మీరు చాల లావుగా ఉన్నారా ? అయితే అలా చేయండి.. మీరు చాల సన్నగా ఉన్నారా ? అయితే ఇలా చేయండి. ఇలాంటి ప్రకటనలు మనం రోజూ టీవీలోను మరియు పేపర్‌లోన...

మరి కొవ్వు సమస్య నుంచి ఎల బయటపడాలో అర్థం కావట్లేదా ? చాల సింపుల్.. కొవ్వు కరిగించే పదార్థాలు ఏమిటో తెలుసుకుని వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోతుంది..
తాజా పండ్లు, కూరగాయలు
శరీరంలోని కొవ్వును తగ్గించుకుని బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి తాజా పండ్లు, కూరగాయలు మంచి ఆహారం. ముఖ్యంగా వీలైనంత ఎక్కువగా ఆకుకూరలు తినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆకుకూరల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి కోలెస్ట్రాల్ పెరుగుతుందన్న భయం ఉండదు. అంతేకాదు ఫైబర్ కూడా విరివిగా శరీరానికి అందుతుంది. ఆకలిగా అనిపించినప్పుడు చిప్స్, నూనెతో చేసిన పదార్థాలకు బదులుగా క్యారట్, బీట్ రూట్ వంటి కూరగాయలతో సలాడ్ చేసుకుని తింటే చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఓట్ మీల్
కొవ్వు కరిగించే ఆహార పదార్థాల్లో మరో ముఖ్యమైంది ఓట్ మీల్. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి శరీరానికి అధిక శక్తి అందుతుంది. దీనిలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మామూలు ఆహారం జీర్ణం కావడానికంటే ఓట్ మీల్ జీర్ణమవడానికి రెండు రెట్లు ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క వల్ల రక్తంలో చెక్కర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే వారికి ఆకలి అదుపులో ఉంటుంది. కాబట్టి వీళ్లు దాల్చిన చెక్కని ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
సరిపడేంత కారం
కొవ్వు కరిగించే ఆహార పదార్థాల్లో కారం కూడా ఒకటి. అయితే కొందరు కారం తినలేక కూరల్లో తక్కువ కారం వేసుకుంటారు. దీనివల్ల శరీరంలో కొన్ని రోజులకు కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి కూరల్లో కారం సరిగ్గా వేసుకోవడం చాల ముఖ్యం. కారంలో ఉండే క్యాప్సైసిస్ అనే థర్మోజెనిక్ పదార్థం జీవక్రియలను వేగవంతం చేస్తుంది. మనం తిన్న 20 నిమిషాల తర్వాత కొవ్వు కరగడం మొదలవుతుంది.
కరివేపాకు
చాలామంది కూరల్లో కరివేపాకు వేస్తే తీసి పడేస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి చాల మంచిది. ఇదొక థర్మోజెనిక్ ఆకు. ఇది శరీరంలోని విషపదార్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది. తద్వారా బరువు తగ్గొచ్చు.
గ్రీస్ టీ
శరీరంలోని కొవ్వును అదుపులో పెట్టడానికి గ్రీస్ టీ తోడ్పడుతుందని చాల పరిశోధనల్లో వెల్లడైంది. గ్రీన్ టీలో ఉండే కొన్ని గుణాల వల్ల నడుము చూట్టు ఉన్న కొవ్వు కరుగుతుంది. దీనిలో ఉండే కెటాచిన్స్ అనే ఫొటో కెమికల్ పదార్థం జీవక్రియలపై ప్రభావం చూపి వేగంగా కొవ్వు కరిగేల ప్రేరేపిస్తుంది. కాబట్టి గ్రీన్ టీని ఆహారంలో భాగం చేసుకోవడం చాల అవసరం.
తేనె..
స్థూలకాయాన్ని తగ్గించడంలో తేనె ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి, ఇతర జీవ క్రియలను వేగవంతం చేస్తుంది. కాబట్టి ఒక టేబుల్ స్పూన్ తేనెను గోరువెచ్చటి నీటిలో కలుపుకొని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది.
పుచ్చకాయ
పుచ్చకాయ, తర్బూజా.. లాంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లు తీసుకోవడం చాల మంచిది. వీటిలో క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తపడొచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు తో పాటు విటమిన్ ఎ, సెలు కూడా పుష్కలంగా లభిస్తాయి.
బీన్స్
బీన్స్లో పీచుపదార్థాలు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. కనీసం వారానికోసారైనా బీన్స్ ను ఆహారంలో బాగంగా తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది.
చిలకడ దుంప
దీనిలో క్యాలరీలు తక్కువగా,. పోషకాలు అధికంగా ఉంటాయి. శరీరంలోని కొవ్వును తగ్గించుకోవడానికి మామూలు దుంపలకు బదులు చిలకడ దుంపలు తింటే తక్షణ ఫలితం ఉంటుంది. ఈ దుంపల్లో ఫైబర్‌తో పాటు పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా శరీరానికి అందుతాయి.
ఇవన్నీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఆహార పదార్థాలు. కాబట్టి ఇప్పటి నుండైన ఆ ట్రీట్‌మెంట్.. ఈ ట్రీట్‌మెంట్ అని ఆరోగ్యాన్ని పాడుచేసుకోకుండా చక్కగా ఈ పదార్థాలను మీ ఆహారంలో భాగం చేసుకోండి.. కొలెస్ట్రాల్ ఫ్రీ గా తయారవ్వండి.
COMMENTS