Articles by "beauty"
beauty లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
కొంతకాలం క్రితం వరకు అసలు పెళ్లిళ్లంటే ముక్కుపుడక లేకుండా జరిగేవే కాదు.. కొన్ని చోట్ల ఇప్పటికీ ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. అయితే కేవలం పెళ్లిళ్లనే కాదు. వేరే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా చక్కని ముక్కుపుడక పెట్టుకోవడం వల్ల చుక్కల్లో చందమామల వెలిగిపోతారు. కేవలం సంప్రదాయమైన దుస్తుల మీదే కాదు, చుడీదార్, జీన్స్ వంటి అవుట్ ఫీట్స్ మీద వేసుకోవడానికి కూడా ముక్కుపుడక అందంగా కనిపిస్తుంది. అందుకే కాబోలు. ఇటివల మన తారలంతా ఎక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్లైనా ముక్కు పుడకలతో ప్రత్యక్షమైపోతున్నారు. ఆ మధ్య కేన్స్ అవార్డ్ ఫంక్షన్ లో విద్యాబాలన్, సోనమ్ కపూర్ ముక్కు పుడగ తో మెరిసారు. యశ్ చోప్రాకు నివాళులర్పిస్తూ బాలీవుడ్ నటమణులంతా నిర్వహించిన క్యాట్వాక్లో కూడా రాణీముఖర్జీ ముక్కుముడకతో మెరుపులు మెరిపించింది. ఇక మన టాలీవుడ్ హీరోయిన్ల పని చెప్పే పనే అవసరం లేదు... ఎక్కడ లేటేస్ట్ ఫ్యాషన్ కనిపించినా దాన్ని వెంటనే ఫాలో అయిపోయే మన అమ్మాయిలు హీరోయిన్లను ఫాలో అవుతూ ముక్కు పుడకకు సలాం అంటున్నారు.. మరి మనమూ ఈ సరికొత్త పాత ఫ్యాషన్పైన ఓ లుకేద్దామా..?
ముక్కుపుడక
ముక్కుపుడక లేదా ముక్కెర ఒక విధమైన ముక్కుకు ధరించే ఆభరణము. ముక్కుపుడక ధరించడం సంపంగి లాంటి ముక్కుకు కొత్త వింత అందాన్ని ఇస్తుంది. అనేక ప్రాంతాలలో ముక్కుపుడక పెళ్ళి అలంకారాలలోనే ఎక్కువగా కనిపిస్తుంది.
  • ముక్కుపుడక అంటే మహిళలకు ఎంత మక్కువో తెలియాలంటే పురాణాలలోని ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు. భామాకలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్లనంటుంది. విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంకెబెందెలు దొరికినంత సంతోషం గా శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయబారం నడుపుతుంది.
  • అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం. తాళిబొట్టు మాదిరిగానే వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం కొందరు తీయరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు. పూర్వకాలం భార్య పెట్టుకున్న ముక్కుపుడక బరువు, సైజు, డిజైన్ భర్త ఆర్థిక స్తోమతను తెలిపేవిగా ఉండేవి. రాజుల వంశానికి చెందిన మహిళల ఆభరణాల్లో ఒకటి నుండి 17 వరకు వివిధ రత్నాలు ఉన్న ముక్కుపుడకలు ఎన్నో ఉండేవి.
  • పూర్వకాలంలో ఏడేళ్ళ వయసులోనే ముక్కు కుట్టించి బంగారుతీగ చుట్టించేవారు. పెరిగిన తర్వాత దాన్ని తీసి రాళ్ళు పొదిగిన పుడకలు పెట్టేవారు. ఎంత పేదవారైనా దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకుంటారు. దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువగా కుడివైపు పెడితే, ఉత్తరాదిన మాత్రం ఎడమవైపు పెడుతుంటారు. ఈ ప్రస్తుతకాలంలో కూడా పెద్ద ముత్యపు ముక్కెరను మరాఠీ మహిళలు చాలా ఇష్టంగా ధరిస్తారు. కొందరిలో ఇది దాదాపు గడ్డం వరకు వస్తుంది.


ఇప్పుడు పెళ్ళికాని అమ్మాయిలు కూడా ముక్కుపుడకను ఇష్టంగా ధరిస్తున్నారు. బంగారు పుడక నుంచి వజ్రపు ముక్కుపుడక వరకూ, రింగులు కూడా ధరించడం ఫ్యాషన్ గా మారింది. దానితో సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకూ అందరూ దీనిని ఇష్టంగా ధరిస్తున్నారు. ప్రముఖ క్రీడాకారిణి సానియా మిర్జా దీనిని మార్చకుండా ధరిస్తుంది. ప్రపంచ సుందరి పోటీల్లో వజ్రపు ముక్కుపుడకతో ఐశ్వర్యా రాయ్ అందరినీ ముగ్ధుల్నిచేసిన విషయం తెలిసిందే.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ముఖం, కళ్లు, పాదాలు ఇలా అన్ని బాగాల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాం కానీ, పెదవుల విషయం వచ్చే సరికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించరు. మరి, ఎర్రెర్రని మృదువైన అధరాలు మన సొంతం కావాలంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి ఇది చదవండి.
మేకప్ వేసుకోవడంలో బాగంగా లిపి స్టిక్ లు ఎంత అప్లై చేసినా సహజంగా పెదవులు బాగుంటేనే లుక్ కూడా బాగుంటుంది. సహజంగా మృదువైన అధరాలు సొంతం కావాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. అవి.....
  • పెదవులు నిర్జీవంగా కనిపించడానికి అసలు కారణం పెదాలపై ఏర్పడే మృతకణాలే. ఫలితంగా పెదవులు తేమని కోల్పోయి పెళుసుగా మారిపోయి డల్ గా కనిపిస్తాయి.
  • కోమలమైన, మృదువైన పెదవులు పొందడానికి అతి సులువైన చిట్కా ఒకటుంది. అదేంటంటే.. రోజూ బ్రస్ చేసేప్పుడు కేవలం నోటి లోపలి బాగాలపైనే కాకుండా పెదాలపై కూడా గుండ్రంగా, మృదువుగా బ్రష్ తో రుద్దడం వల్ల మృతకణాలు తొలగిపోవడంతో పాటు తాజాగా కనిపిస్తాయి.
  • అలాగే కొబ్బరినూనె లేదా లవంగం నూనె తో మృదువుగా మర్దన చేసినా పెదవులు తాజాగా కనిపిస్తాయి.
  • తేనె, పంచదార కలిపి కూడా అధరాల్ని ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ఈ రెంటినీ కలిపి పెదవులపై మృదువుగా మర్దనా చేయండి చాలు. తేనె పెదాలు కోల్పోయిన తేమని తిరిగి తెస్తాయి, పంచదార మృతకణాల్ని తొలగించి పూర్వపు రంగుతో మెరిసేల చేస్తుంది. మిశ్రమంలో తేనెకి బదులు నిమ్మ రసం కూడా వాడుకోవచ్చు. నిమ్మ పెదవుల నలుపుని పోగొట్టి ప్రకాశవంతంగా, మెరిసేల చేస్తుంది.
  • నిద్రపోయే ముందు పొడి బారిన పెదవులకి పెట్రోలియం జెల్లీ రాసుకోండి. దీని వల్ల రాత్రంతా పెదాలు మాయిశ్చరైజ్ అవుతాయి.
  • పెట్రోలియం జెల్లీ వాడకుండా అధరాలకి సహజంగా తేమని అందివ్వాలనుకుంటున్నారా.. అయితే పెదాలపై తేనె లేదా ఆముదం రాసినా మంచి ఫలితం ఉంటుంది.
  • అధరాలు సహజ కాంతితో మెరుస్తూ ఉండాలంటే.. బాదంని మించింది లేదు. బాదంని మిశ్రమంల చేసి పెదాలపై రాసుకోండి. ఇందులో ఉండే విటమిన్ పెదవులు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది.
  • కొంతమంది ఏ మాత్రం ఒత్తిడిగా అనిపించినా, దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నా పెదాల్ని తెగ కొరికేస్తూ ఉంటారు. దీనివల్ల పెదాలు పొడి బారిపోతాయి. అందమైన పెదవులు సొంతం కావాలనుకుంటే ఇలాంటి అలవాట్లని దూరం చేసుకోవాలి.
  • సూర్య కిరణాల ప్రభావం చర్మం మీదే కాదు.. పెదవుల పైనా పడుతుంది. అందుకే పెదవుల్ని కూడా సూర్యరశ్మి బారి నుంచి సంరక్షించుకోవాలి.
  • అలాగే తగినన్ని నీళ్లు తాగకపోతే చర్మమే కాదు.. పెదవులు కూడా పొడిగా, కాంతివిహీనంగా కనిపిస్తాయి. పెదవులకి కొత్త కళ రావాలంటే రోజుకి కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలి. అప్పుడే పెదాలు పొడి బారకుండా ఉంటాయి.

మృతకణాలు తొలగాలన్న ఉద్దేశంతో పెదాలపై అదే పనిగా రుద్దడం కూడా మంచిది కాదు. అలానే మర్దనా కూడా మృదువుగా చేయాలి. పెదాలు పగిలి ఉంటే డైరెక్ట్గా కాటన్ తో పెదాలు తుడవడానికి వాడకూడదు. దానికి బదులు కాటన్ వస్ర్తాన్ని ఉపయోగించాలి. అలా డైరెక్ట్గా వాడితే కాటన్ పెదాల మధ్య ఉండిపోతుంది. అలాగే మృతకణాలు తొలగించిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవడం తప్పనిసరి. 
 చిట్కాలన్నీ పాటిస్తే గులాబీ లాంటి లేత అధరాలు తప్పకుండా మన సొంతమవుతాయి.


E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
జుట్టుని మెరిపించాలంటే ఇంట్లో పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి.  అవి
  • మార్కెట్లో దొరికే అన్ని షాంపూలూ, కండిషనర్లూ మీ జుట్టు కి సరిపడక పోవచ్చు. జుట్టుకి సరిపడే ఉత్పత్తుల్ని ఎంచుకుని వాటినే వాడుతూ ఉండాలి. రకరకాల ఉత్పత్తులు వాడడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది.
  • వర్షంలో తడిసిన తర్వాత తలకి స్నానం చేసే వాళ్లు చాల తక్కువ. కానీ స్నానం చేయకపోవడం వల్ల జుట్టు మొదళ్ల దగ్గర తడి ఉండిపోయి వాసన వచ్చేస్తుంది. ఇది చుండ్రుకు కారణం అవుతుంది. కాబట్టి వానలో తడిశాక తలస్నానం చేయాలి.
  • రాత్రి పడుకునే ముందు మరీ గట్టిగా జడ వేసుకోకుండా కాస్త వదులుగా జుట్టుని వదిలేయాలి. 
  • అసలు దువ్వకుండా వదిలేయడం, లేదంటే తరచూ దువ్వుతూ ఉండడం ఈ రెండూ జుట్టు ఎదుగుదలకు మంచివి కావు.
  • ఎక్కువ మంది నూనె రాయకుండా వదిలేస్తారు. వారానికోసారి నూనె రాసుకుంటేనే మంచిది. అప్పుడప్పుడూ నిమ్మరసంతో శుభ్రపరిస్తే జుట్టు మృదువుగా మారుతుంది. మంచి మెరుపొస్తుంది.


E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
నేడు మార్కెట్లో ఎన్నో రకాల సౌందర్య సాధనాలు వచ్చాయి. చాలామందికి ఏ కాస్మొటిక్‌ దేనికి ఉపయోగిస్తారో తెలియదు. ఏవి కొనాలో తెలియక సతమతమవుతుంటారు. ముఖ్యమైన కాస్మొటిక్స్‌ వివరాలు 


మాయిశ్చరైజర్‌: ఇది పొడిసహజ చర్మం గలవాళ్లు వాడాలి. దీనిని ఉపయోగించడం వల్ల చర్మం ముడతలు పడదు.
కోల్డు క్రీమ్‌: దీనిని శీతాకాలంవర్షాకాలంలో ఉపయోగించాలి.
ఆస్ట్రింజెంట్‌: ఇది జిడ్డు చర్మం కలవాళ్లు ఉపయోగించాలి. దానిని వాడితే చర్మంలో ఉన్న ఆయిల్‌ కంట్రోల్‌ అయి ఫ్రెష్‌గా ఉంటుంది.
క్లెన్సింగ్‌ లోషన్‌: దీనిని ఉపయోగించడం వల్ల చర్మంలో ఉన్న మురికి వచ్చేస్తుంది. దీనిని అన్ని చర్మాల వాళ్లు ఉపయోగించవచ్చు. మేకప్‌ని దీనితో తొలగించవచ్చు.
కేలమైన్‌ లోషన్‌: దీనిని అన్ని కాలాలలో ఉపయోగించవచ్చు. ముఖ్యంగా వేసవికాలంలో చర్మాన్ని ఈ ఎండబారి నుండి రక్షిస్తుంది.
షాంపూలు:  షాంపూలు ఎన్నిక చేసుకునేటప్పుడు కండిషనర్‌ కల షాంపూలు ఎన్నుకోవాలి. 

  • డాండ్రఫ్‌కి:  డాక్టర్ల సలహా మీద యాంటీ డాండ్రఫ్‌ షాంపూ ఉపయోగించాలి.

సోప్‌లు: 

  • ఆయిలీస్కిన్‌ వాళ్లు సిమ్‌, మార్గోవేస్‌గల సోప్‌లు వాడాలి. 
  • యిలీస్కిన్‌ వాళ్లకి ప్రత్యేకించి సోప్‌లు వస్తున్నాయి. అవి వాడాలి. 
  • డ్రైస్కిన్‌ వాళ్లు గ్లిజరిన్‌ బేస్‌గల సోప్‌లు వాడాలి. 
  • పియర్స్‌ లాంటివి డ్రైస్కిన్‌ వాళ్లకి ప్రత్యేకించి  సోప్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. అవి వాడాలి.
  • నార్మల్‌ స్కిన్‌ వాళ్లు శాండల్‌ సోప్‌లు లావెండర్‌ సోప్‌లు వాడాలి. 
  • సెన్సిటివ్‌ స్కిన్‌వాళ్లు బేబీసోప్‌ వాడాలి.
  • మొటిమలు గలవాళ్లు: యాక్నేసోప్‌లు, హెర్బల్‌సోప్‌లు వాడాలి.
  • చర్మసంబంధమైన సమస్యలు: మెడికేటెడ్‌ సోప్‌ వాడాలి, హెర్బల్‌ సోప్‌ వాడాలి


no image
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ప్రకృతి సిద్ధ ఔషధం వేప. ఇది చర్మ సంరక్షణకు ఎంతో మేలు చేస్తుంది. ఓ యాబై వరకు వేపాకుల్ని తీసుకుని రెండు లీటర్ల నీటిలో వేసి, అవి రంగు మారే వరకూ మరిగించాలి. ఆ నీటిని చల్లర్చి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ వేప నీళ్లని రోజూ వంద మి.లీ చొప్పున బెకట్ నీటిలో కలుపుకుని స్నానం చేయాలి. ఇల రోజూ చేస్తే, చర్మ ఇస్పెక్షన్లూ, మెటిమలూ, వైట్ హెడ్స్ లాంటివి రావు. ఈ నీళ్లని స్కిన్ టోనర్లగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ వేప నీటిలో దూదిని ముంచి దాంతో రాత్రి పడుకోబోయే ముందు ముఖాన్ని బాగా తుడుచుకుని పడుకోవాలి. ఇలా చేస్తే మెటిమలూ, మచ్చలూ, బ్లక్ హెడ్స్ లాంటివి రాకుండా ఉంటాయి. ఆ నీటితో తలకి స్నానం చేస్తే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.  కొంచెం నీటిలో పది వేపాకుల్నీ, కొన్ని నారింజ తొక్కల్నీ వేసి మరిగించాలి. చల్లరాక వాటిని పేస్టుల చేయాలి. వాటికి కొంచెం తేనె, పెరుగూ, సోయా పాలూ కలిపి ఆ ముద్దని ముఖానికి రాసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చర్మ సమస్యలు చాలా మటుకు తగ్గిపోతాయి. 


E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ఏ చర్మానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సలహలు 
పొడిచర్మం: 
చర్మంలో తేమ లేకపోవడమే చర్మం పొడిగా కనిపించడానికి కారణం. చర్మం ఎండినట్లు, తాకితే కరకుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ చర్మం ఉన్న వాళ్లు తరచూ క్లెన్సర్ క్రీమ్ తో ముఖంపై రుద్ది, నీటిలో తడిపిన కాటన్ బల్ తో ముఖాన్ని తుడుస్తు ఉండాలి. ఇలా చేస్తే పట్టిన చెమట, మురికి, బ్యాక్టీరియాలు క్లీన్ చేయాబడతాయి. పొడిచర్మం కోసమే తయారుచేసిన టోనర్ నా ముఖానికి రాస్తూ ఉండాలి. విటమిస్ ఇ తో కూడిన మాయిశ్చరైజింగ్ క్రీమ్ ని ఎక్కువగా రాస్తూ ఉండాలి. 

జిడ్డు చర్మం:
చర్మ రంధ్రాల నుంచి ఎక్కువ శాతం నూనె ఉత్పత్తి అయిపోవడం వల్ల జిడ్డుగా కనిపిస్తాం. దీని వల్లే బ్లాక్ హెడ్స్, మెటిమలు త్వరగా వచ్చేస్తాయి. ఇలంటి వాళ్లు ముఖాన్ని ఔషధ గుణలున్న సబ్బులతో లేదా నాస్ ఆల్కలైన్ సబ్బులతో శభ్రం చేసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు స్క్రబ్ తో పట్టిన మురికిని, జిడ్డుని తొలగించాలి. లేకుంటే చర్మగ్రంథులు మూసుకుపోతాయి. ఆయిల్ కాకుండా నీటితో తయారు చేసిన మాయిశ్చరైజర్లు వాడాలి. 

కాంబినేషస్ స్కిస్ :
ముఖంపై కొన్ని చోట్ల  పొడిగా, కొన్నిచోట్ల జిడ్డు పడితే అలాంటి చర్మతత్వాన్ని కాంబినేషస్ స్కిస్ అంటారు. ఇలంటి వాళ్లు ముఖంపై ఏ బాగం పొడిగా మారుతుందో అక్కడ మాయిశ్చరైజర్ ని వాడాలి. జిడ్డు చర్మం దగ్గర నాస్ ఆల్కలైస్ సబ్బులు ఉపయోగించాలి. గులాబి నీళ్లతో తయారుచేసిన టోనర్ ఈ చర్మతత్వం వాళ్లకి బాగా ఉపయోగపడుతుంది.


E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ముఖాన్ని కాంతిమంతంగా మార్చుకోవడం కోసం తరచూ బ్యూటీ పార్లర్లకు పరుగెత్తాల్సిన పని లేదు. వంటింట్లో దొరికే వస్తువులతో ప్రయత్నిస్తే చాలు.
  • చర్మానికి కండిషనర్ఒక టేబుల్‌ స్పూను తేనెకిరెండు టీ స్పూన్ల మీగడని కలిపి ముఖానికీమెడకీ రాసుకుని కొన్ని నిమిషాల తరవాత కడిగేసుకోండి.
  • క్లీనింగ్: పచ్చి పాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకుంటే మురికి వదిలిపోతుంది. తరచూ చేస్తుంటే చర్మం నునుపు దేలుతుంది
  • మాయిశ్చరైజర్‌: ఒక టీ స్పూను నారింజ రసం, ఒక టీ స్పూను నిమ్మరసం, ఒక కప్పు పెరుగు కలిపి పేస్టులా చేయండి. దీనిని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత తడి టిష్యూతో తుడిచేసుకోండి. పొడి చర్మం తేమగా మారడంతో పాటు, చర్మ కాంతి కూడా పెరుగుతుంది.
  • ప్రొటీన్మాస్క్‌: టేబుల్స్పూను మినప్పప్పునీ, ఐదారు బాదం పప్పుల్నీ రాత్రి నానబెట్టి ఉదయం వాటిని పేస్టులా చేసి ముఖానికి రాసుకోండి. గంట తరువాత కడిగేసుకుంటే చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
  • సన్స్క్రీన్లోషన్‌: కీరదోస రసం, గ్లిజరిన్‌, రోజ్వాటర్కలిపి ఒక డబ్బాలో వేసి ఫ్రిజ్లో దాచుకోండి. ఇంట్లోంచి బయటికి వెళ్లడానికి అరగంట ముందు ఇది ముఖానికి రాసుకుంటే సన్స్క్రీన్లోషన్లా పనిచేస్తుంది. దీనివల్ల ఎండ ప్రభావం ఎక్కువగా ఇబ్బంది కలిగించదు.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
శరీర కాంతి పెంచే చిట్కాలు

  • నిమ్మరసముమజ్జిగ సమబాగాలు కలిపి పూయుట వలన ఎండకు నల్లబడిన ముఖము స్వచ్చముగా నుండును.
  • ఆవ నూనెలో శనగపిండిపసుపు కలిపి రాసిన చర్మము కాంతివంతమగును.
  • వెన్నపసుపు కలిపి రాత్రిపూట నిద్రపోవునప్పుడు ముఖమునకు రాసుకొనిన ముఖము కాంతివంతముగాను ఉండును.
  • ముఖము పై ముడతలున్న రెండు చెంచాల గ్లిజరిన్ లో 1/2 చెంచా గులాబీ జలముకొన్ని నిమ్మరసపు చుక్కలు కలిపి రాత్రి ముఖముపై రాయవలెను. ఊదయము లేవగానే చల్లని నీటితో ముఖము కడుగుకొంటే, చర్మపు రంగు నిగ్గు తేలి ముడతలు తగ్గిపోతాయి.
  • చర్మానికి కుంకుమ పువు సొగసు : కుమ్కుమ పూవు అత్యంత ఖరీదే అయినా ప్రపంచ స్థాయిలో సౌంధర్య సాదనగా ప్రసిద్ధిపొందిది. కుంకుమపూవుతో తయారయిన పేస్టుని ముఖము చేతులపైన రాసుకుంటే చర్మానికి మ్రుదుత్వాన్ని,బంగారు మెరుపుని తెస్తుంది. అందుకే గర్భినిగా ఉన్నవారు కుంకుమ పూవు పాలలో వేసుకొని తాగితే మంచి ఛాయతో మెరిసిపోయే బిడ్డపుడుతుందని నమ్ముతారు.
  • పసుపువేప లేపనము : వందల సంవత్సరాల నుండి భారతీయులు చర్మ సంరక్షణకు పసుపువేపలను వాడుతున్నారు. పలురకాల చర్మ సమస్యలకు విరుగుడుగా పనిచేయడమే కాకుండా చర్మానికి చల్లదనాన్నిహాయినీ ఇస్తుంది. ఒక చెంచా పసుపు పొడికొంచము కుంకుమ పొడి,ఒక చెంచా వేపచూర్నము పచ్చి పాలలో వేసి కలిపి మిశ్రమాన్ని తయారుచేసి ముఖము, ఇతర చర్మభాగాల మీద రాస్తే మచ్చలు దద్దుర్లు వంటివి పోతాయి.
  • గంధము పేస్టు : కొంతమంది చర్మము బాగా సున్నితముగా ఉంటుంది. ఏమాత్రము ఎండలోకి వెళ్లినా కందుతుందిదురద, పొడిబారడం, పొరలుగా రావడంబిరుసెక్కిపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటప్పుడు గంధము పేస్టు చర్మాన్ని చల్లబరిచి యాంటిసెప్టిక్ గా పనిచేస్తుందిచర్మాన్ని తేమగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ప్రతి రోజూ దీనిని వాడుతూ ఉంటే చర్మము మీది నూనెగ్రంధులు ఉత్తేజితమై తేమగా ఉండేందుకు తోడ్పడుతూ చర్మాన్ని హానిచేసే బాక్టీరియాను తొలగిస్తాయి.
  • ముడతలు పడకుండా నిమ్మకవచం : కోసిన యాపిల్ ముక్క బూడిద రంగులోనికి మారకుండా ఉండాలంటే నిమ్మరసాన్ని కోసిన యాపిల్ భాగములో నిమ్మరసాన్నీ రాస్తుంటారు. ఆక్షిడేషన్ కారణముగా యాపిల్ అలా మారకుండా ఊంటుంది. వాతావరణ కాలుష్యానికి గురైన చర్మము పాడవకుండా ఆపే శక్తి నిమ్మరసము లోని విటమిను 'సికి ఉన్నది. ప్రతి సౌంధర్య సాధనానికి రెండు నిమ్మ చుక్కలు కలిపితే చర్మము ముడతలు పడకుండా ఉంటుంది.
  • జుట్టుకి గొప్ప కండిషనర్ పెరుగు : పెరుగు జుట్టుని పొడి బారనీయకుండా చేస్తుంది. షాంఫూతో తలంటుకున్న తరువాత ఐదునిముషాలు పెరుగుతో తలకు మసాజ్ చేసుకుంటే పొడిబారినపాదైన జుట్టూకి చక్కని కండిషనర్ గా పనిచేస్తుంది. జుట్టుకి మ్రుదుత్వాన్ని ఇచ్చి తేమగా ఉంచే శక్తి పెరుగుకి ఉంది.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
అందము

అందాన్ని పెంచుకోగల మార్గాలు

  •  సమతుల్యమైన ఆహారము (Balanced diet) తీసుకోవాలి.
  • విటమినులు ఉన్న అహారము లేదా విటమినులు ప్రతిరోజు తీసుకోవాలి.
  •  యాంటిఆక్సిడెంట్లు తీసుకుంటే శరీర కాంతి నిగనిగ లాడుతుంది.
  •  క్రొవ్వు పదార్దములు తక్కువగా తీసుకోవాలి.

అలసిన కల్లకు : నిద్రపోతున్నట్టు, జీవంలేనట్టు కనిపిస్తున్న కళ్ళకోసం ఇంట్లోనే ఈ చిట్కా పాటించవచ్చు.. కళ్ళకు మేకప్ వేసుకునే ముందు చల్లని దోసకాయ గుజ్జులో ముంచిన దూదిని మూసిన కనురెప్పల మీద ఉంచుకోవాలి.
పొడిబారిన చర్మానికి : ఒక్కొక్క టేబుల్ స్పూను చొప్పున టమోటా, దోస రసాలు, కొన్ని నిమ్మ చుక్కలు , ఒక టేబుల్ స్పూను కిస్మిస్ లు ఇవన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొహానికి రాసుకుని 20 నిముషాలు అనంతరము గోరువెచ్చని నీటి తో కడిగేయాలి.
జిడ్డు చర్మానికి : పావు టేబుల్ స్పూను నిమ్మరసం లో 2 టేబు స్పూనులు తురిమిన కమలా తొక్కలు, కొంచం పాలు కలిపి ఒక రోజంతా ఫ్రిజ్ లో ఉంచాలి. ఇది మంచి క్లెన్సర్ గా పనిచేస్తుంది, దీనిని బాడీలోషన్ గా వాడవచ్చు.
చక్కని స్కిన్ టోన్ కోసం : ఒకటిన్నర టేబుల్ స్పూను పెరుగు, ఒక టేబుల్ స్పూను సన్నగా తరిగిన కమలాపండు తిక్కలు, ఒక టేబుల్ స్పూను ఓట్ మీల్, నూనె ఇవన్నీ కలిపిన మిశ్రమంతో శరీరానికి మ్రుదువుగా మర్దన చేయాలి. చర్మం మీది మ్రుత కణాలు, బ్లాక్ హెడ్స్ తొలగి పోతాయి. దీనిని రోజువారీ స్క్రబ్ గా కూడా వాడవచ్చు.

పాటించ వలసిన జాగ్రత్తలు
  •  వేలకు నిద్ర పోవాలి
  • వేలకు ఆహారము తీసుకోవాలి
  •  రోజూ వ్యాయామము చేయాలి
  •  చిన్న చిన్న విషయాలకు టెన్సన్ పడకూడదు.
  • ఎక్కువ స్టెస్, స్ట్రైన్ కి గురుకాకూడదు.
  •  ప్రతి రోజు మ్రుదువైన సబ్బు తో స్నానము చేయాలి.
  • మీ అందాన్ని ఇంకొకరి అందము తో పోల్చుకోకూడదు. ఎప్పుడూ పొజటివ్ గానే ఆలోచించండి.
 ఆహార నియమాలు

మనము తినే ఆహారాన్ని బట్టి మనకు వ్యాధులు వస్తాయి, ఏదైనా వ్యాధి తో బాధపడుతున్నవారు ఎంత అందముగా ఉన్నా పీలగా కనిపిస్తారు, కాంతిహీనముగా ఉంటారు, ఆహారము సరైందికాకుంటే ఎన్ని లోషన్లు, పోషన్లు ఉపయోగించినా ఆశించిన ఫలితాలు కలగవు. అందువలన మంచి ఆహార నియమాలను పాటించడము వలన జబ్బులనుండి దూరముగా ఉండవచ్చును. ఈ క్రింది ఏ ఆహార పదార్దములు ఎలా ఉపయోగపడతాయో చూద్దాము :

క్యారట్లు(carat root):ఒకే ఒక్క పచ్చి క్యారట్ తింటే రోజంతటికి సరిపడె విటమిన్లు శరీరానికి దొరుకుతాయి. అది కళ్ళు, శరీరభాహ్యకణజాలాన్ని, అవయవాలను, ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. విటమిన్ ఎ ఎక్కువగా లబ్యమవుతుంది.
ఆకు కూరలు : విటమిన్లు చాలా కీలకమైనవి శరీర ఆక్రుతిని , ఆరోగ్యాన్ని కాపాడేందుకు, ఇవి ఎక్కువగా ఆకుకూరలలో ఉంటాయి. శరీర అందానికి విటమిన్ 'సి' మరియు విటమిన్ '' ముఖ్యమైనవి. విటమిన్ సి- నిమ్మ, నారింజ జాతి కాయలు, పండ్లలో పుష్కలముగా ఉంటుంది.
రోజుకో యాపిల్ : యాపిల్ లో పెక్టిన్,సి-విటమిన్,కాల్సియమ్,ఫాష్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు లబిస్తాయి. శరీరం లోని విషపదార్దములను, కొలెస్త్రాల్ స్తాయిని యాపిల్ తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు సక్రమముగా పనిచేసెందుకు ఇది సహకరిస్తుంది. అందుకే యాపిల్ ను రొజువారి ఆహారములో చేర్చండి.
నీరు : నీరు మన శరీరానికి ఎంతో అవసరము. సమాజములో దాదాపు 80%మంది డిహైడ్రేషన్ కి లోనవుతుంటారు. దీనివలన శరీరము ముడతలు పడి కాంతిహీవముగా తయారవుతుంది. బుగ్గలు చొట్టలు పడి ముఖము అందవికారముగా తయారవుతుంది.మనశరీర బరువులో 70% పాలుపంచుకున్న నీరు అందానికి ఆరోగ్యానికి ఎంతో అవసరము. కావున ప్రతిరోజూ కనీసము 2లీటర్లు నీటిని త్రాగాలి.
ఉల్లి-వెల్లుల్లి : ఈ రెందూ శరీర రక్తప్రశరణవ్యవస్థ కి మేలుచేస్తాయి. తినే ఆహారపదార్దములలోని 'టాక్సిన్' లను తొలగించడములోను,వ్యాధినిరోధకవ్యవస్థను క్రమబద్దీకరించడములోను ఉపయోగపడతాయి. ఉబ్బసము తగ్గించడానికి కూడా పనికొస్తాయి.
పెరుగు : దీనిలో సహజ సజీవ 'అసిడోఫిల్లస్' లాక్టోబాసిల్లస్ బాక్టీరియ, యోగర్ట్- పుల్లటిపెరుగు లోనే లభిస్తాయి. ఇవి గుండెకు కావలసిన స్పందనను, ఉత్సాహాన్ని అందిస్తాయి.పెరుగు ను క్రమపద్దతిలో వాడితే కడుపులో గాస్ ను,త్రేన్పులు మలబద్దకము, అజీర్ణము వంటి రుగ్మతలు అన్నీ మాయమువుతాయి.
ఫైబరు : కేలరీలు ఏమాత్రము లేకున్నా ,జీర్ణము కానివైనా పీచుపదార్దము ఒంటికి చేసె మేలు ఎక్కువ. ప్రధానముగా ఇవి అతిగాతినడము అరికడతాయి. వయసు మీరిన చిహ్నాన్ని ,గుండెపోటును అరికడతాయి. ఈస్ట్రోజన్ స్తాయిని క్రమపరుస్తాయి.తాజాపండ్లు,పొట్టుగల పదార్దములుతాజారొట్టెఆకుకూరలుకాయకూరలు పీచు గలవి. ఇప్పటి వరకూ మీరు వీటిని అశ్రద్ద చేసినట్లయితే వెంటనే వాడడము ప్రారంభించండి. మలనపదార్దములను బయటకు పంపించడములో పీచుదినుసులదే కీలకపాత్ర.
శాకాహారము / మాంసాహారము : సాకాహారమే శరీరానికి మంచిది. కూరగాయలు,ఆకుకూరలే 'అద్భుతాహారము' కీరదోస, దొండ,ఉడకపెట్టిన క్యాబేజి, తాజాఆకుకూరలు,వంటికి మంచిది, కేశాలు, చర్మము,,కళ్ళు వంటి శరీరభాగాలన్నీ ఆరోగ్యము తో తొణికిస్తుంటాయి. పాలు అందరికీ మంచిదే. కొన్ని ఎమైనో యాసిడ్సు శాకాహారము లో ఉండవు కావున గుడ్లు, చేపలు, చికెన్ తినడం మంచిది. గుడ్లలో ప్రోటీన్లు, కాల్సియం, ఐరన్, జింకు,బి-కాప్లెక్ష్ విటమిన్లు ఉంటాయి. చికెన్ లో క్రొవ్వు తక్కువగా ఉంటుంది కావున వాడవచ్చు. చేపలలో ఒమెగా ఫాటియాసిడ్సు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలుచేస్తాయి.ఇవి తప్ప మిగతా మాంసాహారాన్ని అనగా మటన్, బీప్, పోర్క్, వగైరా ఎక్కువగా తీసుకోకపొవడం మంచిది.