Kitchen tips, apurupa, telugu, teluguh, oil kalthi

ఇంతకీ నూనె కల్తీ ఎలా చేస్తారు?
చవక నూనెలు
వేరుశనగ, సన్ ఫ్లవర్ నూనె, ఆవ, కొబ్బరినూనెలు మార్కెట్లో అధిక ధర ఉన్న నూనెలు. వీటిలో పత్తి గింజల నూనె, ఆముదం, పామాయిల్ కలిపి నూనెలో తేడా తెలియకుండా చేస్తున్నారు. అలాగే ఆవనూనెలో బ్రహ్మ దండి గింజల నూనెను కలుపుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. బ్రహ్మదండి గింజల నుంచి తీసిన నూనెను దీర్ఘకాలం పాటు తీసుకోవడం వల్ల ఎరర్రక్త కణాల సంఖ్య తగ్గిపోయి ముప్పు ఏర్పడుతుంది.
ఎముకల నూనె
కబేళాలలో మిగిలిన జంతు కళేబరాల నుంచి ఎముకలను, కొవ్వునూ సేకరించి వాటిని మరగబెడతారు. చాల సేపు మరగబట్టిన తర్వాత దాన్ని వడకట్టి మిగిలిన కొవ్వును నూనెల్లో కలుపుతారు. వీటిని తీసుకోవడం మన శరీరానికి ఎంతో ప్రమాదం. ఎక్కువ కాలం పాటు తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలూ ఉన్నాయి.
కల్తీ కనిపెట్టండి ఏలా...
నూనెల్లో కల్తీని కనిపెట్టడం కొంచెం కష్టమైన పనే అయినా అసాధ్యం మాత్రం కాదు.
- కొబ్బరి నూనెలో కల్తీని తెలుసుకోవడానికి ఓ గంట పాటు దాన్ని ఫ్రిజ్లో పెట్టండి. కొబ్బరి నూనెలో కల్తీ జరగనట్లయితే అది గడ్డ కడుతుంది. అదే అందులో వేరే నూనెలు కలిసినట్లయితే అది గడ్డ కట్టదు .
- ఆవ నూనెలో కల్తీని కనిపెట్టడానికి ఓ గ్లాసులో కొంచెం నూనెను తీసుకొని అందులో గాఢ నైట్రికామ్లాన్ని కలపండి. అందులో ఎరుపు రంగు వలయం ఏర్పడితే తప్పకుండా బ్రహ్మదండి నూనె ఉన్నట్లే.
- సాధారణ నూనెను ఫ్రిజ్లో పెట్టినప్పుడు గడ్డకడితే అందులో ఎముకల నూనె కలిసిందని అనుమానించాల్సిందే.
- సాధ్యమైనంతవరకు పేరున్న బ్రెండెడ్ కంపెనీల ఉత్పత్తులను (నూనె ప్యాకెట్లు, డబ్బాలు) కొనుగోలు చేయడం మంచిది. వీటి విషయంలో కల్తీ జరిగే అవకాశాలు తక్కువ.
- అయితే వీటిని కొనే ముందు కూడా సీల్ ను తప్పకుండా చెక్ చేయండి. ఒక వేళ సీల్ తొలగించి ఉంటే తీసుకోవద్దు.