వర్షాకాలం వచ్చిందంటే ఎండలేడి తగ్గి కాస్త సేదతీరుతాం.. కానీ చల్లదనంతో పాటే వానలు రకరకాల ఆరోగ్య సమస్యల్ని కూడా వెంట తీసుకోస్తాయి. చిన్నారుల విషయంలోనైతే మరీనూ. ఈ సీజన్ లో చిన్నపిల్లల్లో మలేరియా, కలరా, కామెర్లు, వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు.. ఇల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలత్తుతాయి. అంతేకాదు ఈ సమయంలో చాలమంది పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి వర్షాకాలంలో పిల్లల్ని కంటికి రెప్పల కాపాడాల్సిన భాధ్యత ప్రతి తల్లిదండ్రులకీ ఉంది. మరి ఈ సీజన్ లో చిన్నారులు ఆరోగ్యంగా, ఫిట్గా ఉండాలంటే....

• వర్షాకాలంలో ఇంటిని, పరిసరాలను పరిశభ్రంగా ఉంచడం చాల అవసరం. ఎందుకంటే పిల్లలు ఎక్కడపడితే అక్కడ ఆడుకుండుటారు. ఏదైనా కొంచెం మురికిగా ఉన్నా సరే.. క్రిములు శరీరానికి అంటుకుని రకరకాల చర్మ సమస్యలు తలత్తుతాయి. కాబట్టి దోమలు రాకుండా కిటికీలకు మెషలు, ఇంట్లో స్పే లు..లాంటివి చల్లాలి. అలాగే పిల్లల బడ్ చుట్టూ దోమతెరలు కట్టడం మర్చిపోవద్దు.

• వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఎక్కువగా నీళ్ల వల్లే వ్యాపిస్తాయి. కాబట్టి పిల్లలకు ఏ నీళ్లు పడితే అవి ఇవ్వకుండా. బాగా మరిగించి, చల్లర్చిన నీటిని అందించడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల నీటిలో ఉండే క్రిములు, బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల్ని బయట దొరికే నీరు, జ్యూసులు.. లాంటి పానీయాలకు దూరంగా ఉంచడం మంచిది.

• వర్షాకాలంలో పిల్లలకు కూరగాయలు ఎక్కువగా పెట్టడం మంచిది. ఎందుకంటే వీటిలో యాంటఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని క్రిములను, బ్యాక్టీరియాను నాశనం చేయడంలో తోడ్పడతాయి. అలాగే ఆకుకూరల్లో ఆకు పురుగులు ఎక్కువగా వుండే అవకాశం వుంది. కాబట్టి ఆకుకూరలైనా, కూరగాయలైనా.. వండే ముందు పరిశభ్రంగా కడగం చాల ముఖ్యం.

• ఏ పూటకాపూటే వేడివేడిగా, శుభ్రంగా వండిన ఆహార పదార్థాలే పిల్లలకు పెట్టడం మంచిది. ఫ్రిజ్లో ఉంచాం కదా అని రెండు రోజుల కింద తయారు చేసిన ఆహారం తింటే పలు ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లువుతుంది.

• వర్షాకాలంలో పిల్లల శరీరాన్ని నిరంతరం పొడిగా ఉంచడానికి ప్రయత్నించాలి. కానీ ఇది అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి వాళ్లు ఆడుకునేప్పుడు వచ్చే చెమటను గ్రహించడానికి వదులుగా, పొడిగా ఉండే కాటన్ దుస్తులను వేయాలి. ఒకవేళ మీ పిల్లలు వానలో తడిస్తే.. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తడి బట్టలను తీసేయాలి. ఎందుకంటే తడి బట్టల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షాకాలంలో ఎప్పుడూ పొడిగా ఉండే దుస్తులేక ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే చర్మం కూడా పొడిగా ఉండేల చూడం ముఖ్యం. ఇంకా పిల్లల చెప్పులు, సాక్సులు, రెయిర్ కోట్, గొడుగు శుభ్రంగా కడిగి పొడిగా ఆరబట్టలి.

• బయట ఎక్కువగా ఆడడం వల్ల పిల్లలకు గోళ్లలో మురికి చేరిపోతుంది. వర్షాకాలంలో అయితే మరీనూ... కాబట్టి పిల్లలు చేతులు నోట్లో పెట్టుకోకుండా, గోళ్లు కొరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఎందుకు చేయకూడదో ఒకటికి రెండుసార్లు వారికి అర్థమయ్యేల చెప్పాలి. అలాగే బయటి నుంచి వచ్చిన వెంటనే పిల్లల చేతుల్ని శుభ్రంగా కడగాలి.

• కొంతమంది కట్ చేసిన పండ్లను ఎక్కడపడితే అక్కడ పెడుతుంటరు. పైగా వాటిపై కనీసం మూతలు కూడా పెట్టారు. దీంతో వాటిపై ఈగలు వాలి రకరకాల రోగాలను వ్యాపింపజేస్తాయి. వీటిని పిల్లలకు ఇవ్వడం అంత మంచిది కాదు. కాబట్టి అవసరమున్నప్పుడే పండ్లను కట్ చేసుకోవడం మంచిది. అలాగే వండిన పదార్థాలపై నిండుగా మూతలు పెట్టడం చాల ముఖ్యం.

• ఈ కాలంలో మీ పిల్లలకు ఏదైనా జలుబు, జ్వరం.. లంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి తాత్కాలిక ఉపశమనానికి సొంత వైద్యం జోలికి వెళ్లకపోవడం మంచిది. ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి సరైన వైద్యం చేయించి, చిన్నారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన భాధ్యత తల్లిదండ్రులదే.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: