Articles by "actress"
actress లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
అంజలి తూర్పుగోదావరి జిల్లా, రాజోలులో సెప్టెంబర్ 11, 1986లో జన్మించింది. పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నైకు మకాం మార్చింది. మ్యాథ్స్ లో డిగ్రీ చేస్తూనే షార్ట్ఫిల్మ్ లలో నటించేది. అదే సినిమా రంగంలో ప్రేశించడానికి పునాదులుగా మారాయి. 

  • తొలుత జీవా సరసన తమిళంలో ఒక సినిమాలో నటించింది. అది తెలుగులో ‘డేర్’ గా అనువాదం అయింది. 
  • అ తర్వాత 2006లో ‘ఫొటో’ సినిమాతో స్వప్నగా అందరికీ పరిచయమైంది. 
  • 2007లో ‘ప్రేమలేఖ రాశా’ సినిమాలో సంధ్యగా కనిపించినా తగిన గుర్తింపు దక్కలేదు. 
  • కానీ తర్వాత నటించిన ‘షాపింగ్ మాల్’ సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచింది. 
  • అది చూసిన డైరెక్టర్ మురుగదాస్ తను నిర్మించిన ‘జర్నీ’ సినిమాలో అవకాశం ఇచ్చారు.
  • 2011లో విడుదలైన ‘జర్నీ’ సినిమాలో తన అభినయ ప్రతిభ అందరికీ తెలిసేల చక్కటి నటన తో అకట్టుకుంది. మధుమతిగా డామినేటింగ్ క్యారెక్టర్తో అందరికీ గుర్తుండి పోయింది. 
  • 2013లో మళ్లీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చేట్టు’ సినిమాలో సీతగా, మనింట్లో అమ్మాయిల కనిపించి అందరిని మురిపించింది. అమాయకంగా కనిపిస్తూనే, కల్లకపటం ఎరుగని, చిలిపి అమ్మాయిల కనిపించి మంచి నటనతో సినిమా విజయవంతం కావడంలో బాగం పంచుకుంది.
  • తర్వాత ‘బలుపు’ సినిమాలో రవితేజ ప్రక్కన కనపడింది.
  • తమిళ చిత్రం సింగం-2 లో సూర్య తో ఒక పాటలో గెస్ట్  అప్పియరెన్స్ కూడా ఇచ్చింది.
  • 2014 లో గీతాంజలిగా మన ముందుకు వచ్చింది.

  • ఇటు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక సినిమాల్లో నటిస్తూ, అగ్ర నాయికల్లో ఒకరిగా ముందుకు సాగిపోతోంది. 
  • తమిళచిత్రం ‘ఎంగేయం ఎప్పోదం’ (తెలుగులో జర్నీ)లో తన అద్భుతమైన నటనకు గాను ‘సౌత్ ఫిల్మ్ ఫేర్-2012’, అవార్డును సొంతం చేసుకుంది. 
  • 2013, ఏప్రిల్లో హైదరాబాద్  ఉంటున్న హోటల్ నుంచి మాయమవడంతో కాస్త అలజడి సృష్టించింది. తర్వాత పోలీసుల ముందు ప్రత్యక్షం కావడంతో అంతా వూపిరి పీల్చుకున్నారు. పిన్ని భారతీదేవి, దర్శకుడు కలంజియం కలిసి తనను హింసిస్తున్నారంటూ మీడియాకు తెలిపింది. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.