సంభోగం లేదా ముఖరతి వంటి ఎలాంటి శృంగార చర్యలో పాల్గొంటున్న మొదటి నుంచి చివరి వరకూ కొత్త కండోమ్ ని ఉపయోగించాలి. అంగం స్తంభించిన తర్వాతే కండోమ...
- సంభోగం లేదా ముఖరతి వంటి ఎలాంటి శృంగార చర్యలో పాల్గొంటున్న మొదటి నుంచి చివరి వరకూ కొత్త కండోమ్ ని ఉపయోగించాలి.
- అంగం స్తంభించిన తర్వాతే కండోమ్ ని తొడుక్కోకాలి.
- స్ఖలనం అనంతరం అంగం పూర్తిగా మెత్త బడక ముందే కండోమ్ అంచులు జాగ్రత్తగా నొక్కి పట్టుకుంటూ.. యోని నుంచి బయటకు తీయాలి. వీర్యం ఒలికిపోకుండా దానికి ముడి వెయ్యాలి.
- కండోమ్ వెనుక భాగంలో వీర్యాన్ని నిల్వచేసే తిత్తివంటి బాగం లేనట్లయితే.. కండోమ్ ని పూర్తిగా తొడుక్కోకుండా చివర్లో అరంగుళం మేరకు ఖాళీగా ఉంచాలి.
- వాడిన కండోమ్ ని ఒక కాగితంలో చుట్టి, ఎవరూ దానిని ముట్టుకునే వీలు లేకుండా పారేయాలి.
- ఒకవేళ సంభోగం మధ్యలో కండోమ్ చినిగినట్లు అనిపిస్తే వెంటనే శృంగార చర్యను ఆపేసి, ఆ కండోమ్ ని తీసేసి కొత్తది ధరించాలి.
- ఒక కండోమ్ ను ఒక్కసారికే వాడాలి. తర్వాత పారెయ్యాలి. మళ్లీ వాడకూడదు.

COMMENTS