హెయిర్ ఫాల్ అందం , ఆకర్షణ తెచ్చిపెట్టే జుట్టు వూడిపోతుందంటే ఎవరికైనా ఆందోళనే . ముఖ్యంగా ఆడావారియితే దువ్వుతున్నప్పుడు ఒక్క వెంట్రుక...
![]() |
హెయిర్ ఫాల్ |
అందం, ఆకర్షణ తెచ్చిపెట్టే జుట్టు వూడిపోతుందంటే ఎవరికైనా ఆందోళనే. ముఖ్యంగా ఆడావారియితే దువ్వుతున్నప్పుడు ఒక్క వెంట్రుక రాలిపోయినా తెగ విలవిల లాడిపోతారు. నిజానికి రోజూ ఎంతోకొంత జుట్టు రాలటం సహజమే. కానీ మరీ ఎక్కువగా, కుచ్చులు కుచ్చులుగా వూడుతుంటే మాత్రం అనుమానించాల్సిందే.
మన తలపై సగుటున లక్ష వరకు వెంట్రుకలు ఉంటాయని అంచనా. ఇవి నెలకిసుమారు అరంగుళం వరకు పొడవు పెరుగుతుంటయి. ఇలా రెండు నుంచి ఆరేళ్ల పాటు పెరిగిన తర్వాత విశ్రాంతి దశలోకి చేరుకుంటుయి. ఎప్పుడు చూసినా మన తలపై సుమారు 85% వెంట్రుకలు పెరుగుతూ, మిగతావి విశ్రాంతి దశలో ఉంటయి. రాలిపోయేవన్నీ ఈ విశ్రాంతి దశకు చెందినవే. సాధారణంగా రోజుకి సుమారు 50-100 వెంట్రుకలు రాలిపోతుంటాయి. అయితే వీటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవి పుట్టుకోస్తూ ఉంటాయి. ఈ క్రమం నిరంతరం కొనసాగుతూ ఉండం వల్ల జుట్టు రాలిపోతున్నా పెద్దగా తేడా తెలియదు. కానీ ఒక వేళ పెద్దసంఖ్యలో వెంట్రుకలు రాలిపోతుంటే మాత్రం జుట్టు పలచబడం, మాడు పైకి కనబడుతుండం, కొందరిలో బట్టతల వంటి లక్షణలు కనిపిస్తాయి. ఇల ఎక్కువగా వెంట్రుకలు రాలటానికి ఆడవారిలో కొన్ని ప్రత్యేకమైన సమస్యలతో పాటు పోషకాహారలోపం వంటివి దోహదం చేయవచ్చు. కొన్నిసార్లు ఎలాంటి కారణమూ లేకపోవచ్చు.
క్యాన్సర్ చికిత్స: క్యాన్సర్ కణాలను చంపేందుకు ఇచ్చే రేడియోథెరపీ, కీమో చికిత్సలు వెంట్రుకల కుదుళ్లనూ దెబ్బతీస్తాయి. దీంతో జుట్టు గణనీయంగా రాలిపోతుంది. అయితే చికిత్సలు ఆపిన తర్వాత తిరిగి పెరుగుతుంది.
కాన్పు తర్వాత : గర్భధారణ సమయంలో హార్మోన్ల మోతాదులు చాల ఎక్కువగా ఉంటాయి. దీంతో విశ్రాంతి దశలోనివెంట్రుకలు రాలడం తగ్గిపోయి, జుత్తు వత్తుగా ఉన్నట్లుఅనిపిస్తుంది. కానీ కాన్పు తర్వాత హార్మోన్ల మోతాదులు మామూలు స్థాయికి చేరుకోగానే జట్టు త్వరగా రాలటం పెరుగుతుంది. ఇది మళ్ళి సాధారణ స్థాయికి చేరుకోవటనికి రెండేళ్లయినా పడుతుంది.
థైరాయిడ్ సమస్యలు : గొంతుకి ఇరువైపుల సీతాకోకచిలుకల కరచుకొని ఉంటుంది థైరాయిడ్ గ్రంథి. దీన్నుంచి వెలువడే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైనా, తకువైనా వెంట్రుకలు పెరగడం, విశ్రాంతి దశల క్రమందెబ్బతినొచ్చు. దీంతో వెంట్రుకలు రాలిపోతుంటాయి. థైరాయిడ్ హార్మోన్ లోపంతో ఇదొక్కటే కాదు. బరువు పెరగం, తగ్గండం. వేడిని, చలిని తట్టుకోలేకపోవం.. గుండె వేగంలో మార్పుల వంటి లక్షణలూ ఉంటాయి.
పీసీఓఎ : అండాశయాల్లో నీటితిత్తులు (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) గలవారిలో హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుంది. దీంతోచాలమందిలో మీసాలు, గడ్డం వస్తాయి. అదే సమయంలో తల మీది జట్టు సన్నబడుతుంది కూడా.
తామర : తలపై తామర ఏర్పడితే ఆ ఫంగస్ మూలంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. తామర వచ్చిన భాగంలో ఎరగ్రా, పొట్టు రాలుతున్నట్లు కనిపిస్తుంది. ఈ ఫంగస్ ఇతరులకూ వ్యాపించే ప్రమాదముంది. కాబట్టి ఇంట్లో ఎవరికైనా తామర వస్తే మిగతా కుటుంబసభ్యులూ జాగ్రత్తగా ఉండడంతప్పనిసరి.
గర్భనిరోధక మాత్రలు : ఈ మాత్రల్లోని హార్మోన్లు కొందరిలో జుట్టు రాలటానికి దోహదం చేయవచ్చు. ముఖ్యంగా వెంట్రుకలు ఎక్కువగా రాలే లక్షణంగల కుటుంబాల చెందిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఈ మాత్రలు ఆపేసినప్పుడూ జుట్టు రాలటంఆరంభం కావచ్చు. అధిక రక్తపోటు, గుండె జబ్బు, కీళ్ల అరుగుదల, కుంగు బాటు వంటి జబ్బులకు వేసుకునే మందులతోనూ వెంట్రుకలు రాలిపోవచ్చు.
ఆహార నియమాలు: బరువుతగ్గటానికి ఆహార నియమాలు పాటించే వారిలోనూ వెంట్రుకలు రాలిపోవం కనిపిస్తుంది. తక్కువ ప్రోటీన్ ఆహారం తీసుకుంటూ 8 కిలోల కన్నా ఎక్కువ బరువు తగ్గారనుకోండి. 3-6 నెలల తర్వాత వెంట్రుకలు రాలం ఆరంభంకావొచ్చు. అయితేఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఇవి మళ్లీమొలుస్తాయి.
కారణాన్ని గుర్తించి తగు చికిత్స తీసుకుంటే జుట్టు రాలం చాలవరకు తగ్గిపోతుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి తగినన్ని విటమిన్లు, ఖనిజాలు, ముఖ్యంగా ఇనుము, జింకు, క్యాల్షియం వంటివి అవసరం. కాబట్టి సమతులహారం తీసుకోవం తప్పనిసరి.
COMMENTS