telugu jokes, jokes in telugu, teluguh, apurupa, fun, telugu fun
అప్పారావు(సుబ్బారావుతో): నువ్వు వాచ్ మన్ గా పనిచేస్తున్నావు కదా, దొంగలు పడితే ఎందుకు పట్టుకోలేదు.
సుబ్బారావు : నేను వాచ్ మన్ ని కాని కాచ్ మన్ ని కాదు.
ఆఆఆఆఆ.............................
<><><><><><><><><><><><><><><><><><><><><><><>
బంటి (చంటి తో) : పెళ్లిచూపులకు వెళితే తన్ని పంపించారురా.
చంటి : ఎందుకు?
బంటి : మా అమ్మాయి బంగారం అన్నారురా , అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే.
ఆఆఆఆఆఆఆ................................!
<><><><><><><><><><><><><><><><><><><><><><><>
(ఇద్దరు వ్యక్తులు మందు తాగి ఈ విధంగా మాటలాడుకుంటున్నారు)
అప్పారావు: సుబ్బారావు తో మందుకు విషానికి తేడా ఏమిట్రా?
సుబ్బారావు : మందు తాగితే నలుగురిలో మనం చిందులేస్తాం,
విషం తాగితే మన చుట్టూ నలుగురు డప్పు వాయిస్తూ చిందులేస్తారు.
<><><><><><><><><><><><><><><><><><><><><><><>
అప్పారావు(సుబ్బారావుతో): నాకు ఆస్ట్రేలియాకి కొద్దిగా ఉత్తరం రాసిపెట్టు.
సుబ్బారావు: చిరునామా ఇవ్వు.
అప్పారావు: చిరునామా కోసమే రాయమన్నది.
ఆఆఆఆఆఆఆ....................
<><><><><><><><><><><><><><><><><><><><><><><>
బంటి(వాళ్ళ నాన్నతో): నాన్నా, ఒక్కగ్లాస్ మంచినీళ్ళు తెచ్చివ్వు.
నాన్నా: నువ్వే వెళ్లి తెచ్చుకో, ఈసారి అడుగితే తన్నుతాను.
బంటి: సరే తన్నేటప్పుడైన తీసుకొని రా.
ఆఆఆఆఆఆఅ..............!
<><><><><><><><><><><><><><><><><><><><><><><>
కమల్: నువ్వు కరాటేలో బ్లాక్ బెల్ట్ గా. మరి నిన్న రాత్రి మీ ఇంట్లో దొంగలు పడ్డప్పుడు ఏం చేశావ్?
విమల్: ఆ సమయానికి కరాటే డ్రెస్ దొరకలేదు.
ఆఆఆఆఆఆఅ.....................!
<><><><><><><><><><><><><><><><><><><><><><><>
హరి: నీ సైకిల్ ఎవరో దొంగలు ఎత్తుకుపోయారన్నావ్? మరి పోలీసులకు చెప్పావా?
సోము: ఆ! ఎందుకులే.....ఎలా వచ్చిందో అలాగే పోయింది!
ఆఆఆఆఆఆఅ....................
<><><><><><><><><><><><><><><><><><><><><><><>
సరసు(డాక్టర్ తో): మా వారు రాత్రిళ్ళు నిద్ర పోకుండా ఒకటే మాటలాడుతున్నారండి.
డాక్టర్: మీ వారికి పగలు మాటలాడే అవకాశం ఇవ్వమ్మా.
ఆఆఆఆఆఆ.................
<><><><><><><><><><><><><><><><><><><><><><><>
సరసు: వదినా గారూ! ఇంకా వంట మొదలెట్టలేదేమిటి?
అరసు: నీకెలా తెలుసు?
సరసు: ఆఅ.......మాడిన వాసన ఇంకా రాకపోతేనూ .......!
<><><><><><><><><><><><><><><><><><><><><><><>
శిష్యుడు:మనిషికి భవిష్యత్ తెలుసుకొనే శక్తి వస్తే ఏమవుతుంది గురువు గారు?
గురువు: ఎవరూ పెళ్ళిళ్ళు చేసుకోరు నాయనా! ఎన్ని ఆశ్రమాలైనా సరిపోవు!
ఆఆఆఆఆఆఅ .............
<><><><><><><><><><><><><><><><><><><><><><><>
చింతామణి:(అప్పారావు తో): ఏమండీ శాంపిల్ అంటే ఏమిటి?
అప్పారావు: పెళ్లి చూపుల్లో నువ్వు చూపిన వినయం లాటింది!
ఆఆఆఆఆఆఆఆఅ......................................
<><><><><><><><><><><><><><><><><><><><><><><>
(సుబ్బులు సుబ్బారావుతో )
సుబ్బులు: మన పనిమనిషికి దొంగబుద్ధి ఉన్నట్టుంది.కొత్తవి రెండు పళ్ళేలు కనబడటం లేదు.
సుబ్బారావు: ఏ పళ్ళాలు?
సుబ్బులు: మనం హోటల్ కి వెళ్ళినప్పుడు సంచిలో తీసుకొచ్చాగా, అవే
ఆఆఆఆఆఅ...................
COMMENTS