Articles by "hair care"
hair care లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
జుట్టుని మెరిపించాలంటే ఇంట్లో పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి.  అవి
  • మార్కెట్లో దొరికే అన్ని షాంపూలూ, కండిషనర్లూ మీ జుట్టు కి సరిపడక పోవచ్చు. జుట్టుకి సరిపడే ఉత్పత్తుల్ని ఎంచుకుని వాటినే వాడుతూ ఉండాలి. రకరకాల ఉత్పత్తులు వాడడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది.
  • వర్షంలో తడిసిన తర్వాత తలకి స్నానం చేసే వాళ్లు చాల తక్కువ. కానీ స్నానం చేయకపోవడం వల్ల జుట్టు మొదళ్ల దగ్గర తడి ఉండిపోయి వాసన వచ్చేస్తుంది. ఇది చుండ్రుకు కారణం అవుతుంది. కాబట్టి వానలో తడిశాక తలస్నానం చేయాలి.
  • రాత్రి పడుకునే ముందు మరీ గట్టిగా జడ వేసుకోకుండా కాస్త వదులుగా జుట్టుని వదిలేయాలి. 
  • అసలు దువ్వకుండా వదిలేయడం, లేదంటే తరచూ దువ్వుతూ ఉండడం ఈ రెండూ జుట్టు ఎదుగుదలకు మంచివి కావు.
  • ఎక్కువ మంది నూనె రాయకుండా వదిలేస్తారు. వారానికోసారి నూనె రాసుకుంటేనే మంచిది. అప్పుడప్పుడూ నిమ్మరసంతో శుభ్రపరిస్తే జుట్టు మృదువుగా మారుతుంది. మంచి మెరుపొస్తుంది.


E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates

తల మీద జుట్టు ఉన్నా సమస్యే, లేకపోయినా సమస్యే. 

అలాంటి జుట్టుకు సంబంధించి మనలో ఎన్నో అపోహలు. అవాస్తవాలు ఉన్నాయి. అవి...

తలకు నూనెతో మర్దన చేయడం చుండ్రు వస్తుంది
నూనె మర్దన వల్ల మాడుపై రక్తప్రసరణ పెరుగుతుంది. అలసట పోతుంది. పట్టించిన నూనెను సరిగ్గా కడగకపోతే అది మురికిని చేరనిస్తుంది. అలా చుండ్రు వస్తుంది.

నూనె మర్దనతో జుట్టు బాగా పెరుగుతుంది.
అందరూ అనుకున్నట్టుగా నూనె వల్ల జుట్టుకు పోషణ అందదు. నూనె జుట్టుకు కండిషనర్‌గా మాత్రమే పనిచేస్తుంది.

షాంపూలు జుట్టును బలహీనపరిచి రాలిపోయేలా చేస్తాయి
వాస్తవానికి షాంపూల వల్ల మాడుకు పట్టిన మురికి, జిడ్డు పోతాయి. షాంపూ చేసిన తర్వాత తలను బాగా కడగకపోతే మాత్రం ప్రమాదమే.

తినే తిండికి జుట్టు నాణ్యతకు ఏ సంబంధమూ లేదు.
మంచి ఉత్పత్తులు వాడితే తమ జుట్టు ఆరోగ్యంగా ఉంటుందను కుంటారు ఎక్కువమంది. అది నిజం కాదు. పోషకాలున్న ఆహారం తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది. పండ్లు, కూరగాయలు, మంచినీరు ఇవన్నీ ముఖ్యమే.

తరచూ కత్తిరిస్తుంటే జుట్టు త్వరగా పెరుగుతుంది.
కత్తిరింపుల వల్ల జుట్టుకో షేప్ వస్తుంది, అందంగా కనిపిస్తుంది తప్ప పెరగదు. జుట్టు పెరగడం అనేది లోపల నుంచి జరగాల్సిన ప్రక్రియ. బయట పనుల వల్ల అది జరగదు.

వెంట్రుకల చివర్లు చిట్లిపోవడాన్ని ఆపచ్చు
కత్తిరించడం తప్ప వాటి నేమీ చెయ్యలేం. కండిషనర్లు, వేరే ఎలాంటి చికిత్సలు పనికిరావు.

చివర్లు చిట్లిన జుట్టు పెరగదు
జుట్టు కుదుళ్లలోంచి పెరుగుతుంది తప్ప చివర్లు కాదు. అందువల్ల చివర్లు చిట్లిపోయినా జుట్టు పొడవుగా పెరుగుతుంది.

హెన్నా పెట్టిన జుట్టుకు రంగేస్తే ఎక్కువకాలం ఉంటుంది.
నిజానికి హెన్నా (గోరింటాకు) జుట్టుకు ఒక శాశ్వతమైన కోటింగ్ ఇస్తుంది, అందువల్ల రంగు నిలిచే ప్రసక్తే లేదు. అలాగే హెన్నా వల్ల జుట్టు మృదుత్వాన్ని, సహజత్వాన్ని కోల్పోతుంది. హెన్నా లేదా రంగు - ఏదో ఒక్కటి వాడటమే మేలు. రెండిటినీ కలపి పట్టించడం మంచిది కాదు.

రాత్రికిరాత్రే జుట్టు పండిపోతుంది.
అలా ఎప్పుడూ జరగదు. జుట్టు పండిపోవడం వయసుతో పాటు నెమ్మదిగా జరిగే ప్రక్రియ. పండిన వెంట్రుక ఒక్కటి పీకేస్తే, దానిచుట్టూ ఉన్నవన్నీ పండిపోతాయి ఇది తప్పు. ఒకటి పీకేసినంత మాత్రాన పక్కవాటికి ఏమీ జరగదు.

మందులతో జుట్టు పండిపోకుండా చూడొచ్చు
వయసుమీరడం వల్ల లేదంటే జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల జుట్టు పండిపోతుంది. వయసునేమీ చెయ్యలేరు గనక, జీవనశైలిని మెరుగుపరచుకుంటే జుట్టు పండిపోకుండా జాగ్రత్త పడొచ్చు. వేళకు తిండితో పాటు తగినంత నిద్ర పోతే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
అందం విషయంలో కేశాలు చాల ముఖ్య పాత్ర పోషిస్తాయి. జుట్టు వూడి పోకుండా ఒత్తుగా పెరగాలంటే ఈ నియమాలు పాటించండి. 

1. తలకు నూనెతో ఎప్పటికప్పుడు మసాజ్ చేస్తుండాలి. 

ఆయిల్ మసాజ్ ఎలాచేయాలంటే... 

ముందుగా ఒక బల్లో జుట్టుకు సరిపడ నూనెను తీసుకొని, కొద్దిగా గోరు వెచ్చగా వేడి చేయాలి. తర్వాత పాపిడి తీస్తూ దూదితో తలకు అప్లై చేయాలి. తలకు అన్ని వైపుల ఇదే మాదిరిగా అప్లై చేసి, చేతివేళ్లతో మసాజ్ చేయాలి. ఆ విధంగా 10 నుంచి 15 నిముషాల వరకు సున్నితంగా తలకు మసాజ్ చేయడం వలన, తల పై బాగంలో రక్తప్రసరణ వేగవంతమవుతుంది. మసాజ్ పని పూర్తయ్యాక, 3 నుండి 4 నిముషాల వరకు తలకు ఆవిరి పట్టాలి. ఇల ఆవిరి పట్టడం వలన తలలోని రంధ్రాలు తెరుచుకుంటాయి. ఆ తర్వాత తలకు షాంపూ చేసుకోవాలి. వారానికి ఒక్క సారైనా ఇలా ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టుకు ఎంతో మేలు జరుగుతుంది.

2. పోషకవర్థకమైన ప్యాక్స్ తో పాటు, నాణ్యమైన కండీషనర్, షాంపూ వాడాలి. 

తలకు వేసుకొనే ప్యాక్స్ 

మొదటి రకం 

ఒక బల్లో కోడిగుడ్డు (తెల్లసొన+ పసుపు సొన) వేసి బగా గిలకరించాలి. అందులో నిమ్మరసం (ఒక నిమ్మకాయ నుంచి తీసుకున్నది), 5 టీ స్పూన్ల కొబ్బరినూనెతో పాటు; ఒక కప్పు పెరుగు కూడా వేసి బాగా కలపాలి. వీన్నిటినీ మిక్సీలో లేదా బటిల్లో వేసి అన్నీ సమానంగా కలిసేల బాగా మిక్స్ చేయాలి. ఈ ప్యాక్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఒక గంట వేపు అలాగే ఉంచి, తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఈ కొలతలన్నీ జుట్టు పొడవు తక్కువగా ఉన్నవారికి. ఒకవేళ పొడవాటి జుట్టు ఉంటే రెట్టింపు కొలతలు తీసుకుంటే సరిపోతుంది. 

రెండవ రకం 

ఒక బల్లో కోడిగుడ్డు తెల్ల సొనను తీసుకోవాలి. అందులో 2 టీ స్పూన్ల క్యాస్టర్ ఆయిల్, ఒక టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకి బాగా పట్టించాలి. ప్యాక్ ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఇల నెలకు రెండు సార్లు చేస్తే మీ జుట్టుకు ఎటువంటి ఢోకా ఉండదు.

3. మంచి పోషకాహారం తీసుకోవాలి. 

జుట్టు పెరుగుదలకు సరైన పోషకాహారం 

మాంసకృత్తులు, ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్ కలిగిన ఆహార పదార్థాలే కాకుండా, అన్ని ఆకుకూరలు, పండ్లలో కూడా జుట్టు ఎదుగుదలకు సరిపడే పోషక పదార్ధాలు లభిస్తాయి.

4. అన్నింటి కంటే ముఖ్యంగా మానసిక ఒత్తిడిని బాగా తగ్గించుకోవాలి. 

5. నెలకు ఒక్క సారైనా వెంట్రుకల చివరలను కత్తిరిస్తూ ఉండాలి.

వీన్నింటినీ పాటించడం వలన ఎవరైనా సరే-మంచి కేశ సంపదను సొంతం చేసుకోవచ్చు.