beauty tips, lip care, for lips, teluguh, apurupa, teluguh,com, www.apurupa.com, andam, pedalu

మేకప్ వేసుకోవడంలో బాగంగా లిపి స్టిక్ లు ఎంత అప్లై చేసినా సహజంగా
పెదవులు బాగుంటేనే లుక్ కూడా బాగుంటుంది. సహజంగా మృదువైన అధరాలు సొంతం కావాలంటే కొన్ని
చిట్కాలు పాటించాల్సిందే. అవి.....
- పెదవులు నిర్జీవంగా కనిపించడానికి అసలు కారణం పెదాలపై ఏర్పడే మృతకణాలే. ఫలితంగా పెదవులు తేమని కోల్పోయి పెళుసుగా మారిపోయి డల్ గా కనిపిస్తాయి.
- కోమలమైన, మృదువైన పెదవులు పొందడానికి అతి సులువైన చిట్కా ఒకటుంది. అదేంటంటే.. రోజూ బ్రస్ చేసేప్పుడు కేవలం నోటి లోపలి బాగాలపైనే కాకుండా పెదాలపై కూడా గుండ్రంగా, మృదువుగా బ్రష్ తో రుద్దడం వల్ల మృతకణాలు తొలగిపోవడంతో పాటు తాజాగా కనిపిస్తాయి.
- అలాగే కొబ్బరినూనె లేదా లవంగం నూనె తో మృదువుగా మర్దన చేసినా పెదవులు తాజాగా కనిపిస్తాయి.
- తేనె, పంచదార కలిపి కూడా అధరాల్ని ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ఈ రెంటినీ కలిపి పెదవులపై మృదువుగా మర్దనా చేయండి చాలు. తేనె పెదాలు కోల్పోయిన తేమని తిరిగి తెస్తాయి, పంచదార మృతకణాల్ని తొలగించి పూర్వపు రంగుతో మెరిసేల చేస్తుంది. మిశ్రమంలో తేనెకి బదులు నిమ్మ రసం కూడా వాడుకోవచ్చు. నిమ్మ పెదవుల నలుపుని పోగొట్టి ప్రకాశవంతంగా, మెరిసేల చేస్తుంది.
- నిద్రపోయే ముందు పొడి బారిన పెదవులకి పెట్రోలియం జెల్లీ రాసుకోండి. దీని వల్ల రాత్రంతా పెదాలు మాయిశ్చరైజ్ అవుతాయి.
- పెట్రోలియం జెల్లీ వాడకుండా అధరాలకి సహజంగా తేమని అందివ్వాలనుకుంటున్నారా.. అయితే పెదాలపై తేనె లేదా ఆముదం రాసినా మంచి ఫలితం ఉంటుంది.
- అధరాలు సహజ కాంతితో మెరుస్తూ ఉండాలంటే.. బాదంని మించింది లేదు. బాదంని మిశ్రమంల చేసి పెదాలపై రాసుకోండి. ఇందులో ఉండే విటమిన్ ‘ఈ’ పెదవులు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది.
- కొంతమంది ఏ మాత్రం ఒత్తిడిగా అనిపించినా, దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నా పెదాల్ని తెగ కొరికేస్తూ ఉంటారు. దీనివల్ల పెదాలు పొడి బారిపోతాయి. అందమైన పెదవులు సొంతం కావాలనుకుంటే ఇలాంటి అలవాట్లని దూరం చేసుకోవాలి.
- సూర్య కిరణాల ప్రభావం చర్మం మీదే కాదు.. పెదవుల పైనా పడుతుంది. అందుకే పెదవుల్ని కూడా సూర్యరశ్మి బారి నుంచి సంరక్షించుకోవాలి.
- అలాగే తగినన్ని నీళ్లు తాగకపోతే చర్మమే కాదు.. పెదవులు కూడా పొడిగా, కాంతివిహీనంగా కనిపిస్తాయి. పెదవులకి కొత్త కళ రావాలంటే రోజుకి కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలి. అప్పుడే పెదాలు పొడి బారకుండా ఉంటాయి.
మృతకణాలు తొలగాలన్న ఉద్దేశంతో పెదాలపై అదే పనిగా రుద్దడం కూడా
మంచిది కాదు. అలానే మర్దనా కూడా మృదువుగా చేయాలి. పెదాలు పగిలి ఉంటే డైరెక్ట్గా కాటన్
తో పెదాలు తుడవడానికి వాడకూడదు. దానికి బదులు కాటన్ వస్ర్తాన్ని ఉపయోగించాలి. అలా డైరెక్ట్గా
వాడితే కాటన్ పెదాల మధ్య ఉండిపోతుంది. అలాగే మృతకణాలు తొలగించిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్
రాసుకోవడం తప్పనిసరి.
ఈ చిట్కాలన్నీ పాటిస్తే గులాబీ లాంటి లేత అధరాలు తప్పకుండా మన
సొంతమవుతాయి.