ఇదేం నిజం కాదు. ఇదో పురుషాహంకార భావన. సంబోగాన్ని స్త్రీపురుషులు ఇరువురూ సమాన స్థాయిలోనే ఆస్వాదిస్తారు. అయితే పురుషుల ప్రవర్తన , వ్యవహార శైలి...
ఇదేం నిజం కాదు. ఇదో పురుషాహంకార భావన. సంబోగాన్ని స్త్రీపురుషులు ఇరువురూ సమాన స్థాయిలోనే ఆస్వాదిస్తారు. అయితే పురుషుల ప్రవర్తన,
వ్యవహార శైలి కాస్త బహాంగా,
నాటకీయంగా ఉండి,
వాళ్లు సెక్స్ని ఎక్కువగా ‘
ఎంజాయ్’
చేస్తునట్లు అనిపించొచ్చు. అదే స్త్రీల విషయానికి వచ్చేసరికి ఈ వ్యక్తీకరణలు కాస్త మృదువుగా,
నిదానంగా,
సున్నితంగా అనిపించొచ్చుగానీ,
వాస్తానికి స్త్రీలు పురుషుల కంటే భావప్రాప్తిలో గాఢమైన అనుభూతి పొందుతారు. పైగా స్త్రీలు సంబోగ సమయంలో ఒకసారి కాదు. పలుమార్లు భావప్రాప్తి పొందొచ్చు కూడా. అదే పురుషల్లో ఒక్కసారి స్ఖలనం అయిపోయిందంటే అంగం బిగువు కోల్పోతుంది,
సెక్స్ వాంఛా తీరిపోతుంది. నిజానికి ఇది సంతాన వృద్ధి కోసం ఉన్న ఏర్పాటు. ఎందుకంటే పురుషడు స్ఖలించిన వీర్యం,
అందులోని శక్రకణలు.. ఎక్కడో పైన ఫలోపియస్ ట్యుబుల వద్ద ఉండే అండం వరకూ చేరుకుంటేనే సంయోగం,
గర్భధారణ సాధ్యమవుతాయి. ఒకవేళ స్ఖలనం తర్వాత కూడా పురుషడు సంబోగాన్ని కొనసాగిస్తూనే ఉంటే అది ఈ అండ-శక్ర సంయోగ ప్రక్రియకు అవరోధంగా మారొచ్చు. అందుకే స్ఖలనంతో సాధారణంగా సంబోగం ముగుస్తుంది. సంబోగంలో స్త్రీలు పలుమార్లు భావప్రాప్తి పొందినా,
పురుషలు ఒక్కసారే పొందినా సెక్సును ఇద్దరూ సమానంగానే ఆస్వాదిస్తారు. ఇరువురూ తృప్తిని పొందుతారు. ఇందులో ఒకరు ఎక్కువనీ,
మరొకరు తక్కువనేం ఉండదు.
COMMENTS