ఇది పూర్తిగా అపోహే! వందేళ్లు దాటిన వారిలో కూడా లైంగికపరమైన ఆసక్తులు చచ్చిపోతాయనుకోవటనికి లేదు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు , పరిశోధనల...
ఇది పూర్తిగా అపోహే! వందేళ్లు దాటిన వారిలో కూడా లైంగికపరమైన ఆసక్తులు చచ్చిపోతాయనుకోవటనికి లేదు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు,
పరిశోధనలు చాలానే జరిగాయి. మనుషులు మరణించే వరకూ కూడా లైంగికంగా ఆసక్తులయ్యే ఉంటారని వీటిలో స్పష్టంగా గుర్తించారు. కాకపోతే యుక్తవయసులో ఉండే ఆసక్తీ.. మలివయసులో ఉండే ఆసక్తీ ఒకే రకంగా ఉండదు. యుక్తవయసులో ఉన్న వారిలా మలి వయసులో రోజుకోసారి సంబోగం వంటివి సాధ్యం కాకపోవచ్చు. కానీ స్త్రీపురుషుల మధ్య సాన్నిహిత్యానికి ఉండే ప్రాముఖ్యం మాత్రం మనిషి మరణించే వరకూ కూడా తగ్గదు. కేవలం చేయి పట్టుకోవడమే కావచ్చు... అది కేవలం సాన్నిహిత్య భావనే కావచ్చు.. కానీ దానికీ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి వయసుతో పాటు సెక్స్ వాంఛలు కోరికల రూపం మారొచ్చేమోగానీ ఆసక్తి తగ్గిపోవమన్నది మాత్రం ఉండదు.
COMMENTS