మా బాబు వయసు ఎనిమిదేళ్లు. తరచూ తలనొప్పితో బాధపడుతున్నాడు. ఇంతకుముందు అరుదుగా వచ్చేది. కాని ఇటీవల చాలా తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్ కు చ...
మా బాబు వయసు ఎనిమిదేళ్లు. తరచూ తలనొప్పితో బాధపడుతున్నాడు. ఇంతకుముందు అరుదుగా వచ్చేది. కాని ఇటీవల చాలా తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్ కు చూపిస్తే కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. కొంతకాలం బాగానే ఉంటోంది. మళ్లీ మళ్లీ తలనొప్పి వస్తోంది. మా బాబు విషయంలో తగిన సలహా ఇవ్వండి.

ఈ మైగ్రేషన్ లోనూ చాలారకాలు ఉన్నాయి. ఆహారంలో నైట్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం, అలసట, నిద్రలేమి... వంటి కారణాల వల్ల ఇది మరింత పెరుగుతుంది. కొద్దిమంది పిల్లల్లో వెలుతురు చూడటానికి ఇష్టపడకపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఇది తీవ్రంగా ఉండే కొంతమంది లో దీనివల్ల శరీరంలోని కొన్ని అవయవాలు బలహీనంగా మారడం కూడా కనిపించవచ్చు.
చికిత్స
- చాలా ప్రశాంతంగా ఉండే వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం
- నుదుటిపై చల్లటి నీటితో అద్దడం
- నొప్పి తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మందులు (ఉదాహరణకు ఆస్పిరిన్ లేదా ఎన్ఎస్ఏఐడీ గ్రూప్ మందులు) వాడటం
- నీళ్లు ఎక్కువగా తాగించడం
- ఆందోళన, టెన్షన్, మానసిక ఒత్తిడిని నివారించడం
పైన పేర్కొన్న జాగ్రత్తలతో మైగ్రేన్ కారణంగా తరచూ వచ్చే తల నొప్పి ఎటాక్స్ను చాలావరకు తగ్గించవచ్చు. అయితే ఇది తరచూ వస్తుంటే మాత్రం చికిత్సగా మూడు నుంచి ఆరు నెలల పాటు డాక్టర్ సలహా మేరకు కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరొకసారి మీ న్యూరో ఫీజీషియాన్ ను లేదా మీ ఫ్యామిలీ పీడియాట్రీషియన్ ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోవడం మంచిది.
COMMENTS