హార్మోన్ల అసమతౌల్యత.. ప్రస్తుతం చాలమంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. అతిగా బరువు పెరగడం, నిద్ర పట్టకపోవడం, బద్ధకంగా అనిపించడం, రుతు సంబంధ...

- నిద్రలేమితో కూడా హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడుతుంది. కాబట్టి కనీసం రోజుకి 7-8 గంటలు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. హార్మోన్లు సమతౌల్యంగా ఉంటే జీవిత కాలం పెరగడంతో పాలు శరీర బరువు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.
- హార్మోన్లను సమతౌల్యంగా ఉంచుకోవడానికి.. మనం తీసుకునే ఆహారంలో కార్బొహైడ్రే్లు, కొవ్వులు, ప్రొటన్లు ఉండేల చూసుకోవాలి. రోజూ రెండుమూడు రకాల కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు.. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని ఇన్సులిస్ స్థాయిని సమన్వయ పరుస్తుంది. అలాగే పండ్ల విషయంలో కూడా అధికంగా ఫైబర్ ఉండే బొప్పాయి, యాపిల్, జామ పండ్లను ఎక్కువగా తినాలి
- హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడినప్పుడు వాకింగ్, స్విమ్మింగ్.. లాంటి వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వల్ల కొద్ది కాలంలోనే ఈ సమస్యను దూరం చేయవచ్చు. అలగని వేగంగా పరిగెత్తడం లాంటివి చేయకూడదు.
- మన శరీరంలో కొవ్వుల పాత్ర చాలనే ఉంది. శరీరంలో హార్మోన్ల ఉత్పత్తికి, వివిధ కణాలు తిరిగి నిర్మితమవడానికి కొవ్వులు ఉపయోగపడతాయి. ఈ క్రమంలో వెజిటబుల్ ఆయిల్స్ లో పాలీశ్యాచురేటడ్ ఫ్యాట్ అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఈ ఆయిల్స్ వాడడం మంచిది.
- హార్మోన్లపై కొబ్బరి ప్రభావం ఉంటుంది. శరీరంలో వివిధ హార్మోన్లు ఉత్పత్తి కావడానికి కొబ్బరి నూనె కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు.. దీన్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
- పెస్టిసైడ్స్, ప్లాస్టిక్స్, హౌస్ హోల్డ్ కెమికల్స్ మొదలైన వాటిలో టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నాన్ స్టిక్, టెఫ్లాన్ కోటెడ్ వంటపాత్రల్లో లేదా గాజు పాత్రల్లో ఆహారం వండుకోవడం మంచిది. అంతేకాదు ఆహారాన్ని నిల్వ ఉంచడానికి కూడా ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించకపోవడం మంచిది.
- అలవాటు అయిందనో లేక ఇష్టమనో కొందరు పదే పదే కాఫీ తాగుతుంటరు. కానీ కాఫీ ఎక్కువగా తాగకూడదు. ప్రత్యేకించి గర్భవతిగా ఉన్నప్పుడు కాఫీ తాగితే కొన్ని సందర్భాల్లో ప్రమాదంగా మరే అవకాశం ఉంటుంది.
COMMENTS