Articles by "beauty tips"
beauty tips లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
  • అందంగా కనిపించడానికి మీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం ఆరోగ్యంగా లేకపోతే ఆ ప్రయత్నమంతా వృథానే. అందుకే రోజూ చర్మాన్ని తాజాగా ఉంచేల చూసుకోవాలి. రాత్రిళ్లు ముఖాన్ని మంచి క్లెన్సర్తో శుభ్రం చేసుకోవాలి. దానివల్ల మురికీ, జిడ్డూ పోతాయి. ఆ వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అప్పుడే చర్మం మృదువుగా మారుతుంది.  
  • మొటిమలతో ఇబ్బంది పడుతుంటే, సొంతంగా ప్రయోగాలు చేయకుండా నిపుణుల సలహా తీసుకోవడం చాల అవసరం. కొందరు అవి కనిపించకుండా మొటిమలున్న చో మందంగా ఫౌండేషన్ రాస్తారు. దానివల్ల టీనేజీలో ఉండే సహజ అందం తగ్గుతుంది. అందుకే కన్సీలర్ వాడి, తరాత ఏదయినా పౌడరు రాసుకోవాలి. కన్సీలర్ని కూడా కేవలం అద్దుకోవాలి.  
  • ఆకర్షణీయంగా కనిపించేందుకు మేకప్ అవసరమే. అయితే కాలేజీ వయసులో అది అతిగా ఉండకూడదు. మేకప్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అనుకున్నప్పుడు పెదాలకు కొద్దిగా లిప్ స్టిక్ రాసుకుంటే చాలు. ఒకవేళ డార్క్ లిపస్టిక్ వేసుకోవాలనుకుంటే ముఖానికి వేసుకునే మేకప్ తక్కువగా ఉండేల చూసుకోవాలి. 
  • ఫ్యాషన్లకు ప్రాధాన్యం ఇచ్చి డ్రయార్ లు, కర్లింగ్, ఫ్లాట్ ఐరన్లు వాడకపోవడమే మంచిది. అవి జట్టుకు హానిచేస్తాయి. జట్టుని సాధ్యమైనంత వరకూ తేమగా ఉంచుకుంటే చాలు, అందంగా కనిపిస్తుంది. ఒకవేళ జట్టు మరీ పొడిబరి కనిపిస్తుంటే, వారానికోసారి కండిషనింగ్ తప్పనిసరి. ఆలీవ్ నూనెను పావుకప్పు తీసుకుని గోరువెచ్చగా చేసి తలకు రాసుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో కడిగేసుకోవాలి. ఈ చిన్న ప్రయత్నం జుట్టుకు మంచి పోషణనందిస్తుంది. 


E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
అమ్మాయిలు సన్నగా కనిపించాలనుకుంటురు. ఆ క్రమంలో తెలియకుండానే ఆహారం తీసుకునే విషయంలో పొరపాట్లు చేస్తారు.  అలా కాకుండా ఈ చిన్ని చిన్న సలహాలు పాటించి అందంగా మరియు ఫిట్ గా ఉండండి.
  • కాలేజీ వయసులో అమ్మాయిలు వ్యక్తిగత ఆరోగ్యంపైనా దృష్టిపెట్టాలి. ఎందుకంటే ఏళ్లు గడిచే కొద్దీ ఎముకల్లోని క్యాల్షియం తగ్గిపోతుంది. ఆ మార్పు కౌమారం నుంచే మొదలవుతుంది. అందుకే కెలరీలు, ఫ్యాట్ అని కాకుండా రోజుకో గ్లాసు పాలు తాగాలి. ఓ అరటిపండు తిన్నా మంచిదే.  
  • బరువు పెరుగుతున్నారా?దానికి కారణమేంటో గుర్తించండి. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి. స్నేహితులు ఎంత బలవంతం పెట్టినా ఫాస్ట్ ఫుడ్ పాయింట్ లకు వెళ్లకపోవడమే మంచిది. ద్రవ పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి.  
  • అతిగా డైటింగ్ చేయడమూ మంచిది కాదు. కెలరీలు తగ్గడంపై దృష్టి పెడుతున్నామనుకుంటరు కానీ, దానివల్ల పోషకాలను కోల్పోతారు. అందంపైనా ప్రభావం పడుతుంది. నెలసరీ సరిగ్గా రాకపోవచ్చు. అందుకే తక్కువ కెలరీలున్న ఆహారాన్ని తీసుకుంటూనే బరువు తేగ్గల చూసుకోవాలి.  
  • వ్యాయామం చేయాలి కానీ అతిగా కాదు. శరీర బరువును బట్టి రోజుకు అరగంట నడిస్తే సరిపోతుంది. ఒక్కరూ వెళ్లడం విసుగనిపిస్తే, స్నేహితులతో కలిసి గ్రూప్ గా వెళ్ళవచ్చు.


E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
కళ్ల కింద నల్ల చారలొస్తే చాల ఇబ్బందిగా ఉంటుంది. వీటిని తొలిదశలోనే గుర్తించి తగిన చర్యలు చేసుకుంటే అవి తగ్గు ముఖం పట్టే అవకాశం వుంది. వాటిని తగ్గించడానికి ఇంట్లోనే చేసుకోగల చిట్కాలు....

  • నల్ల చారలు తగ్గించడం కోసం టొమాటో జ్యూస్ చాల బాగ ఉపయోగపడుతుంది. టొమాటోలోని ఔషధ గుణాలు శరీరం మీద ఉన్న నల్ల మచ్చల్ని తొలగించేందుకు సహాయపడతాయి. ఈ జ్యూస్‌తో మర్దన చేసుకున్న తర్వాత ఇరవై నిమిషాలకు నీటితో శుభ్రం చేసుకుంటే నల్ల చారలు తగ్గే అవకాశం వుంది.

  • మార్కెట్‌లో నిత్యం అందుబాటులో ఉండే తాజా కీర దోసను తీసుకుని అప్పటి కప్పుడు ముక్కలుగా కోసి కాసేపు కళ్ల మీద ఉంచుకుంటే మంచిది
  • కీర దోస రసాన్ని తీసి కళ్ల కింది నల్ల చారలకు పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే కోంత ఉపశమనం లభిస్తుంది.
  • దోస రసంలో బంగాళదుంప రసాన్ని కలిపి ఇలాగే చేయవచ్చు. దీనివల్ల కూడా నల్ల చారల సమస్య తగ్గుతుంది.
  • ఆరెంజ్ జ్యూస్ జ్యూస్‌లో కాస్త గ్లిజరిన్ కలిపి వారానికి మూడుసార్లు రాసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది.
  • మార్కెట్‌లో దొరికే ఆల్మండ్ ఆయిల్ చక్కటి ఔషధం. జుట్టుకు మాత్రమే కాదు. కళ్ల కింద నలుపు చారల్ని వదిలించుకునేందుకు ఈ నూనెను వాడుకోవచ్చు.
వీటితో పాటు మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడం, కంటి నిండా నిద్రపోవడం, సమతులాహారాన్ని తీసుకోవడంతో పాటు వీలైనన్ని మంచి నీళ్లను తాగితే కళ్ల చారల సమస్య నుంచి బయట పడవచ్చు

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates

అందమంటే కేవలం ముఖసౌందర్యమే కాదు. చేతులు, పాదాలు కూడా అందంగా ఉండాలి. కాని చాలామంది మహిళలు వాటి అందానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. వారి నిర్లక్ష్యం వల్ల తరువాత చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలా కాకుండా కొద్దిపాటి జాగ్రత్తతో పాదాల అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం ఎలాగో తెలుసుకుందాం. వీటి సంరక్షణ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు....
  • పాదాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. 
  • గోరువెచ్చని నీటితో సబ్బుతో శుభ్రం చెయ్యాలి. 
  • వేళ్ల మధ్య సబ్బునీటితో కడగాలి. తరువాత బాగా ఆరబెట్టాలి.  అవసరమయితే డ్రయ్యర్ ఉపయోగించవచ్చు. 
  • చర్మం రంగు మారడం, ఆనికాయలు, పగుళ్లు వంటివి ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. 
  • భోజనం చేసే ముందు, తరువాత, బయట తిరిగి వచ్చిన తరువాత, పడుకోబోయే ముందు పాదాలను చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. 
  • ఇంటికి వెళ్లిన వెంటనే పాదరక్షలు తీసివేయాలి. 
  • మరీ ఎక్కువగా కడగడం వలన పాదాలలోని సహజనూనెలు పోతాయి. 
  • ఈతవల్ల, పాదాలకు కాళ్లకు మంచి వ్యాయామం కాలికండరాలు పటిష్టమవుతాయి. 
  • పాదాలు మరీ చల్లగా ఉంటే రక్తప్రసరణ నెమ్మదిగా జరుగుతుంది. అందువలన పాదాలు ఎప్పుడే వెచ్చగా ఉంచడం మంచిది. 
  • అతివేడి, అతిచల్లని, అతికఠిన ప్రదేశాలపై నడవవద్దు. 
  • పొగతాగితే, పాదాలకు రక్తప్రసరణ సరిగా జరగదు. 
  • శరీర బరువు తగ్గించుకుంటే పాదాల శ్రమ తగ్గుతుంది. 
  • పిక్కలను, కాళ్లను చాచడం ద్వారా పాదాల శ్రమ తగ్గుతుంది. కాలి కండరాలు విశ్రాంతిగా ఉంటాయి. 
  • బాగా ఎక్కువగా నడవడం వల్ల పాదాలు అలిసిపోతే కొద్దిగా నూనె, సబ్బుపొడి గోరువెచ్చని నీటిలో వేసి, దానిలో పాదాలను కొద్దిసేపు ఉంచాలి. 
  • రెండు చెంచాల ఆలివ్నూనెకి, కొంచెం ఉప్పు కలిసి స్నానానికి ముందు పాదమర్దన చేస్తే మంచిది. 
  • ఎక్కువదూరం నడిచినప్పుడు మధ్యలో కాళ్లు చాచడం, ముడవడం, విదిలించడం, చెప్పులు లేదా షూస్ తీసి పాదాలకు గాలి తగిలేలా చెయ్యడం మంచిది. 
  • బరువులను మోసేటప్పుడు, ఎత్తు పల్లాలలో నడుస్తున్నప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మధ్యమధ్యలో ఆగి పాదాలకు విశ్రాంతినివ్వాలి. 
  •  కాళ్లు ముడుచుకుని లేక పీఠం వేసుకుని ఎక్కువసేపు కూర్చోకూడదు. అందువలన కాళ్లకు, పాదాలకు రక్తప్రసరణ సరిగా జరగదు. నొప్పి కలిగిస్తాయి. 
 
  • మడమ లేదా పాదం ముందుభాగంపై మొత్తం శరీర బరువు ఆనకుండా బేలన్స్ గా నడవాలి. నేలపై కూర్చొన్నప్పుడు చెప్పులపై కూర్చోవడం మానుకోవాలి. సాధ్యమైనంతవరకు లిఫ్ట్ వాడవద్దు. మెట్లు ఎక్కుతూ వెళ్లడం మంచిది. ఇందువలన కాళ్లకు రక్తప్రసరణ సరిగా జరుగుతుంది. 
  • గోరువెచ్చని నీటిలో ఎప్సమ్ సాల్ట్ వేసి దానిలో పాదాలు మునిగేలా ఉంచితే కీళ్లనొప్పులు తగ్గుతాయి. 
  • వెల్లుల్లి నూరి ఆనెల మీద ఉంచితే నొప్పి తగ్గుతుంది. 
  • రాత్రి పడుకోబోయే ముందు మూడు చెంచాల నిమ్మరసం, రెండు చెంచాల గ్లిజరిన్ కలిపి మర్దన చేస్తే పాదాలు మృదువుగా, అందంగా ఉంటాయి. 
  •  కాలి పగుళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు స్క్రాపర్ ఉపయోగించాలి. 
  •  పాదాలు శుభ్రం చేసి మసాజ్ క్రీమ్తో రుద్దితే రక్తప్రసరణ బాగా జరిగి పాదాలు హాయిగా ఉంటాయి. 
  • వేపాకు ముద్ద అరికాళ్లకి రాస్తే బాగా నిద్రపడుతుంది. 
  • పాదాలను పదినిముషాలు పాలతో మర్దన చేసి, నిమ్మచెక్కతో తోమి, శుభ్రం చేస్తే నాజూకుగా ఉండే మీ పాదాలు మీకు ఆశ్చర్యం కలిగిస్తాయి. 
  • పాదాలు పగిలితే స్పూన్ మామిడిబంకను నీళ్లతో అరగతీసి రాస్తే పగుళ్లు తగ్గి నాజూకుగా ఉంటాయి. 
  • మూడు గరిటెల తేనెలో స్పూన్ నువు్వల నూనె కలిపి కొద్దిగా వేడిచేసి, పాదాలకు రాస్తూ పొడిగా ఉండడం, పగుళ్లు తగ్గుతాయి. 
  • ఆముదంలో కొద్దిగా పసుపు కలిపి, ఉదయం, సాయంత్రం పాదాలకు మర్దన చేస్తే పగుళ్లు తగ్గుతాయి. 
  • మూడు గరిటెల తేనెటీగల మైనానికి, 3స్పూన్ల నువు్వలనూనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని పగుళ్లపై రాయాలి. 
  • తరువాత ఆవునెయ్యి విడిచి విడిచి రాయడం వల్ల పొడిగా ఉండే పాదాలు, పగుళ్లు నయమవుతాయి. 
  • శరీరభాగాలకు, అవయవాలకు సంబం ధించిన అరవై అయిదు కేంద్రాలు పాదాల్లో ఉన్నాయి. పాదమర్దన చేయడం వల్ల ఆయా భాగాలన్నీ ఉత్తేజితమవుతాయి. శరీరమంతా ఆరోగ్యంగా ఉంటుంది. పాదాల్లోని ఒక్కో భాగంపై ఒత్తిడి కలిగిస్తే ఆ భాగం ఆరోగ్యవంతమవుతుంది. దీనిని ఆక్యుప్రెజర్ అంటారు. దీనికోసం ప్రత్యేకమయిన జోళ్లు వాడటం మంచిది. 
  • పాదరక్షలు లేకుండా నడవడం చాలా మంచిది. గ్రామాల్లో ఉండే మన పూర్వీకులు చెప్పులు లేకుండా నడిచేవారు. పాద సంబంధమైన వ్యాధులు వారికి వచ్చేవి కావు. 
  • సహజసిద్ధమైన నడకల వల్ల గాలి, నేల మొక్కలు వంటివి తగిలి పాదాల్లోని నరాలు ఉత్తేజితమవుతాయి.
  • చిన్నపిల్లల కాళ్లు ఎదగాలంటే చెప్పులు వాడకపోవడం మంచిది. 
  • మెత్తటి సోల్స్ వల్ల ఎత్తుపల్లాలోను, ఎగుడు,దిగుళ్లలోను నడిచినా అపాయముండదు. 
  • ఉత్తపాదాలతో నడిస్తే బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎథ్లెట్స్ ఫుట్ రాదు

బీస్ ఇఛ్: 
శుభ్రమైన గుడ్డను, త్రిఫలచూర్ణం లేక నీటిలో ముంచి పాదాల్ని శుభ్రం చెయ్యాలి. ఆరనివ్వాలి. దూదితో తుడిస్తే త్వరగా ఆరుతుంది. వెంటనే తేనె, నెయ్యి రాయాలి. వెంటనే నయమవుతుంది. వేపాకులు, నువు్వల ముద్దను గాయంపై వేసి కట్టుకట్టాలి.

ఆనెలు: 
ఒక వెల్లుల్లిపాయను నేతితో కాని, అలాగే కాని, నిప్పులపై పెట్టి బంగారం రంగు వచ్చే వరకు వేయించాలి. దానిని ఆనెల ఉంచి కట్టాలి. ఒక్కొక్క ఆనెకు ఒక్కొక్క వెల్లుల్లి వాడాలి. ఇలా రోజుకోసారి ఆనెలు పోయేదాకా చెయ్యాలి.
చెమట కార్చే పాదాలు
ఎక్కువ చెమట పడుతున్నప్పుడు పాదాలను పొడిగుడ్డతో తుడిచి ఆరబెట్టాలి. కారన్ స్టార్చ్ పైన రాయాలి.
దుర్వాసన వెలువరించే పాదాలు
ఒక వెడల్పైన పాత్రలో రెండు చెంచాల షాంపూ వెయ్యాలి. దానిలో గోరువెచ్చని నీరుపోసి, శుభ్రమైన చేతులతో దానిని కలపాలి. ఆ పాత్రలో పాదాల్ని ఐదునిముషాలుంచాలి. పుదీనా ఆకులు వేస్తే సువాసనిస్తాయి.
పాదాల శ్రమ తగ్గించడానికి 
  • కాసేపు వెచ్చని నీటిలో పాదాలు ఉంచి, మర్దన చేస్తే పాదాలకు రక్తసరఫరా బాగా జరిగి సేదదీరుతాయి.


  •  ఎక్కువగా పాదాలు నీటితో తడుస్తున్నప్పుడు వేళ్ల మధ్య ఒరుపులు వస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే పొద్దుటే లేవగానే కొద్దిగా కొబ్బరి నూనెలో పసుపు కలుపుకుని పాదాలకు పట్టించాలి. ఒరుపులు వచ్చాక కూడా పసుపు బాగా పనిచేస్తుంది.

  • కాళ్లకు పారాణి రాసినప్పుడు పసుపు, సూక్ష్మజీవుల నుండి పాదాలను రక్షించడానికి, అందలి కాల్షియం పగుళ్ల నివారణకు తోడ్పడుతుంది.

  • గోరింటాకు, నూనెవేసి ఉడికించి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమం రాస్తే కాలివేళ్ల ఒరుపులు మానతాయి.

  • గోరింటాకును మెత్తగా నూరి కొద్దిగా వెనిగర్తో కలిపి పాదాలకు రాస్తే పాదాల మంటలు తగ్గుతాయి.

  • గోరింటాకును మెత్తగా దంచి రసం తీయాలి. దానిలో కొద్దిగా నిమ్మరసం, గ్లిజరిన్ కలిసి కాలిపగుళ్లపై రాస్తే పగుళ్లు తగ్గుతాయి.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates



  • పొడి చర్మం అనగా పొరలు పొరలుగా ఉండటం, అలాంటి వారికి మేకప్ సరిగ్గా ఇమడదు. వాళ్లు నీరు ఎక్కువ త్రాగటం అవసరం. దాని సంగతి పక్కనపెడితే ఎక్కువ నీటి పరిమాణం ఉన్న మాయిశ్చరైజర్‌లను ఉపయోగించండి.  
  • మీ కళ్లు ఉబ్బినట్టు ఉన్నాయా? నల్లటి చారలు మిమ్మల్ని బాధపెడుతుంటే కీరదోసకాయని బద్దలుగా కత్తిరించి కళ్లమీద పెట్టుకుని పావుగంట ఉంచుకోండి. కళ్లకు, మెదడుకు ఉపశమనంతో పాటు చారలు, ఉబ్బుడు పోతుంది. బైటికెళ్లేముందు, మేకప్ ముందు చేస్తే ఇంకా చాలా ఫ్రెష్ గా కనబడతారు.

  • కొంత మందికి పెదాలపై పొరలు పొరలుగా మృతకణాలుంటాయి. పొడి బారి ఉంటాయి. అలాంటి వారు పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పెదాలు మృదువు గా లేత కొబ్బరిలా ఉంటాయి. పెట్రోలియం జెల్లీని చేతితో కాకుండా బ్రషుతో తుడవండి.

  • జిడ్డు చర్మం కలవారు పొర ఏర్పడే విధంగా మేకప్ చేసుకోకండి. మేకప్‌పై గీతలు పడి మేకప్ వేసుకున్నా అందము పాడయిపోవచ్చు. అలాంటి వాళ్లు ఆయిల్ లెస్ మాయిశ్చరైజర్లు ఉపయోగించండి. విటమిన్'' ఉన్నవి వాడండి.

  •  ఐ షాడో కారణంగా ఫౌండేషన్ పాడవకుండా చూసుకోండి. ఐ షాడో రాసుకొనేటప్పుడు లూస్ పౌడర్ ని కళ్ల క్రింద రాసుకోండి. అలా చేయటం వల్ల క్రింద పడిపోయే ఐ షాడోను పట్టి ఉంచుతుంది. మేకప్ పూర్తి అయ్యాక మేకప్ బ్రషుతో పౌడర్ను తొలగించుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఫౌండేషన్ ఐ షాడో కారణంగా పాడవకుండా ఉంటుంది.

  •  మేకప్ వేసుకోవటానికి, ఐ మీన్ రెడీ అవ్వటానికి ఎప్పుడూ మీ హ్యాండ్స్ ను ఉపయోగించవద్దు. బ్రష్లు వాడటం అలవాటు చేసుకోండి. మేకప్లో ఎంత మార్పు వచ్చిందో మీరే తెలుసుకుంటారు. అన్నింటికీ బ్రష్లు దొరుకుతాయి.

  •  మీ చర్మానికి తగ్గ కలర్ ఫౌండేషన్ ఎన్నుకోబోయే ముందు మీ ముఖంపై దవడలపై ఫౌండేషన్ కొంచెం వ్రాయండి. అది మీ చర్మానికి సరిపోయిందో లేదో తెలుసుకుంటారు. చర్మం రంగులో కలిసిపోతే ఆ కలర్ ఫౌండేషన్ కొనండి.

  • మస్కారా ఇంట్లో ఉంది కదాని పాతవన్నీ అనగా సమయము అయిపోయినవి వేసుకోకండి. అలాగే మస్కారా హాండెల్ అంటే చిన్న పుల్లను పైకి కిందకు లాగకండి. అలా చేయటం వల్ల మస్కారా ట్యూబ్‌లోకి గాలి ప్రవేశించి మస్కారా త్వరగా పొడిబారిపోతుంది. మస్కారా మొద్దుబారిపోయినా మూడు నెలలు దాటినా వాడకండి.

  •  వయస్సుని వెనక్కి తిప్పండి. చర్మపు ముడుతల వల్లే నిగారింపు, యవ్వనం, అందంమటుమాయ మౌతాయి. వయసుతో సంబంధం లేకుండా కేవలం కేర్ తీసుకోకపోవటం వల్లే ఇది జరుగుతుంది. కొంత మందిని కొన్ని సందర్భాల్లో చూసి అమ్మ, కూతుళ్లా, అక్కాచెల్లెళ్లా అనుకుంటారు. దానికి కారణం కేర్. ఆ పోషణ మీరు తీసుకుంటే మీరు అక్కా చెల్లెళ్లలానే ఉండొచ్చు మీ అమ్మాయితో. 
  •  రోజు ఏదో ఒక సమయంలో అయిదారు చుక్కలు నిమ్మరసం తీసుకోవటం వల్ల చర్మంపై మచ్చలు వయస్సు ప్రభావం వల్ల వచ్చే చర్మ ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు.

  • ముఖం మీద ముడతలున్న వారు గింజలు లేని ద్రాక్షను తీసుకుని దాన్ని రెండు భాగాలుగా చేసి వాటిని వేళ్లతో ముడతలు ఉన్నచోట రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగి, బాగా గాలికి ఆరనిస్తే ముడతలు క్రమేణ తగ్గుతాయి


E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మీరు బోర్లా పడుకొని నిద్రపోతుంటరా? ముఖాన్ని దిండకేసి నొక్కుతూ పడుకునే అలవాటుందా? అయితే ముఖంపై మడతలు పడుతున్నాయేమో, చర్మం సాగిపోతోందేమో ఓసారి చూసుకోండి. ఎందుకంటే బోర్లా పడుకునేవారికి ఇలాంటి సమస్యలు పొంచి ఉంన్నట్లు నిపుణులు చెబుతున్నారు. రోజూ ముఖాన్ని దిండుకు నొక్కుతూ పడుకుంటే దాని ఒత్తిడి, ఘర్షణ మూలంగా చర్మంపై ముడతలు పడే ప్రమాదముంది. దిండు చర్మం నుంచి నూనెలను పీల్చుకోవం వల్ల తేమా తగ్గుతుంది. ముఖం చర్మంలోని సన్నటి నారలు (కొల్లజెస్) దెబ్బతింటాయి. సింథటిక్ వస్ర్తాల మీద చర్మం రుద్దుకోవం వల్ల మెటిమలు వచ్చే అవకాశమూ ఉంది. కాబట్టి ముఖం అందంగా కనబడాలంటే వెల్లకిల పడుకోవడం మంచిది. మనం పడుకునే విధానాలు కూడా ముఖంపై మడతలు పడటనికి కారణమవుతాయి. పక్కలకు తిరిగి పడుకునే వారికి చెంపలు, గదమలపై మడతలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక దిండుకు ముఖం ఆనించి బోర్లా పడుకునేవారికి నుదురుపై మడతలు ఎక్కువ. రాత్రుళ్లు వీలైనంత త్వరగా పడుకొని పెందలడే లేవడం కూడా చర్మం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీంతో రోగనిరోధశక్తి స్ధాయిలు స్థిరంగా ఉండి చర్మం, వెంట్రుకలు మెరుగ్గా ఉంటాయి. అలాగే రాత్రిపూట ఏడు గంల పాటు నిద్రపోవడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడకుండా, నల్లబడకుండా (పిగ్మెంటేషస్) ఉంటుంది. బోర్లా పడుకోవం వల్ల ఒక్క చర్మం మాత్రమే కాదు.. జీర్ణ ప్రక్రియ కూడా అస్తవ్యస్తమవుతుంది. కాబట్టి వెల్లకిల పడుకోవం అన్నింటికన్నా ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.


E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
పొడి చర్మం:
చర్మంలో తేమ లేకపోవడమే చర్మం పొడిగా కనిపించడానికి కారణం. చర్మం ఎండినట్లు, తాకితే కరకుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ చర్మం ఉన్న వాళ్లు తరచూ క్లెన్సర్ క్రీమ్ తో ముఖంపై రుద్ది, నీటిలో తడిపిన కాటన్ బల్ తో ముఖాన్ని తుడుస్తు ఉండాలి. ఇలా చేస్తే పట్టిన చెమట, మురికి, బ్యాక్టీరియాలు క్లీన్ చేయాబడతాయి. పొడిచర్మం కోసమే తయారుచేసిన టోనర్ నా ముఖానికి రాస్తూ ఉండాలి. విటమిస్ ఇ తో కూడిన మాయిశ్చరైజింగ్ క్రీమ్ ని ఎక్కువగా రాస్తూ ఉండాలి.

జిడ్డు చర్మం:
చర్మ రంధ్రాల నుంచి ఎక్కువ శాతం నూనె ఉత్పత్తి అయిపోవడం వల్ల జిడ్డుగా కనిపిస్తాం. దీని వల్లే బ్లాక్ హెడ్స్, మెటిమలు త్వరగా వచ్చేస్తాయి. ఇలంటి వాళ్లు ముఖాన్ని ఔషధ గుణలున్న సబ్బులతో లేదా నాస్ ఆల్కలైన్ సబ్బులతో శభ్రం చేసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు స్క్రబ్ తో పట్టిన మురికిని, జిడ్డుని తొలగించాలి. లేకుంటే చర్మగ్రంథులు మూసుకుపోతాయి. ఆయిల్ కాకుండా నీటితో తయారు చేసిన మాయిశ్చరైజర్లు వాడాలి.

కాంబినేషస్ స్కిస్ :

ముఖంపై కొన్ని చోట్ల  పొడిగా, కొన్నిచోట్ల జిడ్డు పడితే అలాంటి చర్మతత్వాన్ని కాంబినేషస్ స్కిస్ అంటారు. ఇలంటి వాళ్లు ముఖంపై ఏ బాగం పొడిగా మారుతుందో అక్కడ మాయిశ్చరైజర్ ని వాడాలి. జిడ్డు చర్మం దగ్గర నాస్ ఆల్కలైస్ సబ్బులు ఉపయోగించాలి. గులాబి నీళ్లతో తయారుచేసిన టోనర్ ఈ చర్మతత్వం వాళ్లకి బాగా ఉపయోగపడుతుంది.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
చాలామంది ఇంట్లోనే తలకు రంగు (హెయిర్ డ్రై) వేసుకుంటూ ఉంటారు. కాని సరైన జాగ్రత్తలు పాటించ కపోతే చర్మసమస్యలు ఎదురవ్వవచ్చు. 
అందుకని... జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు అది చర్మానికి తగలకూడ జాగ్రత్తగా వేసుకోవాలి.

ముందుగా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్ లేదా నూనె రాసుకొని తర్వాత డై వేసుకోండి. తలంటుకు నేటప్పుడు కూడా డై చర్మానికి తగలకుండా జాగ్రత్తపడాండి.
అలాగే డైఎంపికలో నాణ్యత విషయంలో రాజీ పడకండి.
ఇక జుట్టు మంచి వాసన రావాలంటే హెయి సీరమ్ లేదా హెయిర్ స్ప్రేలను వాడవచ్చు. అయితే ఈ సీరమ్స్, స్ప్రేలు మాడుకు, జుట్టు కుదుళ్లకు తగలకుండా జాగ్రత్తగా వాడండి లేదంటే వీటిలో ఉండే గాఢ రసాయనాలు వెంట్రుక కుదురును దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి.


E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
బ్యూటీపార్లర్ లో ఫేసియల్ చేసేటప్పుడు ముఖానికి ఆవిరిపట్టడం (స్టీమ్) చూస్తుంటాం.

అయితే ఆవిరి ఎంత సమయం పట్టాలి? ఎలా పట్టాలి? అసలు ఆవిరిపట్టడం వల్ల ఉపయోగాలేమిటో ముందు తెలుసుకుంటే మనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి.
  • ముఖచర్మానికి దగ్గరగా ఆవిరి వేడి తగలకూడదు. షవర్ బాత్ చేసేటప్పుడు నీరు ఎంత దూరం నుంచి పడుతున్నాయో అంత దూరం నుంచి ఆవిరి చర్మానికి తగలాలి. లేదంటే చర్మం తన సహజత్వాన్ని కోల్పోవడానికి ఆవిరి ప్రధాన కారణం అవుతుంది.
  • ఐదు నిమిషాలకుమ ఇంచి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలను ఒకేలా ఉండవు. అందుకని అందరికీ ఒకేవిధంగా ఆవిరిపట్టడం సరైన విధానం కాదు. దీని వల్ల చర్మంలోని పోర్స్ తెరుచుకని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంధులు పొడిబారుతాయి. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం అవుతుంది.
  • ఆవిరి పట్టిన తర్వాత క్లెన్సర్ తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల పోర్స్ లో ఉన్న మలినాలు తొలగిపోతాయి.
  •  పొడిగా ఉన్న మెత్తని టవల్తో తర్వాత ముఖాన్ని తుడుచుకోవాలి. ఆవిరిపట్టిన తర్వాత కొంతమంది చర్మం మరీ పొడిబారినట్టుగా అనిపి స్తుంది. అందుకని ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి.
  • ఆవిరిపట్టడం అనేది సున్నితమైన ప్రక్రియ. చర్మతత్వం తెలుసుకుని, దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ ఇచ్చే నిపుణుల చేతనే ఫేసియల్ చేయించుకోవడం, స్టీమ్ పట్టడం చేయడం మేలు.