కొంతవరకూ నిజమే. లైంగిక సమస్యలకు , ముఖ్యంగా వైఫల్యలకు నీలిచిత్రాలు ఎక్కువగా చూడం (పోర్నోగ్రఫీ) కూడా ఒక ముఖ్య కారణం. పురుషుల్లో ఈ సమస్య చాల ఎక...
కొంతవరకూ నిజమే. లైంగిక సమస్యలకు,
ముఖ్యంగా వైఫల్యలకు నీలిచిత్రాలు ఎక్కువగా చూడం (పోర్నోగ్రఫీ) కూడా ఒక ముఖ్య కారణం. పురుషుల్లో ఈ సమస్య చాల ఎక్కువ,
స్త్రీలలో కొంత తక్కువ. ముఖ్యంగా స్త్రీలు ఈ చిత్రాల్లో చూపించేవన్నీ నిజాలేననీ,
మిగతా పురుషులంతా ఈ చిత్రాల్లో చూపిస్తున్నంత దృఢంగా ఉంటారనీ,
తమ భర్తలే ఎందుకూ కొరగాకుండా ఉన్నారని నమ్మటం మొదలుపెడితే పరిస్థితి సమస్యాత్మకంగా తయారవుతుంది. అలాగే పురుషులు కూడా వీటిని చూసి భార్యలతో లేదా భాగస్వాములతో రకరకాల ప్రయోగాలకు దిగితే ఇబ్బందే. చాలసార్లు స్త్రీలు వీటికి అంగీకరించకపోవచ్చు. భాగస్వామి ఒత్తిడి భరించలేక ఒప్పుకున్నా అందులో తృప్తి పొందలేక రకరకాల మానసిక రుగ్మతల్లో చిక్కుకోవచ్చు. నీలిచిత్రాల వల్ల బావుద్వేగాల పరంగా చాల ఇబ్బందులు రావచ్చు. అయితే ఇవన్నీ అందరి విషయంలో ఇలాడే జరిగి తీరతాయని చెప్పలేంగానీ వీటితో ఈ రకం ముప్పు మాత్రం కచ్చితంగా ఉంటుంది.
COMMENTS