కావలసినవి : మొక్కజొన్న గింజలు - రెండు కప్పులు , నీళ్లు - రెండు కప్పులు , బొంబయి రవ్వ - ఒకటిన్నర కప్పు , చెక్కర - రెండు కప్పులు , నెయ్యి - ...
కావలసినవి :
మొక్కజొన్న గింజలు - రెండు కప్పులు, నీళ్లు - రెండు కప్పులు, బొంబయి రవ్వ - ఒకటిన్నర కప్పు, చెక్కర - రెండు కప్పులు, నెయ్యి - పావుకప్పు, యాలకులపొడి - చెంచా. వేయించిన జీడిపప్పు, బదం పప్పులు - కొన్ని.
తయారీ :
కొబ్బరిపాలు తీసుకున్న్లుట్లే మొక్కజొన్న పాలను తయారుచేసుకోవాలి. దీని కోసం మొక్కజొన్న గింజల్లో నీళ్లు పోసి మిక్సీలో వేసి మిక్స్ చేయలి. అలా వచ్చిన పాలను వడకడుతూ మూడు కప్పులు వచ్చేవరకూ తీసుకోవాలి. ఇప్పుడు బణలిలో చెంచా నెయ్యి వేసి వేడిచేసి బొంబయిరవ్వను వేయించుకోవాలి. మరో పొయ్యిమీద అడుగు మందంగా ఉన్న గిన్నెలో మొక్కజొన్న పాలను తీసుకుని వేడిచేయాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. లేదంటే పాలు విరిగిపోతాయి. అదే సమయంలో మొక్కజొన్నలోని పిండిపదార్థం అడుగుకు చేరి ఉండకట్టేస్తుంది. అందుకే పాలను జాగ్రత్తగా మరగనివాలి. తర్వాత అందులో బొంబయిరవ్వ వేయాలి. అది మూడువంతులు ఉడికాక చెక్కర వేయాలి. చెక్కర కరిగి హల్వ తయారయ్యే సమయంలో మధ్యమధ్య నెయ్యి వేసుకుంటూ ఉండాలి. హల్వ పూర్తిగా తయారయ్యాక యాలకులపొడీ, జీడిపప్పూ, బదం వేసుకుని మరోసారి కలిపి దింపేయాలి.
COMMENTS