అందము అందాన్ని పెంచుకోగల మార్గాలు సమతుల్యమైన ఆహారము ( Balanced diet) తీసుకోవాలి. విటమినులు ఉన్న అహారము లేదా విటమినులు ప్రతిరోజు తీసుకోవాలి...
అందము
అందాన్ని పెంచుకోగల మార్గాలు
- సమతుల్యమైన ఆహారము (Balanced diet) తీసుకోవాలి.
- విటమినులు ఉన్న అహారము లేదా విటమినులు ప్రతిరోజు తీసుకోవాలి.
- యాంటిఆక్సిడెంట్లు తీసుకుంటే శరీర కాంతి నిగనిగ లాడుతుంది.
- క్రొవ్వు పదార్దములు తక్కువగా తీసుకోవాలి.
అలసిన కల్లకు : నిద్రపోతున్నట్టు, జీవంలేనట్టు కనిపిస్తున్న కళ్ళకోసం ఇంట్లోనే ఈ చిట్కా పాటించవచ్చు.. కళ్ళకు మేకప్ వేసుకునే ముందు చల్లని దోసకాయ గుజ్జులో ముంచిన దూదిని మూసిన కనురెప్పల మీద ఉంచుకోవాలి.
పొడిబారిన చర్మానికి : ఒక్కొక్క టేబుల్ స్పూను చొప్పున టమోటా, దోస రసాలు, కొన్ని నిమ్మ చుక్కలు , ఒక టేబుల్ స్పూను కిస్మిస్ లు ఇవన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొహానికి రాసుకుని 20 నిముషాలు అనంతరము గోరువెచ్చని నీటి తో కడిగేయాలి.
జిడ్డు చర్మానికి : పావు టేబుల్ స్పూను నిమ్మరసం లో 2 టేబు స్పూనులు తురిమిన కమలా తొక్కలు, కొంచం పాలు కలిపి ఒక రోజంతా ఫ్రిజ్ లో ఉంచాలి. ఇది మంచి క్లెన్సర్ గా పనిచేస్తుంది, దీనిని బాడీలోషన్ గా వాడవచ్చు.
చక్కని స్కిన్ టోన్ కోసం : ఒకటిన్నర టేబుల్ స్పూను పెరుగు, ఒక టేబుల్ స్పూను సన్నగా తరిగిన కమలాపండు తిక్కలు, ఒక టేబుల్ స్పూను ఓట్ మీల్, నూనె ఇవన్నీ కలిపిన మిశ్రమంతో శరీరానికి మ్రుదువుగా మర్దన చేయాలి. చర్మం మీది మ్రుత కణాలు, బ్లాక్ హెడ్స్ తొలగి పోతాయి. దీనిని రోజువారీ స్క్రబ్ గా కూడా వాడవచ్చు.
పాటించ వలసిన జాగ్రత్తలు
- వేలకు నిద్ర పోవాలి
- వేలకు ఆహారము తీసుకోవాలి
- రోజూ వ్యాయామము చేయాలి
- చిన్న చిన్న విషయాలకు టెన్సన్ పడకూడదు.
- ఎక్కువ స్టెస్, స్ట్రైన్ కి గురుకాకూడదు.
- ప్రతి రోజు మ్రుదువైన సబ్బు తో స్నానము చేయాలి.
- మీ అందాన్ని ఇంకొకరి అందము తో పోల్చుకోకూడదు. ఎప్పుడూ పొజటివ్ గానే ఆలోచించండి.
ఆహార నియమాలు
మనము తినే ఆహారాన్ని బట్టి మనకు వ్యాధులు వస్తాయి, ఏదైనా వ్యాధి తో బాధపడుతున్నవారు ఎంత అందముగా ఉన్నా పీలగా కనిపిస్తారు, కాంతిహీనముగా ఉంటారు, ఆహారము సరైందికాకుంటే ఎన్ని లోషన్లు, పోషన్లు ఉపయోగించినా ఆశించిన ఫలితాలు కలగవు. అందువలన మంచి ఆహార నియమాలను పాటించడము వలన జబ్బులనుండి దూరముగా ఉండవచ్చును. ఈ క్రింది ఏ ఆహార పదార్దములు ఎలా ఉపయోగపడతాయో చూద్దాము :
క్యారట్లు(carat root):ఒకే ఒక్క పచ్చి క్యారట్ తింటే రోజంతటికి సరిపడె విటమిన్లు శరీరానికి దొరుకుతాయి. అది కళ్ళు, శరీరభాహ్యకణజాలాన్ని, అవయవాలను, ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. విటమిన్ ఎ ఎక్కువగా లబ్యమవుతుంది.
ఆకు కూరలు : విటమిన్లు చాలా కీలకమైనవి శరీర ఆక్రుతిని , ఆరోగ్యాన్ని కాపాడేందుకు, ఇవి ఎక్కువగా ఆకుకూరలలో ఉంటాయి. శరీర అందానికి విటమిన్ 'సి' మరియు విటమిన్ 'ఇ' ముఖ్యమైనవి. విటమిన్ సి- నిమ్మ, నారింజ జాతి కాయలు, పండ్లలో పుష్కలముగా ఉంటుంది.
రోజుకో యాపిల్ : యాపిల్ లో పెక్టిన్,సి-విటమిన్,కాల్సియమ్,ఫాష్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు లబిస్తాయి. శరీరం లోని విషపదార్దములను, కొలెస్త్రాల్ స్తాయిని యాపిల్ తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు సక్రమముగా పనిచేసెందుకు ఇది సహకరిస్తుంది. అందుకే యాపిల్ ను రొజువారి ఆహారములో చేర్చండి.
నీరు : నీరు మన శరీరానికి ఎంతో అవసరము. సమాజములో దాదాపు 80%మంది డిహైడ్రేషన్ కి లోనవుతుంటారు. దీనివలన శరీరము ముడతలు పడి కాంతిహీవముగా తయారవుతుంది. బుగ్గలు చొట్టలు పడి ముఖము అందవికారముగా తయారవుతుంది.మనశరీర బరువులో 70% పాలుపంచుకున్న నీరు అందానికి ఆరోగ్యానికి ఎంతో అవసరము. కావున ప్రతిరోజూ కనీసము 2లీటర్లు నీటిని త్రాగాలి.
ఉల్లి-వెల్లుల్లి : ఈ రెందూ శరీర రక్తప్రశరణవ్యవస్థ కి మేలుచేస్తాయి. తినే ఆహారపదార్దములలోని 'టాక్సిన్' లను తొలగించడములోను,వ్యాధినిరోధకవ్యవస్థను క్రమబద్దీకరించడములోను ఉపయోగపడతాయి. ఉబ్బసము తగ్గించడానికి కూడా పనికొస్తాయి.
పెరుగు : దీనిలో సహజ సజీవ 'అసిడోఫిల్లస్' లాక్టోబాసిల్లస్ బాక్టీరియ, యోగర్ట్- పుల్లటిపెరుగు లోనే లభిస్తాయి. ఇవి గుండెకు కావలసిన స్పందనను, ఉత్సాహాన్ని అందిస్తాయి.పెరుగు ను క్రమపద్దతిలో వాడితే కడుపులో గాస్ ను,త్రేన్పులు మలబద్దకము, అజీర్ణము వంటి రుగ్మతలు అన్నీ మాయమువుతాయి.
ఫైబరు : కేలరీలు ఏమాత్రము లేకున్నా ,జీర్ణము కానివైనా పీచుపదార్దము ఒంటికి చేసె మేలు ఎక్కువ. ప్రధానముగా ఇవి అతిగాతినడము అరికడతాయి. వయసు మీరిన చిహ్నాన్ని ,గుండెపోటును అరికడతాయి. ఈస్ట్రోజన్ స్తాయిని క్రమపరుస్తాయి.తాజాపండ్లు,పొట్టుగల పదార్దములు, తాజారొట్టె, ఆకుకూరలు, కాయకూరలు పీచు గలవి. ఇప్పటి వరకూ మీరు వీటిని అశ్రద్ద చేసినట్లయితే వెంటనే వాడడము ప్రారంభించండి. మలనపదార్దములను బయటకు పంపించడములో పీచుదినుసులదే కీలకపాత్ర.
శాకాహారము / మాంసాహారము : సాకాహారమే శరీరానికి మంచిది. కూరగాయలు,ఆకుకూరలే 'అద్భుతాహారము' కీరదోస, దొండ,ఉడకపెట్టిన క్యాబేజి, తాజాఆకుకూరలు,వంటికి మంచిది, కేశాలు, చర్మము,,కళ్ళు వంటి శరీరభాగాలన్నీ ఆరోగ్యము తో తొణికిస్తుంటాయి. పాలు అందరికీ మంచిదే. కొన్ని ఎమైనో యాసిడ్సు శాకాహారము లో ఉండవు కావున గుడ్లు, చేపలు, చికెన్ తినడం మంచిది. గుడ్లలో ప్రోటీన్లు, కాల్సియం, ఐరన్, జింకు,బి-కాప్లెక్ష్ విటమిన్లు ఉంటాయి. చికెన్ లో క్రొవ్వు తక్కువగా ఉంటుంది కావున వాడవచ్చు. చేపలలో ఒమెగా ఫాటియాసిడ్సు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలుచేస్తాయి.ఇవి తప్ప మిగతా మాంసాహారాన్ని అనగా మటన్, బీప్, పోర్క్, వగైరా ఎక్కువగా తీసుకోకపొవడం మంచిది.
COMMENTS