భార్యాభర్తల బంధం దృఢ పడటానికి ప్రేమ ఎంత ముఖ్యమో; లైంగిక చర్య కూడా అంతే ముఖ్యం. ఆలుమగలిద్దరూ పూర్తి ఇష్టంతో, సౌఖ్యంగా కలయికలో పాల్గొంటేనే అది...

చాల మంది పెళ్లి కుదిరి నప్పటి నుండే వైవాహిక జీవితం గురించి ఎన్నెన్నో కలలు కనేస్తూ ఉంటారు. కానీ, ఆ కలలన్నీ నిజమయ్యే సమయం వచ్చేసరికి మాత్రం ఎక్కడ లేని భయం, సందేహాలు. అన్నీ ఒకేసారి చుట్టి ముట్టి మనసుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. అందుకే శారీరక కలయికని కొంతమంది ఎంజాయ్ చేస్తే, మరికొందరు మాత్రం భయం వల్ల, లేక ఇష్టం లేకపోవడం వల్ల, ఇలా ఏదో ఒక కారణంతో కలయికకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మరి, అలా దూరంగా ఉండకుండా, కలయికను మీరూ పూర్తిగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఆలోచనల్లో కొన్ని మార్పులు రావాలి.
ఊరిస్తూ.. ప్రేరేపిస్తూ..
లైంగిక చర్యని కేవలం ఒక పనిగా ఎప్పుడూ భావించకూడదు. అలా భావిస్తే.. అందులో ఎంతమాత్రం తృప్తి ఉండదు. మీ ప్రతి స్పర్శ భాగస్వామిపై మీకున్న ప్రేమని తెలుపుతుందని గుర్తుంచుకోండి. అలా ప్రేమగా, ఇష్టంగా, ఆలుమగలిద్దరూ కోరుకున్న విధంగా లైంగిక చర్యని ఆస్వాదించగలిగితేనే అందులోని ఆనందాన్ని పొందగలుగుతారు. మహిళలకు మామూలుగానే సిగ్గు ఎక్కువ. అయితే కలయికలో పాల్గొనేప్పుడు మాత్రం ఈ సిగ్గును కొంచెం సేపు వదులు చేయాల్సిందే! లేదంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ఇబ్బంది పడవలసి వస్తుంది.
సిగ్గు, బిడియంతో సైలెంట్ గా ఉండిపోకుండా, కూడా కాస్త యాక్టివ్ ఉంటూ మీ చిలిపి పనులతో భాగస్వామిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయండి. ఆ సమయంలో చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ ఉత్సాహంగా పాల్గొంటే ఇద్దరూ ఆనందపు సాగరంలో తేలిపోవాల్సిందే!
మీ భార్య/భర్త పూర్తి గా సహకరించండి!
సాధారణంగా కలయిక సమయంలో భార్యాభర్తలిద్దరూ ఉత్సాహంగా ఉండాలి. ఒకరు యాక్టివ్ గా ఉన్నప్పుడు, ఇంకొకరు పూర్తి సహకారం అందించాల్సి ఉంటుంది. మీ వైపు నుంచి సహకారం లేకపోయినా, అయిష్టత వ్యక్తం చేసినా, మీ భాగస్వామి అసంతృప్తి చెందే అవకాశం వుంది. అందుకే లైంగిక చర్యలో పాల్గొనేప్పుడు పూర్తిగా స్పందన లేకపోవడం లేదా చాల తక్కువగా స్పందించడం, ఈ రెండూ పనికి రావు. వీలైనంత వరకు ప్రతి చర్యలకూ స్పందిస్తూ, మీరు పొందుతున్న లైంగికానందాన్ని మీ భార్య/భర్తకు ఇవ్వడానికి ప్రయత్నించండి.
ఎక్కువగా మాట్లాడకండి
లైంగిక చర్యలో పాల్గొనే సమయంలో మాటలకు ప్రాధాన్యం ఇవ్వకండి. అంటే షాపింగ్, నిత్యావసరాలు, ఇంట్లో ఉన్న సమస్యలు.. మొదలై నవన్నీ బెడ్ రూమ్ వరకు చేరకపోవడం మంచిది. అవి మీ ఆసక్తిని ప్రభావితం చేసే అవకాశం వుంది. కాబట్టి ఆ సమయంలో మీరు మాట్లాడే మాటలు మీ ఇరువురి ఆనందాన్ని రెట్టింపు చేస్తేనే మాట్లాడండి.
వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి.
లైంగిక చర్యలో పాల్గొనే ముందు లేదా తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాల ముఖ్యం. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉంటాయి. చాల మంది ఈ విషయంలో అజాగ్రత్త వహిస్తూ ఉంటారు. కానీ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంలో అస్సలు రాజీపడకూడదు. అది మీ వైవాహిక జీవితానికే కాదు, ఆరోగ్యానికి కూడా చాల శ్రేయస్కరం.
COMMENTS