వయసులో చిన్నావారిల కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోంటే అలాంటి అందాన్ని సొంతం చేసుకోవచ్చు... అవి 40+ ...
వయసులో చిన్నావారిల కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోంటే అలాంటి అందాన్ని సొంతం చేసుకోవచ్చు... అవి
![]() |
40+ అందంగా కనిపిించాలంటే |
- చర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపించాలంటే సబ్బు వాడకం తగ్గించాలి. బదులుగా క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ పద్ధతిని ప్రతిరోజూ పాటించాలి. సబ్బు ఎక్కువగా వాడడం వల్ల చర్మం పొడిబరుతుంది. అలా కాకుండా క్లెన్సింగ్ని వాడితే చర్మం తేమగా ఉంటుంది. వార్థక్యపు ఛాయలు కేవలం ముఖంపైనే కాదు.. చేతుల్లోనూ కనిపిస్తాయి. అందుకే మంచి క్రీమ్ ను చేతులకు రోజూ రాసుకోవాలి. ఎప్పటికప్పుడు మృత కణలను తొలగించాలి. నిమ్మరసంలో తగినంత ఉప్పు వేసి దాన్ని చేతులకు రాసుకోని, కాసేపయ్యాక పాత టూత్ బ్రెష్ తో రుద్దితే మృత కణలు తోలిగి చేతులలో నిగారింపు కనిపిస్తుంది.
- ఎప్పటికప్పుడు కనుబొమల్ని షేప్ చేయించుకోవడం ఓ అలావాటుగా మార్చుకోండి. కళ్లు కూడా అందంగా కనిపిస్తాయి. ఎదుటిారి దృష్టి మీ ముఖంపై కన్నా కళ్లపై పడుతుంది.
- ద్రాక్ష పండ్లలో ప్రత్యేకంగా ఉండే పదార్థలు నీటిని సులువుగా స్వీకరిస్తాయి. ద్రాక్షను చర్మానికి రాసినప్పుడు అవి నీటిని స్వీకరించి, చర్మాన్ని తేమగా మారుస్తాయి. అందుచేత ద్రాక్ష పండ్లతో కుదిరినప్పుడల్ల ప్యాక్ వేసుకుంటే మంచిది.
- జుట్టు పలుచబడుతున్నప్పుడు ప్రత్యేక శ్రద్దతో మెరుగులు దిద్దుకోవాలి. లేత రంగు వేసుకోవడం, డీప్ కండిషనర్ షాంపు లాంటివి వాడడం. వీటి వల్ల జుట్టు పొడిబరే తత్వం తగ్గుతుంది.
- వారంలో కనీసం నాలుగుసార్లు, కుదిరితే అంతకన్నా ఎక్కువగా వ్యాయామం చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే కండరాలు దృఢంగా ఉంటాయి. ఆరోగ్యమూ సొంతం అవుతుంది.
- అలాగే కంటినిండా నిద్రపోవడం ఓ అలవాటుగా మార్చుకోండి.
COMMENTS