ఏ చర్మానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సలహలు పొడిచర్మం: చర్మంలో తేమ లేకపోవడమే చర్మం పొడిగా కనిపించడానికి కారణం. చర్మం ఎండినట్లు , తాకిత...
ఏ చర్మానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సలహలు
పొడిచర్మం:
చర్మంలో తేమ లేకపోవడమే చర్మం పొడిగా కనిపించడానికి కారణం. చర్మం ఎండినట్లు, తాకితే కరకుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ చర్మం ఉన్న వాళ్లు తరచూ క్లెన్సర్ క్రీమ్ తో ముఖంపై రుద్ది, నీటిలో తడిపిన కాటన్ బల్ తో ముఖాన్ని తుడుస్తు ఉండాలి. ఇలా చేస్తే పట్టిన చెమట, మురికి, బ్యాక్టీరియాలు క్లీన్ చేయాబడతాయి. పొడిచర్మం కోసమే తయారుచేసిన టోనర్ నా ముఖానికి రాస్తూ ఉండాలి. విటమిస్ ఇ తో కూడిన మాయిశ్చరైజింగ్ క్రీమ్ ని ఎక్కువగా రాస్తూ ఉండాలి.
జిడ్డు చర్మం:
చర్మ రంధ్రాల నుంచి ఎక్కువ శాతం నూనె ఉత్పత్తి అయిపోవడం వల్ల జిడ్డుగా కనిపిస్తాం. దీని వల్లే బ్లాక్ హెడ్స్, మెటిమలు త్వరగా వచ్చేస్తాయి. ఇలంటి వాళ్లు ముఖాన్ని ఔషధ గుణలున్న సబ్బులతో లేదా నాస్ ఆల్కలైన్ సబ్బులతో శభ్రం చేసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు స్క్రబ్ తో పట్టిన మురికిని, జిడ్డుని తొలగించాలి. లేకుంటే చర్మగ్రంథులు మూసుకుపోతాయి. ఆయిల్ కాకుండా నీటితో తయారు చేసిన మాయిశ్చరైజర్లు వాడాలి.
కాంబినేషస్ స్కిస్ :
ముఖంపై కొన్ని చోట్ల పొడిగా, కొన్నిచోట్ల జిడ్డు పడితే అలాంటి చర్మతత్వాన్ని కాంబినేషస్ స్కిస్ అంటారు. ఇలంటి వాళ్లు ముఖంపై ఏ బాగం పొడిగా మారుతుందో అక్కడ మాయిశ్చరైజర్ ని వాడాలి. జిడ్డు చర్మం దగ్గర నాస్ ఆల్కలైస్ సబ్బులు ఉపయోగించాలి. గులాబి నీళ్లతో తయారుచేసిన టోనర్ ఈ చర్మతత్వం వాళ్లకి బాగా ఉపయోగపడుతుంది.
COMMENTS