దంతాలు ఆరోగ్యంగా ఉంటే , సాధారణ ఆరోగ్యం బాగుంటుంది. అనేక కారణాల వలన దంతాలు ఇన్ఫెక్షన్లకు లోనై దంత క్షయం సంభవిస్తుంటుంది. దంతాలు ఇన్ఫెక్షన్లకు...

ప్రథమ చికిత్స
- దంత క్షయానికి గురవుతున్న దంతం చుట్టూ లవంగ నూనెను రాయడం ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు రబ్బరు సంచిలో వేడినీటిని పోసి (హాట్వాటర్ బ్యాగ్) దానిని నొప్పి ఉన్న వైపు బుగ్గలపై పెట్టుకోవడం ద్వారా బాధనుంచి నివారణ పొందవచ్చు.
- దంతశూలను తగ్గించుకోవడానికి అనేక విధానాలున్నాయి. ఆహార పదార్థాలు, పండ్లు, ఐస్ క్రీమ్ మొదలైనవి తీసుకున్నప్పుడు పంటి నొప్పి ఉంటే ఆ భాగంపై టూత్ పేస్టును పూయడం ద్వారా నొప్పి కలుగకుండా చేసుకోవచ్చు.
- నొప్పి నివారణ కోసం మాత్రలను వేసుకో వచ్చు. అయితే ఏ ఔషధం వాడాల్సి వచ్చినా వైద్య సలహా తీసుకోవడం తప్పనిసరి. నొప్పి ఇంకా తగ్గకుండా బాధిస్తూనే ఉంటే, వెంటనే దంత వైద్యులను సంప్రదించాలి. అవసరాన్ని బట్టి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి రావచ్చు.
COMMENTS