ఈ కాలంలో వయస్సుతో సంబందం లేకుండా అందరిని ఇబ్బందిపెట్టే సమస్య స్థూలకాయం, అయితే ప్రత్యేకంగా కార్పొరేట్ ఉద్యోగులకు ఎక్కువగా స్థూలకాయం వస్తుంది, ఎందుకంటే వారి ఉరుకుల పరుగుల జీవితంలో, పని ఒత్తిడిలో సరియైనఆహార నియమాలు పాటించడం మానేసి, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ, ఏవిదమైన వ్యాయామం చేయకపోవడం వల్ల, వారి ఆహారంపై నియంత్రణ లేకపోవడం వల్ల దీనికి గురివుతున్నారు.

మన ఇంట్లో కూర్చునే అధిక బరువును తగ్గించుకోవడానికి మార్గాలు

  • రోజూ కనీసం 30 నిమిషాలైన వాకింగ్ చేయడం ఎంతో మంచిది, దీని వల్ల మీరు ఆ రోజు తీసుకున్న క్యాలరీలు తగ్గుతాయి.
  • మీ రోజువారి ఆహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉన్న ఆహరం అంటే పాలు, మజ్జిగ ఎల ఎక్కువగా తీసుకుంటే ఎంతో మంచిది.
  • ఒకవేళ మీకు మంసాహారం అంటే ఇష్టం ఉన్ననూ, ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు, దాని వల్ల మీశరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఎక్కువ.
  • ద్రవం రూపంలో ఉన్నవి ఎక్కువగా తీసుకోవాలి, ప్రత్యేకంగా “గ్రీన్ టీ” రోజుకు కనీసం 2 సార్లు అయినా తీసుకుంటే ఎంతో మంచిది, ఇది మీ శరీరంలోని కొవ్వు పదార్దాలను కరిగిస్తుంది.
  • మీరు తీసుకునే ఆహారంలో “చక్కెర నిల్వలు” ఎక్కువగా ఉంటే దానిని తగ్గించడం ఎంత అవసరం, ఎందుకంటే ఈ చక్కెర నిల్వలు అధిక బరువుకి దారి తీస్తాయి.
  • అధిక రసం కలిగిన పండ్లను తీసుకోవడం ఎంతో మంచిది, ప్రత్యేకంగా నారింజ, పుచ్చకాయ, పైన్ ఆపిల్ తీసుకుంటే మీ బరువుని ఎంతో సులభంగా తగ్గించుకోవచ్చు.
  • మీ ఆహారం తీసుకునే పద్దతిని మార్చుకోండి, ఒకవేళ మీరు రోజుకి 3 సార్లు ఆహరం తీసుకుంటున్నట్లైతే దానికి నాలుగు సార్లుగా కొంచెం కొంచెం తీసుకోండి.
  • మీ ఆహారంలో చీజ్, నెయ్యి మరియు వెన్న ఎలాంటి కొవ్వుని కలిగించే పదార్దాలు లేకుండా చూసుకోండి ఎందుకంటే వీటి వల్ల మీ బరువు పెరిగే అవకాశం ఎక్కువ.
  • మీ అధిక బరువు తగ్గించుకోవడానికి వారంలో కనీసం 3 కోడి గుడ్లు అయినా తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఈ కోడి గుడ్లలో ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.
  • సాద్యమైనంత వరకూ ఆకలి వేస్తేనే ఆహారం తీసుకోండి, అంతేకాకుండ ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి లేని సమయంలో కూడా ఆహారం తీసుకోవడం వల్ల మీరు అధిక బరువుకు గురి అయ్యే ప్రమాదం ఉంది.
  • రోజూ వ్యాయామం చేయండి,అలా చేస్తే మీ శరీరంలోని క్యాలరీలు తగ్గి మీ బరువును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి,వీలుంటే “యోగా” చేయడం ఎంతో శ్రేయస్కరం.
  • ప్రతి రోజు ఓకే సమయంలో నిద్రపోతే మీలోని జీవక్రియ రేటు పెరిగి, మీ అదిక బరువును తగ్గించడంలో సహాయ పడుతుంది.
  • మీ రోజు వారి ఆహారంలో “సూప్స్” తీసుకుంటే అది మీ అధిక బరువును తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
  • నూనెతో చేసిన వస్తువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది,ఎందుకంటే వీటిలో అధిక శాతంలో ఉన్న క్యాలరీలు,మీ బరువు అధికంగా పెంచే అవకాశం ఉంది.
  • బంగాళ దుంపలలో కేలరీలు మరియు కార్బోహైడ్రేట్ల ఎక్కువగా ఉండడం వల్ల అధిక బరువుకు గురి చేసే ప్రమాదం ఉంది.

బరువు తగ్గించే ద్రవాలు(డ్రింక్స్):
  • రోజూ కాఫీ తాగడం వల్ల అందుకో ఉండే కెఫిన్ మీ బరువుని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఇందులో కోకో మరియు కోలా గింజలు కలుపుకుంటే మంచి ప్రబావం చూపిస్తాయి.
  • ఆపిల్ జ్యూస్, తేనె, చల్లని నీరు కలిపి తీసుకుంటే మీకు మీ శరీరంలోని క్యాలరీలను తగ్గించడమే కాకుండా మీ జీర్ణ సమస్యలకి మంచి ఫలితం లబిస్తుంది.
  • నిమ్మ,నారింజ వంటి సిట్రస్ పండ్లు జ్యూస్ రోజూ తీసుకుంటే మీ అధిక బరువు సమస్యను తరిమేయవచ్చు.
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: