మీ ముఖం డల్ గా, కాంతిహీనంగా ఉందా? మళ్లీ చర్మానికి కాంతి చేకూర్చాలని ఉందా. 
యితే ఈ చిట్కాలు పాటించండి. 
ముఖారవిందం

మీ చేతివ్రేళ్లతో మీ చర్మానికి జీవకళ తీసుకురావచ్చు
కంటి పై ఎముకభాగం నుండి ముక్కు వరకు అక్కడి నుండి బుగ్గల ఎముక భాగాల వరకు మీ చేతివ్రేళ్లతో పైకి కిందకు నెమ్మదిగా మర్దనా చేయండి. ఈ విధంగా మర్దనా చేస్తూ మాయిశ్చరైజర్ను ముఖానికి పట్టించి మెడ కింది భాగం నుండి గడ్డం వరకు వ్రేళ్లతో మర్దనా చేయాలి. ఇలా చేయడంతో మీ ముఖం కందినట్లు కనిపించినా, ముఖానికి కావలసినంత ఆక్సిజన్ లభిస్తుంది. 
ముఖానికి మసాజ్తో ఎంతో మేలు దీనికోసం మీరు మసాజ్ సెంటర్లకు వెళ్లనక్కర్లేదు. ప్రతీరాత్రి నచ్చిన మాయిశ్చరైజర్తో ఐదు నిమిషాల పాటు ముఖంపై నెమ్మదిగా మర్దనా చేయండి. మసాజ్ చేయించుకున్నంత ఫలితం పొందుతారు. ఆహార అలవాట్లపై దృష్టి ఉంచండి. 
పరిశుభ్రమైన ఆహారంతో మీ చర్మానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. మీరు తీసుకునే ఆహారంతో మీ ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా కాపాడుకోవచ్చు. తరుచుగా చేపలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల చర్మానికి మంచి పోషణ అందించవచ్చు.
  
మీకు ముడతలు లేని చర్మం కావాలంటే...
మీరు నిద్రించేటప్పుడు ముఖం పైకి ఉండేలా నిద్రించండి. పక్కకు, బోర్లా పడుకునే వారికి ఎక్కువగా చర్మంపై ముడతలు త్వరగా ఏర్పడుతాయి.

సన్స్క్రీన్లు వాడటం మంచిది

కుడిచేయి వాటం ఉన్నవారు ఎక్కువగా సన్స్క్రీన్లను ఎడమవైపు పెడతారని, ఎడమ చేయివాటం వారు కుడివైపు ఎక్కువ క్రీం పూస్తారని దీంతో ముఖంపై రెండువైపులా అసమతౌల్యంగా రాయడం జరుగుతుంది. క్రీం వాడేప్పుడు రెండువైపులా రెండు చేతులతో మార్చి మార్చి రాయడంతో ముఖమంతా సమపాళ్లలో క్రీం పడుతుందని, ఇలా రాయడమే ఉత్తమమని బ్యూటీషియన్లు అంటున్నారు.
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: