Articles by "fitness tips"
fitness tips లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates

చాలా మందికి నిద్ర సమస్య వేధిస్తూ ఉంటుంది. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఎంతకీ నిద్రపట్టదు. ఇలాంటి ముందు కొన్ని పాటి చిట్కాలు పాటిస్తే నిద్రలేమి సమస్య నుంచి గట్టెక్కవచ్చని నిపుణులు చెపుతున్నారు.



  • మీలోనున్న ఒత్తిడి కారణంగా లేదా మనసులో అలజడి కారణంగా కూడా నిద్ర రాదు. అలాంటి పరిస్థితుల్లో మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి లేదా మంచి సాహిత్యం చదవండి లేదా ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలను చదవండి. ఇలా చేస్తే మనసు కాస్త కుదుటపడి గాఢమైన నిద్ర రావడానికి ఆస్కారం ఉంటుంది.

  • రాత్రి భోజనం చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలపాటు నడవడం అలవాటు చేసుకోండి. ఆదీంతో మంచిగా నిద్ర పట్టడమే కాకుండా జీర్ణక్రియ కూడా పెరగుతుంది.
  • మీరు పడుకునే మంచం లేదా పడక ఏదైనా కావచ్చు మీకు అనువైన రీతిలో ఉండే విధంగా తయారు చేసుకోండి. లేకుంటే నిద్రలో తేడాలొచ్చి మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం వుంది.
  • నిద్రలేమితో బాధపడుతుంటే మీ ముఖం, కాళ్ళు, చేతులు చల్లటి నీటితో కడుగుకోండి. దీంతో నిద్ర తప్పక వస్తుంది.
  • పడుకునే ముందు రోజంతా చేసిన పనిని మర్చిపొండి. మరుసటి రోజు చేయవలసిన పనిని గురించి ఏమాత్రం ఆలోచించకండి. అన్ని విషయాలను ఉదయం వరకు మర్చిపొండి. మరుసటి రోజు పనిగురించి ఆలోచిస్తే ఒత్తిడి పెరిగి నిద్ర పట్టదంటున్నారు వైద్యులు.
  • ఒకవేళ మీరు నిద్రలేమితో బాధపడుతుంటే, నిద్రమాత్రలు వాడుతుంటే మీరు యోగా నిపుణులను సంప్రదించండి. వారి సలహాలు పాటించి శ్వాసక్రియను పాటించండి. రాత్రి పడుకునేముందు శ్వాసను పూర్తిగా తీసుకోని వదలండి. దీంతో మీ మస్తిష్కానికి ప్రాణావయువు చేరి మీకు నిద్ర సంపూర్ణంగా వస్తుంది.
  • మంచి నిద్రకు మీ గదిలో గాలి సౌకర్యం బాగుండాలి. పడుకోవడానికి బయటి వాతావరణం అనుకూలంగా ఉంటే గది బయట పడుకోండి లేదా పైకప్పుపై పడుకోండి. మీ గదిలో కూలర్, ఫ్యాన్ లేదా ఎయిర్ కండీషనర్ శబ్దం ఎక్కువగా ఉంటే వాటిని రిపేరు చేయించండి. ఎందుకంటే శబ్దాలవలనకూడా నిద్ర రాదు.
  • నిద్రపోయేముందు టీ- కాఫీల్లాంటివి వాడకండి. దీంతో మస్తిష్కంలోని సిరలు ఉత్తేజం చెంది నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.



E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
బరువు కోల్పోవడం అత్యంత ప్రాధమిక మార్గం కేలరీలు తగ్గించుకోవడం. ఈ విధానలు పటించడం వల్ల 5 వారలలో కనిసం 5 కేజీలు బరువు తగ్గే అవకాశం వుంది. ప్రయత్నించి చూడండి.
  • 1.      మీ కాళ్ళకు పని చేప్పండి.  నడక, పరిగెత్తం వంటివి చేయడం వల్ల ప్రతిరోజు 350 కేలరీలు తగ్గే అవకాశం వుంది. జగింగ్, లేదా వ్యాయమం చేయడానిక సమయం లేదు అనుకునేవారు సెల్ ఫోన్ లో మాట్లాడే టప్పుడు అటు ఇటు నడవడం, వేరే వాళ్ళ మీద అధారపడకుడా ఆఫీసులో లేదా వంటగదిలో మనకు అవసరమైనవి మనమే వేళ్ళి తెచ్చుకోవడం, లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కిడం వంటి చిన్న చిన్న పనులు చేసిన ప్రతి రోజు 350 కేలరీలు తగ్గే అవకాశం వుంది.
  • 2.      నట్స్ : జీడిపప్పు, బాదం పప్పు, వేరుశనక గుళ్ళు వంటివి కోవ్వు పదార్ధలే అయిన ప్రతిరోజు తక్కువ మోతదులో అవి తీసుకోవడం వల్ల కడుపు నిడినట్లుగా అనిపించి వేరే ఏమి తినాలనిపించవు. ఫైగా ఇవి తీసుకోవడం వల్ల శరిరానికి కావలసిన ఫోషకాలు అందుతాయి.
  • 3.      టీవీ ముందు కుర్చోని ఏమి తినకండి. టీవీ ముందు కుర్చోని తీనే వారు ఎక్కువగా తీనే అవకాశం వుంది, కాబట్టి, సన్నబడలనుకున్నవారు కొన్ని రోజులు టీవీకు అతుక్కోపోకుండా, అ సమయంలో జాగింగ్ వంటివి చేస్తే మంచిది.
  • 4.      పండ్లు, కురగాయలు వంటి సహజసిద్దమైన ఆహరన్ని ప్రతిరోజు తీసుకుండి. ప్రై లేదా రిఫ్రైండ్ చేసిన ఆహరం తీసుకోగపొవడం మంచిది.
  • 5.      పెద్ద పేట్ల లో ఆహరం తినడం కన్న చిన్న ప్లేట్ల ఆహరం తినడం వల్ల ఎక్కువ తినేసం అనే భావన కలిగి తక్కువ తీనే అస్కారం వుంది.
  • 6.      ఐస్ క్రీమ్స్ , జంక్ ఫుడ్ వంటి కోవ్వు పదార్దలు తగ్గించడం మంచిది. 

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ప్రస్తుతకాలంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు బరువు అన్నది పెద్ద సమస్యగా మారింది. నేటి జంక్ఫుడ్, బిజీ లైఫ్, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, వండుకునే సమయం లేకపోవడం. ఇలాంటి అనేక కారణాల చేత అంతకంతకూ స్థూలకాయ సమస్య పెరిగిపోతుంది. మరి దీన్నుండి బయటపడాలంటే ఏం చేయాలి.అదీ నీరసం రాకుండా... సౌందర్యానికి ఆపద వాటిల్లకుండా! ఎందుకంటే, డైటింగ్ పేరిట పస్తులుండి ఆసుపత్రుల పాలవుతున్న అమ్మాయిలను మనం చూస్తున్నాం. ఆహారంలో ఈ క్రింది వాటిని భాగంగా చేస్తే ఎలాంటి కొవ్వు లేకుండా పోషకాహారం మీ శరీరానికి అందిస్తున్నట్లే! నాజూగ్గా మారడానికి ఇది ఒక చక్కటి మార్గం. బరువు తగ్గాలంటే ఈవిధంగా మీరు ఆచరించండి
  • మొదటి రోజు : ఆపిల్, కమల, దానిమ్మ, బత్తాయి, జామ, మొదలైన రకాల పండ్లను మూడు పూటలా ఆహారముగా తీసుకొనకొండి, అందులోను పుచ్చకాయ, తినే దోసకాయను ఎక్కువగా తీసుకొండి. అరటిపండు మాత్రము తినకండి
  •  రెండవ రోజు : ఉదయాన్నే ఫలాహరముగా బంగాళ దుంపలను ఉడకబెట్టి ఆహారముగా తీసుకొనవలెను, తదుపరి అన్ని రకాల కూరగాయలను పచ్చిగా గాని, ఉడక బెట్టినవి గాని తినకొండి. కొబ్బరి మాత్రము తినకండి !
  • మూడవ రోజు : పండ్లు కాయగోరలు కలపి అనగా మిక్స్ చేసి తినండి. అరటి పండు, బంగాళదుంప మాత్రం తినవవద్దు.
  • నాలుగువ రోజు : ఉదయము రెండు అరటి పండ్లు + ఒక గ్లాసు పాలు. మద్యపానము రెండు అరటి పండు + ఒక గ్లాసు పాలు. రాత్రి రెండు అరటి పండ్లు + ఒక గ్లాసు పాలు మరియు కూరగాయల సూప్ తీసుకోవచ్చు.
  • ఐదవ రోజు : ఈరోజు ఒక్క కప్పు రైస్, మరియు ఆరు బంగాళదుంపలు + పన్నండు గ్లాసులు మంచినీరు త్రాగండి.
  • ఆరవ రోజు : ఈరోజు ఒక్క కప్పు రైస్, పచ్చికూరగాయలు వుడికించినటువంటివి మాత్రమే తీసుకోవాలి.
  •  ఏడవ రోజు : ఈరోజు ఒక్క కప్పు రైస్ + పచ్చికూరగాయలువుడ్డికేపేట్టినవి తీసుకోవాలి, ఒక కప్పు పండ్లరసం తీసుకోవాలి.


వారం రోజుల తరవాత మీరు స్లీమ్ గా తయ్యారవడామే కాకుండ, మీ చర్మం కుడా నిగరింపు పొందుతుంది.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికీ ఇబ్బందే! ఇది హార్మోన్లనూ ప్రభావితం చేస్తుంది. అంతేకాదు దీని వల్ల గుండెజబ్బులూ, మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ కొవ్వును తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహార పదార్థాల ఎంపికలో జాగ్రత్త వహించాలి. 
  • కరోజులో మనం తినే ఆహారంలో పది గ్రాముల పీచు పద్దార్ధం (ఫైబర్) ఉండేలా చూసుకొంటే అంతర్గత కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం బీన్స్, పప్పుధాన్యాలూ, పండ్లూ, కాయగూరలూ, ఓట్స్ (అటుకులు), పొ్టుతీయని తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటూ రోజూకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే పీచు పదార్థాల కారణంగా ఏర్పడే గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదురుకావు.
  • దీనితో పాటు ప్రొటన్స్ అంటే మాంసకృత్తుల మోతాదు తగినంతగా ఉండేలా చూసుకోవాలి. రోజులో కనీసం వంద కేలరీల పోషకాలు ప్రొటన్ల నుంచి అందేలా జాగ్రత్త పడాలి. ఇవి నిదానంగా జీర్ణమై ఆకలిని అదుపులో ఉంచి కొవ్వు పేరుకోకుండా చూస్తాయి. ఇందుకోసం మీగడ తీసిన పెరుగూ, పాలూ, చేపలూ, గుడ్లూ తింటే మెరుగైన మాంసకృత్తులు అందుతాయి.
  • అలాగే యాపిల్, పుచ్చకాయ, దోసకాయ, ముల్లంగి, టొమాటో, క్యాబేజీ, చిలగడదుంప లలో పీచు పదార్ధలు ఎక్కువగా ఉంటాయి. మరియు కొవ్వు తక్కువగా ఉండి, యాంటి ఆక్సిడెంట్ల ఎక్కువగా ఉంటయి. వీటిని తినడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. ఓట్స్ (అటుకులు)తో  చేసిన పదార్థాలు కూడా పొట్ట దగ్గర కొవ్వును తగ్గిస్తాయి.



E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates

సన్నగా, నాజూగ్గా ఉండాలనే కోరుకుంటుటారు ఏవ్వరైన.  
almonds-బాదం

అనుకోకుండా పెరిగిన బరువుని వ్యాయామంతో తగ్గించుకోవడానికి ప్రత్యేకంగా సమయం కేటయించలేని వాళ్లు చాలమందే ఉంటారు. అలాంటి వాళ్లకి బాదం  మంచి ప్రత్యామ్నాయం. కొత్తగా చేసిన పరిశోధనలో ఈ విషయం తెలుస్తుంది.
  •  బరువుని తగ్గించడంలో బాదం ముందుంటుది. విటమిన్లూ, ఖనిజాలూ, ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వూ కలిగిన బాదం పలుకుల్ని తింటే కార్బోహైడ్రేడ్ లు ఎక్కువగా ఉండే పదార్థాలు తినాలన్న ఆసక్తి తగ్గుతుంది. ఇలా కొన్ని నెలల పాటూ కార్బోహైడ్రేడ్ ల వినియోగం తగ్గించగలిగితే అదనపు కొవ్వు దానికదే కరుగుతుంది. కొత్తగా కొవ్వు పట్టదు కూడా. కనుక రెండు రోజులకోసారి గుప్పెడు బదం గింజల్ని తింటూ ఉండండి.
  • వీటిల్లో మాంగనీస్, కాపర్, మెగ్నీషియం, బి- కాంప్లెక్సు విటమిన్లయిన నియాసిస్, బయోటిస్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తి పుట్టేందుకు సహకరిస్తాయి. దీనివల్ల శరీరం చురుకుగా ఉండి ఏదో ఒక పనిలో నిమగ్నమవుతారు. దీని వల్ల కెలొరీలు కరుగుతాయి. 
కనుక సాధారణ బరువుని మించి ఉన్నావారు బరువు తగ్గడానికి బాదం పలుకుల్ని వినియోగించుకోవచ్చు.


E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
వయసులో చిన్నావారిల కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోంటే అలాంటి అందాన్ని సొంతం చేసుకోవచ్చు... అవి 
40+ అందంగా కనిపిించాలంటే
  • చర్మం ఆరోగ్యంగాతాజాగా కనిపించాలంటే సబ్బు వాడకం తగ్గించాలి. బదులుగా క్లెన్సింగ్మాయిశ్చరైజింగ్ పద్ధతిని ప్రతిరోజూ పాటించాలి. సబ్బు ఎక్కువగా వాడడం వల్ల చర్మం పొడిబరుతుంది. అలా కాకుండా క్లెన్సింగ్ని వాడితే చర్మం తేమగా ఉంటుంది. వార్థక్యపు ఛాయలు కేవలం ముఖంపైనే కాదు.. చేతుల్లోనూ కనిపిస్తాయి. అందుకే మంచి క్రీమ్ ను చేతులకు రోజూ రాసుకోవాలి. ఎప్పటికప్పుడు మృత కణలను తొలగించాలి. నిమ్మరసంలో తగినంత ఉప్పు వేసి దాన్ని చేతులకు రాసుకోని, కాసేపయ్యాక పాత టూత్ బ్రెష్ తో రుద్దితే మృత కణలు తోలిగి చేతులలో నిగారింపు కనిపిస్తుంది.
  • ఎప్పటికప్పుడు కనుబొమల్ని షేప్ చేయించుకోవడం ఓ అలావాటుగా మార్చుకోండి. కళ్లు కూడా అందంగా కనిపిస్తాయి. ఎదుటిారి దృష్టి మీ ముఖంపై కన్నా కళ్లపై పడుతుంది. 
  • ద్రాక్ష పండ్లలో ప్రత్యేకంగా ఉండే పదార్థలు నీటిని సులువుగా స్వీకరిస్తాయి. ద్రాక్షను చర్మానికి రాసినప్పుడు అవి నీటిని స్వీకరించి, చర్మాన్ని తేమగా మారుస్తాయి. అందుచేత ద్రాక్ష పండ్లతో కుదిరినప్పుడల్ల ప్యాక్ వేసుకుంటే మంచిది. 
  • జుట్టు పలుచబడుతున్నప్పుడు ప్రత్యేక శ్రద్దతో మెరుగులు దిద్దుకోవాలి. లేత రంగు వేసుకోవడం, డీప్ కండిషనర్ షాంపు లాంటివి వాడడం. వీటి వల్ల జుట్టు పొడిబరే తత్వం తగ్గుతుంది. 
  • వారంలో కనీసం నాలుగుసార్లు, కుదిరితే అంతకన్నా ఎక్కువగా వ్యాయామం చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే కండరాలు దృఢంగా ఉంటాయి. ఆరోగ్యమూ సొంతం అవుతుంది. 
  • అలాగే కంటినిండా నిద్రపోవడం ఓ అలవాటుగా మార్చుకోండి.