Articles by "Gents Health"
Gents Health లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మగవాళ్లు ఎందుకు అబద్ధాలు చెబుతారు? సాహసాలు చేయటానికి ముందుకెందుకు దూకుతారు? భావోద్వేగాలను వ్యక్తం చేయకుండా లోపలే ఎందుకు దాచుకుంటారు? వీటన్నింటికీ టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ ప్రభావమే కారణమని చెబుతున్నారు అమెరికా సైకియాట్రిస్ట్‌లు. వారు ఆడవారు, మగవారి ఆలోచనలు, ప్రవర్తనలకు గల తేడాలను విశ్లేషించారు. అందుకు కారణమవుతున్న అంశాలనూ వివరించారు.  అందులో కొన్ని విషయాలు మీ కోసం..


  • గర్భంలో ఉండగానే ఎనిమిదో వారం నుంచే మగశిశువు మెదడుపై టెస్టోస్టీరాన్‌ ప్రభావం పడుతోంది. దీంతోనే అబద్ధాలు ఆడటం, సాహసం చేయటం, భావోద్వేగాలను అణచుకోవటం వంటి లక్షణాలకు బీజం పడుతోంది.
  • యుక్తవయసులో మగపిల్లలు ఇతరులను ఎక్కువగా విమర్శిస్తుంటారు. అన్నింటి పైనా త్వరగా ఆసక్తి కోల్పోతుంటారు. మెదడును టెస్టోస్టీరాన్‌ ఎక్కువగా ప్రభావితం చేయటం వల్ల.. అసాధారణమైన భావోద్వేగాలు మాత్రమే వారిని ఉత్తేజితం చేయగలుగుతాయి. అందుకే ఉద్వేగభరితమైన వీడియోగేమ్‌లను ఆడేందుకు మగపిల్లలు ఇష్టపడుతుంటారు.
  • సంభోగానంతరం ఆనందాన్ని కలగజేసే ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ హైపోథాలమస్‌లోకి విడుదల అవుతుంది. దీని ప్రభావంతో ఆడవాళ్లు తమ భాగస్వాములను హత్తుకోవాలని, మాట్లాడాలని భావిస్తుంటే.. మగవారిలో ఇది నిద్ర మాత్రలా పనిచేసి మగతను కలిగిస్తుంది. అందుకే వారు శృంగారంలో పాల్గొన్న తర్వాత వెంటనే నిద్రపోతుంటారు.
  • ఎవరైనా ఏదైనా సమస్యను మగవారికి చెప్పగానే సానుభూతికి బదులు ఏదో ఒక పరిష్కారాన్నే సూచిస్తుంటారు. మెదడులోని టెంపోరల్‌ పార్షల్‌ జంక్షన్‌ వ్యవస్థ చురుగ్గా పనిచేసి విశ్లేషణకు పురికొల్పటమే ఇందుకు కారణమవుతోంది. ఆ సమయంలో ఈ జంక్షన్‌. భావోద్వేగాలను రేకెత్తించే భాగంపై ఆధిపత్యం చెలాయిస్తుంది.
  • అయితే ఆడవారిలో ఇందుకు వ్యతిరేకంగా జరుగుతుంది. అందుకే స్త్రీలు పరిష్కారాలను సూచించే తార్కికత కంటే భావోద్వేగాలకే ఎక్కువ లోనవుతుంటారు.
  • కాబోయే తండ్రుల్లో టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ స్థాయి పెరుగుతుంది. అదే సమయంలో ప్రోలాక్టిన్‌ హార్మోన్‌ స్థాయి పడిపోతుంది. కాబోయే తల్లుల చర్మం నుంచి విడుదలయ్యే ఫెర్మోన్స్‌కు ప్రతిస్పందించటం వల్లే ఇలా జరగుతుండొచ్చు. ఇదే సమయంలో మెదడులో శబ్దాలను వినే భాగం మరింత చురుకుగా మారుతుంది.
  • అందువల్లే పిల్లల ఏడ్పును త్వరగా వినగలుగుతారు. పిల్లలు పుట్టే సమయానికి వారిని కనిపెట్టుకొని ఉండటంలో మగవారు ప్రధాన బాధ్యత తీసుకునే స్థాయికి చేరుకుంటారు.


E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
వృద్ధుల్లో తికమక పడడం, మతి మరుపు వంటి లక్షణలు సహజంగా కనిపించేవే గానీ ఇందుకు బీ12 విటమిస్ లోపమూ కారణం అవుతుండొచ్చని మీకు తెలుసా? ఎందుకంటే వయసు మీద పడుతున్నకొద్దీ మనం తీసుకునే ఆహారంలోని బీ12 విటమిస్ను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. ఇది బీ12 లోపానికి దారితీస్తుంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఈ లోపం ఎక్కువవుతుండొచ్చు. దీంతో తికమకపడం, మతిమరుపు వంటి లక్షణలు కనిపిస్తాయి. ఇలాంటివి వృద్ధుల్లో కనిపిస్తే వయసుతో పాటు వచ్చే లక్షణలుగానే చాలమంది పొరపడుతుంటారు. 


మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటనికి, ఎర్ర రక్తకణాల తయారీకి బీ12 విటమిస్ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, మూత్రం ఆపుకోలేకపోవం, రక్తపోటు తక్కువ కావడం, కుంగుబాటు(డిప్రెషన్), మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు తలత్తుతాయి. ఇక లోపం మరీ తీవ్రమైతే మాత్రం రక్తహీనతకు దారితీస్తుంది. అన్ని బీ విటమిన్ల మాదిరిగానే బీ12 కూడా నీటిలో కరుగుతుంది. అయితే మోతాదు ఎక్కువగా ఉంటే దీన్ని మన శరీరం.. కాలేయం, కణజాలల్లో నిల్వ చేసుకుంటుంది. అందువల్ల ఆహారం ద్వారా తగినంత బీ12 తీసుకోకపోయినా చాలకాలం పాటు రక్తంలో దీని మోతాదు తగ్గినట్లు కనిపించదు. ఒకవేళ నిల్వ మోతాదు తక్కువగా ఉంటే చాల త్వరగానే బీ12 లోపం కనబడొచ్చు. పిల్లల్లోనైతే అంతకన్నా ముందుగానే ప్రభావం చూపుతుంది. 

వేటి ద్వారా లభిస్తుంది? 

ఆహారం పదార్థాల్లోకేవలం మాంసంలో.. ముఖ్యంగా కాలేయంలో బీ12 అధిక మొత్తంలో ఉంటుంది. సుమారు 100 గ్రాముల కాలేయం ద్వారా 83 మైక్రోగ్రాముల విటమిస్ లభిస్తుంది. చేపలు, షెల్ఫిషలో కూడా ఎక్కువగానే ఉంటుంది. పాల పదార్థాలు, గుడ్లు లలోకాస్త తక్కువ.

మాంస పదార్థాల్లో ఈ బీ12 విటమిస్ ప్రోటన్లతో కలిసిపోయి ఉంటుంది. జీర్ణాశయంలోని ఆమ్లం ఇది విడుదలయ్యేల చేస్తుంది. అయితే వయసుతో పాటే జీర్ణాశయంలోని ఆమ్లం స్థాయీ తగ్గుతుండం వల్ల వృద్ధాప్యంలో బీ12ను గ్రహించే శక్తీ మందగిస్తుంది. ఇక శాకాహారంలో బీ12 చాల తక్కువగా ఉండమే కాదు.. దీన్ని శరీరం సరిగా గ్రహించలేదు కూడా. కాబట్టి పూర్తి శాకాహారులు, వృద్ధులు వైద్యుల సలహా మేరకు బీ12 మాత్రలు వేసుకోవం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ఈ మధ్య మీకు కారణం తెలియకుండానే తలనొప్పి వేధిస్తోందా? దీనికేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మీ విధి నిర్వహణలో భాగంగా తలెత్తిన ఒత్తిడి. దీన్ని పట్టించుకోకపోతే డిప్రెషన్‌లోకీ దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

భారత పరిశ్రమల అనుబంధ సంస్థ- అసోచామ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక సర్వేలో.. మనదేశంలో పలురంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి, బడలిక అధికంగా ఉంటున్నట్లు గుర్తించారు. భారతీయ ఉద్యోగివర్గంలో ఇంటికీ, ఆఫీసు పనికీ మధ్య తేడా చెదిరిపోతున్నట్లు తేల్చారు. పనివేళలు ఎక్కువవ్వటం, అసాధారణ పని వేళల్లో విధులు నిర్వర్తించాల్సి రావటం వంటివన్నీ మానసిక ఒత్తిడులను అంతకంతకూ పెంచుతూ పలురకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఒత్తిడి డిప్రెషన్‌కు కారణమవ్వటం మామూలే కానీ.. ఇది తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలకూ దారి తీస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి తలనొప్పులకు స్పష్టమైన కారణం కూడా తెలియటం లేదని పేర్కొంటున్నారు. తలనొప్పితోపాటు కాళ్లూ చేతుల్లో నొప్పులు, నిద్రలేమి, ఆకలి తగ్గటం, మహిళల్లోనైతే ఎక్కువెక్కువగా తినెయ్యటం వంటి సమస్యలు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. 

అకస్మాత్తుగా ఇలా తలనొప్పి, కాళ్ల నొప్పుల వంటివి వేధిస్తున్నప్పుడు తరచూ ఆఫీసు వదిలి ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుండటం ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. ఎన్ని రకాల పరీక్షలు చేయించుకున్నా ఈ తరహా నొప్పులకు కారణాలేమిటనేది వైద్యులు సైతం గుర్తించలేకపోతున్నారు. ఎంతకీ అంతుచిక్కని పలురకాల నొప్పులు, దేనిపైనా ఆసక్తి లేకపోవటం, నీరసం వంటివి సతాయిస్తున్నప్పుడు ఇవన్నీ విధి నిర్వహణకు సంబంధించిన సమస్యలుగా అనుమానించాలని మానసిక నిపుణులు అంటున్నారు. 

అధిక వేతనాలు, పెరుగుతున్న కోర్కెలు, తీవ్రస్థాయి పోటీతత్వం, బాగా సంపాదించాలనే కాంక్ష.. వంటివన్నీ భారతీయ ఉద్యోగుల్లో ఒత్తిడులను పెంచుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చేసే పనినీ, పనిచేసే చోటునీ ఆస్వాదించటం, అనవసరమైన ఒత్తిడికి లోనుకాకుండా జాగ్రత్తగా వ్యవహరించటమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. 

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ఆఫీసులో ఉద్యోగి ఎలా ఉండాలి? ఉద్యోగి మరింత బాగా పని చేసేందుకు ఆఫీసు ఎలా ఉండాలి? ఈ కోణంలో ఎన్నో ఏళ్లుగా ఎన్నో అధ్యయనాలు సాగాయి. సంతోషంగా ఉండే ఉద్యోగి, ఆరోగ్యంగా ఉంటారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పని చేసే చోట కొన్ని చిన్నచిన్న మార్పులు చేపట్టటం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఉదాహరణకు తరచూ ఈ మెయిల్స్‌ చూడటాన్ని తగ్గించటం ద్వారా ఒత్తిడి తగ్గుతుందనీ, పనిచేసే చోట మొక్కల్ని పెంచుకోవటం ద్వారా గొంతు నొప్పి వంటి సమస్యల్ని నివారించుకోవచ్చని పేర్కొన్నారు. కిటికీ దగ్గర కూర్చునే అవకాశం ఉంటే.. ఒత్తిడి మరింతగా తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. పని ప్రదేశాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవటానికి కొన్ని చిట్కాలివి.

  • కార్యాలయంలో లోపలి భాగంలో మంచి రంగులుసరిపడినంతగా వెలుతురు ఉండటం వల్ల మూడ్‌ బాగుండటమే కాకుండా తలనొప్పి వంటి సమస్యలూ తగ్గుతాయని పేర్కొన్నారు. టెక్సాస్‌ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం.. తెలుపునీలం ఆకుపచ్చ రంగులు వేసిన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో మంచి పనిసామర్థ్యం కనబరిచినట్లు గుర్తించారు. వీరిలో మూడ్‌ చక్కగా ఉండటంపనిలో తృప్తి ఎక్కువగా కనిపించినట్లు గుర్తించారు.
  • కంప్యూటర్‌ తెరను సరైన పద్ధతిలో అమర్చకపోతే తలనొప్పులుఅలసటమెడనడుముభుజంమణికట్టు నొప్పులు తలెత్తుతాయన్న సంగతి తెలిసిందే. కాంగ్స్‌బెర్గ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (నార్వే) పరిశోధకులు కంప్యూటర్‌ తెరను అమర్చిన విధానం ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందనేది పరిశీలించారు. మానిటర్‌ను 15 డిగ్రీలు అటూఇటూగా అమర్చుకున్న వారికి మరింత ఎక్కువ నొప్పి ఉంటోందనీఎక్కువగా సిక్‌ సెలవులు పెడుతున్నారనీమెడల్ని ఎక్కువగా కదిలించలేకపోతున్నారనీ గుర్తించారు. కంప్యూటర్‌ తెరను సరిగ్గా అమర్చుకోవటమంటే.. కంటి ఎత్తుకు సమానంగా మానిటర్‌ పైభాగాన్ని అమర్చుకోవటమేనని సూచిస్తున్నారు.
  • ఐయోవా యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం.. 62 శాతం మంది పురుషులు, 46 శాతం మహిళలు ఆఫీసుల్లో అనారోగ్యకర అనుబంధాల్ని కొనసాగిస్తారని గుర్తించారు. దీనివల్ల అనవసర ఒత్తిడులు పెరిగి, కార్యాలయంలో ఆరోగ్యకర వాతావరణం కాస్తా చెడిపోతుందని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారాల్ని వదిలెయ్యటమే మేలని సూచిస్తున్నారు.
  • కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు పనిగంటలకీ, రక్తపోటు పెరగటానికీ మధ్య సంబంధాన్ని పరిశీలించారు. వారానికి 40 గంటలు పనిచేసే స్త్రీ పురుషుల్లో 14 శాతం అధిక రక్తపోటు ముప్పు పెరిగినట్లు గుర్తించారు. 11 నుంచి 39 గంటలు మాత్రమే పనిచేసే వారిలో ముప్పు ఈ స్థాయిలో లేదు. అదే 41 -50 గంటలు పనిచేసేవారిలో 17 శాతం, 51 గంటలకన్నా ఎక్కువ చేసేవారిలో 29 శాతం రక్తపోటు ముప్పు పెరిగినట్లు తేల్చారు.
  • ఉల్ట్సర్‌ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో.. లిఫ్టుకు బదులుగా మెట్లెక్కే వారిలో కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉండటం, శ్వాససామర్థ్యం మెరుగ్గా ఉండటం, గుండె ఆరోగ్యం బాగుండటం, బరువు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఎక్కే మెట్ల సంఖ్యను పెంచి చూసినప్పుడు శ్వాస సామర్థ్యం మరింత మెరుగవ్వటమే కాకుండా కొలెస్ట్రాల్‌ బాగా తగ్గినట్లు తేల్చారు.
  • ఆఫీసు ఆవరణలో మొక్కల కుండీల్ని అమర్చుకోవటం ద్వారా గొంతెండిపోవటం, ముక్కులు బిగుసుకోవటం వంటి సమస్యలు తగ్గుతాయని పరిశోధకులు అంటున్నారు. 'నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ (ఓస్లో)' పరిశోధకులు ఆఫీసు ఆవరణలో కుండీమొక్కల ప్రభావాన్ని పరిశీలించారు. ఇలా మొక్కల్ని అమర్చుకున్న వారిలో.. ముక్కు, గొంతు, పొడిచర్మం సమస్యలు 23 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దగ్గు 37 శాతం, బడలిక 34 శాతం తగ్గినట్లు తేల్చారు. ఆఫీసు మొక్కలు ఎందుకిలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయనేది మాత్రం నిర్దిష్టంగా చెప్పలేదు. మొక్కల కారణంగా గాలి స్వచ్ఛత పెరగటం, మానసిక ప్రభావం ఉండటం వంటివి కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు.
  • ప్రతి ముగ్గురిలో ఒక ఉద్యోగి ఈ మెయిల్‌ ఒత్తిడితో బాధపడుతున్నట్లు 'పెయిస్లే యూనివర్సిటీ' పరిశోధకులు పేర్కొన్నారు. కొంతమంది ఉద్యోగులు నిమిషానికి 40 సార్లు మెయిల్స్‌ చూసుకుంటారనీ, ఫలితంగా ఒత్తిడి పెరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో పురుషులతో పోలిస్తే మహిళలు మరింత ఒత్తిడి ఎదుర్కొంటారని అన్నారు. తక్షణం తెరపై మెయిల్స్‌ కనిపించే పద్ధతిని మానేసి రెండు రోజులకు ఒకసారి అన్ని మెయిల్స్‌ను సరి చూసుకునే పద్ధతిని అనుసరించటం మంచిదని సూచిస్తున్నారు.
  • డెస్కు కిటికీకి దగ్గరగా ఉండటం మంచిది. అయితే.. ప్రింటర్లకు మాత్రం కొద్దిగా దూరంగా ఉండాలి. 'లండ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (స్వీడన్‌)' పరిశోధకుల ప్రకారం- కిటికీ దగ్గర కూర్చున్నప్పుడు ఉద్యోగుల మూడ్‌ బాగుంటున్నట్లు గుర్తించారు. ప్రింటర్లు కాలుష్య కారకాలుగా మారి వూపిరితిత్తుల ఆరోగ్యానికి హాని తలపెడతాయని పేర్కొన్నారు. ఆఫీసుల లోపలి నుంచి గాలి ధారాళంగా బయటికి వెళ్లేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు.
  • ఉద్వేగాలన్నింటినీ మనసులో కుక్కుకోవటం ఆరోగ్యానికి మంచిదికాదు. ఇది.. డిప్రెషన్‌కు దారితీయటమే కాకుండా గుండె జబ్బులకూ కారణమవుతుంది. 'స్ట్రెస్‌ అండ్‌ హెల్త్‌' జర్నల్‌ ప్రచురించిన ఒక అధ్యయనం ఎమోషన్‌ డైరీ పేరిట ఒక డైరీని పెట్టుకుని ఒత్తిడి కారకాల్నీ, భావాల్నీ అందులో రాసుకుంటే చాలా వరకు ఒత్తిడి తగ్గిపోతుందని పేర్కొన్నారు. దీనివల్ల మొత్తంగా ఆరోగ్యమూ మెరుగవుతుందని సూచించారు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates


చర్మం కింద ఉన్న ఫాలికిల్ అనే చిన్న చిన్న పాకెట్ల నుంచి జుట్టు తయారవుతుంది. ఒక్కో ఫాలికిల్ నుంచి దాదాపు మూడేళ్ల పాటు వెంట్రుక పెరుగుతుంది. ఆ తరువాత రాలిపోయి ఆ స్ధానంలో కొత్త వెంట్రుక మోలుస్తుంది.
ఈ ఫాలికిల్ అనేది మగవాళ్లలో ఉత్పతి అయ్యే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ పై అధారపడి ఉంటుంది.
ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిలో హెచ్చు తగ్గుల వల్ల ఆ ప్రభావం పైన చెప్పిన ఫాలికిల్ మీద పడుతుంది. దానివల్ల ఫాలికిల్స్ ముడుచుకుపోతాయి. దాంతో కొత్తగా వచ్చే ప్రతీ వెంట్రుకా అంతకు ముందు వచ్చిన దానికంటే చిన్నదిగా వస్తుంది. దీనివల్ల వెంట్రుక చర్మాన్ని దాటుకుని బయటికి రాలేదు. 
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
వయస్సులో ఉన్నప్పుడు ఏం తిన్నా.. ఎలా తిరిగినా రోజులు బాగానే గడిచిపోతాయి. ఆ ఉరకలెత్తే వయస్సులో శారీరక సామర్థ్యం అంత  బాగా ఉంటుంది! కానీ 30లు దాటుతున్న కొద్దీ పరిస్థితి క్రమేపీ మారిపోతుంటుంది. ఎప్పుడూ లేనిది నెలకో రెణ్ణెల్లకో ఏదో ఒక చిన్నాచితకా ఆరోగ్య సమస్య పలకరించటం. మళ్లీ కొద్దిరోజుల్లో సర్దుకోవటం! చాలామందికి నలభైల్లో పడిన తర్వాత బండి ఇలాగే నడుస్తుంది! శరీరం కొద్దికొద్దిగా పట్టు సడలుతోందనటానికి ఇదే తార్కాణం. మరి దీన్ని అడ్డుకునేదెలా? 50, 60 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఎటువంటి శారీరక సమస్యా దరిజేరకుండా.. దృఢత్వం జారకుండా చక్కటి ఆరోగ్యాన్ని నిలబెట్టుకునేదెలా? అందుకోసం..  పాటించండీ ఈ ఐదు సూత్రాలు!

  • ముప్ఫై ఏళ్లు దాటుతుంటే సహజంగానే స్త్రీపురుషులు ఇరువురూ కొద్దిగా బరువు పెరుగుతుంటారు. ముఖ్యంగా ప్రసవానంతరం స్త్రీలు కొంత బరువు పెరగటం చూస్తూనే ఉంటాం. అయితే ఏ రకంగా చూసుకున్నా కూడా బరువు పెరగటం మంచిది కాదు. అందుకోసం పద్ధతి ప్రకారం తప్పనిసరిగా రోజూ ఏదో ఒక వ్యాయామం చెయ్యటం చాలా అవసరం. బద్ధకం ముంచెత్తకుండా ఉండేందుకు నలుగురితో కలిసి వ్యాయామానికి వెళ్లేందుకు వీలుగా వాకింగ్‌ లాంటివి ఎంచుకోవచ్చు. నిజానికి సాధారణ వ్యాయామాలన్నింటిలోకీ ఈత ఉత్తమమైనది. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు కాబట్టి తేలికైన, సమర్థమైన వాకింగ్‌ను ఎంచుకోవచ్చు. వారానికి కనీసం నాలుగు రోజులు గుండె బలాన్ని పెంచే వాకింగ్‌, జాగింగ్‌, రన్నింగ్‌ చెయ్యాలి. మిగిలిన రోజుల్లో జిమ్‌ వ్యాయామాల వంటివి ఎంచుకోవచ్చు. బరువు పెరగకుండా ఉండటమే కాదు.. చిన్నాచితకా జబ్బుల బారిన పడకుండా రోగనిరోధక శక్తి బలపడేందుకు, శరీరంలో జీవక్రియలు సజావుగా సాగేందుకు కూడా నిత్య వ్యాయామం దోహదపడుతుందని మరువద్దు. 


  • ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏమిటో అవగాహన పెంచుకోవటం చాలా అవసరం. ప్రతిపూటా వరి అన్నం, గోధుమ వంటి పిండి పదార్ధాలనే ఎక్కువెక్కువగా తినటం సరికాదు. వీటిని కొద్దిగా తీసుకోవాలి. అది కూడా ముడివైతే మంచిది. (మైదా వంటి తేలికగా జీర్ణమయ్యే రిఫైన్డ్‌ పిండ్లు బాగా తగ్గించెయ్యాలి) ప్రతి భోజనంలోనూ ప్రధానంగా పప్పు, మాంసం వంటి మాంసకృత్తులు దండిగా ఉండాలి. ఇక ప్రతి పూటా కూరలు, ఆకుకూరలు దండిగా తినాలి. కూరలను, పండ్లను చెక్కు తియ్యకుండా తినటం, లేదా సాధ్యమైనంత తక్కువగా తియ్యటం మంచిది. నూనె, కొవ్వు, స్వీట్లు బాగా తగ్గించెయ్యాలి. రోజూ ఒకే సమయానికి తినటం అలవాటు చేసుకోవాలి. వారాంతాల్లో-ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువెక్కువగా తినటం మంచిది కాదు. 


  • ఇన్నాళ్లుగా ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేకపోయినా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తించి.. మన శరీరం మీద ఒక కన్నేసి ఉంచటం చాలా అవసరం. ముఖ్యంగా 30-35 ఏళ్లు వచ్చినప్పుడు ఏడాదికి ఒకసారైనా కొన్ని తేలికపాటి పరీక్షలు చేయించుకోవటం మంచిది. ముఖ్యంగా బీపీ చూపించుకోవటం, మధుమేహం వస్తోందేమో తెలుసుకునేందుకు, రక్తహీనత-అధిక కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు రక్తపరీక్షలు చేయించుకోవాలి. స్త్రీలైతే- పాప్‌స్మియర్‌ పరీక్ష (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వస్తోందేమో ముందే గుర్తించేందుకు), 40 ఏళ్లు దాటిన తర్వాత రెండేళ్లకొకసారైనా మామోగ్రామ్‌ పరీక్ష (రొమ్ము క్యాన్సర్‌ ఆనవాళ్లను పసిగట్టేందుకు) చేయించుకోవటం ఉత్తమం. పరీక్షల విషయంలో తాత్సారం అంత మంచిది కాదు! మన శరీరం పట్ల మనం శ్రద్ధ కనబరుస్తున్నామనటానికి ఇదే తార్కాణం. 


  • 30 ఏళ్ల వయసనేది ఎవరైనా ఇంట్లోనూ, పనిలోనూ కూడా చాలా చురుకుగా ఉండే సమయం. కెరీర్‌ పరంగా కూడా చాలా వేగంగా ఎదిగే సమయం. పిల్లల పెంపకం, డబ్బు దాచుకోవటం, భవిష్యత్‌ ప్రణాళికలు వేసుకోవటం, సామాజిక సంబంధాలు పెంచుకోవటం.. ఇవన్నీ కూడా ఒక్కసారిగా మీద పడతాయి. ఈ ఒత్తిడికి ఉక్కిరిబిక్కిరి అవుతూ.. ఏదైనా కాస్త అటూఇటూ అయితే మానసికంగా నిరాశలోకి జారిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అన్నింటినీ ఒక్కసారే నెత్తినేసుకుని వైఫల్యాన్ని కొని తెచ్చుకోకూడదు. జీవితాన్ని ప్రణాళికా బద్ధంగా మలుచుకోవటం, సమయ పాలన, 'ఈ క్షణం మనది' అనుకుంటూ కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో జీవితాన్ని ఆనందించటం ముఖ్యం. ప్రతి పనిలోనూ సానుకూల దృక్పథం ప్రదర్శించటం అవసరం. మానసిక నిశ్చింతకు అవసరమైతే యోగాభ్యాసం, ధ్యానం వంటివి కూడా ఉపకరిస్తాయి. 


  • కచ్చితంగా రావాలనేం లేదుగానీ... కొన్ని వ్యాధులు, రుగ్మతలు కుటుంబ పరంగా వచ్చే ఆస్కారం లేకపోలేదు. అందుకే కుటుంబంలో, వంశంలో ఇంతకు ముందు ఎవరికైనా గుండె జబ్బులు, హైబీపీ, మధుమేహం, క్యాన్సర్లు, థైరాయిడ్‌ సమస్యలు, కీళ్ల వాతం వంటివి ఉన్నాయేమో తెలుసుకుని ఉండటం.. వీలైతే సాధ్యమైనంత వరకూ మనకు రాకుండా 20-30 ఏళ్ల వయసు నుంచే నివారణ చర్యలు ఆరంభించటం చాలా చాలా అవసరం. దీని విషయమై కుటుంబ వైద్యులతో ముందే చర్చించటం శ్రేయస్కరం! 
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ఇప్పుడున్న సమాజ పోకడ, ఫాస్ట్ జనరేషన్‌లో చాలామందికి నిద్ర కరువైపోతోంది. ఫలితంగా నిద్రలేమితో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. నిద్రలేమి చిన్న విషయం కాదు. మెదడు చురుకుగా పనిచేయాలంటే మనిషికి తగినంత నిద్ర అవసరం.
ప్రస్తుత సమాజంలో ప్రతి నలుగురిలో ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతుంటే, నిద్రలేమితో యువత అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోందని సర్వేలు చెబుతున్నాయి. అసలు నిద్రలేమి అంటే ఏమిటో, దానికి కారణాలేమిటో, దాని లక్షణాలేమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

రాత్రిపూట సరిగా నిద్రపట్టక పోవడాన్నే నిద్రలేమి(ఇన్సోమ్నియా) అంటారు. ఇది చాలామంది దృష్టిలో చిన్న సమస్య. కొందరైతే అసలు ఈ విషయాన్నే పట్టించుకోరు. కానీ దీని దుష్పలితాలు ప్రమాదకరంగా ఉంటాయి. నిద్రలేమితో జరిగే అనర్థాలలో ప్రధానంగా ఏర్పడే సమస్య ఆరోగ్యం చెడిపోవడం. మానసికంగా, శారీరకంగా చురుకుదనం కోల్పోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాల్లో ఒకటి.

లక్షణాలు : కారణం లేకుండా నిద్రపట్టకపోవడం లేదా నిద్రపట్టిన తర్వాత గాఢమైన నిద్రలోకి జారుకోకపోవటం ఇందులో కనిపించే ప్రధానమైన లక్షణం. ఇక కొంతమందికైతే తొందరగా నిద్రపడుతుంది. కానీ అర్ధరాత్రి మెలకువ వస్తుంది. తరువాత మళ్లీ నిద్రపట్టడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలామందికి నిద్రపోయిన తర్వాత మళ్లీ నిద్రలేచే సమయానికి ముందే మెలకువ వస్తుంటుంది. ఒకవేళ మళ్లీ పడుకుందామని ప్రయత్నించినా నిద్రరాదు. అయితే ఈ నిద్రలేమి సమస్య మగవారిలో కన్నా ఆడవాళ్లలో సమస్య ఎక్కువగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి.

కారణాలు : నిద్రలేమికి అసలు కారణాలేంటి, ఎలాంటి పరిస్థితిల్లో నిద్రలేమి వెంటాడుతుంది అనే సందేహాలకు వైద్యులు కొన్ని అంశాలను నిద్రలేమికి ప్రధాన కారణాలు చూపించారు. పని ఒత్తిడి, హృద్రోగ, శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించిన మందులు వాడటం, విపరీతమైన ఆలోచనలు, శక్తికి మించి పనిచేయడం, కోపం, చిరాకు పడటం, మానసిక ఆందోళన, దాంపత్య జీవితం సరిగా లేకపోవడం, పగలు పడుకుని రాత్రి మేల్కొనడం. మొదలైనవి నిద్రలేమికి కారణాలు.

ప్రతి మనిషిలో భయం, ఉద్వేగం అనే లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల కారణంగా నిద్రపట్టక ఎప్పుడూ సతమతమవుతుంటారు. ఇది కూడా నిద్రలేమిని పెంపొందిస్తుంది. అలాంటివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే.. కచ్చితంగా రాత్రి పదిగంటలకు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. పడుకునే ముందు పాలు తాగే అలవాటు చేసుకొవాలి. వేడి ఆహారం తినడం మంచిది. ఒత్తిడితో కూడిన పని చేయకూడదు.

నిద్ర త్వరగా వస్తుంది. కాని మధ్యలో చాలాసార్లు మెలకువ వస్తుంది. శరీరమంతా నొప్పులు, భయం, కోపం, బాధ మొదలైన లక్షణాలు ఉంటాయి. దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే... మసాలా పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. ఉపవాసం చేయకూడదు.

తెల్లవార్లు త్వరగా నిద్రలేవడం జరుగుతుంది. అలసటగా అనిపిస్తూ ఉంటుంది. సమయానికి ముందే మెలకువ వస్తుంది.దీనిని నివారించాలంటే వ్యాయామం ఎక్కువగా చేయాలి. గోరు వెచ్చని నీరు తాగాలి. తీపి, పులుపు, లవణ పదార్థాలు తినటం తగ్గించాలి.

నిద్రలేమిని అధిగమించడానికి సహజంగా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అవి....

  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • కెఫిన్ లాంటి పదార్థాలు తినకూడదు.
  • మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
  • ఒత్తిడి తగ్గించుకోవాలి.
  •  పగటి నిద్ర మంచిది కాదు.
  • ఆహార విహారాలలో మార్పులు చేసుకోవాలి.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates

సన్నగా, నాజూగ్గా ఉండాలనే కోరుకుంటారు  ఏవ్వరైన అనుకోకుండా పెరిగిన బరువుని వ్యాయామంతో తగ్గించుకోవడానికి ప్రత్యేకంగా సమయం కేటయించలేని వాళ్లు చాలమందే ఉంటారు. అలాంటి వాళ్లకి బాదం  మంచి ప్రత్యామ్నాయం. కొత్తగా చేసిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది. బరువుని తగ్గించడంలో బాదం ముందుంటుది. విటమిన్లూ, ఖనిజాలూ, ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వూ కలిగిన బాదం పలుకుల్ని తింటే కార్బోహైడ్రే్లు ఎక్కువగా ఉండే పదార్థాలు తినాలన్న ఆసక్తి తగ్గుతుంది.
 ఇలా కొన్ని నెలల పాటూ కార్బోహైడ్ల్రే వినియోగం తగ్గించగలిగితే అదనపు కొవ్వు దానికదే కరుగుతుంది. కొత్తగా కొవ్వు పట్టదు కూడా. కనుక రెండు రోజులకోసారి గుప్పెడు బాదం గింజల్ని తింటూ ఉండాలి. వీటిల్లో మాంగనీస్, కాపర్, మెగ్నీషియం, బి- కాంప్లెక్సు విటమిన్లయిన నియాసిస్, బయోటిస్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తి పుట్టేందుకు సహకరిస్తాయి. దీనివల్ల శరీరం చురుకుగా ఉండి ఏదో ఒక పనిలో నిమగ్నమవుతారు. దానివల్ల కెలొరీలు కరుగుతాయి. కనుక సాధారణ బరువుని మించి ఉన్నారు బరువు తగ్గడానికి బదం పలుకుల్ని వినియోగించుకోవచ్చు.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికీ ఇబ్బందే! ఇది హార్మోన్లనూ ప్రభావితం చేస్తుంది. అంతేకాదు దీని వల్ల గుండెజబ్బులూ, మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉండి. అందుకే ఈ కొవ్వును తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహార పదార్థాల ఎంపికలో జాగ్రత్త వహించాలి. ఒకరోజులో మనం తినే ఆహారంలో పది గ్రాముల పీచు పద్దార్ధం (ఫైబర్) ఉండేలా చూసుకొంటే అంతర్గత కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం బీన్స్, పప్పుధాన్యాలూ, పండ్లూ, కాయగూరలూ, ఓట్స్ (అటుకులు), పొ్టుతీయని తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటూ రోజూకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే పీచు పదార్థాల కారణంగా ఏర్పడే గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదురుకావు.
దీనితో పాటు ప్రొటన్స్ అంటే మాంసకృత్తుల మోతాదు తగినంతగా ఉండేలా చూసుకోవాలి. రోజులో కనీసం వంద కేలరీల పోషకాలు ప్రొటన్ల నుంచి అందేలా జాగ్రత్త పడాలి. ఇవి నిదానంగా జీర్ణమై ఆకలిని అదుపులో ఉంచి కొవ్వు పేరుకోకుండా చూస్తాయి. ఇందుకోసం మీగడ తీసిన పెరుగూ, పాలూ, చేపలూ, గుడ్లూ తింటే మెరుగైన మాంసకృత్తులు అందుతాయి.
అలాగే యాపిల్, పుచ్చకాయ, దోసకాయ, ముల్లంగి, టొమాటో, క్యాబేజీ, చిలగడదుంప లలో పీచు పదార్ధలు ఎక్కువగా ఉంటాయి. మరియు కొవ్వు తక్కువగా ఉండి, యాంటి ఆక్సిడెంట్ల ఎక్కువగా ఉంటయి. వీటిని తినడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. ఓట్స్ (అటుకులు)తో  చేసిన పదార్థాలు కూడా పొట్ట దగ్గర కొవ్వును తగ్గిస్తాయి.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనునది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే ఒక రకమైన అనుభవం. లక్షణాలు
  • కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం
  • ఆకలి లేకపోవడం
  • పెద్ద శబ్దంతో తేంపులు రావడం
 కారణాలు
  • కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో పనిచేయడం.
  • అధిక టీ/కాఫీ సేవనం
  • సరియైన వేళకు ఆహారం తీసుకోకపోవడం
  • ఒత్తిడి, అలసట
  • మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం
నివారణా చర్యలు 
  •  వేళకు ఆహారం తీసుకోవడం.
  • నీరు ఎక్కువగా త్రాగడం
  • వ్యాయామం చెయ్యడం
  •  వైద్యుల సలహా అనుసరించి ఏంటాసిడ్ మందులు వాడండి.