Articles by "pickle"
pickle లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
కావలసినవి

కొత్తిమీర - రెండుకప్పులు
పచ్చిమిర్చి - 6
చింతపండు - నిమ్మకాయంత
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
ఇంగువ - చిటికెడు
నూనె - రెండు టేబుల్ స్పూన్లు

తయారి: 

కొత్తిమీరను శుభ్రంగా కడగాలి మిక్సీలో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంగువ, చింతపండు, పసుపు, ఉప్పు వేసి మెత్తగా చేయాలి. (అవసరమనుకుంటే నీరు జత చేయాలి) పచ్చడిని గిన్నెలోకి తీసుకుని కొద్దిగా నూనె వేసి కలపాలి.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
కావలసినవి

దోసకాయ - మీడియం సైజుది ఒకటి
పచ్చిమిర్చి - 6
చింతపండు - కొద్దిగా
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
ఇంగువ - చిటికెడు
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - చిన్న కట్ట

తయారి

దోసకాయ చెక్కు తీసి, గింజలు వేరుచేసి, చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. మిక్సీలో పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కొన్ని దోసకాయముక్కలు వేసి కచ్చాపచ్చాగా చేయాలి.  ఒక గిన్నెలో దోసకాయ ముక్కలు, మెత్తగా చేసిన దోసకాయల మిశ్రమం, పసుపు, ఇంగువ, నూనె వేసి బాగా కలిపి, అరగంట సేపు ఊరనివ్వాలి.  కొత్తిమీరతో గార్నిష్ చేసి, వేడివేడి అన్నంలోకి సర్వ్ చేయాలి.