hair care, beauty tips, telugu, teluguh, apurupa, www.teluguh.com. www.apurupa.com, andam,
జుట్టుని మెరిపించాలంటే ఇంట్లో పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. అవి
- మార్కెట్లో దొరికే అన్ని షాంపూలూ, కండిషనర్లూ మీ జుట్టు కి సరిపడక పోవచ్చు. జుట్టుకి సరిపడే ఉత్పత్తుల్ని ఎంచుకుని వాటినే వాడుతూ ఉండాలి. రకరకాల ఉత్పత్తులు వాడడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది.
- వర్షంలో తడిసిన తర్వాత తలకి స్నానం చేసే వాళ్లు చాల తక్కువ. కానీ స్నానం చేయకపోవడం వల్ల జుట్టు మొదళ్ల దగ్గర తడి ఉండిపోయి వాసన వచ్చేస్తుంది. ఇది చుండ్రుకు కారణం అవుతుంది. కాబట్టి వానలో తడిశాక తలస్నానం చేయాలి.
- రాత్రి పడుకునే ముందు మరీ గట్టిగా జడ వేసుకోకుండా కాస్త వదులుగా జుట్టుని వదిలేయాలి.
- అసలు దువ్వకుండా వదిలేయడం, లేదంటే తరచూ దువ్వుతూ ఉండడం ఈ రెండూ జుట్టు ఎదుగుదలకు మంచివి కావు.
- ఎక్కువ మంది నూనె రాయకుండా వదిలేస్తారు. వారానికోసారి నూనె రాసుకుంటేనే మంచిది. అప్పుడప్పుడూ నిమ్మరసంతో శుభ్రపరిస్తే జుట్టు మృదువుగా మారుతుంది. మంచి మెరుపొస్తుంది.
