అందం విషయంలో కేశాలు చాల ముఖ్య పాత్ర పోషిస్తాయి. జుట్టు వూడి పోకుండా ఒత్తుగా పెరగాలంటే ఈ నియమాలు పాటించండి. 1. తలకు నూనెతో ఎప్పటికప్పుడు మసా...

1. తలకు నూనెతో ఎప్పటికప్పుడు మసాజ్ చేస్తుండాలి.
ఆయిల్ మసాజ్ ఎలాచేయాలంటే...
ముందుగా ఒక బల్లో జుట్టుకు సరిపడ నూనెను తీసుకొని, కొద్దిగా గోరు వెచ్చగా వేడి చేయాలి. తర్వాత పాపిడి తీస్తూ దూదితో తలకు అప్లై చేయాలి. తలకు అన్ని వైపుల ఇదే మాదిరిగా అప్లై చేసి, చేతివేళ్లతో మసాజ్ చేయాలి. ఆ విధంగా 10 నుంచి 15 నిముషాల వరకు సున్నితంగా తలకు మసాజ్ చేయడం వలన, తల పై బాగంలో రక్తప్రసరణ వేగవంతమవుతుంది. మసాజ్ పని పూర్తయ్యాక, 3 నుండి 4 నిముషాల వరకు తలకు ఆవిరి పట్టాలి. ఇల ఆవిరి పట్టడం వలన తలలోని రంధ్రాలు తెరుచుకుంటాయి. ఆ తర్వాత తలకు షాంపూ చేసుకోవాలి. వారానికి ఒక్క సారైనా ఇలా ఆయిల్ మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టుకు ఎంతో మేలు జరుగుతుంది.
2. పోషకవర్థకమైన ప్యాక్స్ తో పాటు, నాణ్యమైన కండీషనర్, షాంపూ వాడాలి.
తలకు వేసుకొనే ప్యాక్స్
మొదటి రకం
ఒక బల్లో కోడిగుడ్డు (తెల్లసొన+ పసుపు సొన) వేసి బగా గిలకరించాలి. అందులో నిమ్మరసం (ఒక నిమ్మకాయ నుంచి తీసుకున్నది), 5 టీ స్పూన్ల కొబ్బరినూనెతో పాటు; ఒక కప్పు పెరుగు కూడా వేసి బాగా కలపాలి. వీన్నిటినీ మిక్సీలో లేదా బటిల్లో వేసి అన్నీ సమానంగా కలిసేల బాగా మిక్స్ చేయాలి. ఈ ప్యాక్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఒక గంట వేపు అలాగే ఉంచి, తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఈ కొలతలన్నీ జుట్టు పొడవు తక్కువగా ఉన్నవారికి. ఒకవేళ పొడవాటి జుట్టు ఉంటే రెట్టింపు కొలతలు తీసుకుంటే సరిపోతుంది.
రెండవ రకం
ఒక బల్లో కోడిగుడ్డు తెల్ల సొనను తీసుకోవాలి. అందులో 2 టీ స్పూన్ల క్యాస్టర్ ఆయిల్, ఒక టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకి బాగా పట్టించాలి. ప్యాక్ ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఇల నెలకు రెండు సార్లు చేస్తే మీ జుట్టుకు ఎటువంటి ఢోకా ఉండదు.
3. మంచి పోషకాహారం తీసుకోవాలి.
జుట్టు పెరుగుదలకు సరైన పోషకాహారం
మాంసకృత్తులు, ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్ కలిగిన ఆహార పదార్థాలే కాకుండా, అన్ని ఆకుకూరలు, పండ్లలో కూడా జుట్టు ఎదుగుదలకు సరిపడే పోషక పదార్ధాలు లభిస్తాయి.
4. అన్నింటి కంటే ముఖ్యంగా మానసిక ఒత్తిడిని బాగా తగ్గించుకోవాలి.
5. నెలకు ఒక్క సారైనా వెంట్రుకల చివరలను కత్తిరిస్తూ ఉండాలి.
వీన్నింటినీ పాటించడం వలన ఎవరైనా సరే-మంచి కేశ సంపదను సొంతం చేసుకోవచ్చు.
COMMENTS