పొడి చర్మం అనగా పొరలు పొరలుగా ఉండటం , అలాంటి వారికి మేకప్ సరిగ్గా ఇమడదు. వాళ్లు నీరు ఎక్కువ త్రాగటం అవసరం. దాని సంగతి పక్కనపెడితే ఎక్కువ నీ...
పొడి చర్మం అనగా పొరలు పొరలుగా ఉండటం, అలాంటి వారికి మేకప్ సరిగ్గా ఇమడదు. వాళ్లు నీరు ఎక్కువ త్రాగటం అవసరం. దాని సంగతి పక్కనపెడితే ఎక్కువ నీటి పరిమాణం ఉన్న మాయిశ్చరైజర్‌లను ఉపయోగించండి.
- మీ కళ్లు ఉబ్బినట్టు ఉన్నాయా? నల్లటి చారలు మిమ్మల్ని బాధపెడుతుంటే కీరదోసకాయని బద్దలుగా కత్తిరించి కళ్లమీద పెట్టుకుని పావుగంట ఉంచుకోండి. కళ్లకు, మెదడుకు ఉపశమనంతో పాటు చారలు, ఉబ్బుడు పోతుంది. బైటికెళ్లేముందు, మేకప్ ముందు చేస్తే ఇంకా చాలా ఫ్రెష్ గా కనబడతారు.
- కొంత మందికి పెదాలపై పొరలు పొరలుగా మృతకణాలుంటాయి. పొడి బారి ఉంటాయి. అలాంటి వారు పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పెదాలు మృదువు గా లేత కొబ్బరిలా ఉంటాయి. పెట్రోలియం జెల్లీని చేతితో కాకుండా బ్రషుతో తుడవండి.
- జిడ్డు చర్మం కలవారు పొర ఏర్పడే విధంగా మేకప్ చేసుకోకండి. మేకప్‌పై గీతలు పడి మేకప్ వేసుకున్నా అందము పాడయిపోవచ్చు. అలాంటి వాళ్లు ఆయిల్ లెస్ మాయిశ్చరైజర్లు ఉపయోగించండి. విటమిన్'ఇ' ఉన్నవి వాడండి.
- ఐ షాడో కారణంగా ఫౌండేషన్ పాడవకుండా చూసుకోండి. ఐ షాడో రాసుకొనేటప్పుడు లూస్ పౌడర్ ని కళ్ల క్రింద రాసుకోండి. అలా చేయటం వల్ల క్రింద పడిపోయే ఐ షాడోను పట్టి ఉంచుతుంది. మేకప్ పూర్తి అయ్యాక మేకప్ బ్రషుతో పౌడర్ను తొలగించుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఫౌండేషన్ ఐ షాడో కారణంగా పాడవకుండా ఉంటుంది.
- మేకప్ వేసుకోవటానికి, ఐ మీన్ రెడీ అవ్వటానికి ఎప్పుడూ మీ హ్యాండ్స్ ను ఉపయోగించవద్దు. బ్రష్లు వాడటం అలవాటు చేసుకోండి. మేకప్లో ఎంత మార్పు వచ్చిందో మీరే తెలుసుకుంటారు. అన్నింటికీ బ్రష్లు దొరుకుతాయి.
- మీ చర్మానికి తగ్గ కలర్ ఫౌండేషన్ ఎన్నుకోబోయే ముందు మీ ముఖంపై దవడలపై ఫౌండేషన్ కొంచెం వ్రాయండి. అది మీ చర్మానికి సరిపోయిందో లేదో తెలుసుకుంటారు. చర్మం రంగులో కలిసిపోతే ఆ కలర్ ఫౌండేషన్ కొనండి.
- మస్కారా ఇంట్లో ఉంది కదాని పాతవన్నీ అనగా సమయము అయిపోయినవి వేసుకోకండి. అలాగే మస్కారా హాండెల్ అంటే చిన్న పుల్లను పైకి కిందకు లాగకండి. అలా చేయటం వల్ల మస్కారా ట్యూబ్‌లోకి గాలి ప్రవేశించి మస్కారా త్వరగా పొడిబారిపోతుంది. మస్కారా మొద్దుబారిపోయినా మూడు నెలలు దాటినా వాడకండి.
- వయస్సుని వెనక్కి తిప్పండి. చర్మపు ముడుతల వల్లే నిగారింపు, యవ్వనం, అందంమటుమాయ మౌతాయి. వయసుతో సంబంధం లేకుండా కేవలం కేర్ తీసుకోకపోవటం వల్లే ఇది జరుగుతుంది. కొంత మందిని కొన్ని సందర్భాల్లో చూసి అమ్మ, కూతుళ్లా, అక్కాచెల్లెళ్లా అనుకుంటారు. దానికి కారణం కేర్. ఆ పోషణ మీరు తీసుకుంటే మీరు అక్కా చెల్లెళ్లలానే ఉండొచ్చు మీ అమ్మాయితో.
- రోజు ఏదో ఒక సమయంలో అయిదారు చుక్కలు నిమ్మరసం తీసుకోవటం వల్ల చర్మంపై మచ్చలు వయస్సు ప్రభావం వల్ల వచ్చే చర్మ ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు.
- ముఖం మీద ముడతలున్న వారు గింజలు లేని ద్రాక్షను తీసుకుని దాన్ని రెండు భాగాలుగా చేసి వాటిని వేళ్లతో ముడతలు ఉన్నచోట రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగి, బాగా గాలికి ఆరనిస్తే ముడతలు క్రమేణ తగ్గుతాయి
COMMENTS