శరీర కాంతి పెంచే చిట్కాలు నిమ్మరసము , మజ్జిగ సమబాగాలు కలిపి పూయుట వలన ఎండకు నల్లబడిన ముఖము స్వచ్చముగా నుండును. ఆవ నూనెలో శనగపిండి , పసుపు ...
శరీర కాంతి పెంచే చిట్కాలు
- నిమ్మరసము, మజ్జిగ సమబాగాలు కలిపి పూయుట వలన ఎండకు నల్లబడిన ముఖము స్వచ్చముగా నుండును.
- ఆవ నూనెలో శనగపిండి, పసుపు కలిపి రాసిన చర్మము కాంతివంతమగును.
- వెన్న, పసుపు కలిపి రాత్రిపూట నిద్రపోవునప్పుడు ముఖమునకు రాసుకొనిన ముఖము కాంతివంతముగాను ఉండును.
- ముఖము పై ముడతలున్న రెండు చెంచాల గ్లిజరిన్ లో 1/2 చెంచా గులాబీ జలము, కొన్ని నిమ్మరసపు చుక్కలు కలిపి రాత్రి ముఖముపై రాయవలెను. ఊదయము లేవగానే చల్లని నీటితో ముఖము కడుగుకొంటే, చర్మపు రంగు నిగ్గు తేలి ముడతలు తగ్గిపోతాయి.
- చర్మానికి కుంకుమ పువు సొగసు : కుమ్కుమ పూవు అత్యంత ఖరీదే అయినా ప్రపంచ స్థాయిలో సౌంధర్య సాదనగా ప్రసిద్ధిపొందిది. కుంకుమపూవుతో తయారయిన పేస్టుని ముఖము చేతులపైన రాసుకుంటే చర్మానికి మ్రుదుత్వాన్ని,బంగారు మెరుపుని తెస్తుంది. అందుకే గర్భినిగా ఉన్నవారు కుంకుమ పూవు పాలలో వేసుకొని తాగితే మంచి ఛాయతో మెరిసిపోయే బిడ్డపుడుతుందని నమ్ముతారు.
- పసుపు, వేప లేపనము : వందల సంవత్సరాల నుండి భారతీయులు చర్మ సంరక్షణకు పసుపు, వేపలను వాడుతున్నారు. పలురకాల చర్మ సమస్యలకు విరుగుడుగా పనిచేయడమే కాకుండా చర్మానికి చల్లదనాన్ని, హాయినీ ఇస్తుంది. ఒక చెంచా పసుపు పొడి, కొంచము కుంకుమ పొడి,ఒక చెంచా వేపచూర్నము పచ్చి పాలలో వేసి కలిపి మిశ్రమాన్ని తయారుచేసి ముఖము, ఇతర చర్మభాగాల మీద రాస్తే మచ్చలు దద్దుర్లు వంటివి పోతాయి.
- గంధము పేస్టు : కొంతమంది చర్మము బాగా సున్నితముగా ఉంటుంది. ఏమాత్రము ఎండలోకి వెళ్లినా కందుతుంది, దురద, పొడిబారడం, పొరలుగా రావడం, బిరుసెక్కిపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటప్పుడు గంధము పేస్టు చర్మాన్ని చల్లబరిచి యాంటిసెప్టిక్ గా పనిచేస్తుంది, చర్మాన్ని తేమగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ప్రతి రోజూ దీనిని వాడుతూ ఉంటే చర్మము మీది నూనెగ్రంధులు ఉత్తేజితమై తేమగా ఉండేందుకు తోడ్పడుతూ చర్మాన్ని హానిచేసే బాక్టీరియాను తొలగిస్తాయి.
- ముడతలు పడకుండా నిమ్మకవచం : కోసిన యాపిల్ ముక్క బూడిద రంగులోనికి మారకుండా ఉండాలంటే నిమ్మరసాన్ని కోసిన యాపిల్ భాగములో నిమ్మరసాన్నీ రాస్తుంటారు. ఆక్షిడేషన్ కారణముగా యాపిల్ అలా మారకుండా ఊంటుంది. వాతావరణ కాలుష్యానికి గురైన చర్మము పాడవకుండా ఆపే శక్తి నిమ్మరసము లోని విటమిను 'సి' కి ఉన్నది. ప్రతి సౌంధర్య సాధనానికి రెండు నిమ్మ చుక్కలు కలిపితే చర్మము ముడతలు పడకుండా ఉంటుంది.
- జుట్టుకి గొప్ప కండిషనర్ పెరుగు : పెరుగు జుట్టుని పొడి బారనీయకుండా చేస్తుంది. షాంఫూతో తలంటుకున్న తరువాత ఐదునిముషాలు పెరుగుతో తలకు మసాజ్ చేసుకుంటే పొడిబారిన, పాదైన జుట్టూకి చక్కని కండిషనర్ గా పనిచేస్తుంది. జుట్టుకి మ్రుదుత్వాన్ని ఇచ్చి తేమగా ఉంచే శక్తి పెరుగుకి ఉంది.
COMMENTS