telugu jokes, jokes in telugu, apurupa, teluguh, fun, telugu fun
రాము: రైట్ బ్రదర్స్ టీచర్.
టీచర్(సోముతో): సోము రైలును ఎవరు కనుక్కొన్నారు?
సోము: లెఫ్ట్ బ్రదర్స్ టీచర్.
ఆఆఆ............
<><><><><><><><><><><><><><><><><><><><><><>
చింటు(వాళ్ళ నాన్నా అప్పారావుతో): "నాన్నా నాకు ఇన్ని తెలివితేటలు ఎక్కడినుండి వచ్చాయి"?
అప్పారావు(చింటుతో): "నీవన్ని మీ అమ్మ తెలివితేటలు రా, నావి నాదగ్గరే ఉన్నాయి."
ఆఆఆఆఆఆఆఆఆఆఆ......................
<><><><><><><><><><><><><><><><><><><><><><>
పప్పు:"ATM నుండి డబ్బులు తీసుకుంటున్నాడు". ఇంతలో(దొంగ)
బిల్లు(దొంగ):" పప్పు వెనకలనుండి హ, హ నీ పాస్ వర్డ్ నేను చూశాను.అది 1458"
పప్పు:" హ, హ, హ కాదు, కాదు, అది 1258"
ఆఆఆఆఆఆఆఆఆఆ ..........................
<><><><><><><><><><><><><><><><><><><><><><><><>
(ఇద్దరు స్నేహితురాళ్ళు ఇలా మాటలాడుకుంటున్నారు)
అమ్ములు: "మగవారి మీద నీ అభిప్రాయము ఏమిటి?
సుబ్బులు: "ఒక విషయం వారి చెవుల నుండి వెళ్తే ఆ విషయం మరొకరి నుండి బయటికి వస్తుంది".
సుబ్బులు:"మరి ఆడవారి మీద నీ అభిప్రాయం ఏమిటి?"
అమ్ములు:"ఒక విషయమ వారి రెండు చెవుల నుండి వెళ్లి వారి నోటి నుండి బయటకి వస్తుంది".
ఆఆఆఆఆఆఆఆఆఆ.............................
<><><><><><><><><><><><><><><><><><><><><><><><>
టీచర్: (బన్నితో) రైలు ప్రమాదాలు ఎలా తగ్గించవచ్చు?
బన్ని: "Speed Breakers" రైల్ ట్రాక్స్ మీద పెట్టి తగ్గించవచ్చు టీచర్.
ఆఆఆఆఆఆఆఆ..........................
<><><><><><><><><><><><><><><><><><><><><><><><>
"ఏరా పరీక్షా ఎలా రాశావు?" అడిగాడు కామేశం కొడుకు బాబిని.
బాబి: "కేక వందకు వంద వస్తాయి" తల ఎగిరేస్తూ చెప్పాడు బాబి.
కామేశం:"నేను నమ్మను" అనుమానంగా చూసాడు బాబిని.
బాబి:"నువ్వు నమ్మవనే ఆన్సర్ షీట్ కూడా తీసుకొచ్చా. ఇదిగో చూడు" బ్యాగ్ లో నుండి తీస్తూ అన్నాడు బాబి.
ఆఆఆఆఆఆఆఆఆఆ...................................
<><><><><><><><><><><><><><><><><><><><><><><><>
(చింతామణి, వరహాల రావు భార్యాభర్తలు)
ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది.
వరహాల రావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి "ఏమండీ మీ బందువొస్తోంది...పలకరించండి"
అంది నవ్వుతూ.
వరహాల రావు: "నమస్తే అత్త గారు..............బాగున్నారా?" నేను మీ అమ్మాయి "Evening Walk" కి బయలుదేరామండి" అని పలకరించాడు వరహాల రావు.
ఆఆఆఆఅ............................
<><><><><><><><><><><><><><><><><><><><><><><><>
చింటూ: "ఈ పెయింటింగ్ 200 ఏళ్ళ 10 రోజుల కిందటిది కదా?"
బంటి: "అంత సరిగ్గా ఎలా చెప్పగలవు?"
చింటూ: "10 రోజుల క్రితం దీన్నికొన్నప్పుడు షాపువాడు 200 ఏళ్లది అని నాకు చెప్పాడు."
ఆఆఆఆఆఆఆఆ.......................
<><><><><><><><><><><><><><><><><><><><><><><><>
(ఇంటర్వ్యూ జరుగుతోంది)
"మీ పేరు?"
"నా పేరు శ్రీ ......శ్రీ......శ్రీ .......శ్రీ.........శ్రీనివాస రావు".
"మీ పేరు ముందు అన్ని శ్రీలు ఎందుకు?"
"న....న...న......న......నాకు నత్తండి"
ఆఆఆఆఆఆఅ........................
COMMENTS