కోమల ముఖం చర్మానికి మంచి మెరుపు తెచ్చేందుకు చాలా పద్ధతులను మహిళలు పాటిస్తారు. వంటింటి పదార్థాల్లోనే మృతకణాలని పోగొట్టే సుగుణాలున్నాయంటే మీరు...
![]() |
కోమల ముఖం |
చర్మానికి మంచి మెరుపు తెచ్చేందుకు చాలా పద్ధతులను మహిళలు పాటిస్తారు. వంటింటి పదార్థాల్లోనే మృతకణాలని పోగొట్టే సుగుణాలున్నాయంటే మీరు ఆశ్చర్య పోవలసిన పని లేదు. ఆ పదార్థాలేమిటో, వాటినెలా ఉపయోగించి కోమలమైన ముఖాన్ని పొందాలో తెలుసుకుందాం.
పెరుగు : దీనిని తిన్నా, ముఖానికి రాసుకున్నా, తలకి పెట్టుకున్నా అన్ని మంచి ఫలితాలే వస్తాయి. ఇందులో ఉండే లాక్టిక్ ఆమ్లంలో ఆల్ఫా హైడ్రాక్సిల్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగూ, పాలూ కలిపి ముఖానికి రాసుకుని పావు గంటయ్యాక కడిగేసుకుంటే మృతకణాలతో పాటు మురికి పోతుంది.
నట్స్: బాదం, వాల్నట్స్ వంటివి రోజుకి గుప్పెడు తింటే మంచిది. వాటిని పేస్టు చేసి ముఖానికి రాసుకుంటే మృతకణాలు పోవడంతో పాటూ చర్మం చాలా మృదువుగా మారుతుంది. బాదం పేస్టు, పాలు కలిపి ముఖం, మెడ, చేతులకి రాసుకుంటే మరింత మెరుపు సొంతమవుతుంది.
తేనె : చర్మానికి మెరుపు తెచ్చి మేలుచేసే పదార్థాలలో తేనె ఒకటి. ఇది యాంటీసెప్టిక్, యాంటీ బాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది. మచ్చలూ, చారలూ, గీతలతో చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు తేనె మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇది రాయడం వల్ల మచ్చలు పోవడమే కాదు, చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. మృతకణాలు పోవాలంటే తేనె, కొంచెం పంచదార కలిపి ముఖానికి రుద్దితే చర్మం శుభ్రపడుతుంది.
సముద్రపు ఉప్పు: దీనిని ఫేషియల్ స్క్రబ్ గా ఉపయోగించుకోవచ్చు. ఇది మూసుకున్న చర్మగ్రంథులు తెరుచుకునేలా చేస్తుంది. సముద్రపు ఉప్పుతో ముఖం రుద్దుకుంటే మృతకణాలన్నీ పోతాయి. ప్రతి ఉదయం ఇలా చేస్తే మంచిది.
COMMENTS