కావలసినవి : పచ్చి మిర్చి - కేజీ (బజ్జీమిర్చి వాడాలి) పుల్ల పెరుగు - 2 లీటర్లు ఉప్పు – తగినంత పసుపు – కొద్దిగా ఇంగువ - టీ స్పూను తయారీ పచ్చి...
పచ్చి మిర్చి - కేజీ (బజ్జీమిర్చి వాడాలి)
పుల్ల పెరుగు - 2 లీటర్లు
ఉప్పు – తగినంత
పసుపు – కొద్దిగా
ఇంగువ - టీ స్పూను
తయారీ
- పచ్చి మిర్చిని నిలువుగా ఒక వైపు కట్ చేయాలి
- పుల్ల పెరుగులో ఉప్పు, పసుపు, ఇంగువ వేసి కలపాలి
- పచ్చిమిర్చిని అందులో వేసి ఒక రోజంతా ఉంచాలి
- మరుసటి రోజు పెరుగులో నుంచి మిర్చిని బయటకు తీసి ప్లాస్టిక్ కవర్ మీద ఎండలో ఉంచాలి
- పెరుగును కూడా ఎండబెట్టాలి
- సాయంత్రం మిర్చిని పెరుగులో నానబెట్టాలి
- మరుసటి రోజు మళ్లీ ముందులాగే ఎండబెట్టాలి
- ఇలా సుమారు ఐదు రోజులయ్యాక ఇంక పెరుగులో వేయకుండా కేవలం మిర్చి మాత్రమే ఎండబెట్టాలి
- పూర్తిగా ఎండిన తర్వాత డబ్బాలో నిల్వచేసుకోవాలి
వీటిని వేయించు కుంటే, మామిడికాయ పప్పులోకి రుచిగా ఉంటాయి.
COMMENTS