ఇంట్లొనే అందానికి మెరుగులు చర్మం నిగారింపు విరజిమ్ముతూ మెరిసిపోవాలంటే బ్యూటీ పార్లర్‌కో , సౌందర్యసాధనాలు అమ్మే షాపుకో వెళ్లి వందలు , వేలు ...
![]() |
ఇంట్లొనే అందానికి మెరుగులు |
కళ్లకింద నలుపు తగ్గించేందుకు
మూడు బాదం పప్పులను తీసుకుని మెత్తగా నూరి, అందులో ఐదారు చుక్కలు నిమ్మరసం, ఒక టేబుల్ స్పూను చైనా మట్టి, ఒక టేబుల్ స్పూను పాలు కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ల కింద రాసుకుని పదిహేను నిముషాల అనంతరం, ముందు పాలతోనూ అనంతరం నీటితోనూ కడిగేయాలి.
మొహంపై ముడతలు
ఒకటేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన, అర బంగాళాదుంప రసం వీటి మిశ్రమాన్ని మొహానికి రాసుకుని బాగా ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలి.
చర్మం ముడతలు తగ్గేందుకు
ఒక గుడ్డుని, రెండు బాగా చిదిపిన అరటిపళ్లతో కలిపి మిశ్రమం తయారు చేయండి. దీనిని మొహానికి, మెడకు రాయండి. పదిహేను నిముషాలపాటు అలాగే వదిలేసి, తరువాత మొదట పాలతోనూ, అనంతరం నీటితోనూ కడగాలి. దీని వల్ల చర్మం ముడతలు మాయమై మృదువుగా మెరుస్తుంటుంది.
మోచేతులు, కాళ్ల నునుపు కోసం
సాధారణంగా మోచేతులు, కాళ్లు గరుకుగా ఉంటాయి. రెండు అరటిపళ్లలో రెండు టేబుల్ స్పూన్ల పంచదారని కలిపి ఈ మిశ్రమాన్ని పైన చెప్పిన శరీరభాగాల మీద రాస్తే ఆ భాగాలు నునుపుగా మంచి రంగుకి మారతాయి.
అందమైన చేతుల కోసం
రెండు అరటి పళ్లు, నిమ్మరసం, రెండు స్పూన్ల ఓట్‌మీల్ ఇవన్నీ కలిపి చేతులకు రాయాలి. ఒక క్రమపద్ధతిలో ఈ మిశ్రమంతో చేతులకు మర్దనా చేయాలి.
బొప్పాయితో స్వచ్ఛత
పావుభాగం బొప్పాయికాయని మెత్తగా నూరి దీనితో మొహానికి మసాజ్ చేయడం ద్వారా మొహంపై ఉన్న మృతకణాలు, మట్టి తొలగి, మృదువుగా స్వచ్ఛంగా మారుతుంది.
కమిలిన చర్మానికి బొప్పాయితో
ఒక టేబుల్ స్పూను తాజా మీగడ, ఒక టేబుల్ స్పూను పంచదార, కాయలో పావుభాగం బొప్పాయి తీసుకుని మెత్తగా నూరి దీనిని ఫ్రిజ్‌లో ఉంచి గడ్డకట్టనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఒక స్పూనుడు తీసుకుని మొహానికి బాగా మర్దనా చేయాలి. ఇందులో ఉన్న పంచదార శరీర ఉష్ణోగ్రతకు కరిగే వరకు మర్దనా చేయాలి. దీనివల్ల చర్మం మృదుత్వాన్ని సంతరించుకోవడమే కాకుండా మేని ఛాయ మెరుగవుతుంది.
జుట్టు పౌష్టికత కోసం
మూడు అరటిపళ్లు తీసుకుని ఒక గుడ్డుని, రెండు స్పూన్ల షీకాయ పొడిని కలిపి జుట్టుకి బాగా పట్టించి అరగంటపాటు అలాగే ఉంచి తరువాత షాంపూతో తలస్నానం చేయాలి.
బంగాళాదుంపతో
సగం బంగాళాదుంప తురుములో నిమ్మరసం, ఒక టేబుల్ స్పూను చైనా మట్టిని కలిపి మెత్తగా పేస్ట్‌లా తయారుచేసి దీనిని మొహానికి రాసుకుని ఇరవై నిముషాల అనంతరం చల్లని నీటితో కడిగేయాలి.
బంగాళా దుంప రసంతో ముఖ సౌందర్యం
పచ్చి బంగాళా దుంపని తురిమి దాని నుంచి రసాన్ని తీయాలి. ఒక నిమ్మకాయ రసాన్ని ఇందులో కలపాలి. ఈ మిశ్రమాన్ని దూదితో మొహమంతా పట్టించాలి. మొహం శుభ్రంగా ఆరేదాక ఆగి అనంతరం కడిగేయాలి.
మొహాం జిడ్డు గా ఉంటే టమాటాతో
టమాటా రసాన్ని మొహానికి రాసుకుని ఆరే వరకు ఆగి తరువాత కడిగేస్తే మొహానికి ఉన్న జిడ్డు తొలగుతుంది.
మృదుత్వాన్ని తెచ్చే టమాటా
ఒక టేబుల్ స్పూను ముల్తానీ మట్టి, ఒక నిమ్మకాయ రసం, సగం టమాటా ఈ మూడింటిని మిశ్రమం చేసి మొహానికి రాసుకుంటే జిడ్డు తగ్గి మొహం మృదువుగా మారుతుంది.
బాదంపప్పుతో
ఐదు నూరిన బాదంపప్పులను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూను మీగడ, సగం నిమ్మకాయ రసం కలిపి దీనిని మొహానికి రాసుకుని ఆరే వరకు ఒక క్రమపద్ధతిలో మసాజ్ చేయాలి. ఇది పొడి చర్మానికి ఉపయుక్తం.
మొహం శుభ్రత కోసం క్యాబేజి
ఒక లీటరు నీటిలో 100 గ్రాముల క్యాబేజిని వేసి ఉడికించాలి. ఈ నీటితో మొహం కడిగితే చర్మం స్వచ్ఛంగా, శుభ్రంగా అవుతుంది.
యాపిల్‌తో
ఒక టేబుల్ స్పూను ఓట్‌మీల్ పౌడర్‌ని తీసుకుని ఇందులో తురిమిన యాపిల్ పండు( సగభాగం), రెండు స్పూన్ల పాలు కలిపి మొహానికి రాసుకుని పదిహేను నిముషాలపాటు ఉంచుకుని కడిగేస్తే చర్మం మెరుస్తుంది.
క్యాబేజితో ప్యాక్
200గ్రాముల తురిమిన క్యాబేజి రెండు టేబుల్ స్పూన్ల వెన్న, నిమ్మరసం, తురిమిన క్యారెట్, రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి ఇవన్నీ బాగా గట్టి మిశ్రమంగా కలిపి దీనిని మొహానికి, మెడకు రాసుకుంటే చర్మానికి మేలు చేస్తుంది.
నిమ్మరసంతో
నిమ్మరసంలో గోళ్లు మునిగేలా ఉంచితే వాటికి బలం చేకూరడమే కాకుండా శుభ్రపడతాయి.
COMMENTS