నేడు మార్కెట్లో ఎన్నో రకాల సౌందర్య సాధనాలు వచ్చాయి. చాలామందికి ఏ కాస్మొటిక్ దేనికి ఉపయోగిస్తారో తెలియదు. ఏవి కొనాలో తెలియక సతమతమవుతుంటారు. ...

మాయిశ్చరైజర్: ఇది పొడి, సహజ చర్మం గలవాళ్లు వాడాలి. దీనిని ఉపయోగించడం వల్ల చర్మం ముడతలు పడదు.
కోల్డు క్రీమ్: దీనిని శీతాకాలం, వర్షాకాలంలో ఉపయోగించాలి.
ఆస్ట్రింజెంట్: ఇది జిడ్డు చర్మం కలవాళ్లు ఉపయోగించాలి. దానిని వాడితే చర్మంలో ఉన్న ఆయిల్ కంట్రోల్ అయి ఫ్రెష్‌గా ఉంటుంది.
క్లెన్సింగ్ లోషన్: దీనిని ఉపయోగించడం వల్ల చర్మంలో ఉన్న మురికి వచ్చేస్తుంది. దీనిని అన్ని చర్మాల వాళ్లు ఉపయోగించవచ్చు. మేకప్‌ని దీనితో తొలగించవచ్చు.
కేలమైన్ లోషన్: దీనిని అన్ని కాలాలలో ఉపయోగించవచ్చు. ముఖ్యంగా వేసవికాలంలో చర్మాన్ని ఈ ఎండబారి నుండి రక్షిస్తుంది.
షాంపూలు: షాంపూలు ఎన్నిక చేసుకునేటప్పుడు కండిషనర్ కల షాంపూలు ఎన్నుకోవాలి.
- డాండ్రఫ్‌కి: డాక్టర్ల సలహా మీద యాంటీ డాండ్రఫ్ షాంపూ ఉపయోగించాలి.
సోప్‌లు:
- ఆయిలీస్కిన్ వాళ్లు సిమ్, మార్గోవేస్‌గల సోప్‌లు వాడాలి.
- ఆయిలీస్కిన్ వాళ్లకి ప్రత్యేకించి సోప్‌లు వస్తున్నాయి. అవి వాడాలి.
- డ్రైస్కిన్ వాళ్లు గ్లిజరిన్ బేస్‌గల సోప్‌లు వాడాలి.
- పియర్స్ లాంటివి డ్రైస్కిన్ వాళ్లకి ప్రత్యేకించి సోప్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. అవి వాడాలి.
- నార్మల్ స్కిన్ వాళ్లు శాండల్ సోప్‌లు లావెండర్ సోప్‌లు వాడాలి.
- సెన్సిటివ్ స్కిన్‌వాళ్లు బేబీసోప్ వాడాలి.
- మొటిమలు గలవాళ్లు: యాక్నేసోప్‌లు, హెర్బల్‌సోప్‌లు వాడాలి.
- చర్మసంబంధమైన సమస్యలు: మెడికేటెడ్ సోప్ వాడాలి, హెర్బల్ సోప్ వాడాలి
COMMENTS