపు కూచోవడం వల్ల పరిసర వాతావారణంతో సంబంధం తగ్గిపోతుందని, ఇది డిప్రెషన్ కు దారి తిస్తుందని పరిశోధకులు అనుమానిస్తున్నారు. మన మెదడులో ఎండార్ఫిన్  అనే రసాయనాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి మనం ఉత్సాహంగా ఉండటానికి తోడ్పడతాయి. ఎక్కువ సేపు కూచోవడం వల్ల ఈ ఎండార్ఫిన్ లో చురుకుదనం తగ్గి పోతుంది. అంతే కాదు.. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే బాగాలకు రక్త సరఫరా కూడా తగ్గుతుంది. ఇవన్నీ నిరుత్సాహ భావన కలగటనికి దారితీసే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి అదేపనిగా కూచోకుండా వీలైనప్పుడల్ల కాస్త లేచి నిలబడి, అటు ఇటు నడవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
పీసీఓడీ అనగా ఇమ్మెచ్యూర్ ఫాలికల్ (సరిగా ఎదగని అండం) గర్భాశయానికి రెండు వైపులా ఉన్న అండాశయాలపై నీటిబుడగల వలె ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారు. దీని బారిన పడిన చాలామంది స్త్రీలు సాధారణ ఆహార అలవాట్లు పాటిస్తున్నప్పటికీ అధిక బరువు, వెంట్రుకలు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద మగవారిలా వెంట్రుకలు రావడం, నెలసరి సరిగ్గా ఉన్నప్పటికీ సంతాన లేమితో బాధపడుతూ ఉంటారు. దీనిని అదుపులో ఉంచుకోవడానికి ఈ సలహాలు పాటించి చూడండి...

హార్మోన్ల అసమతౌల్యం వల్ల ఎదురయ్యే పీసీఓడీతో బాధపడేవారికి సాధారణంగా, ఆకలి, జీవక్రియలకు సంబంధించిన సమస్యలు, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. తక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవడం మొదలు పెట్టడం వల్ల అది తలనొప్పి, నీరసం, కళ్లు తిరగడానికి దారి తీసింది. అయితే మీరు తగినంత బరువు ఉన్నారా ? లేదా? అన్న విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ బరువు తగ్గిన విషయం తెలుసుకోవడానికి మీ నడుం భాగం, భుజాలు కొలుచు కొని చూడండి. ఇక కళ్లు తిరగడం, తలనొప్పి వంటి వాటిని దూరం చేసుకోవాలంటే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పాలిష్ చేసిన బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్, బొంబాయి రవ్వకు బదులు గోధుమ నూక వాడడం, ఇలాంటి మార్పులను మీ ఆహారంలో చేసుకోండి. ముడి ఆహారానికి, తృణధాన్యాలకు ఎక్కువగా ప్రాధాన్యాన్ని ఇవ్వండి. అన్ని వేళల మీరు తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంకో ఉపయోగమేంటంటే దీని వల్ల ఆకలి కూడా అదుపులో ఉంటుంది. సాధ్యమైనంత వరకు శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. ముఖ్యంగా సోయా ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోండి. అప్పుడప్పుడు ఉడికించిన కోడిగుడ్డులోని తెల్లసొన, చేపలు తీసుకుంటూ ఉండండి. ఈ విధంగా ఆహారంలో మార్పులు చేసుకున్నా, పెద్దగా మార్పు లేకపోతే, ఒకసారి డాక్టర్ ను సంప్రదించడం మంచిది.