Articles by "diabetics"
diabetics లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మధుమేహం ఉన్న వారికి కృత్రిమ తీపి పదార్థాలు (ఆర్టిఫీషియల్‌ స్వీటనర్స్‌) మంచివని భావిస్తూ చాలామంది వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు, ఇదంత మంచిది కాదు.

ఆస్పర్టేమ్‌, శాక్రీన్‌ వంటి కృత్రిమ తీపి పదార్థాలను ఏదో పాలు, కాఫీల్లో రుచికి కొద్దిగా కలుపు కొంటే పెద్దగా నష్టం ఉండదు గానీ వాటితోనే స్వీట్లు, బిస్కట్లు, బేకరీ ఉత్పత్తుల వంటివన్నీ చేసుకుని.. వాటిని పెద్ద మొత్తంలో తినటం వల్ల ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో ప్రస్తుతానికి చెప్పటం కష్టం. అవేవీ సహజమైనవి కావు, కృత్రిమ రసాయనాలు. వాటిపై జరిగిన అధ్యయనాలు ఇంకా స్పష్టంగా ఏమీ తేల్చకపోయినా సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవటమే మంచిదని గుర్తించాలి.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
పంచదార ఎక్కువ తింటే 'షుగర్‌' వస్తుందన్నది చాలామంది నమ్మే విషయం. కానీ ఇది వాస్తవం కాదు. 
షుగర్‌.. మధుమేహం అన్నది కేవలం పంచదార, తీపి పదార్థాలు ఎక్కువగా తినటం వల్లనే రాదు. మనం ఏం తీసుకున్నా శరీరంలో అది ముందు షుగర్‌ కింద మారి, వినియోగానికి వీలైన శక్తిగా (క్యాలరీల్లా) సిద్ధంగా ఉంటుంది. కానీ మనం ఎటువంటి శారీరక శ్రమా చెయ్యకుండా దాన్ని ఖర్చు పెట్టకపోతే, అది తనకు తానుగా కొవ్వుగా మారిపోయి శరీరంలో పేరుకుని, నిల్వ ఉంటుంది. దీనివల్ల బరువు పెరగటం, అది తెచ్చే దుష్ప్రభావాలు మొదలవుతాయి. అంతేగానీ పంచదార తింటే మధుమేహం వస్తుందని భావించటం సరికాదు. మధుమేహానికి మన జీవనశైలి, ఒత్తిళ్లు, జన్యువుల వంటివి ముఖ్యమైన కారణాలుగానీ పంచదార కాదు. అయితే ఒకసారి మధుమేహం వస్తే మాత్రం పంచదార, తీపి, స్వీట్ల విషయంలో పథ్యం తప్పదు. తీపి, కొవ్వు తక్కువగా తీసుకోవాలి.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
డయాబెటిస్ అన్ని అవయవాలను ప్రభావితం చేసినట్లే... పళ్లనూ చేస్తుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు గుండె, రక్తపోటు విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లే... పళ్ల విషయంలోనూ అంతే శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారికి రోగనిరోధకశక్తి తక్కువ . దాంతో నోటిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. పైగా చిగుళ్ల వ్యాధిలో నొప్పి తెలియదు. దీనికి తోడు డయాబెటిస్ ఉందంటే చిగుళ్ల వ్యాధులు వచ్చేందుకు అన్ని రకాల అవకాశాలుంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు నోరు, దంతాల విషయంలో ఎలాంటి జాగ్ర త్తలు పాటించాలన్న అవగాహన కోసం ఈ కథనం.

డయాబెటిస్ ఉన్నవారు డెంటిస్ట్ వద్దకు వెళ్లినప్పుడు తమకు డయాబెటిస్ ఉందన్న సంగతి తప్పనిసరిగా చెప్పాలి. డయాబెటిస్ కు వాడుతున్న మందులు, వ్యాధి నియంత్రణలో ఉన్నదా అన్న విషయం డెంటిస్ట్కు వివరించాలి. డయాబెటిస్ మందులతో పాటు వారు వాడే ఇతర మందులు అంటే రక్తాన్ని పలుచబార్చే మందుల వంటి వాటి వివరాలతో పాటు రోగి తాలూకు పూర్తి మెడికల్ హిస్టరీ ని వివరించాలి.

డయాబెటిస్ రోగుల్లో వచ్చే సాధారణ నోటి సమస్యలు...
  • తరచూ నోరు తడారిపోవడం: సాధారణంగా నోరు ఎప్పుడూ తడిగా ఉంటుంది. కానీ డయాబెటిస్ ఉన్నవారిలో మాత్రం నోరు పొడిబారిపోతూ ఉండటం చాలా సాధారణం. ఈ పరిస్థితిని ‘జీరోస్టోమియా’ అంటారు. ఇలా నోటిలో తగినంత లాలాజలం లేనప్పుడు బ్యాక్టీరియా అంతా ఒకచోట గూడుకట్టినట్లుగా పెరుగుతుంది. దీన్ని కాలొనైజేషన్ అంటారు. ఇలా జరగడం వల్లనే చాలామంది షుగర్ రోగుల్లో నోటి దుర్వాసన చాలా సాధారణం. ఇలా నోరు పొడి బారడం అన్నది దీర్ఘకాలం పాటు కొనసా గితే అది నోటిలోని మృదుకణజాలం (సాఫ్ట్ టిష్యూస్) దెబ్బతినేలా చేస్తుంది. దాంతో పాటు దంతక్షయం, పంటినొప్పి వంటి సమస్యలు వస్తాయి. జీరోస్టోమియా అనే సమస్య కాస్త వయసు పైనబడినవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో మరికాస్త ఎక్కువ. మనం తిన్న ఆహార పదార్థాలను గొంతులోకి సులువుగా జారుతూ వెళ్లేలా చేయడానికి లాలాజలం అవసరం. నోటిలో తగినంత లాలాజలం లేకపోతే పళ్లు పుచ్చిపోవచ్చు, చిగుళ్ల వ్యాధులతో పాటు మాట్లాడటంలో ఇబ్బంది, మింగలేకపోవడం, గొంతు బొంగురుపోవడం, నోటిలో మంట, ముక్కు పొడిబారడం వంటి సమస్యలు కూడా రావచ్చు. దీర్ఘకాలంపాటు నోరు పొడిబారిపోయినట్లుగా ఉండే చక్కెర రోగులు తప్పనిసరిగా దంతవైద్యులను కలవాలి. వారు నోరు పొడిబారకుండా ఉండేందుకు కొన్ని చికిత్సలు చేస్తారు. వాటితో పాటు కొన్ని పుక్కిలించే ద్రవాలు, ఫ్లోరైడ్ ఉండే పూతమందులను సైతం సూచిస్తారు. చక్కెర లేని గమ్స్, చక్కెర రహిత మింట్ వంటి వాటిని నములుతూ ఉండటం వల్ల నోటిలో తగినంత లాలాజలం ఊరుతుంటుంది. ఇక కొద్ది కొద్ది సేపటికి ఒకసారి చిన్న చిన్న గుటక వేస్తూ మంచినీళ్లు తాగడం కూడా మేలు చేస్తుంది. ఫ్రిజ్లోని ఐస్ ముక్కల ను తీసుకుని చప్పరించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక నోరు పూర్తిగా పొడిబారి పోయేవారు కాఫీ, కూల్ డ్రింక్స్ వంటి  కెఫిన్ ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ కాఫీ తాగే అలవాటు ఉంటే, చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి.
  • నోటికి రుచి తెలియకపోవడం: ఇంతకు ముందులా ఇప్పుడు తమ నోటికి రుచి తెలియడం లేదంటూ చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఫిర్యాదు చేస్తుంటారు. అందుకే వారు ఆహార పదార్థాలను మరింత రుచికరం చేసుకోవడం కోసం రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకుంటుంటారు. దాంతో వారి పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.  పైగా ఈ తరహా ఆహారం వల్ల నోటిలో మరింతగా బ్యాక్టీరియా చేరుతుంది. అది చేరుతున్న కొద్దీ దంతక్షయం, పంటినొప్పి వంటి సమస్యలూ పెరుగుతాయి. అందుకే రుచి తెలిసినా, తెలియకపోయినా ఆహారం విషయంలో డయాబెటిస్ రోగులు తమ పరిమితులను పూర్తిగా పాటించాలి. కార్బోహైడ్రేట్ ఆహారాన్ని, కొవ్వుపదార్థాలను పరిమితంగా తీసుకుంటూ, పుష్టికరమైన ప్రోటీన్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.
  • ఓరల్ క్యాండిడియాసిస్: ఇది నోటిలో వచ్చే ఒకరకం ఫంగల్ ఇన్ఫెక్షన్. నోటిలో డెంచర్స్ వాడేవాళ్లతో పాటు డయాబెటిస్ రోగుల్లోనూ ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ వ్యాధి వచ్చినవారు దంతవైద్యుల సలహా తో యాంటీ ఫంగల్ మందులను వాడాల్సి ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నవారు నోటి పరిశుభ్రతను పాటించడం అవసరం.
 అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నవారు సైతం ప్రతి ఆర్నెల్లకు ఒకసారి డెంటిస్ట్ను కలిసి క్లీనింగ్ వంటి సాధారణ ప్రక్రియలు చేయించుకోవాలన్నది దంతవైద్యులు చేసే సిఫార్సు. అలాంటిది ఒకవేళ డయాబెటిస్ కూడా ఉంటే వారు తరచూ దంతవైద్యనిపు ణులను కలిసి తమ పళ్లు పరీక్షింపజేసుకోవ డం చాలా అవసరం.

చక్కెరతో దంతాలపై ప్రభావం ఇలా...
మనం ఆహారం తీసుకున్నప్పుడు నోట్లో మిగిలి పోయిన ముక్కల నుంచి బ్యాక్టీరియా పెరిగి అది దంతాలపై పాచి (ప్లాక్)లా ఏర్పడుతుంది. మన ఆహారంలో తీపి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ గా ఉంటే ఈ బ్యాక్టీరియా పెరుగుదల మరీ ఎక్కువ. వాటి నుంచి యాసిడ్స్ తయారై, అవి పంటిపై దుష్ర్పభావం చూపడం వల్ల పంటి ఎనా
మిల్ దెబ్బతింటుంది. ఇది అదేపనిగా జరగడం వల్ల పంటి ఎనామిల్లో పగుళ్లు వచ్చి అవే పంటిలో ని క్యావిటీస్గా ఏర్పడతాయి. చక్కెర వ్యాధి అదుపులో లేనివారిలో బ్యాక్టీరియా మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. దాంతో పాచి కాస్తా ‘గార’ (టార్టార్)గా మారి చిగుళ్ల వద్ద, పంటికీ పంటికీ మధ్య దీర్ఘకాలికంగా ఉండిపోతుంది. అది అలా ఉండిపోవడం వల్ల క్రానిక్ (దీర్ఘ కాలిక) ఇన్ఫెక్షన్స్కు, ఇన్ఫ్లమేషన్కు దారితీయవచ్చు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ఎవరికైనా డయాబెటిస్ ఉన్నట్లు బయటపడగానే డాక్టర్లు కళ్లకు, కిడ్నీలకు, వాటితో పాటు గుండె వంటి ప్రధాన అవయవాలకు సంబంధించిన పరీక్షలు చేయిస్తుంటారు. చాలామంది రోగుల్లో ఒక సందేహం వస్తుంది. డయాబెటిస్ నిర్ధారణ జరిగాక... రక్తంలో చక్కెర పాళ్లను నియంత్రణలో ఉంచే మందులను ఇవ్వకుండా... వ్యాధి నిర్ధారణ తర్వాత అనేక పరీక్షలు ఎందుకు చేస్తారనే సందేహం వస్తుంటుంది. ఎందుకంటే...

అప్పటికి డయాబెటిస్ బయటపడిందంటే... అంతకుముందు ఎంతకాలం నుంచి అది ఉందో తెలియదు. కాబట్టి అప్పటికే అది కన్ను, మూత్రపిండాల వంటి వాటిని దెబ్బతీసిందా, తీస్తే ఏ మేరకో తెలుసుకోవడానికి ఆ పరీక్షలు చేస్తారు. ఒకవేళ దెబ్బతీసి ఉంటే, చెడిపోయిన మేరకు వదిలేసి, ఇకపై మరింత నష్టం జరగకుండా చూసుకోవడం కోసమే ఈ పరీక్షలు. ఒకనాడు షుగర్ వ్యాధి అంటే ఏ కొద్దిమందిలోనో కనిపించేది. కానీ ఇప్పుడు ఇంటికి కనీసం ఇద్దరు రోగులు ఉంటున్నారు. యాభై ఏళ్ల క్రితం మన జీవనశైలి అంతగా మారక మునుపు మధుమేహం తాలూకు ఆ లక్షణాలన్నీ ఒకప్పుడు విశ్రాంతిగా ఉండే ఆ కాలం నాటి ఏ కొద్దిమందిలోనో కనిపించేవి. అది కూడా వారి వృద్ధాప్య దశలో. కానీ 1970లలో వచ్చిన మార్పుల దుష్పరిణామాలన్నీ దాదాపు 40-50 ఏళ్లు గడిచాక చాలామందిలో... ఆ మాటకొస్తే మన ఇళ్లలోని కనీసం ఒక్కరు లేదా ఇద్దరిలోనైనా కనిపిస్తున్నాయి. పైగా అప్పట్లో వృద్ధాప్యంలో కనిపించే ఆ డయాబెటిస్ ఇప్పుడు 30 – 40 ఏళ్లకే కనిపిస్తోంది. చక్కెర వ్యాధి కలిగించే దుష్పరిణామాలు, అవి ఉన్నప్పుడు చేయించుకోవాల్సిన పరీక్షలపై అవగాహన కోసమే... ఈ వ్యాసం 

మన ఇళ్లలోనే కనీసం ఇద్దరు చొప్పున డయాబెటి్స రోగులున్నప్పటికీ... ఆ వ్యాధి వచ్చే వరకూ మనమేదో దానికి అతీతులమనుకుంటాం. తీరా వచ్చాక కూడా దానితో వచ్చే అనేక దుష్పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా అలాగే గడిపేస్తాం. తీరా అది ఆసుపత్రిలో పడేసేంతగా ప్రభావితం చేసి బెదిరిస్తే గాని అప్పటివరకూ మనం తగు జాగ్రత్తలు పాటించం. అందుకే డయాబెటిస్ గురించిన ప్రాథమిక అంశాల కంటే దానితో వచ్చే అనేక దుష్పరిణామాల గురించి తెలుసుకోవడం అవసరం. అప్పుడు డయాబెటిస్ రాని వారైతే, దాన్ని రాకుండా నివారించడం లేదా వచ్చే పరిస్థితులు ఉంటే వీలైనంత ఆలస్యం చేయడానికీ, ఒకవేళ అప్పటికే వ్యాధి వచ్చి ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుంది. డయాబెటిస్ రోగులకు వచ్చే దుష్పరిణామాలు డయాబెటిస్ రోగులకు ప్రధానంగా రెండు రకాల దుష్ప రిణామాలు సంభవిస్తాయి. అవి... 

అతి సూక్ష్మ రక్తనాళాలకు సంబంధించిన దుష్పరిణామాలు: వీటినే వైద్యపరిభాషలో మైక్రో వాస్క్యులార్ కాంప్లికేషన్స్ గా పేర్కొనవచ్చు. ఎందుకంటే వీటిలో అతి సన్నటి రక్తనాళాలు/రక్తకేశనాళికలు ఉండే శరీరభాగాలు దెబ్బతింటాయి. అంటే... ప్రధానంగా కళ్లు, మూత్రపిండాలు, నరాలు. 

మామూలు రక్తనాళాలు దెబ్బతినడంతో వచ్చే దుష్పరిణామాలు: వీటినే మ్యాక్రోవాస్క్యులార్ కాంప్లికేషన్స్ గా పేర్కొనవచ్చు. అంటే ఇందులో అతి సూక్ష్మ రక్తనాళికలు కాకుండా కాస్త పెద్దవి, ప్రధానమైనవే అయిన రక్తనాళాలకు సమస్యలు వచ్చి, వాటితో అనుసంధానమై ఉండే ప్రధాన అవయవాలు దెబ్బతింటాయన్నమాట. గుండె, మెదడు, కాళ్లూచేతుల్లో ఉండే పెద్ద రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవడంతోవచ్చే కొన్ని దుష్పరిణామాలివి. మైక్రోవాస్క్యులార్ దుష్పరిణామాలు అత్యంత సూక్ష్మ రక్తనాళికలు దెబ్బతింటే వచ్చే వ్యాధులు, వాటివల్ల ఏ మేరకు అవి నష్టపోయాయో తెలుసుకోవడం ఇలా...

డయాబెటిస్ రెటినోపతి:
రెటీనాకు కూడా రక్త సరఫరా అవసరం కాబట్టి, అతి పలుచని ఆ పొరకు సరఫరా అయ్యే రక్తనాళాలు అత్యంత సన్నగా ఉంటాయి. దాంతో చక్కెరతో చిక్కబారే రక్తం రెటీనాకు తగినంత సర ఫరా కాకపోతే రెటీనా దెబ్బతింటుంది. దాంతో దృష్టి కూడా మందగిస్తుంది. డయాబెటిస్ వల్ల రెటీనాకు వచ్చిన ఈ దుష్పరిణామాన్ని డయాబెటిస్ రెటినోపతి అంటారు. నిజానికి ఈ కారణంగా కనిపించే ఫలితాలు కనిపించక ముందు నుంచే ఈ దుష్పరిణామాలు మొదలైపోతాయి. కాబట్టి ఒకవేళ డయాబెటిస్ను కనుగొనగానే ఈ దుష్పరిణామాలు మొదలయ్యాయా లేదా చూడాలి. అందుకే డయాబెటిస్ ఉన్నట్లు తెలియగానే దృష్టికి సంబంధించిన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.

డయాబెటిస్ నెఫ్రోపతి:
రక్తంలోని మాలిన్యాలను తొలగించేందుకు ఉద్దేశించిన అతి సన్నటి రక్తనాళాలు మూత్రపిండాల్లో ఉంటాయి. రక్తంలోని చక్కెరపాళ్లు ఆ నాళాలపై దుష్ర్పభావాన్ని చూపితే మూత్ర పిండాల బాధ్యత అయిన వడపోత కార్యక్రమం దెబ్బతిని, మాలిన్యాలన్నీ ఒంట్లోనే ఉండిపోతాయి. దాంతో శరీర మంతా విషపూరితంగా మారిపోవడం వల్ల ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. అందుకే చక్కెర వ్యాధితో ఆ పరిస్థితి వచ్చే లోపే మూత్రపిండాలు ఆ మేరకు దెబ్బతిన కుండా జాగ్రత్తపడాలి. మూత్రపిండాలు శరీరానికి అవసరమైన మలినాలను మాత్రమే వేరు పరచి, శరీరానికి అవసరమయ్యే కొన్ని లవణాలు, ప్రోటీన్లు, సీరమ్ క్రియాటినిన్ వంటి పదార్థాలు ఉంటే వాటిని వేరుపరచకుండా అలాగే వదిలేస్తాయి. ఒకవేళ అవి మూత్రంలో కనిపించాయనుకోండి. అప్పుడు మూత్ర పిండాలు వాటి బాధ్యతలను సరిగా నెరవేర్చడం లేదని తెలుస్తుంది. ఆ పరీక్షల ద్వారా డాక్టర్లు కిడ్నీల పనితీరును అంచనా వేస్తుంటారు. ఉదాహరణకు మైక్రో ఆల్బుమిన్ యూరియా అనే పదార్థం మూత్రంలో కొంత పరిమితిలోనే ఉండాలి. ఒకవేళ మూత్రపరీక్షలో అది పరిమితికి మించి కనిపించిందనుకోండి. డాక్టర్లు దాన్ని బట్టి డయాబెటిక్ నెఫ్రో పతి అనే జబ్బు ఉన్నట్లు గుర్తించి, తగిన చికిత్సను, జాగ్రత్తలను సూచిస్తారు. 

డయాబెటిక్ న్యూరోపతి: 
కొందరిలో చేతుల్లోని నరాలు లాగినట్లుగా ఉండటం, చేతుల చివర్లు తిమ్మిరెక్కినట్లుగా ఉండటం, కొందరిలో అరుదుగా చివర్లు స్పర్శను కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి. అన్ని అవయవాల ను దెబ్బతీసినట్లే, చక్కెర నరాలపై కూడా దుష్ర్పభావం చూపడం వల్ల ఈ దుష్పరిణామాలు సంభవిస్తాయి. కొన్ని సార్లు ఈ దుష్పరిణామాలతోనే కొందరిలో డయాబెటిస్ బయటపడుతుంది. ఒకవేళ ఇలాంటి పరీక్షలే చేయకపోతే ఒక్కోసారి వ్యాధి ముదిరిపోయి, తిమ్మిర్లు పట్టే శరీరభాగం కుళ్లి (గ్యాంగ్రీన్గా మారి) ఆ అవయవాన్నే తొలగించాల్సిన పరిస్థితి రావచ్చు.

మ్యాక్రోవాస్క్యులార్ దుష్పరిణామాలు

కరోనరీ ఆర్టరీ డిసీజెస్ (గుండెజబ్బు లు):
డయాబెటిస్ ఉన్నవాళ్లకు నొప్పి పెద్దగా తెలియదు. గుండెనొప్పి కూడా తెలియదు. దాంతో లక్షణాలను పసిగట్టి, అవి గుండెజబ్బులని తెలుసుకునేలోపే జరగాల్సిన ప్రమాదం జరగవచ్చు. అందుకే డయాబెటిస్ ప్రభావం గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళాలపై పడి, అక్కడ రక్తపుగడ్డల అడ్డంకి (బ్లడ్ క్లాట్స్)తో గుండెపోటు వంటివి వచ్చే అవకాశాలున్నాయా అని అంచనా వేయడం కోసం ఏడాదికోసారైనా ఈసీజీ తీయించుకుంటూ ఉండాలి. దీంతోపాటు రక్తంలోని కొవ్వులపాళ్లను అంచనావేసే లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలూ చేయించుకుంటూ ఉండాలి.

హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు): 
కొన్ని కారణాలు మన సాధారణ రక్తపోటును మరింత అధికం చేస్తాయి. దాంతో అధిక రక్తపోటు (హైబీపీ) వచ్చే అవకాశాలున్నాయి. స్థూలకాయం, నెఫ్రోపతి, డయాబెటిస్ రోగులకు ఇలా అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువన్నమాట. అందుకే అధిక రక్తపోటు ఉందా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి మూడు నెలలకూ ఓసారి బీపీ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ అధిక రక్తపోటు ఉంటే, ఆ ఒత్తిడికి అసలే చాలా సూక్ష్మంగా ఉండే మూత్రపిండాల్లోని రక్తనాళాలు చిట్లే ప్రమాదం ఉంది. అందుకే నిత్యం బీపీని పరీక్షించుకుంటూ ఉండటంతో పాటు, ఒకవేళ ఉన్నా లేకపోయినా, అధిక రక్తపోటుకు కారణమయ్యే ఉప్పును వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది.

పెరిఫెరల్ వాస్క్యులార్ డిసీజ్:
రక్తంలో చక్కెరపాళ్లు అధికమైనప్పుడు అది మరింత చిక్కగా మారి కొన్ని క్లాట్స్ ఏర్పరుస్తుందని, ఒకవేళ అవి మెదడు రక్తనాళాల్లో ఏర్పడితే స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయన్న విషయం తెలిసిందే. మరి ఒంట్లో అన్నిచోట్లా రక్తనాళాలు విస్తరించి ఉంటాయి. వాటిల్లో రక్త ప్రవాహం ఉంటుంది. కాబట్టి అక్కడ ఇలాంటి ప్రమాదం ఉండదా... అంటే అక్కడా ఉండే అవకాశం ఉంది. కాకపోతే మెదడు చాలా కీలకం. శరీరం లోని అన్ని భాగాలను నియంత్రిస్తుంటుంది కాబట్టి స్ట్రోక్కు ఇచ్చిన ప్రాధాన్యం, మిగతా భాగాలకు మనం వెంటనే చూపం. అయితే అదే పరిణామం మిగతా శరీర భాగాలకూ, ముఖ్యంగా కాళ్లూ, చేతుల్లోని రక్తనాళాల్లో సంభవిస్తే, అది సరఫరా చేసే శరీర భాగాలు మొద్దుబారిపోయి, గాంగ్రీన్ కు (కుళ్లిపోవడానికి) గురవుతాయి. దానికి ముందు అక్కడ శరీర భాగంలో పుండు పడటం (అల్సర్) వంటి లక్షణాలూ కనిపిస్తాయి. అది గాంగ్రీన్ గా మారి, ఇక చివర్లో ఆ భాగాన్ని తొలగించడం మినహా మరో మార్గం ఉండకపోవచ్చు. 
ఇలా శరీర భాగాన్ని తొలగించాల్సిన పరిస్థితిని ఆంప్యుటేషన్ అంటారు. ఇలా చేస్తే గాని మిగతా ఆరోగ్యకరమైన శరీర భాగాన్ని రక్షించుకోలేని పరిస్థితుల్లో ఈ గత్యంతరం లేని చర్యకు ఉపక్రమిస్తారు డాక్టర్లు. అందుకే శరీర భాగాలన్నింటికీ సరిగా రక్తం సరఫరా అవుతుందో లేదో తెలుసుకోడానికి ‘యాంకిల్ బ్రాకియల్ ఇండెక్స్’(ఏబీఐ) అనే పరీ క్షను నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే కాళ్లూ, చేతులకు సరైన రీతిలో, సరైన ఒత్తిడితో రక్తసరఫరా జరుగుతోందో లేదో తెలుసుకునేందుకు సైతం డాప్లర్ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి దీన్ని డాక్టర్లు నిర్వహిస్తారు. ఇందులో విలువ 0, 9 కంటే తక్కువగా ఉందంటే ఆయా అవయవాలకు రక్తసరఫరా తక్కువగా ఉందన్నమాట. అప్పుడు అవసరాన్ని బట్టి డాప్లర్ పరీక్ష చేయాల్సి ఉంటుంది. లక్షణాలు కనిపించడానికి ముందే దుష్పరిణామాలు సంభవించే అవకాశం ఉన్నందున ఈ పరీక్షలు చేయించడం అవసరం. 

అందుకే ఈ పరీక్షలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చిన్న పరీక్షతో చింతలన్నీ దూరం... రక్తంలో చక్కెర పాళ్లు పెరుగుతున్నాయా లేదా నిర్ధారణ చేయడానికి ఒక చిన్న పరీక్ష చాలు. అదే... హెచ్ బి ఏ1సీ. దీనిలో విలువ 6.5 నుంచి 7 శాతం మధ్యలో ఉందంటే చక్కెర పాళ్లు అదుపులో ఉన్నట్లే. అందుకే ప్రతి మూడు నెలలకోసారి ఈ పరీక్ష చేయించుకుంటే నిర్భయంగా ఉండవచ్చు.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
సాధారణంగా వయసు పైనబడిన వారిలో రక్తంలో క్యాల్షియం, విటమిన్-డి తక్కువగా ఉండం వల్ల ఒంటి నొప్పులు, ఎముకలు, కండరాలకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్య మధుమేహుల్లో కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తుంటుంది. కాబట్టి మధుమేహులు విటమిన్-డి, క్యాల్షియం కోసం డాక్టర్ సలహాతో మందుల్ని ఎక్కువ కాలమే వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల సమస్య ఏమీ ఉండదు.
ఎలా గుర్తించాలి? 
ఇతరత్రా ఏమైనా కారణాలతో ఛాతీ, కీళ్లు, తుంటికి సంబంధించిన ఎక్స్-రే తీసినప్పుడు ఎముకలు అరిగిపోయే, విరిగిపోయే లక్షణాలు కనిపిస్తాయి. ఎముకలు మామూలుగా ఉండాల్సిన దాని కన్నా పలుచగా, సన్నగా, పెళుసు గా కనిపిస్తే ఆస్టియో పొరోసిస్ గా అనుమానించాలి. శరీరంలో క్యాల్షియం, విటమిన్-డి తగ్గం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. ఇలాంటి వన్ని మధుమేహ బాధితుల్లో ఎక్కువగా జరిగే అవకాశం వుంది. అందుకనే, వైద్యులు ఇలాంటి మందుల్ని ముందు జాగ్రత్తగా సూచిస్తారు. ఆస్టియో పొరోసిస్ సమస్య ఉండేవారిలో 65 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కడైనా జారిపడితే తుంటి ఎముక విరిగి పోయే ప్రమాదం ఉంది కాబట్టి, ముందస్తుగానే ఎక్స్-రే ద్వారా ఆస్టియోపొరోసిస్ తలెత్తే అవకాశం ఉన్నట్లు గుర్తించి, మందులు వాడితే మంచిది. ఇక పోతే.. మధుమేహం ఉన్నవారు, రక్తంలో షుగర్ స్థాయి పరీక్షించుకుంటూ, దానిని నియంత్రణలో ఉంచుకోవటానికి వైద్యుల సలహాతో ప్రత్యేకించి మందులు వాడడం కూడా అవసరమే.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
గర్భిణులకు మధుమేహం వస్తే కాన్పు తర్వాత  తగ్గిపోవచ్చు. అయితే, కాన్పు తర్వాత అయిదేళ్లు లోపు కనీసం సగం మందిలో మధుమేహం శాశ్వతంగా వచ్చేస్తుంది. ఒకసారి గర్భంతో ఉన్నప్పుడు మధుమేహం వచ్చిందంటే, తర్వాతి అయిదేళ్లలో డయాబెటిస్ వచ్చే అవకాశం 50 శాతం ఉంటుంది. ఇతరత్రా మధుమేహుల మాదిరిగానే ఆహార నియమాలు, వ్యాయామాలు వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణుల్లో మధుమేహం వచ్చినప్పుడు, కాన్పు తర్వాత ప్రతి నెల రక్తపరీక్ష చేయించు కుంటుండాలి. అయిదేళ్లలో వస్తుందిలే అనే నిర్లక్ష్యం పనికి రాదు. ఏ నెలల్లో రక్తంలో గ్లూకోజ్ ఎక్కువవుతుందో తెలియదు కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడమే శ్రేయస్కరం.

గర్భధారణలో వచ్చిన మధుమేహం అలాగే ఉండిపోయింది. అందుకని, ఆహార, వ్యాయామాల నియమాలు పాటిస్తూనే, మందులూ వాడడం శ్రేయస్కరం. ప్రస్తుత కాలంలో నిరంతరం మందులు వాడుతుండాల్సిందే. కొంతకాలం పాటు మానేసి చూద్దామనే ధోరణి ఎంతమాత్రం సరికాదు. ప్రస్తుతం వైద్య నిపుణులంతా సూచిస్తున్నదేమింటే, డయాబెటిస్ ను నియంత్రించే మందుల్ని ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిది. 25 ఏళ్లు లోపు మధుమేహం వచ్చిన గర్భవతుల్లో ఇన్సులిన్ తోనే నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది. 25 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చిన వారిలో మధుమేహం ఉంటే గర్భిణిగా ఉన్నప్పుడు ఇన్సులిస్ తీసుకున్నా, కాన్పు తర్వాత మాత్రలతో నియంత్రించుకునే అవకాశం ఉంది. కానీ, 25 ఏళ్లు లోపే వచ్చి ఉంటే మాత్రం ఇన్సులిన్ తో మెట్ఫార్మిస్ వంటి మందులూ వాడుతూ ఆ తర్వాత రక్తంలోని స్ధాయిన్నిబట్టి ఇన్సులిస్ నిలిపి వేసే అవకాశాన్ని పరిశీలించవచ్చు. తర్వాత తర్వాత రెండుమూడు నెలల వరకూ రక్తంలో గ్లూకోజ్ తగ్గుతుంటే ఇన్సులిస్ ఆపేసి మందులు మాత్రమే వాడొచ్చు. గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంటే మాత్రం ఇన్సులిన్ ను కొనసాగించాలి.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
పదేళ్లకు పైగా మధుమేహం బారిన పడిన వారు గ్యాంగ్రిస్ విషయంలో ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. గ్యాంగ్రిస్ ఏర్పాడ్డాక జాగ్రత్తలు తీసుకుందాం, ముందు నుంచీ ఎందుకనే ధోరణి మధుమేహులకు పనికిరాదు. మధుమేహులు సూది మొన గుచ్చుకున్నా, గాజు పెంకు కోసుకున్నా, మట్టి పెడ్డ నొక్కుకున్నా, ఇలాంటి ప్రతి చిన్న గాయమూ గ్యాంగ్రిన్ కు దారితీసే అవకాశం ఉంటుందన్న అతి జాగ్రత్తతోనే ఉండాలి. ఎంత చిన్న గాయం తగిలినా, గ్యాంగ్రిస్ అవుతుందా, లేదా? అని ఆలోచిస్తూ ఎదురు చూడడం కన్నా గ్యాంగ్రిస్ అవుతుందనే
భావించి ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

గ్యాంగ్రిస్ లక్షణాలు
గాయం/పుండు గ్యాంగ్రిన్ గా మారుతోందనటానికి సంకేతం.. అక్కడ నలుపు రంగు వస్తుండడమే. అంటే.. గాయమైన చోట ఉండే కణాలన్నీ మరణిస్తున్నాయని అర్థం. మిగతా గాయాల్లో అక్కడ ఉండే కణాలు చనిపోయినా చీము రూపంలో బయటికి వచ్చేస్తూ, కొత్త కణాలు ఏర్పడుతుంటాయి. గాయాల్లో ఎరుపు, పసుపు రంగు కనిపిస్తుంటుంది. నల్లగా మారదు. అదే గ్యాంగ్రిన్ లో నలుపు రంగు వస్తుంటుంది. అయితే, ఇక్కడ మీరు గుర్తించుకోవలసినది ‘‘గాయం ఒకసారి నలుపు రంగులో కనిపించిందంటే, అప్పుడు చికిత్సగా పెద్దగా చేసేదేమీ ఉండదు’’. నల్లగా మారిన ప్రాంతాన్నంతా తొలగించాల్సి ఉంటుంది. అది మామూలుగా మారే అవకాశం ఉండదు. అందుకని, ఏ చిన్న గాయమైనా నలుపు రంగులోకి మారక ముందే జాగ్రత్త పడాలి. ప్రతి చిన్న గాయమూ గ్యాంగ్రిన్ అవుతుందేమోనని అనుమానించి, గాయం తగిలిన వెంటనే జాగ్రత్త పడుతూ చికిత్స తీసుకోవాలి.

కాబట్టి డయాబెటీస్ ఉన్నవారిలో అరికాలికి కలిగిన గాయం గ్యాంగ్రిన్ మారే అవకాశాలే ఎక్కువ. అంతే కాకుండా, మధుమేహ చికిత్సలో బాగంగా మందులు వాడినంత మాత్రాన గ్యాంగ్రిస్ తగ్గుతుందనేదేమీ లేదు. దీనికి ప్రత్యేక చికిత్స తీసుకోవాలి. ఏదైనా గాయం గ్యాంగ్రిన్ గా మారుతుందనే అనుమానం ఉంటే, మధుమేహానికి మాత్రలకన్నా ఇన్సులిన్ తీసుకోవడం మంచిది. మధుమేహుల్లో ఒకకాలికి గాయమై, పుండు పడిందంటే, అక్కడ రక్తప్రసరణ జరగడం లేదని గుర్తించాలి. అలాంటి వారిలో శక్తిమంతమైన యాంటీ బయాటిక్స్ మందులు నోటిద్వారా తీసుకున్నా వాటి ప్రభావం గాయం వరకూ చేరదు. అందుకని ఇంజక్షన్ రూపంలోనే తీసుకోవడం మంచిది. ఇంజక్షన్ తీసుకున్నంత కాలమే గాయమైన చో ఇస్ఫెక్షస్ రాకుండా అడ్డుకోవడం సాధ్యమతుంది. అందుకని, దీర్ఘకాలం పాటు  తీసుకోవాల్సి ఉంటుంది. గాయం దగ్గరి చీమును కల్చర్ పరీక్ష చేసి దాని ప్రకారం యాంటిబయాటిక్స్ మందుల్ని డాక్టర్ సలహాతో తరచూ మార్చాల్సిన అవసరమూ ఉంటుంది. కాలికి కట్టు కట్టినప్పుడు రోజూ రుద్దడం, నల్లబడిన చోట సొంతంగా కోయటానికి ప్రయత్నించం వంటివి చేయకూడదు. ఇది సర్జన్లు మాత్రమే చేయాలి. స్పిరిట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, బోరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ ఆసిడ్ వంటివి వేయకూడదు.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మధుమేహం ఉన్నారు రక్తదానం చేయడంలో తప్పే మీ లేదు. మధుమేహం ఉన్నవారిలో రక్తహీనత వంటి లక్షణాలు ఉంటే మాత్రం రక్తదానం చేయకూడదు. డయాబెటిస్ ఉన్నంత మాత్రాన రక్తదానం చేయకూడదనేదేమీ లేదు. మధుమేహులకు రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన, ఆ గ్లూకోజ్ తో కలిసిన రక్తాన్ని మరో వ్యక్తికి ఎక్కించినప్పుడు వారికి మధుమేహం రావడం గానీ, ఇతరత్రా ఇబ్బందులు రావడం గానీ జరగదు
 
. అదేవిధంగా మధుమేహం ఉన్నారు రక్తదానం చేస్తే, వారికీ ఎలాంటి నష్టం ఉండదు. ఇది అసలు సమస్యే కాదు.
మామూలుగా రక్తదానం చేసినప్పుడు 300-500 మి.లీ. వరకూ రక్తం సేకరిస్తారు. మన శరీరంలో ఉండే 5-6 లీటర్ల రక్తంలో మనం మధుమేహ నియంత్రణ కోసం వేసుకునే మందులు కొన్ని స్వల్ప మిల్లీ గ్రాముల పరిమాణంలోనే ఉంటాయి. ఇలా అతితక్కువ పరిమాణాల్లో ఉండే మాత్రలు, ఇన్సులిన్ రక్తంలో కలిసి, మరింత పలుచగా మారిపోతాయి. అందువల్ల రక్త గ్రహీతల్లో వీటి ప్రభావం ఎంతమాత్రం ఉండదు. కాబట్టి మధుమేహ నియంత్రణ కోసం రోజూ మందులు, ఇన్సులిస్ తీసుకుంటున్న వారుకూడా నిరభ్యంతరంగా రక్తదానం చేయవచ్చు.