Articles by "health articles"
health articles లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మానసిక ఒత్తిడి వల్ల కలిగే శారీరకంగానూ సమస్యలు ఎదురవుతాయని గుర్తించినప్పుడు చేయాల్సిందల్లా దాన్ని అధిగమించడం, నియంత్రిం చడం. దీనివల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని తేలింది కూడా. ఉదాహ రణకు మొదటిసారి గుండెపోటుకు గురైనవారు, ఒత్తిడిని సమర్థంగా నియంత్రించుకోగలిగితే 74 శాతం మందిలో రెండో స్ట్రోక్ రాకుండా నివారిం చుకోగలగడం సాధ్యమేనని తేలింది. పైగా ఇలా ఒత్తిడి నియంత్రణ కారణంగా వ్యాధి నిరోధకశక్తి కూడా పెరిగి అది కూడా జబ్బులను దూరం చేస్తుందని నిరూపితమైంది. ఒత్తిడిని అధిగమించడానికి మార్గాలివి...

  • ఒత్తిడికి కారణాన్ని గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండాలి. దాంతోపాటు ఒత్తిడిని దూరం చేసుకోడానికి మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాలివి... ? చాలా లోతుగా గాలి పీల్చడం వంటి బ్రీతింగ్ వ్యాయా మాలు చేయడం ? ఏదైనా అంశం తీవ్రంగా బాధపెడుతుండటం లేదా పదే పదే గుర్తుకొస్తూ పశ్చాత్తాపానికి గురిచేస్తుంటే మరింకేదైనా వ్యాపకంలో పడుతూ దాన్ని మరచిపోయి, ఒత్తిడి నుంచి విముక్తం కావడం. 
  • ఒత్తిడికి గురయ్యే క్షణాల్లో చిక్కుకున్నప్పుడు అది తప్పని పరిస్థితి అని, దాని కార ణంగా ఒత్తిడికి గురవుతూ అంతర్మధనానికి లోనుకోవడం కంటే... అది తప్పించుకోలేని పరిస్థితి కాబట్టి, ఆ పరిస్థితుల్లో ఎవరున్నా చేయగలిగింది ఉండదని, కాబట్టి ఆ స్థితిని యథాతథంగా స్వీకరించడం మంచిదని సర్దిచె ప్పుకోవడం 
  • పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడటం, సమస్యల ను అధిగమించాల్సిన కోణంలో పరిశీలించడం వంటి కొన్ని మార్గాల ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు.ఏ శారీరక లక్షణాల ద్వారా ఒత్తిడి ఉన్నట్లు గుర్తించవచ్చు.
కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ మనకు అది తెలియకపోవచ్చు. కానీ కొన్ని శారీరక లక్షణాలు సైతం ఒత్తిడిని గుర్తించేలా చేస్తాయి. అవి...


1. నిద్రపట్టకపోవడం 
2. ఆకలి లేకపోవడం 
3. కండరాలు బిగుతుగా పట్టేయడం. 
4.మాటిమాటికీ తలనొప్పి 
5. జీర్ణకోశ సమస్యలు
6. దీర్ఘ కాలంగా దిగులు, బాధ లాంటివి ఉండి ఎంతకూ తగ్గకపోవడం. 

ఇవి కనిపిస్తున్నప్పుడు ఆ శారీరకబాధలు చిన్నవే కదా అంటూ నిర్లక్ష్యం చేయకూడదు. వీలైనంత త్వరగా డాక్టర్ను సంప్రదించి మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలకు దారితీయకముందే జాగ్రత్తపడాలి.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ఒత్తిడి అనేది కేవలం మనల్ని ఇబ్బంది పెట్టే ఆ సమయంలోని మానసిక స్థితి మాత్రమే కాదు. దానివల్ల కొన్ని శారీరకమైన మార్పులూ వస్తాయి. ఫలితంగా శరీరం దెబ్బతింటుంది. అది ఎన్ని రకాలుగా జరుగుతుందో చూద్దాం.
ఒత్తిడి కారణంగా వచ్చే పది పాపులర్ సమస్యలు :
1. గుండెజబ్బులు: పైన పేర్కొన్నట్లుగా ఒత్తిడికి గురయ్యేవారిలో దీర్ఘ కాలిక గుండెజబ్బులు ఎక్కువగా ఉండటం చాలా సాధారణమైన విషయం. ఒక్కోసారి ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే.
2. ఆస్తమా: ఒత్తిడి ఆస్తమాను ప్రేరేపిస్తుందని ఇప్పటికే వైజ్ఞానిక శాస్తపరంగా రుజువైంది. అంతేకాదు... తల్లిదండ్రుల ఒత్తిడి పిల్లలకూ హాని చేస్తుందని తేలింది. ఒకవేళ తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారే అయితే వారి పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశాలు చాలాఎక్కువని అధ్యయనాల్లో తేలింది. అంటే... తమ
ఒత్తిడి వల్ల వారు తమనే కాకుండా తమ సంతతిని, ముందు తరాలవారినీ బాధిస్తున్నారన్నమాట. గర్భవ
తిగా ఉన్నవారిలో కొందరిని ఎంపిక చేసుకుని ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. వారిలో సగం మందిని ఒత్తిడికి, మరో సగం మందిని కాలుష్యపు పొగకు ఎక్స్పోజ్ అయ్యేలా చేశారు. ఈ అధ్యయన ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. నిజానికి కాలుష్యపు పొగకు గురైన గర్భిణులకు పుట్టిన వారి కంటే... ఒత్తిడికి గురైన గర్భవతులకు పుట్టిన పిల్లల్లో అత్యధికులకు ఆస్తమా సోకింది. 
3. స్థూలకాయం: మన శరీరంలో కొవ్వు పేరుకునే ప్రాంతాల్లో... తొడలు, పృష్టభాగం కంటే పొట్టలో పేరుకునే కొవ్వు వల్ల తీవ్రమైన హాని కలుగుతుంది. కానీ ఒత్తిడి వల్ల పొట్టభాగంలో కొవ్వు పేరుకోవడం ఎక్కువగా జరుగుతుంది. తద్వారా ఆరోగ్య హాని కూడా ఎక్కువేనన్నమాట. అంటే ఒత్తిడి వల్ల రెండు రకాల నష్టాలని గుర్తించాలి. మొదటిది పొట్ట రావడం, రెండోది ఆ పొట్ట వల్ల ఆరోగ్యభంగం జరగడం.
4. డయాబెటిస్: తీవ్రమైన మానసిక ఒత్తిడి... డయాబెటిస్కు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. మళ్లీ ఇది రెండురకాలుగా బాధిస్తుంది. డయాబెటిస్ కారణంగా ఆకలి పెరిగి... మనం తినకూడని అనారోగ్యకరమైన పదార్ధలైన వేపుళ్లు, బేకరీ పదార్థాలు తినేలా చేస్తుంది. ఇవి తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ పాళ్లు పెరగడం కారణంగా మనం అనారోగ్యానికి గురవుతాం. ఇలా ఒక అనారోగ్యం మరో ప్రతికూలతకూ, ఆ ప్రతికూలత మరో అనారోగ్యానికీ ఒక చక్రంగా సాగిపోతూ అనారోగ్యపు ఊబిలోకి దించుతూపోతుంది.
5. తలనొప్పి: ఒత్తిడివల్ల కొన్ని తలనొప్పులూ, మైగ్రేన్ రావడం సహజం. వాటి కోసం వాడే నొప్పి నివారణ మందులతో కొన్ని దుష్ఫలితాలు రావడం సాధారణం. వాటితో మరింత అనారోగ్యం కలగడం మరింత సర్వసా ధారణం. ఇలా ఒకటికొకటి తోడవుతూ ఆరోగ్యాన్ని మరింతగా దెబ్బతీయడం అన్నది ఒత్తిడి తాలూకు మరో చెడు లక్షణం.
6. డిప్రెషన్, యాంగ్జైటీ: ఒత్తిడికి గురైన వారుఉద్వేగాలకు లోనవుతుంటారు. ఇలాంటివారిలో యాంగ్జైటీ కనిపించడం మామూలే. ఇలా దీర్ఘకా లిక భావోద్వేగాలకు గురయ్యేవారిలో 80 శాతం మంది ఒత్తిడులకు లోనవుతుంటారు. వీరిలో చాలామంది కొంతకాలం తర్వాత తీవ్ర నిరాశ, నిస్పృహలకూ దీర్ఘకాలంలో డిప్రెషన్కు లోనైన దాఖలాలు చాలా ఉన్నాయి.
7. జీర్ణకోశ సమస్యలు: ఒత్తిడికి గురయ్యేవారిలో చాలామంది జీర్ణకోశ సమస్యలకు గురవుతుండటం సాధారణం. వీరిలో చాలామందికి ఒత్తిడికి గురికాగానే కడుపులో యాసిడ్స్ స్రవించి మంట రావడం, అలా మంటలు వచ్చే వారిలో చాలామందికి దీర్ఘకాలంలో కడుపులో అల్సర్స్ కనిపిస్తాయి. ఇలా గ్యాస్ పైకి తన్నేవారికి ఛాతీలో నొప్పి రావడం చాలా సాధారణంగా కని పించే పరిణామం. ఆ సంకేతాన్ని కొన్నిసార్లు గుండెపోటుగా పొరబడటమూ చాలామందిలో చూస్తుంటాం. ఇలా దీర్ఘకాలం గ్యాస్ పైకి ఎగదన్నుతుండేవారు గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) అనే శారీరక రుగ్మతకూ లోనవుతుంటారు. ఈ దుష్పరిణామాలన్నీ ఒత్తిడి కారణంగానే జరుగుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
8. అల్జైమర్స్ డిసీజ్: ఒత్తిడి కారణంగా మెదడులో కలిగే గాయాలు తీవ్రమై అల్జైమర్స్ డిసీజ్కు దారితీస్తుందని కొన్ని అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా ఒత్తిడి వల్ల అల్జైమర్స్ డిసీజ్ తీవ్రం కావడం చాలా
వేగంగా జరుగుతుంది. అంటే ఒత్తిడి లేనివారిలో అల్జైమర్స్ డిసీజ్ కాస్త ఆలస్యమైతే... ఒత్తిడి వల్ల అది రావాల్సిన సమయం కంటే ముందుగా వచ్చే అవకాశాలూ ఉన్నాయని గుర్తించాలి. పైగా ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ అది తీవ్రమయ్యే వేగం కూడా పెరుగుతుందని గ్రహించాలి.
9. వేగంగా వయసు పైబడటం: ఒత్తిడి వల్ల త్వరగా వృద్ధులైపోయే మరో దుష్పరిణామం కనబడుతోంది. తల్లుల, పిల్లల డీఎన్ఏలను పరిశీలిస్తూ జరిగిన ఒక అధ్యయనంలో ఈ ఫలితాలు స్పష్టమయ్యాయి. ఒత్తిడికి గురైనవారు, తమ తల్లులతో పోలిస్తే వేగంగా వృద్ధాప్య దశకు సమీపించి నట్లు, వారిలో వృద్ధాప్యలక్షణాలు చాలా త్వరగా కనిపించినట్లుగా అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. అంటే... ఒకరు ఆ వయసుకు కనబరచాల్సిన లక్షణాలను 9 నుంచి 17 ఏళ్ల ముందుగానే కనబరుస్తున్నట్లు ఆ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
10. చాలా ముందుగా మరణించడం (ప్రీ-మెచ్యుర్ డెత్) : ఒకరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిలో మరణం ఎప్పుడు సంభవించవచ్చో కొంతమేరకు అంచనా వేయడం మామూలే. అయితే కొందరిలో మరణించాల్సిన వయసు
కంటే ముందే మరణించడం జరుగుతుంది. అప్పుడు చాలా త్వరగా పోయా రంటూ బాధపడటం మామూలే. ఒత్తిడితో ఇలాంటి మృతులు సంభవించడా న్ని అధ్యయనవేత్తలు చాలా దృష్టాంతాలలో పరిశీలించారు. తీవ్రమైన దీర్ఘ కాలిక ఒత్తిడికి లోనయ్యేవారిలో మరణం చాలా ముందుగా వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
‘ఒత్తిడి అలా కొనసాగుతూ ... అది ఎలాంటి హానీ చేయకపోతే దాన్ని ఎంతకాలమైనా భరించ గలం’ అనుకునే వాళ్లూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఒత్తిడి అన్నది కేవలం ఆ సమయానికే పరిమితం కాదు. ఒత్తిడి అప్పటికి తొలగినా... దాని భవిష్యత్ పరిణామాలు మాత్రం వేరుగా ఉంటాయి. దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉండే ఒత్తిడి అలా అలా వేర్వేరు వ్యాధులకు దారితీస్తుంది. అదీ నిజమైన సమస్య. అందుకే ఏరోజుకు కలిగే ఒత్తిడిని ఆ రోజుకు అలా భరిద్దాంలే అనుకుంటే కుదరదు. అదలా దీర్ఘకాలం పాటు కొనసాగుతూ పోతూ ఉంటే, దాని వల్ల వచ్చే వేర్వేరు వ్యాధులు... అందు వల్లదాన్ని నివారించుకోవాల్సిన ఆవశ్యకత గురించిన అవగాహన కోసం... ఈ కథనం. 

వ్యాధి నిరోధక శక్తిపై ఒత్తిడి ప్రభావం... 
మనకు ఏదైనా గాయం అయినప్పుడు అక్కడ వాపు రావడం, ఎరబ్రారడం (ఇన్ఫ్లమేషన్) వంటి పరిణామాలు జరుగుతాయి. ఇది బాధాకరంగానే ఉన్నా, కాస్త వ్యవధి తర్వాత ఆ ఎరుపూ, మంటా, వాపు వంటివి దానంతట అదే తగ్గడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ను నివారించే శక్తిని మన శరీరం కోల్పోతుంది. ఈ విషయం కార్నెగీ మెలాన్ యూనివర్సిటీకి చెందిన షెల్డన్ కోహెన్ అనే అధ్యయనవేత్త ఆధ్వర్యంలో జరిగిన అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అధ్యయన ఫలితాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ తాలూకు మార్గదర్శ కాల్లో చోటుచేసుకున్నాయి కూడా. ఒత్తిడి అన్నది శరీరంపై ఎలా దుష్ర్పభావం చూపుతుందన్న విషయం మొదటిసారిగా స్పష్టమైన తార్కాణాలతో వెల్లడైంది. నిజానికి మనలో ఇన్ఫ్లమేషన్ కలిగిన ప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ విడుదలై, అది వ్యాధి నిరోధక అంశాలను ప్రేరేపిస్తుంది. దాంతో ఆ వ్యాధి నిరోధకతను కలిగించే అంశాలు ఇన్ఫ్లమేషన్ను నియంత్రిస్తాయి. కానీ దీర్ఘకాలపు ఒత్తిడి కారణంగా కార్టిజోల్ అన్న హార్మోన్ స్రవించినా అది సరిగా పనిచేయదు. దాంతో ఒత్తిడి కారణంగా వ్యాధి నిరోధక అంశాలు కార్టిజోల్ వల్ల సరిగా ప్రేరణ చెందవు. ఫలితంగా ఇన్ఫ్లమేషన్ తగ్గదు. అంతే కాదు... ఈ థియరీ మరికొన్ని దృష్టాంతాల ద్వారా కూడా వాస్తవమని తేలింది. సాధారణంగా మనకు జలుబు చేస్తే, ఒకటి రెండు రోజుల తర్వాత దానంతట అదే తగ్గుతుంది. కానీ దీర్ఘకాలం పాటు ఒత్తిడికి గురయ్యే వారిలో జలుబు తగ్గడానికి చాలాకాలం తీసుకుంటుంది. కారణం... ఒత్తిడి ప్రభావం మన వ్యాధినిరోధక అంశాలపై ప్రతికూలంగా పడటమే. ఇలా మానసికమైన ఒత్తిడి కేవలం మానసికంగానే బాధించకుండా క్రమంగా అది శారీరక బాధలైన స్థూల కాయం, గుండెజబ్బులు, అల్జైమర్స్ వ్యాధులు, డయాబెటిస్, డిప్రెషన్, జీర్ణకోశ సమస్యలు, ఆస్తమా వంటి వాటికి దారితీస్తుందని స్పష్టంగా గుర్తించారు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మగవాళ్లు ఎందుకు అబద్ధాలు చెబుతారు? సాహసాలు చేయటానికి ముందుకెందుకు దూకుతారు? భావోద్వేగాలను వ్యక్తం చేయకుండా లోపలే ఎందుకు దాచుకుంటారు? వీటన్నింటికీ టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ ప్రభావమే కారణమని చెబుతున్నారు అమెరికా సైకియాట్రిస్ట్‌లు. వారు ఆడవారు, మగవారి ఆలోచనలు, ప్రవర్తనలకు గల తేడాలను విశ్లేషించారు. అందుకు కారణమవుతున్న అంశాలనూ వివరించారు.  అందులో కొన్ని విషయాలు మీ కోసం..


  • గర్భంలో ఉండగానే ఎనిమిదో వారం నుంచే మగశిశువు మెదడుపై టెస్టోస్టీరాన్‌ ప్రభావం పడుతోంది. దీంతోనే అబద్ధాలు ఆడటం, సాహసం చేయటం, భావోద్వేగాలను అణచుకోవటం వంటి లక్షణాలకు బీజం పడుతోంది.
  • యుక్తవయసులో మగపిల్లలు ఇతరులను ఎక్కువగా విమర్శిస్తుంటారు. అన్నింటి పైనా త్వరగా ఆసక్తి కోల్పోతుంటారు. మెదడును టెస్టోస్టీరాన్‌ ఎక్కువగా ప్రభావితం చేయటం వల్ల.. అసాధారణమైన భావోద్వేగాలు మాత్రమే వారిని ఉత్తేజితం చేయగలుగుతాయి. అందుకే ఉద్వేగభరితమైన వీడియోగేమ్‌లను ఆడేందుకు మగపిల్లలు ఇష్టపడుతుంటారు.
  • సంభోగానంతరం ఆనందాన్ని కలగజేసే ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ హైపోథాలమస్‌లోకి విడుదల అవుతుంది. దీని ప్రభావంతో ఆడవాళ్లు తమ భాగస్వాములను హత్తుకోవాలని, మాట్లాడాలని భావిస్తుంటే.. మగవారిలో ఇది నిద్ర మాత్రలా పనిచేసి మగతను కలిగిస్తుంది. అందుకే వారు శృంగారంలో పాల్గొన్న తర్వాత వెంటనే నిద్రపోతుంటారు.
  • ఎవరైనా ఏదైనా సమస్యను మగవారికి చెప్పగానే సానుభూతికి బదులు ఏదో ఒక పరిష్కారాన్నే సూచిస్తుంటారు. మెదడులోని టెంపోరల్‌ పార్షల్‌ జంక్షన్‌ వ్యవస్థ చురుగ్గా పనిచేసి విశ్లేషణకు పురికొల్పటమే ఇందుకు కారణమవుతోంది. ఆ సమయంలో ఈ జంక్షన్‌. భావోద్వేగాలను రేకెత్తించే భాగంపై ఆధిపత్యం చెలాయిస్తుంది.
  • అయితే ఆడవారిలో ఇందుకు వ్యతిరేకంగా జరుగుతుంది. అందుకే స్త్రీలు పరిష్కారాలను సూచించే తార్కికత కంటే భావోద్వేగాలకే ఎక్కువ లోనవుతుంటారు.
  • కాబోయే తండ్రుల్లో టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ స్థాయి పెరుగుతుంది. అదే సమయంలో ప్రోలాక్టిన్‌ హార్మోన్‌ స్థాయి పడిపోతుంది. కాబోయే తల్లుల చర్మం నుంచి విడుదలయ్యే ఫెర్మోన్స్‌కు ప్రతిస్పందించటం వల్లే ఇలా జరగుతుండొచ్చు. ఇదే సమయంలో మెదడులో శబ్దాలను వినే భాగం మరింత చురుకుగా మారుతుంది.
  • అందువల్లే పిల్లల ఏడ్పును త్వరగా వినగలుగుతారు. పిల్లలు పుట్టే సమయానికి వారిని కనిపెట్టుకొని ఉండటంలో మగవారు ప్రధాన బాధ్యత తీసుకునే స్థాయికి చేరుకుంటారు.


E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
వృద్ధుల్లో తికమక పడడం, మతి మరుపు వంటి లక్షణలు సహజంగా కనిపించేవే గానీ ఇందుకు బీ12 విటమిస్ లోపమూ కారణం అవుతుండొచ్చని మీకు తెలుసా? ఎందుకంటే వయసు మీద పడుతున్నకొద్దీ మనం తీసుకునే ఆహారంలోని బీ12 విటమిస్ను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. ఇది బీ12 లోపానికి దారితీస్తుంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఈ లోపం ఎక్కువవుతుండొచ్చు. దీంతో తికమకపడం, మతిమరుపు వంటి లక్షణలు కనిపిస్తాయి. ఇలాంటివి వృద్ధుల్లో కనిపిస్తే వయసుతో పాటు వచ్చే లక్షణలుగానే చాలమంది పొరపడుతుంటారు. 


మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటనికి, ఎర్ర రక్తకణాల తయారీకి బీ12 విటమిస్ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, మూత్రం ఆపుకోలేకపోవం, రక్తపోటు తక్కువ కావడం, కుంగుబాటు(డిప్రెషన్), మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు తలత్తుతాయి. ఇక లోపం మరీ తీవ్రమైతే మాత్రం రక్తహీనతకు దారితీస్తుంది. అన్ని బీ విటమిన్ల మాదిరిగానే బీ12 కూడా నీటిలో కరుగుతుంది. అయితే మోతాదు ఎక్కువగా ఉంటే దీన్ని మన శరీరం.. కాలేయం, కణజాలల్లో నిల్వ చేసుకుంటుంది. అందువల్ల ఆహారం ద్వారా తగినంత బీ12 తీసుకోకపోయినా చాలకాలం పాటు రక్తంలో దీని మోతాదు తగ్గినట్లు కనిపించదు. ఒకవేళ నిల్వ మోతాదు తక్కువగా ఉంటే చాల త్వరగానే బీ12 లోపం కనబడొచ్చు. పిల్లల్లోనైతే అంతకన్నా ముందుగానే ప్రభావం చూపుతుంది. 

వేటి ద్వారా లభిస్తుంది? 

ఆహారం పదార్థాల్లోకేవలం మాంసంలో.. ముఖ్యంగా కాలేయంలో బీ12 అధిక మొత్తంలో ఉంటుంది. సుమారు 100 గ్రాముల కాలేయం ద్వారా 83 మైక్రోగ్రాముల విటమిస్ లభిస్తుంది. చేపలు, షెల్ఫిషలో కూడా ఎక్కువగానే ఉంటుంది. పాల పదార్థాలు, గుడ్లు లలోకాస్త తక్కువ.

మాంస పదార్థాల్లో ఈ బీ12 విటమిస్ ప్రోటన్లతో కలిసిపోయి ఉంటుంది. జీర్ణాశయంలోని ఆమ్లం ఇది విడుదలయ్యేల చేస్తుంది. అయితే వయసుతో పాటే జీర్ణాశయంలోని ఆమ్లం స్థాయీ తగ్గుతుండం వల్ల వృద్ధాప్యంలో బీ12ను గ్రహించే శక్తీ మందగిస్తుంది. ఇక శాకాహారంలో బీ12 చాల తక్కువగా ఉండమే కాదు.. దీన్ని శరీరం సరిగా గ్రహించలేదు కూడా. కాబట్టి పూర్తి శాకాహారులు, వృద్ధులు వైద్యుల సలహా మేరకు బీ12 మాత్రలు వేసుకోవం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మనసుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుకోవటానికి ఆహారం బాగా తోడ్పడుతుంది. ఇందుకోసం కొంతమంది కాఫీ, టీలను ఆశ్రయిస్తుంటే.. మరికొందరు స్వీట్ల వంటివి తెగ లాగించేస్తుంటారు. నిజానికి ఇవి మనసుని ఉత్సాహ పరచినా వీటితో దుష్రభావాలు ఎక్కువ. అంతకన్నా పోషకాలు దండిగా కలిగిన ఆహార పదార్థాలు తినటం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి చాలా త్వరగా మూడ్‌నీ మార్చేస్తాయని వివరిస్తున్నారు. 

మోనోసాచ్యురేటెడ్‌ కొవ్వు, పొటాషియం:
 ఇవి మెదడుని ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడులోని నాడీకణాలు ఉత్తేజంగా ఉండేలా చేయటంలో పొటాషియం తోడ్పడుతుంది. బాదంపప్పు, వేరుశనగల్లో ఆరోగ్యకరమైన కొవ్వు.. అరటిపండు, చిలగడ దుంపల్లో బాగా పొటాషియం లభిస్తాయి. 

ట్రైప్టోఫాన్‌: 
మూడ్‌ని నియంత్రించటంలో సెరటోనిన్‌ పాత్ర చాలా కీలకం. ఇది మెదడులో న్యూరో ట్రాన్స్‌మీటర్‌గా పనిచేస్తుంది. ఈ సెరటోనిన్‌ ఎక్కువగా లభించాలంటే పాలు, చేమదుంపలు, చేమకూర, జీడిపప్పులను తింటే సరి. 

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు:
 మానసిక ఏకాగ్రత, విశ్రాంతి, కలుపుగోలుతనం పెంపొందటానికి ఒమేగా-3 కొవ్వులు సాయం చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఈ కొవ్వులు లోపించటం వల్ల కుంగుబాటు, చిరాకు బాధించే అవకాశం ఉంది. అందుకే వీటిని పొందాలంటే ఆకుకూరలు.. చేపలు.. అవిసెగింజలు తీసుకుంటే మేలు.

ఫోలిక్‌ యాసిడ్‌, బి6 విటమిన్‌: 
కుంగుబాటుని దూరం చేసేందుకు ఈ రెండు విటమిన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి తాజా కూరగాయలు, కాలేయం, పప్పుల్లో దండిగా ఉంటాయి. 
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
చదువులు కావచ్చు.. పోటీ పరీక్షలు కావచ్చు.. విద్యార్థుల మీద రకరకాల ఒత్తిళ్లుంటాయి. అలాంటప్పుడు యోగా, ధ్యానం చాలు అని చాలామంది అంటారు. అవే కాదు... ఆహారంతోనూ ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

విటమిన్‌ 'సి': ఈ విటమిన్‌లో ఒత్తిడిని తగ్గించే గుణం ఉంటుంది. నారింజ, అనాస, టొమాటో, జామలో ఇది ఉంటుంది. మానసికంగా చిరాగ్గా, విసుగ్గా ఉన్నప్పుడు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది.  

అరటిపండు: ఒత్తిడిని తగ్గించే ఔషధాల్లో అరటి పండు ఒకటి. ఓ చిన్న పండును తింటే సరిపోతుంది. అందులో తక్కువ కెలొరీలు లభించడమే కాదు, శరీరానికి అవసరమైన చక్కెర ఆ చిన్న పండు ద్వారా అందుతుంది. 
అంతేకాదు మెదడుకు మేలు చేసే సెరటోనిన్‌ అనే రసాయనం ఉత్పన్నమవుతుంది. దీనివల్ల ఉత్సాహంగా ఉండటం సాధ్యమవుతుంది. ఒత్తిడి కూడా నియంత్రణలోకి వచ్చేస్తుంది. 

నట్స్‌: వీటిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మానసికంగానూ దృఢంగా మారతారు. ఉద్యోగినులూ, విద్యార్థినులూ వెంట ఎప్పుడూ డ్రై ప్రూట్స్‌ ఉంచుకుంటే సరిపోతుంది. అలవాటుగా మార్చుకుంటే ఇంకా మంచిది. ఒత్తిడిగా అనిపించినప్పుడు తిన్నా అది దూరమవుతుంది. 

ఓట్స్‌: ఇవి మనకు కావల్సినప్పుడు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే ఓట్స్‌తో చేసిన బిస్కెట్లు, చిక్కీలు తినడం మంచిది. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు ఒత్తిడిని దూరం చేస్తాయి. శరీరం కూడా వీటిని త్వరగా గ్రహిస్తుంది. ఓట్స్‌ తేలికపాటి ఆహారం కావడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలూ రావు.

చేప నూనె: ఎక్కువగా ఒత్తిడికి గురై, టెన్షన్లు ఎదుర్కొనేవాళ్లు..వంటకు మామూలు నూనెకు బదులు, చేప నూనెను ఎంచుకోవడం మంచిది. దీనిలో ఉండే విటమిన్‌ ఈ ఒత్తిడిని దూరం చేసే హార్మోన్లను శరీరంలోకి విడుదల చేస్తుంది. విద్యార్థులు దీనికి ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచిది.  

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
సెల్‌ఫోన్ల సాంకేతిక పరిజ్ఞానం పెరగటంతోపాటు ఉపయోగించేవారి విస్తృతీ పెరుగుతోంది. సెల్‌ఫోన్లను ఎక్కువగా వాడితే సమస్యలూ ఎక్కువేనని, వాటిలోని రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీతో అనారోగ్య సమస్యలు చోటుచేసుకుంటాయనే నేపథ్యంలో పరిశోధకులు ఎన్నో అధ్యయనాల్ని పరిశీలించారు. ఇంతకీ సెల్‌ఫోన్లతో నిజంగానే సమస్యలున్నాయా? అనే దిశగా అధ్యయనాలు సాగిస్తున్నారు. పిల్లలు, గర్భిణులు, కడుపులోని పిండాలు, వృత్తిపరంగా ఫోన్లను ఎక్కువగా వినియోగించే వారికి సెల్‌ఫోన్లతో ఎంతోకొంత హాని ఉంటోందనే వాదనల నిగ్గు తేల్చేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. 

సెల్‌ఫోన్లతో అందరూ అనుకున్నంతగా, ప్రచారం చేస్తున్నంత హాని మాత్రం లేదని కొలరాడో యూనివర్సిటీ పరిశోధకులు ఫ్రాంక్‌ బార్నెస్‌ స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు వీటితో ముప్పు ఉన్నట్లు తేలకపోయినా.. దీర్ఘకాలంలో ఎలాంటి సమస్యలు వస్తాయనే దిశగా మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందంటున్నారు. ఇవే కాకుండా సెల్‌ఫోన్‌ టవర్లపై పనిచేసే వారిపై ప్రభావం ఎలా ఉంటోందన్నదీ పరిశీలించాలంటున్నారు. పాఠశాల వయసు పిల్లలు సెల్‌ వాడటం వల్ల తలెత్తే మంచీచెడ్డల్నీ పట్టించుకోవాల్సి ఉందన్నారు. ఎందుకంటే.. పెద్దలతో పోలిస్తే.. పిల్లల్లో తల, పుర్రె పరిమాణం, మందం కొంత తక్కువగా ఉండటం వల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందా? అనేదీ గమనించాల్సి ఉందన్నారు. ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్లను చేతుల్లో పట్టుకోవటమే కాకుండా నడుము బెల్టులకూ పెట్టుకోవటం వల్ల నాడీ వ్యవస్థపై ప్రభావం ఎంతమేర ఉంటుందన్నదీ గమనించాల్సిన అవసరం ఉందని వారి వాదన. 
అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) సెల్‌ఫోన్లపై సమగ్ర అధ్యయనం చేయాలని నేషనల్‌ రీసెర్చి కౌన్సిల్‌(ఎన్‌ఆర్సీ- అమెరికా) కు పురమాయించింది. దీనికోసం భారీ వర్క్‌షాప్‌ నిర్వహించి పలు దేశాల నుంచి నిపుణుల్ని ఆహ్వానించి సెల్‌ఫోన్లపై పలు నివేదికల్ని విశ్లేషించి, దీర్ఘకాలిక వినియోగంతో వాటివల్ల తలెత్తే సమస్యల్ని విశ్లేషించారు. సెల్‌ఫోన్లు, వ్యక్తిగత కంప్యూటర్లు వంటి వాటితో వెలువడే విద్యుత్తు తరంగాల వల్ల పిల్లలు, గర్భిణులు, కడుపులోని పిండాలపై ప్రభావాన్ని దీర్ఘకాలంపాటు పరిశీలిస్తేనే ముప్పు ఏమిటనేది తెలుస్తుందని, దీనికోసం మరింతగా అధ్యయనాలు సాగాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాబోయే కాలంలో సెల్‌ఫోన్లు వినియోగించే ధోరణిలోనూ పలుమార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందనీ భావిస్తున్నారు. ఇప్పటికే చాలామేరకు సమాచారాన్ని మెసేజ్‌ల రూపంలో పంపించుకుంటూ, సంభాషణల్ని తగ్గిస్తున్నారనీ ఫలితంగా వీటితో తలెత్తే ముప్పు తీవ్రతల్లోనూ మార్పులు వచ్చే అవకాశం ఉందని శహిస్తున్నారు. కాకపోతే.. మెదళ్లు ఎదిగే దశలో పిల్లలు ఎక్కువగా వాడటమే ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ఇలాంటి అన్ని అంశాల నేపథ్యంలో సెల్‌పోన్ల వాడంకపై ఇప్పుడే తీవ్రస్థాయి ఆందోళన చెందటం అనవసరమనీ, అధ్యయన ఫలితాలు వందశాతం వెలువడ్డాకే ఒక నిర్ణయానికి రావటం శ్రేయస్కరమని స్పష్టం చేస్తున్నారు. 

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
విటమిన్‌-ఇని సమృద్ధిగా తీసుకుంటే 65 ఏళ్ల పైబడిన వృద్ధులు శారీరకంగా బలంగా ఉంటారని తాజా అధ్యయనంలో గుర్తించారు.  మన శరీరంలో తయారుకాదు, విటమిన్‌-ఇ ని ఆహార పదార్థాల ద్వారానే తీసుకోవాలి. వృక్ష సంబంధ నూనె, సోయా గింజలు, మొక్కజొన్న, ఆలివ్‌ నూనె, గుడ్డుసొన, ఆకుకూరలు వంటి ఆహార పదార్థాలతో విటమిన్‌-ఇ అందుతుంది. ఇవి యాంటీఆక్సిడెంట్లనూ అందివ్వటం వల్ల శారీరక ఆరోగ్యం చక్కగా ఉంటుందని అమెరికా పరిశోధకుల అధ్యయనంలో గుర్తించారు. విటమిన్‌-ఇ మన శరీరంలోని కణజాలాన్ని అన్నిరకాల దాడుల నుంచి రక్షిస్తుంటుంది. వృద్ధాప్య లక్షణాల్ని నెమ్మదింప జేయటంతోపాటు, చర్మ కణాలు క్షీణించటాన్నీ అడ్డుకుంటుంది. 

యేల్‌ యూనివర్సిటీ పరిశోధకులు కొంతమంది వాలంటీర్లు రక్తం శాంపిళ్లను పరీక్షించి విటమిన్ల స్థాయుల్ని గణించగా 65 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో విటమిన్‌-ఇ తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. విటమిన్‌-ఇ తక్కువగా ఉన్నవారిలో శారీరక సామర్థ్యం 1.62 రెట్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. విటమిన్‌ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాల్ని సరిపడినంతగా తీసుకుంటే ఈ సమస్య తక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. దీనికోసం సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనీ, ఆరోగ్యకరమైన ఆహారంతోనే విటమిన్‌ను పొందవచ్చని స్పష్టం చేశారు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
పొగతాగటం ఒక్క వూపిరితిత్తులనే కాదు. శరీరంలోని చాలా భాగాలనూ దెబ్బతీస్తుంది. ఈ అలవాటును ఎప్పుడు మానేస్తే అప్పట్నుంచే మంచి ఫలితం కనబడుతుందని నిపుణులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. దీన్ని
బలపరుస్తూ మరో రుజువూ లభించింది. పొగతాగే అలవాటు మానేస్తే కంట్లో శుక్లం ఏర్పడే ముప్పూ తగ్గుతున్నట్టు తాజాగా బయటపడింది. మన కంట్లో పారదర్శకమైన కటకం ఉంటుంది. దీనిలోంచి కాంతి కిరణాలు ప్రసరించి ఆయా దృశ్యాలు స్పష్టంగా కనబడతాయి. కానీ ఇది వృద్ధాప్యంలో మబ్బుమబ్బుగా (శుక్లం) మారిపోతుంది. దీంతో చూపు మసకబారుతుంది. ఇలా శుక్లం ఏర్పడటానికీ పొగ తాగే అలవాటుకూ గల సంబంధంపై స్వీడన్‌ పరిశోధకులు ఇటీవల ఒక అధ్యనం చేశారు. పొగ అలవాటు లేనివారితో పోలిస్తే.. రోజుకి 15 కన్నా ఎక్కువ సిగరెట్లు తాగినవారికి శుక్లాల ముప్పు 42% అధికంగా ఉంటున్నట్టు గుర్తించారు. అయితే పొగ మానేసిన 20 ఏళ్ల తర్వాత శుక్లాల ముప్పు 21 శాతమే ఉంటుండటం గమనార్హం. పొగ తాగటానికీ ఇతర కంటి సమస్యలకూ సంబంధం ఉండటం వల్ల దీన్ని అలవాటు చేసుకోకపోవటమే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ పొగ అలవాటుంటే దాన్ని మానేయటం ఉత్తమమని సూచిస్తున్నారు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మన గుండె నిరంతరం లబ్‌డబ్‌మని కొట్టుకుంటూ ఉంటుంది కదా. ఇది సమర్థవంతంగా పనిచేస్తేనే శరీరంలోని అన్ని భాగాలకు తగినంత రక్తం పంప్‌ అవుతుంది. సాధారణంగా మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఈ వేగం (పల్స్‌) మన శరీర సామర్థ్యాన్నే కాదు.. గుండె ఆరోగ్యాన్నీ, ఇతర సమస్యలనూ పట్టి చూపుతుంది. అందువల్ల గుండె వేగం గురించి అవగాహన కలిగి ఉండటం అవసరం.  

గుండె సాధారణ (నార్మల్‌) వేగం ఒకొకరిలో ఒకోరకంగా ఉంటుంది. వయసు పెరుగుతున్నకొద్దీ గుండె వేగంలో మార్పులొస్తాయి. మణికట్లు, మోచేయి, మెడ, పాదంపైన పల్స్‌ను స్పష్టంగా గుర్తించొచ్చు. ఈ భాగాల్లో వేలిని పెట్టి 60 సెకండ్లలో నాడి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో లెక్కిస్తే గుండె వేగం తెలుస్తుంది. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మన శరీరానికి రక్తసరఫరా అంతగా అవసరముండదు. కాబట్టి గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది. ఎలాంటి జబ్బులూలేని పెద్దవారిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుండె 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. తీవ్రంగా శారీరక శ్రమ, వ్యాయామం చేసేవారికి, క్రీడాకారుల్లో గుండె కండరం బలంగా ఉండటం వల్ల విశ్రాంతి సమయంలో ఈ నాడి వేగం 60 కన్నా తక్కువగా ఉండొచ్చు. రక్తపోటును తగ్గించే బీటా బ్లాకర్‌ మందులు, గుండెలయను సరిచేసే మందులు వేసుకునేవారు గుండెవేగంపై ఓ కన్నేసి ఉంచటం మంచిది. ఇలాంటి వారిలో ఏవైనా తేడాలు కనిపిస్తే మందుల మోతాదు మార్చటమో, వేరే మందులకు మారటమో చేయాల్సి ఉంటుంది. గుండెవేగం చాలా తక్కువగా ఉన్నా, తరచుగా గుండెవేగం పెరుగుతున్నా, ముఖ్యంగా బలహీనత, తలతిప్పు, వణుకు వంటివి ఉంటే వెంటనే డాక్టర్‌కి చూపించుకోవటం మంచిది. ఏవైనా సమస్యలుంటే ముందుగానే జాగ్రత్త పడే అవకాశముటుంది.  

వేగాన్ని పెంచే కారకాలు 

  • భావోద్వేగాలు: ఒత్తిడి, ఆందోళన, విచారం, సంతోషం వంటి భావోద్వేగాలకు గురైనప్పుడూ గుండెవేగం పెరుగుతుంది. 
  • శరీర భంగిమ: విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, కూచున్నప్పుడు, నిలబడినప్పుడు గుండె వేగం ఒకేలా ఉంటుంది. అయితే కొన్నిసార్లు నిలబడిన వెంటనే 15-20 సెకండ్ల పాటు ఇది కాస్త పెరగొచ్చు. కానీ కొద్దిసేపట్లోనే వేగం సర్దుకుంటుంది. 
  • వూబకాయం: భారీ వూబకాయుల్లో విశ్రాంతి సమయంలో గుండెవేగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది సాధారణంగా 100కు మించకపోవచ్చు. 
  • ఉష్ణోగ్రత: వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ పెరిగినపుడు గుండె మరింత ఎక్కువగా రక్తాన్ని పంప్‌ చేయాల్సి వస్తుంది. దీంతో గుండె నిమిషానికి 5-10 సార్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. 

వేగాన్ని ఎంతవరకు పెంచొచ్చు?

వ్యాయామం చేసినపుడు గుండె సాధ్యమైనంత ఎక్కువగా కొట్టుకునేలా చూసుకోగలిగితే మంచిదని నిపుణులు సూచిస్తుంటారు.
అయితే ఈ గరిష్ఠ గుండెవేగాన్ని గుర్తించటమెలా? దీనికి తేలికైన సూత్రముంది. 220లోంచి వ్యక్తి వయసును తీసేస్తే.. వచ్చే సంఖ్యను గరిష్ఠ గుండెవేగంగా పరిగణించొచ్చు. అంటే 40 ఏళ్ల వ్యక్తి నిమిషానికి గరిష్ఠంగా 180 సార్లు గుండె కొట్టుకునేవరకు వ్యాయామం చేయొచ్చన్నమాట. అయితే ఇది ఆయా వ్యక్తుల సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని మరవరాదు. కచ్చితంగా ఎంతమేరకు వ్యాయామం చేయాలనేది డాక్టర్ల సూచనల మేరకు నిర్ణయించుకోవాలి.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మామూలుగా విశ్రాంతి తీసుకునేప్పుడు గుండె తక్కువ గా కొట్టుకుంటుంది. అదే తొందరగా నడిచేప్పుడు లేదా పరుగెత్తేప్పుడు అడ్రినాలిన్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రసరించడంతో గుండె స్పందనలు పెరుగుతాయి. ఇలా గుండె వేగంగా కొట్టుకోవడాన్ని గుండెదడగా పేర్కొనవచ్చు. ఇది కొన్ని నిమిషాలు లేదా గంటల నుంచి ఒక్కోసారి కొన్ని రోజులు కూడా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అధికంగా వచ్చే గుండె తరంగాలు గుండె సైనస్నోడ్ నుంచే కాకుండా గుండెలోని వేర్వేరు ప్రదేశాల నుంచి రావచ్చు. అంతేకాదు కొన్నిసార్లు ఎలక్ట్రిక్ సర్క్యూట్లో అదనంగా ఏర్పడిన తరంగాల అనియంత్రితంగా గుండెకు చేరి గుండెదడకు కారణం కావచ్చు.

గుండెదడ లక్షణాలు

గుండెదడ వచ్చినప్పుడు సాధారణంగా కనిపించే లక్ష ణాలివి...
  • ఆయాసం 
  • తలతిరగడం
  •  కొన్నిసార్లు స్పృహ కోల్పోవడం కూడా జరగవచ్చు.


చికిత్స

గుండెదడకు చికిత్స అనేది రోగి పడే ఇబ్బంది మీద ఆధారపడి ఉంటుంది. గుండెదడ వల్ల ఇబ్బంది తక్కువగా ఉంటే దాన్ని ప్రత్యేకమైన చికిత్స ఏదీ అవసరం లేదు. డాక్టర్ రోగికి కొన్ని చిట్కాలు సూచిస్తారు. చల్లనినీళ్లతో ముఖం కడుక్కోవడం, ఊపిరి బిగబట్టి ముక్కడం వంటి చాలా సాధారణ చిట్కాలతో దీన్ని అధిగమించవచ్చు.

గుండెదడ అనియంత్రితంగా జరుగుతుంటే మాత్రం చికిత్స అవసరమవుతుంది. అప్పుడు దీనికోసం కొన్ని మందులు వాడటం లేదా అబ్లేషన్ చికిత్స ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. గుండెదడను నియంత్రించడానికి ఉపయోగించే మందులు చాలా రకాలుగా ఉంటాయి. గుండెలో ని ఎలక్ట్రికల్ సిస్టమ్లో అధిక ప్రకంపనలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయో నిర్ధారణ చేసి, తగిన మందులను గుండె వ్యాధి నిపుణులు సూచిస్తారు. సాధారణంగా 90 శాతం వ్యక్తుల్లో కేవలం మందుల ద్వారానే ఈ సమస్యను నియంత్రించవచ్చు. అయితే ఈ తరహా మందులను జీవితాంతం వాడాల్సి రావడం వల్ల వీటి తాలూకు దుష్పరిణావూలు (సైడ్ ఎఫెక్ట్స్) తలెత్తే అవకావం ఉండవచ్చు. అందుకే ఒకవేళ మందులు పనిచేయకపోయినా లేదా మందుల కారణంగా దుష్ర్పభావాలు కనిపించినా అబ్లేషన్ పద్ధతి ద్వారా గుండెలోని ఏస్థానం నుంచి అధికంగా విద్యుత్ తరంగాలు తయారవుతున్నాయో చూసి, వాటిని సరిచేస్తారు. ఈ అబ్లేషన్ చికిత్స అంత సంక్లిష్టమైనది కూడా కాదు.

సురక్షితమైనది కూడా. పైగా గుండెదడను నియంత్రించడా నికి ఒకసారి అబ్లేషన్ చికిత్స చేయించాక ఇక జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. కాకపోతే కొన్నిసార్లు అబ్లేషన్ చికిత్స చేశాక ఆ తర్వాత గుండెకు సరఫరా అయ్యే రక్తాన్ని పలుచబార్చడం కోసం ‘ఆస్పిరిన్’మందును ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే ఈ తరహా చికిత్స గురించి రోగులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

చాలా సందర్భాల్లో కేవలం ఆందోళన వల్లనే... 

గుండెదడ అన్నది చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరికీ కని పించే అంశమే. ఇది కేవలం మానసిక ఆందోళన వల్ల కూడా జరిగే అవకాశాలే ఎక్కువ. వ్యక్తిగత లక్షణాలలో భాగంగా కొందరికి చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందడం తేలిగ్గా ఉద్రేకాలను లోనుకావడం వంటివి సంభవించ వచ్చు. ఇలా జరిగేప్పుడు వచ్చే గుండెదడ చాలా తాత్కాలికం. దీనికి ఎలాంటి చికిత్స కూడా అవసరం లేదు.

కాకపోతే ఈ ఇబ్బందిని అధిగమించడానికి ఆందోళనలను నియంత్రించుకునేలా యోగా, ధ్యానం వంటి చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు. అయితే ఈ తరహా చిట్కాలు కూడా ప్రయోజనం ఇవ్వని సందర్భాల్లో మందులు వాడాల్సి ఉంటుంది. కాబట్టి గుండెదడ కనిపించినప్పుడు అది రోగికి ఆరోగ్యపరంగా ఇబ్బందినీ, సమస్యను కలిగించే స్థాయిలో ఉందా లేదా అన్నది హృద్రోగ నిపుణులతో పరీక్షింపజేసు కుని, అది పెద్ద ప్రమాదకరమైన విషయం కాదని వారు భరోసా ఇచ్చాక దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే అది ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువ అన్నప్పుడే చికిత్స అవసరమని గుర్తిస్తే చాలు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
గుండెదడ... ఇది ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరికీ అనుభవం లోకి వచ్చే అంశమే. పరీక్షలకు వెళ్లేప్పుడో, ఏ విషయం గురించైనా ఆందోళనతో ఎదురు చూసేటప్పుడో, ఏదైనా వినకూడని విషయం వినాల్సి వస్తుందనప్పుడో గుండె దడ కలగడం సర్వసాధారణం. అయితే ఇది సాధారణంగా కాకుండా కొన్ని సార్లు ఇబ్బంది కలిగేలా కూడా ఉండవచ్చు. అలాంటప్పుడే చికిత్స అవసరమవుతుంది. గుండెదడకు కారణాలు, అది వచ్చినప్పుడు కలిగే పరిణామాలు, దాన్ని సరిచేయడానికి అవసరమైన చికిత్స ప్రక్రియల వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.
గుండె స్పందనలు కలగడం ప్రతి వ్యక్తిలోనూ కనిపించే అంశమే. అయితే అలా గుండె స్పందనలు మనలో ఎవరికీ తెలియకుండానే జరిగిపోతుంటాయి. కొందరిలో గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండవచ్చు. లేదా మరింత నెమ్మదిగా కూడా జరుగుతుండవచ్చు. ఒక వ్యక్తిలో గుండె కొట్టుకోవడం ఆ వ్యక్తికే తెలిసేలా జరుగుతుంటే దాన్ని గుండెదడగాచెప్పవచ్చు.

గుండెదడ అంటే...

గుండెదడ అన్నది ఒక వ్యాధి కావచ్చు. లేదా ఏదైనా వ్యాధికి అది లక్షణం కూడా కావచ్చు. రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, మానసిక ఆందోళన, గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గడం లాంటి అనేక వ్యాధుల్లో కూడా గుండెదడ ప్రధాన లక్షణం. ఈ కారణంగా వచ్చే గుండెదడ... ప్రధాన వ్యాధికి తగిన చికిత్స చేస్తే తగ్గిపోతుంది. చాలా సందర్భాల్లో గుండె దడకు ప్రధాన కారణం ఇదే. కాబట్టి దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మరికొందరిలో మాత్రం గుండెకు జరిగే విద్యుత్ సరఫరా సర్క్యూట్లో తేడాలు రావడం వల్ల గుండె స్పందనల్లో హెచ్చుతగ్గులు రావడం సంభవిస్తుంది. గుండె కొట్టుకోవాల్సిన దానికంటే ఎక్కువగా కొట్టుకుంటుంటే దాన్ని ‘టాకికార్డియా’ అని, నెమ్మదిగా కొట్టుకుంటే దాన్ని ‘బ్రాడీకార్డియా’ అని వైద్య పరిభాషలో చెబుతుంటారు.

గుండె ఎలక్ట్రిక్ సర్క్యుట్ ప్రాధాన్యం...

గుండె లయబద్ధంగా (నిమిషానికి 60 నుంచి 100 సార్లు) స్పందించడానికి అవసరమైన కండరశక్తిని సమకూర్చడంలో గుండె తాలూకు ఎలక్ట్రిక్ సర్క్యూట్ అత్యంత కీలకం. గుండె కచ్చితంగా నిర్ణీత వేగంతో కొట్టుకోడానికి అత్యంత క్రమశిక్షణతో గుండెకు అవసరమైన ఎలక్ట్రిక్ తరంగాలను ఇచ్చే పేస్మేకర్ గుండెలోని కుడి కర్ణికలో ఉంటుంది. దీనిపేరే ‘సైనస్ నోడ్’. ఇది గుండె తాలూకు పవర్హౌస్లా పరిగణించవచ్చు. ఇక్కడ తయారైన విద్యుత్ తరంగాలు కర్ణిక (ఏట్రియమ్), జఠరిక (వెంట్రికిల్)ల కూడలి వద్ద ఉన్న ఏట్రియోవెంట్రిక్యులార్ నోడ్ దగ్గరకు వస్తాయి. గుండె విద్యుత్ తరంగాలు కొన్ని పరిస్థితుల్లో ఎక్కువగా తయారైనా ఈ ఏట్రియోవెంట్రిక్యులార్ నోడ్ వాటిని గుండెకు చేర కుండా నియంత్రిస్తుంటుంది. అందుకని దీనిని గుండె తాలూకు ఎలక్ట్రికల్ సర్క్యూట్కి పోలీస్ ఆఫీసర్లాగా భావించవచ్చు. ఈ ఏవీనోడ్ నుంచి విద్యుత్ తరంగాలు గుండె ఎడమ జఠరిక (వెంట్రికల్) నుంచి కుడి (జఠరిక) వెంట్రికల్కు ప్రసరిస్తాయి. ఇది సాధారణ స్పందనల్లో జరిగే ప్రక్రియ.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
గుండెపోటు అన్నది గుండె రక్తనాళాల్లో కొవ్వు చేరడం వల్ల గుండె కండరానికి తగినంత రక్తసరఫరా జరగకపోవడం వల్ల వచ్చే సమస్య. గుండెదడ అన్నది గుండె ఎలక్ట్రిక్ సిస్టమ్లో మార్పు రావడం వల్ల సంభవించేది. కాబట్టి గుండెదడ, గుండెపోటు వేర్వేరు సమస్యలు. వాటికి కారణాలు, పర్యవసానాలు, వైద్యచికిత్స కూడా వేరుగా ఉంటాయి. గుండెలో నాలుగు గదులు ఉంటాయి. పైన రెండు గదులను కుడి, ఎడమ కర్ణికలు (ఏట్రియమ్) అంటారు. వీటిలో రక్తం నిల్వ ఉంటుంది. కింద రెండు గదులను కుడి, ఎడమ జఠరిక (వెంట్రికిల్) అంటారు. ఈ రెండు గదుల నుంచి నిరంతరం శరీరానికి రక్తం సరఫరా అవుతుంటుంది. 

వ్యాధి నిర్ధారణ : గుండెదడ వచ్చినప్పుడు అది ఏ రకానికి చెందినదో నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. కొంతమందికి గుండె కొట్టుకోవడం మామూలుగా ఉన్నా గుండె ఎక్కువగా కొట్టు కుంటోందనే అపోహ ఉంటుంది. కాబట్టి గుండె తరంగాలను ఈసీజీ ద్వారా రికార్డ్ చేయడం ద్వారా గుండె స్పందనలు మామూలుగా ఉన్నాయా లేక అసాధారణంగా ఉన్నాయా అన్నది నిర్ధారణ చేయవచ్చు. కొన్నిసార్లు 24 గంట పాటు ఈసీజీ తీసి పరీక్షించడానికి హోల్టర్ అనే పరికరాన్ని కూడా అమర్చాల్సి రావచ్చు. మరికొన్నిసార్లు టీఎంటీ పరీక్ష కూడా అవసరం కావచ్చు. అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఏది ఎప్పుడు చేయాల న్నది వైద్యులు సూచిస్తారు. 

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
"జుట్టు తెల్లబడి, చర్మం ముడుతలు పడడమే వయసు మీద పడిందనడానికి గుర్తనుకుంటే పొరపాటు. అసలు మొత్తం శరీరానికి ఒకటే వయసు ఉంటుందనుకుంటే అది ఇంకా పెద్ద పొరపాటు. శరీరంలోని చాలా భాగాలు మీ వయసు కంటే ముందుగానే ముసలివి అవుతాయి'' అంటున్నారు క్లినీషియన్ (clinician) డాక్టర్ యాంజిలా ఎపిస్టిన్. ఆమె లెక్క ప్రకారం మనని ప్రతిక్షణం నడిపించే మెదడు 20 యేళ్ల నుంచే ముసలిదవడం ప్రారంభమవుతుందట. మరి మిగతా భాగాల సంగతో అంటున్నారా. వివరాలు చెప్పే కథనమే ఇది.


గుండె : గుండె వృద్ధాప్యం నలభై యేళ్ల నుంచి మొదలవుతుంది. వయసు మీద పడుతున్న కొద్దీ శరీరంలోకి రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేదు. కారణం రక్తనాళాల్లో సాగేగుణం తగ్గిపోవడమే. ధమనులు గట్టిపడతాయి లేదా కొవ్వు రక్త నాళాల్లో అడ్డుపడుతుంది. శాచ్యురేటెడ్ ఫ్యాట్ పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల కరొనరి ఆర్టరీల్లో కొవ్వు డిపాజిట్లు ఏర్పడతాయి. దాంతో గుండెకు రక్త సరఫరా తగ్గిపోతుంది. యాంజినా నొప్పి వస్తుంది. 45 యేళ్లు పైబడిన పురుషుల్లో, 55 యేళ్లు పైబడిన మహిళల్లో హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువగా ఉండేది అందుకే.
మెదడు : మీకు 20 యేళ్ల వయసుండగానే మెదడు ముసలిదైపోవడం మొదలవుతుంది. పుట్టినపుడు వంద బిలియన్లు ఉండే న్యూరాన్లు 20 యేళ్లు వచ్చేసరికి తగ్గిపోవడం మొదలవుతుంది. 40 యేళ్లు వచ్చేసరికి రోజుకి పదివేల కణాల చొప్పున కోల్పోతుంటాం. అందుకే జ్ఞాపకశక్తిలో తేడాలు, సమన్వయ లోపాల వంటి సమస్యలు వచ్చి మెదడు పనితీరులోనే మార్పు వస్తుంది.
కళ్లు: ఇవి నలభై యేళ్ల నుంచి ముసలివవడం మొదలవుతుంది. అప్పట్నించి కంటిచూపులో తేడా వస్తుంది. దీనికి కారణం కంటి కండరాలు బలహీనమవడమే.
గొంతు : దీని వృద్ధాప్యం 65 యేళ్ల నుంచి మొదలవుతుంది. గొంతు గరుకుగా మారుతుంటుంది. స్వరపేటికలో ఉండే మృదుత్వచాలు బలహీనమవడం వల్ల పరిస్థితి వస్తుతంది. మహిళల గొంతు బొంగురుగా మారితే మగవాళ్ల గొంతు సన్నగా ఉంటుంది.
దంతాలు : 40 నుంచి వయసు మీద పడుతుంది వీటికి. బ్యాక్టీరియాని కడిగి పారేసే లాలాజలం తక్కువగా విడుదలవడం వల్ల దంతాలు, చిగుళ్లు బలహీనమై ఖాళీలు ఏర్పడతాయి.
కండరాలు: వీటికి వృద్ధాప్యం 30 నుంచే మొదలవుతుంది. యువతలో కండరాలు ఏర్పడటం, విడిపోవటం సమతుల్యంగా జరుగుతుంటుంది. 30 యేళ్ల తర్వాత విడిపోవడం పెరిగిపోయి, కొత్తగా తయారవడం తగ్గిపోతుంది. అందుకే 40 యేళ్ల తర్వాత ఏడాదికి 0.5 నుంచి రెండు శాతం వరకు కండరాలు కోల్పోతారు. దీన్ని నివారించాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి మించిన పరిష్కారం లేదు.

కాలేయం : అన్నిటికంటే ఆలస్యంగా ముసలిదయ్యేది ఇదే. 70 ఏళ్ల దాకా దీనికి వృద్ధాప్యం రాదు. కాలేయానికి కణాలని పునరుజ్జీవం చేసుకునే సామర్ధ్యం ఉంటుంది. కాలేయ దాతకి ఆల్కహాల్ తాగే అలవాటు లేకుండా, ఇన్ఫెక్షన్లు లేకపోతే 70 యేళ్ల వయసున్న వాళ్ల కాలేయాన్ని 20 యేళ్ల వయసున్న వాళ్లకి కూడా అమర్చొచ్చు.


ఊపిరితిత్తులు : ఇవి కూడా 20 యేళ్ల నుంచే ముసలివి అవడం ప్రారంభమవుతుంది. వయసు నుంచే ఊపిరితిత్తుల సామర్థ్యం నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. 40 యేళ్ల వాళ్లలో కొందరికి అప్పుడప్పుడు ఊపిరాడనట్టు ఉంటుంది. దీనికి కారణం శ్వాసను అదుపులోఉంచే కండరాలు, పక్కటెముకలు గట్టిపడడమే. దాంతో ఊపిరితిత్తులు పనిచేయడం కష్టమవుతుంది. అంటే శ్వాస బయటకు వదిలిన తరువాత కూడా కొంత గాలి ఊపిరితిత్తుల్లో ఉండి శ్వాస ఆడనీయదు. 30 యేళ్ల వాళ్లు లోనికి తీసుకునే ఒక శ్వాసలో సగటున 2 పింట్స్ అంటే దాదాపు 950 మిల్లీలీటర్ల గాలి ఉంటే 70 యేళ్ల వ్యక్తి ఒక పింట్ మాత్రమే తీసుకోగలరు.

మూత్రపిండాలు : 50 యేళ్ల నుంచి వీటి వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. రక్తంలో ఉండే చెత్తను తీసిపారేసే ఫిల్టర్లు అయిన నెఫ్రాన్స్ అప్పటికి తగ్గిపోతాయి. దీనివల్లే రాత్రుళ్లు ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుంది.

వినికిడి : 50 లనుంచి దీనికి ఓల్డ్ ఏజ్ ఆరంభం. సగానికి సగం మంది 60 యేళ్లు వచ్చేసరికి వినికిడి లోపంతో బాధపడుతుంటారు. స్థితిని ప్రెస్బీక్యుసిస్ అంటారు. దీనికి కారణం లోపలి చెవిలోని చిన్న సెన్సరీ కణాలు శిథిలమవడమే. ధ్వని తరంగాలను గ్రహించి మెదడుకు పంపించే కణాలివే.

చర్మం: దీని వృద్ధాప్యం 20 యేళ్ల నుంచే మొదలవుతుంది. కొత్త చర్మం తయారవ్వాలంటే మృతకణాలు త్వరగా రాలిపోవాలి. అలా జరగకపోవడం వల్ల చర్మం ముడుతలు, పలుచబడడం వంటివి జరుగుతాయి. చర్మం ముడుతలు పడడం అనేది 30 మధ్య నుంచి క్రమేపి పెరుగుతుంది.

రుచి-వాసన: 60 వరకు నో ప్రాబ్లమ్. పదివేల రుచి మొగ్గలున్న నాలుకతో జీవితం మొదలయితే తరువాత వీటి సంఖ్య సగానికి సగం తగ్గిపోతుంది. 60 యేళ్లకి రుచి, వాసన రెండూ తగ్గుతాయి.

ఎముకలు : 35 యేళ్ల వయసు నుంచే ఇది ముసలిదవడం మొదలవుతుంది. పిల్లల్లో ఎముకల పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. కాబట్టి అస్తిపంజరం ఏర్పడేందుకు వారికి రెండేళ్లు పడితే పెద్దవాళ్లకు పదేళ్లు పడుతుంది. 20 యేళ్ల వరకు ఎముకల సాంద్రత పెరుగుతుంది.కాని 35 దాటాక తగ్గుతుంది. స్థితి మెనోపాజ్కి ముందు మహిళల్లో ఇంకా తీవ్రంగా ఉంటుంది. దానివల్లే ఎముకలు పలుచబడి ఆస్టియోపొరోసిస్ బారిన పడతారు. సైజు, సాంద్రతల్లో తగ్గుదల మొదలవడం వల్ల ఎత్తులో కూడా మార్పు వస్తుంది.  80 యేళ్లు వచ్చేసరికి రెండు అంగుళాల ఎత్తు తగ్గిపోవడానికి కారణం ఇదే.

జుట్టు : 30 యేళ్ల నుంచే ముసలిదవుతుంది. మగవాళ్లలో జుట్టు రాలిపోవడం 30లనుంచే ఉంటుంది. చర్మం కింద ఉన్న ఫాలికిల్ అనే చిన్న చిన్న పాకెట్ల నుంచి జుట్టు తయారవుతుంది. ఒక్కో ఫాలికిల్ నుంచి మూడేళ్ల పాటు వెంట్రుక పెరుగుతుంది. తరువాత రాలిపోయి కొత్త వెంట్రుక వస్తుంది.

మగవారికి బట్టతల ఎందుకొస్తుందంటే 30 కంటే ముందునుంచే వాళ్లలో టెస్టోస్టిరాన్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. ప్రభావం పైన చెప్పిన సైకిల్ మీద ఉంటుంది. దానివల్ల ఫాలికిల్స్ ముడుచుకుపోతాయి. దాంతో కొత్తగా వచ్చే ప్రతీ వెంట్రుకా అంతకుముందు వచ్చిన దానికంటే చిన్నదిగా వస్తుంది. దాంతో అది చర్మాన్ని దాటుకుని బయటికి రాలేదు.
పేగు లేదా ఆంత్రం (గట్): మనకు 55 యేళ్లు వచ్చేవరకు ఇది బాగానే పనిచేస్తుంది. ఆరోగ్యంగా ఉన్న గట్ హానికారక, స్నేహపూరిత బ్యాక్టీరియాలను సమతుల్యం చేస్తుంటుంది. 55 యేళ్ల తరువాత నుంచి స్నేహపూరిత బ్యాక్టీరియా తగ్గిపోతుంటుంది. ఇది పెద్దపేగు విషయంలో మరింత స్పష్టంగా తెలుస్తుంది. జీర్ణక్రియ సరిగా లేకపోవడం, గట్కి సంబంధించి పలు వ్యాధులు రావడం ఇందుకు నిదర్శనం. వయసుతో పాటు మలబద్ధకం పెరగడం కూడా ఇందుకే. ఉదరం, కాలేయం, క్లోమగ్రంధులు, చిన్న పేగుల నుంచి విడుదలయ్యే జీర్ణరసాలు నెమ్మదిస్తాయి.


ఫెర్టిలిటీ : ఇది ముసలిదవ్వడం 35 యేళ్ల నుంచి మొదలవుతుంది. అండాల నాణ్యత, సంఖ్య తగ్గు ముఖం పడతాయి. అండాశయ పొర పలుచబడడం మొదలవుతుంది. దాంతో అండాల ఫలదీకరణ సరిగా జరగదు. అలాగే వీర్యకణాలకు సరైన వాతావరణం కూడా ఉండదు.