అంజలి తూర్పుగోదావరి జిల్లా, రాజోలులో సెప్టెంబర్ 11, 1986లో జన్మించింది. పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నైకు మకాం మార్చింద...

- తొలుత జీవా సరసన తమిళంలో ఒక సినిమాలో నటించింది. అది తెలుగులో ‘డేర్’ గా అనువాదం అయింది.
- అ తర్వాత 2006లో ‘ఫొటో’ సినిమాతో స్వప్నగా అందరికీ పరిచయమైంది.
- 2007లో ‘ప్రేమలేఖ రాశా’ సినిమాలో సంధ్యగా కనిపించినా తగిన గుర్తింపు దక్కలేదు.
- కానీ తర్వాత నటించిన ‘షాపింగ్ మాల్’ సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచింది.
- అది చూసిన డైరెక్టర్ మురుగదాస్ తను నిర్మించిన ‘జర్నీ’ సినిమాలో అవకాశం ఇచ్చారు.
- 2011లో విడుదలైన ‘జర్నీ’ సినిమాలో తన అభినయ ప్రతిభ అందరికీ తెలిసేల చక్కటి నటన తో అకట్టుకుంది. మధుమతిగా డామినేటింగ్ క్యారెక్టర్తో అందరికీ గుర్తుండి పోయింది.
- 2013లో మళ్లీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చేట్టు’ సినిమాలో సీతగా, మనింట్లో అమ్మాయిల కనిపించి అందరిని మురిపించింది. అమాయకంగా కనిపిస్తూనే, కల్లకపటం ఎరుగని, చిలిపి అమ్మాయిల కనిపించి మంచి నటనతో సినిమా విజయవంతం కావడంలో బాగం పంచుకుంది.
- తర్వాత ‘బలుపు’ సినిమాలో రవితేజ ప్రక్కన కనపడింది.
- తమిళ చిత్రం సింగం-2 లో సూర్య తో ఒక పాటలో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చింది.
- 2014 లో గీతాంజలిగా మన ముందుకు వచ్చింది.
- ఇటు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక సినిమాల్లో నటిస్తూ, అగ్ర నాయికల్లో ఒకరిగా ముందుకు సాగిపోతోంది.
- తమిళచిత్రం ‘ఎంగేయం ఎప్పోదం’ (తెలుగులో జర్నీ)లో తన అద్భుతమైన నటనకు గాను ‘సౌత్ ఫిల్మ్ ఫేర్-2012’, అవార్డును సొంతం చేసుకుంది.
- 2013, ఏప్రిల్లో హైదరాబాద్ ఉంటున్న హోటల్ నుంచి మాయమవడంతో కాస్త అలజడి సృష్టించింది. తర్వాత పోలీసుల ముందు ప్రత్యక్షం కావడంతో అంతా వూపిరి పీల్చుకున్నారు. పిన్ని భారతీదేవి, దర్శకుడు కలంజియం కలిసి తనను హింసిస్తున్నారంటూ మీడియాకు తెలిపింది. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.
COMMENTS