తల మీద జుట్టు ఉన్నా సమస్యే, లేకపోయినా సమస్యే. అలాంటి జుట్టుకు సంబంధించి మనలో ఎన్నో అపోహలు. అవాస్తవాలు ఉన్నాయి. అవి... తలకు నూనెతో మర్దన చేయ...

తల మీద జుట్టు ఉన్నా సమస్యే, లేకపోయినా సమస్యే.
అలాంటి జుట్టుకు సంబంధించి మనలో ఎన్నో అపోహలు. అవాస్తవాలు ఉన్నాయి. అవి...
తలకు నూనెతో మర్దన చేయడం చుండ్రు వస్తుంది
నూనె మర్దన వల్ల మాడుపై రక్తప్రసరణ పెరుగుతుంది. అలసట పోతుంది. పట్టించిన నూనెను సరిగ్గా కడగకపోతే అది మురికిని చేరనిస్తుంది. అలా చుండ్రు వస్తుంది.
నూనె మర్దనతో జుట్టు బాగా పెరుగుతుంది.
అందరూ అనుకున్నట్టుగా నూనె వల్ల జుట్టుకు పోషణ అందదు. నూనె జుట్టుకు కండిషనర్‌గా మాత్రమే పనిచేస్తుంది.
షాంపూలు జుట్టును బలహీనపరిచి రాలిపోయేలా చేస్తాయి
వాస్తవానికి షాంపూల వల్ల మాడుకు పట్టిన మురికి, జిడ్డు పోతాయి. షాంపూ చేసిన తర్వాత తలను బాగా కడగకపోతే మాత్రం ప్రమాదమే.
తినే తిండికి జుట్టు నాణ్యతకు ఏ సంబంధమూ లేదు.
మంచి ఉత్పత్తులు వాడితే తమ జుట్టు ఆరోగ్యంగా ఉంటుందను కుంటారు ఎక్కువమంది. అది నిజం కాదు. పోషకాలున్న ఆహారం తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది. పండ్లు, కూరగాయలు, మంచినీరు ఇవన్నీ ముఖ్యమే.
తరచూ కత్తిరిస్తుంటే జుట్టు త్వరగా పెరుగుతుంది.
కత్తిరింపుల వల్ల జుట్టుకో షేప్ వస్తుంది, అందంగా కనిపిస్తుంది తప్ప పెరగదు. జుట్టు పెరగడం అనేది లోపల నుంచి జరగాల్సిన ప్రక్రియ. బయట పనుల వల్ల అది జరగదు.
వెంట్రుకల చివర్లు చిట్లిపోవడాన్ని ఆపచ్చు
కత్తిరించడం తప్ప వాటి నేమీ చెయ్యలేం. కండిషనర్లు, వేరే ఎలాంటి చికిత్సలు పనికిరావు.
చివర్లు చిట్లిన జుట్టు పెరగదు
జుట్టు కుదుళ్లలోంచి పెరుగుతుంది తప్ప చివర్లు కాదు. అందువల్ల చివర్లు చిట్లిపోయినా జుట్టు పొడవుగా పెరుగుతుంది.
హెన్నా పెట్టిన జుట్టుకు రంగేస్తే ఎక్కువకాలం ఉంటుంది.
నిజానికి హెన్నా (గోరింటాకు) జుట్టుకు ఒక శాశ్వతమైన కోటింగ్ ఇస్తుంది, అందువల్ల రంగు నిలిచే ప్రసక్తే లేదు. అలాగే హెన్నా వల్ల జుట్టు మృదుత్వాన్ని, సహజత్వాన్ని కోల్పోతుంది. హెన్నా లేదా రంగు - ఏదో ఒక్కటి వాడటమే మేలు. రెండిటినీ కలపి పట్టించడం మంచిది కాదు.
రాత్రికిరాత్రే జుట్టు పండిపోతుంది.
అలా ఎప్పుడూ జరగదు. జుట్టు పండిపోవడం వయసుతో పాటు నెమ్మదిగా జరిగే ప్రక్రియ. పండిన వెంట్రుక ఒక్కటి పీకేస్తే, దానిచుట్టూ ఉన్నవన్నీ పండిపోతాయి ఇది తప్పు. ఒకటి పీకేసినంత మాత్రాన పక్కవాటికి ఏమీ జరగదు.
మందులతో జుట్టు పండిపోకుండా చూడొచ్చు
వయసుమీరడం వల్ల లేదంటే జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల జుట్టు పండిపోతుంది. వయసునేమీ చెయ్యలేరు గనక, జీవనశైలిని మెరుగుపరచుకుంటే జుట్టు పండిపోకుండా జాగ్రత్త పడొచ్చు. వేళకు తిండితో పాటు తగినంత నిద్ర పోతే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
COMMENTS